వచ్చేస్తోంది మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో! | Earth-Mars transfer window: Earth-Mars transfer window will open up in October 2024 | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో!

Published Tue, Sep 17 2024 5:05 AM | Last Updated on Tue, Sep 17 2024 5:33 AM

Earth-Mars transfer window: Earth-Mars transfer window will open up in October 2024

అంగారక ప్రయోగాలకు అత్యంత అనువు 

ప్రయోగాలకు అంతరిక్ష సంస్థల సన్నాహాలు 

2026 విండోలో మిషన్‌ మార్స్‌: స్పేస్‌ఎక్స్‌ సక్సెసైతే 2028లో మానవసహిత మిషన్‌

మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్‌–మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో’ అక్టోబర్లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్‌ఫర్‌ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్‌ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్‌ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. 

ఏమిటీ ట్రాన్స్‌ఫర్‌ విండో? 
ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. 

వీటన్నింటికీ మించి ట్రాన్స్‌ఫర్‌ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్‌లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 

2026 విండోపై స్పేస్‌ ఎక్స్‌ కన్ను 
ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్‌íÙప్‌’ మిషన్‌ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్‌–మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్‌ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement