SpaceX Inspiration4: తన ఇష్ట సామ్రాజ్యం స్పేస్‌ఎక్స్ ద్వారా అరుదైన ఘనతలు సాధించాలన్న కలలను సాకారం చేసుకుంటూ పోతున్నాడు అపరకుబేరుడు ఎలన్ మస్క్. మిగతా బిలియనీర్స్‌లా ఆకాశం హద్దు దాటొచ్చి అంతరిక్ష ప్రయాణం చేశానని గప్పాలు కొట్టుకోవడం లేదు. సరికదా నలుగురు స్ఫూర్తిదాయక వ్యక్తులను తన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి.. స్పేస్‌టూరిజంలో సంచలనానికి తెర లేపాడు. #Inspiration4 ప్రయోగం ద్వారా ఆసక్తికర చర్చకు దారితీశాడు.
ఇన్‌స్పిరేషన్ 4.. ఎలన్ మస్క్ తన స్పేస్‌ఎక్స్ తాజా అంతరిక్షయానానికి పెట్టిన పేరు. నలుగురు పౌరులను అంతరిక్షంలోకి పంపడం స్పేస్‌ఎక్స్ ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8గం.2ని. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఈ నలుగురు స్పేస్ టూరిస్టులను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 12 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి డ్రాగన్ క్యాప్సూల్ విడిపోయింది. దీంతో ఆ క్రూ ఆర్బిట్‌లోకి ప్రవేశించడంతో స్పేస్‌ఎక్స్ బృందం ఆనందంలో మునిగింది. విశేషం ఏంటంటే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్‌షిప్‌లో తిరుగాడుతుండడం.
🚀Congratulations, #Inspiration4! Proud to provide the launchpad from @NASAKennedy for the first orbital spaceflight with an all-private crew. Today's launch represents a significant milestone in the quest to make space for everybody. https://t.co/8a37VzN3Xl
— NASA (@NASA) September 16, 2021
మూడురోజుల తర్వాత స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్4లో పాల్గొంటున్న ఈ బృందం.. ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. ఇదిలా ఉంటే ఇన్‌స్పిరేషన్ 4 ఖర్చు ఎంత అయ్యిందనే విషయాల్ని స్పేస్‌ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ వివరించకపోయినా.. బిలయన్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. హైస్కూల్ డ్రాప్ అవుట్ అయిన జేర్డ్ ఐసాక్‌మాన్(38).. షిఫ్ట్4 పేమెంట్స్ ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. ఈ ఇసాక్‌మాన్‌తో పాటు మరో ముగ్గురు ఇన్‌స్పిరేషన్‌లో పాల్గొన్నారు. ఈ నలుగురి ఆసక్తికరమైన ప్రస్థానం గురించి నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఓ డాక్యుమెంటరీ రూపొందించింది కూడా.
క్రిస్ సెంబ్రోస్కి, సియాన్ ప్రోక్టర్, జేర్డ్ ఐసాక్‌మాన్, హాయిలే ఆర్కేనాక్స్(ఎడమ నుంచి.. )
క్రిస్ సెంబ్రోస్కి(42) యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వెటరన్. ప్రస్తుతం ఈయన ఎయిరోస్పేస్‌లో డాటా ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
సియాన్ ప్రోక్టర్(51) జియోసైంటిస్ట్. అంతరిక్షంలోకి వెళ్లిన నాలుగో ఆఫ్రో-అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. తొలి ఫస్ట్ స్పేస్‌క్రాఫ్ట్ పైలట్‌గా రికార్డు సృష్టించారు.
The crew of #Inspiration4 is go for launch. pic.twitter.com/xou4rJJnjp
— Inspiration4 (@inspiration4x) September 15, 2021
హాయిలే ఆర్కేనాక్స్(29).. క్యాన్సర్‌ను జయించిన యువతి, ఫిజీషియన్ అసిస్టెంట్ కూడా. అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్. అంతేకాదు ప్రొస్తెసిస్(తొడ ఎముక భాగం)తో ఆర్బిట్‌లోకి వెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించింది కూడా. ఇక స్పేస్ ఎక్స్ సాధించిన ఈ ఘనతపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో పాటు అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్లీ ఒబామా కూడా హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: మంచి కోసమే ఇన్‌స్పిరేషన్ 4.. తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
Comments
Please login to add a commentAdd a comment