Exploration
-
చంద్రునిపైకి ‘ఘోస్ట్’ ప్రయోగం
హాథ్రోన్: అంతరిక్ష ప్రయోగాలకు ఈ మధ్యకాస్త గ్యాప్ వచ్చింది. అయితే 2025 ఆరంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్(SpaceX) తన ప్రయోగాలను మొదలుపెట్టింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా.. ఒకే రాకెట్‌తో ఏకంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ఒకేసారి రెండు మిషన్లను ప్రారంభించినట్లైంది!. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా(NASA) కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ బ్లూ ఘోస్ట్-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్2లను ల్యాండర్లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్ఎక్స్ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు.. వేర్వేరు టెక్నాలజీలకు చెందినవి కూడా. ఆయా నిర్ణీత రోజుల్లో అవి చంద్రుడి మీదకు దిగనున్నాయి. ఇంతకీ ఇవి స్విచ్ఛాఫ్ అయ్యేలోపు ఎలాంటి పనులు చేస్తాయంటే.. Today’s mission is our third launch to a lunar surface and just the first of several our Falcon fleet will launch for @NASA’s Commercial Lunar Payload Services (CLPS) program this year. These missions help humanity explore the Moon, Mars, and beyond, bringing us one step closer… pic.twitter.com/Go2yUccFb3— SpaceX (@SpaceX) January 15, 2025ఘోస్ట్ ఏం చేస్తుందంటే.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కమర్షియల్ లూనార్ ప్లేలోడ్ సర్వీసెస్(CLPS)లో భాగంగా బ్లూ ఘోస్ట్-1ను రూపొందించారు. చంద్రుడిపై ఉన్న అతిపెద్ద పరివాహక ప్రాంతం మేర్ క్రిసియంలో ఇది దిగి.. పరిశోధనలు చేయనుంది. ఈ ల్యాండర్ చంద్రుడి మీదకు చేరుకోవడానికి 45 రోజలు టైం పడుతుంది. ఇది చంద్రుడిపై స్వతంత్రంగానే ల్యాండ్ అయ్యి.. రెండువారాలపాటు సైంటిఫిక్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తుంది. అలాగే.. పది అడుగుల లోతులో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంది. అలాగే రెగోలిథ్(అక్కడి భూపొర)ను సేకరిస్తుంది. భూమికి చందద్రుడికి మధ్య లేజర్ కిరణాల సాయంతో దూరాన్ని కొలుస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పది సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. ఇది చంద్రుడిపై నిర్వహిస్తున్న అత్యాధునిక పరిశోధనగా నాసా చెబుతోంది. హకుటో చేసే పని ఇదే.. జపాన్‌కు చెందిన ఐస్పేస్ కంపెనీ హకుటో ఆర్2 అనే రీసైలెన్స్ ల్యాండర్‌ను రూపొందించింది. ఇది చంద్రుడి ఉత్తర గోళార్థంలోని మేర్ ఫ్రిగోరిస్లో అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఈ ల్యాండర్‌కు 4 నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. కింది ఏడాది ఏప్రిల్‌లో ఐస్పేస్ ఇదే తరహా ప్రయోగాన్ని నిర్వహించినప్పటికీ.. సెన్సార్లు పనిచేయకపోవడంతో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. టెనాషియస్ అనే మైక్రోరోవర్ను హకుటో-ఆర్2 చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగిస్తుంది. అది అక్కడి రెగోలిత్‌ను సేకరిస్తుంది. చంద్రుడి మీద పరిశోధనలకు అంతరిక్ష పరిశోధన సంస్థలే కాదు.. ప్రైవేట్ కంపెనీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాన్వేషణలో మున్ముందు మరింత అత్యాధునిక ప్రయోగాలు జరిగే అవకాశం లేకపోలేదు. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనారోగ్యంతో తుర్కియే గుహలో చిక్కుబడిన అమెరికా అన్వేషకుడు
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన మార్క్ డికే(40)ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు. జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గృహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజు్ఞలైన గృహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని టర్కిష్ కేవింగ్ ఫెడరేషన్ వివరించింది. మార్క్ డికే కోసం ఆరు యూనిట్ల రక్తం పంపించామని టర్కీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. డికేను కాపాడేందుకు తుర్కియే, అమెరాకాతోపాటు హంగరీ, బల్గేరియా, ఇటలీ, క్రొయేíÙయా, పోలాండ్ దేశాలకు చెందిన 150 మంది నిపుణులను రప్పిస్తున్నట్లు యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ తెలిపింది. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. -
మంచి మాట: అన్వేషణ ఏమిటి? ఎందుకు?
అన్వేషణ ఓ సాహసకృత్యం, ప్రయాణం, వేట, డేగ కన్ను, లోచూపు. ఒక కొత్తపుంత, అద్భుత సృజన, చింతన, సత్యశోధన, నిత్యసాధన, తపన. జ్ఞాన సముపార్జన. అన్వేషణ ఒక జీవిత పోరాటం. అన్వేషణ జీవితంలో అతి ముఖ్యమైన అంతర్భాగం. ప్రతి ప్రాణికి తప్పనిది, తప్పించుకో లేనిది. అయితే దీనిలో స్థాయీభేదముంటుంది. దీన్నే దృష్టి అంటాం. ఇది ఎవరి కెలా ఉంటుందనేది వారి వారి జీవిత నేపథ్యం, భౌగోళిక, సామాజికాంశాలతో పాటు చదువుల సారం మీద కూడ ఆధారపడుతుంది. హృదయ సంస్కారం కూడ ఈ అన్వేషణలో చేర్చతగ్గ ముఖ్యాంశమే. మన ఉనికికి భౌతికరూపమైన ఈ శరీరాన్ని పోషించుకునేందుకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే యత్నంతో అన్వేషణ ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అత్యంతావశ్యకమైనది. పక్షులు సైతం తమ పిల్లలకోసం ఆహారాన్ని సంపాదించి నోటిలో పెట్టటం సాధారణ దృశ్యం. ఆదిమానవుడు ప్రకృతి, సూర్యోదయ, చంద్రోదయాలను, మెరుపులను ఉరుముల శబ్దాన్ని రుతు మార్పులను చూసి, జంతువులను చూసి ఎంతగానో భయపడ్డాడు. క్రమేణా భయాన్ని వీడుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ మార్పులు సహజమన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. జీవితం నేర్పిన ఈ జ్ఞానం అతడికి ఆలోచనా శక్తినిచ్చింది. ఇదీ ఒక అన్వేషణే. ఎంతో గొప్పదైనది. మానవ సమూహాల సంఖ్య పెరిగిన కొద్దీ అహారవసరాలు పెరిగాయి. నివాసాల అవసరాలు వచ్చాయి. ఇది వ్యవసాయానికి, ఇళ్ల నిర్మాణానికి దారి తీసాయి. మనిషి భయం, అవసరం అతడిని కొత్త మార్గాలను, పద్ధతులను కనిపెట్టేటట్టు చేసింది. చేస్తూనే ఉంటుంది. ఇది మనిషికి ఉన్న ఆలోచనా శక్తి వల్ల వచ్చింది. మనిషికున్న ఈ అన్వేషణా మేధ ఎప్పటికప్పుడు నూతన ఒరవళ్ళకు శ్రీకారం చుడుతూనే ఉంటుంది. ‘అవసరం’ అన్వేషణను ప్రేరేపించే అంశాలలో మొట్టమొదటిది. రెండవది ‘ఆసక్తి లేదా ‘జిజ్ఞాస.’ మనిషికి ఉత్సకత ఉండాలి. ఇది ప్రశ్నించేటట్టు చేస్తుంది. ప్రతిదాన్ని నిశితంగా, లోతుగా చూసే చూపునిస్తుంది. అది ప్రకృతి పరమైనది కావచ్చు. లేదా ఆత్మానుగతమైనదీ కావచ్చు. ఒక శాస్త్రవేత్త, ఒక సిద్ధార్థుడు దీనికి మనకు గొప్ప నిదర్శనంగా నిలుస్తారు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది.. జీవపరిణామం ఏమిటన్నది ఒకరి ఆలోచన అయితే, మరొకరిది ఈ సృష్టిలో మనిషి ఆస్తిత్వమేమిటి, చావు పుట్టుకల చట్రం నుండి బయటపడేదెలా అన్న ఆలోచనమరొకరిది. మార్గాలేవేరు అంతే. ఇద్దరూ మేధోమధనం చేసేవారే. ఇరువురూ జ్ఞానసాధకులే, సత్యశోధకులే. సామాన్యులకు అర్థం కాని, తట్టని జీవిత రహస్యాలను విడమరచి చెప్పే మాన్యులే. ఈ అన్వేషణ శక్తి సహజాతం కానప్పుడు అలవరచుకోవటం కష్టం. ఎవరైతే ఆ శక్తి లేదనుకుంటారో వారు ప్రయత్నం చెయ్యాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలనగా చూడాలి. మనుషుల ప్రవర్తనను గమనిస్తూ విశ్లేషణ చేసుకోవాలి. ఈ అన్వేషణ అనే లోతైన సముద్రంలో తార్కికత, గొప్ప అవగాహనా శక్తి, కఠోర శ్రమలతోపాటు గొప్ప జిజ్ఞాస తోడు చేసుకుని ఈదగలిగితే రత్నాలు.. మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. అయితే, ఇంతటి సాధన.. శోధన కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారికే జగతి జేజేలు పలుకుతుంది. అన్వేషణకు మార్గమే కాదు లక్ష్యం కూడ సరైనదిగా ఉండాలి. వక్రమార్గంలో స్వార్థపూరితంగా చేసే అన్వేషణ ప్రపంచానికి ఏ ప్రయోజనాన్నీ ఇవ్వకపోగా చేటు చేస్తుంది. వ్యక్తికైనా, సమాజానికైనా, దేశానికైనా, పరశువేది, అమృతం గురించి అన్వేషించిన వాళ్ళ జీవితాలు ఎలా వృథా అయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. కొన్నిదేశాలు చేసే ప్రయోగాలు, శాస్త్రపరిశోధనలు మానవాళికెంత హాని కలిగించాయో మనకు తెలుసు. అందుకనే అన్వేషణకు ఉత్తమ లక్ష్యం ఉండాలి. అప్పుడే ఉత్తమ సాధనాపథం అమరుతుంది. ఉత్తమ సాహిత్యం చదువుతున్నప్పుడు ఈ అన్వేషణ అనే వివేచనా నయనం అవసరం. అప్పుడే ఆ కవి లేదా రచయిత సృజనలోని విశిష్టతను పసిగట్టగలం. ఆ కావ్యంలోని భాషా సొబగులను.. కవి భావనా పటిమను, కవి చూసిన సాహితీ లోతులను.. ఆ కావ్యప్రయోజనాన్ని అర్థం చేసుకోగలం. లోపాలను చూడగలిగే విమర్శనాశక్తికి ఈ అన్వేషణ గొప్ప సాధనమవుతుంది. అన్వేషణంటే కొందరి భావన కొత్త ప్రదేశాలను సందర్శించటం, కొత్త వ్యక్తులను కలవటం. వారి సంస్కృతిని దాని గొప్పదనాన్ని చూడగలగటం. అనుసరణ యోగ్యమైతే స్వీకరించటం. రక్త సంబంధీకులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగు, ముఖ పరిచయం కలవారు... ఇలా అనేకమంది తో సాగేదే మన ఈ జీవితనౌక. దీనిలో మనతో, మన భావాలతో, మన ధోరణితో ఒదిగి మనతో ఎక్కువకాలం పయనించ గలిగే వారి కోసం మనం అన్వేషించాలి. మనకు కష్టం కలిగినవేళ నేనున్నాననే వారి చేతి స్పర్శ, బాధపడే సమయాన మనకొరకు చెమ్మగిల గల నయనం, మనం తలను వాల్చేటందుకు ఒక భుజం, మనం తలవాల్చ గల ఎద మనకు కావాలి. ఒక సహచర్యం ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకోసం ప్రతి ఒక్కరూ వెతకాలి. ఆస్తికులకి అన్వేషణ అంటే ఆత్మ శోధన. ఆత్మతత్వమేమిటో తెలుసుకోవాలనే తపన. జీవాత్మ, పరమాత్మల సంబంధం, సంలీనం కోసం ఆరాటం. నాస్తికులకు, మానవతా వాదులకు మాధవ సేవ కన్నా మానవ సేవ ముఖ్యం. అన్నార్తుల, బాధార్తుల, అనాథలను ఆదుకోవాలనే తపన వీరిది. ఇది కూడా ఒక విధమైన అన్వేషణే. ఇది కూడా అలవర చుకోవలసిన అన్వేషణమే. విద్యను గరిపే గురువులకు అన్వేషణాశక్తి ఎంత అవసరమో దానిని నేర్చుకునే విద్యార్థులకు అది అంతే ఆవశ్యకం. గురువు తన జ్ఞానాన్ని నిత్యవసంతం చేసుకోవాలి. క్లిష్టమైన అంశాలను శిష్యులకు బోధించే సులభమైన పద్ధతులను వెతకాలి. శిష్యులు కూడ గురువు అందిస్తున్న జ్ఞానాన్ని తరచి చూసే అలవాటు చేసుకోవాలి. ఈ రకమైన అన్వేషణ వల్ల తాను పొందే జ్ఞాన సత్యాసత్యాలు తెలుస్తాయి. పరిశోధకులకు ఈ అన్వేషణ చాలా అవసరం. అంతవరకూ ప్రపంచం విశ్వసిస్తున్న ఒక నిజాన్ని, ఒక సిద్ధాంతాన్ని త్రోసిరాజని నిరూపణ చేసే శక్తి అన్వేషణ మనిషికిస్తుంది. అసలు నిజమేమిటో ప్రపంచానికి చాటాలంటే మనకెంతో స్థైర్యం ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది వేదాంతులు, తత్త్వవేత్తలు, సిద్ధాంతకర్తలు, శాస్త్రవేత్తలు తాము శోధించి తెలుసుకున్న సత్యాన్ని తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జగతికి ప్రకటించి జగత్విఖ్యాతులై ప్రాతః స్మరణీయులయ్యారో తెలుస్తుంది. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
ఖనిజాల అన్వేషణ: ఏఐ, ఆటోమేషన్‌ను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: దేశీయంగా వివిధ లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మన దగ్గర లోహాలు, ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై అంతగా ఉండదని, దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు.. గణనీయంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ చెప్పారు. దిగుమతి చేసుకునే ధరలో పావు వంతుకే భారత్‌లో ముడిచమురును ఉత్పత్తి చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు పెరగడం, రూపాయి మారకం విలువ పతనమవడం వంటి కారణాలతో క్రూడాయిల్ తదితర దిగుమతుల భారం పెరిగిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధనాలు, ఖనిజాల అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. -
అంతరిక్ష పరిశోధనపై చైతన్యం అవసరం
ఇస్రో ఎస్ఎస్ఎంఈ అధ్యక్షుడు మాధుర్ గైట్‌లో ముగిసిన అవగాహన సదస్సు రాజానగరం : భారతీయ అంతరిక్ష పరిశోధనపై దేశ యువతలో చైతన్యం నింపేందుకు ఇస్రో కృషి చేస్తున్నదని (ఎస్ఎస్ఎంఈ) అధ్యక్షుడు ఏసీ మాధుర్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇస్రో నమూనా ఉపగ్రహాల ప్రదర్శనలను ఉచితంగా ఏర్పాటు చేయడంతోపాటు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహించి అంతరిక్ష విజ్ఞానం గురించి తెలియజేస్తుందన్నారు. గైట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, అహ్మదాబాద్‌లోని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఇస్రో సహకారంతో ‘అంతరిక్ష సాంకేతికరంగంలో మెకానికల్ ఇంజనీరింగ్ సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ఎంఈని 1977లో ప్రారంభించామని, దీనిలో 340 మంది జీవిత సభ్యులున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారు రూ.250 చెల్లించి సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు. డీఈసీయూ మాజీ డైరెక్టర్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతికి అవసరమైన బహుముఖ అంశాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిపై ఇస్రో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా విద్యా విధానం, టెలీమెడిసిన్లపై డీఈసీయూ దృష్టి సారించిందన్నారు. దేశంలోని 26 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 వేల మంది విద్యార్థులకు దూరవిద్యా విధానం అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది వేలమంది విద్యార్థులు ప్రయోజనం పొందుతుండగా హర్యానాలో 10 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్ఏసీ మాజీ హెడ్ ఎస్జి వైష్టక్ మాట్లాడుతూ కొత్త విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ఉపగ్రహ నమూనాలతో ప్రదర్శనలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. విఎస్ఎస్సీ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ భానుపంత్ మాట్లాడుతూ అంతరిక్ష నౌకలో వివిధ విడిభాగాలను 253 నుంచి రెండు వేల సెంటిగ్రేడ్ తట్టుకునే విధంగా తయారుచేసేందుకు లోహాలను, లోహమిశ్రమాలను వినియోగిస్తారన్నారు. వాటి తయారీ విధానం, ఏఏభాగాలలో ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియజేశారు. సభ్యత్వం పొందిన గైట్ ఎస్ఎస్ఎంఈలో కార్పొరేట్ సభ్యత్వాన్ని తీసుకుంటూ గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ సంబంధిత పత్రాన్ని సంస్థ అధ్యక్షుడు ఏసీ మాధుర్‌కు అందజేశారు. రానున్న కాలంలో తమ కళాశాల విద్యార్థులకు ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అతిధులను కళాశాల ఎండీ దుశ్శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అతిరా కన్సల్టెంట్ ఎల్ఎం కేపీ భల్సా«ద్, ఎస్ఎస్ఎంఈ ఏవీ ఆప్టే, గైట్ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్ష్మీ శశికిరణ్, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, డీన్ డాక్టర్ ఎం.వరప్రసాదరావు, హెచ్ఓడీ డాక్టర్ టి.జయానంద్‌కుమార్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
గురుశిష్యుల సంవాదమే... కేనోపనిషత్తు
గతవారం ఈశావాస్యోపనిషత్తు గురించి తెలుసుకున్నాం కదా, ఈ వారం కేనోపనిషత్తు గురించి తెలుసుకుందాం. కేనోపనిషత్తులో నాలుగు ఖండాలున్నాయి. మొత్తం ముప్ఫయి నాలుగు మంత్రాలు ఉన్నాయి. గురుశిష్యుల మధ్య జరిగిన ప్రశ్న- సమాధానాలుగా ఈ ఉపనిషత్తు ఏర్పడింది. మొదటి మంత్రంలో శిష్యుడు కేనేషితం పతతి ప్రేషిత మనః అంటే ఎవరి ప్రేరేపణతో మనస్సు పరుగెత్తుతోంది? అనే ప్రశ్న వేస్తాడు. ఇందులో మొదటిపదం ‘కేన (ఎవని చేత, దేని చేత) అనేది ప్రశ్న వాచకం. అందుచేత ఇది కేనోపనిషత్తు అయింది. యువతరం ప్రశ్నించాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు. మొండిగా వ్యతిరేకించకూడదు. గురువు దగ్గర కూర్చొని వినాలి. చర్చించాలి. అదే ఉపనిషత్తుల ఉద్దేశం, ప్రయోజనం! సామవేద ఉపనిషత్తులు మొత్తం పదహారు. వాటిలో మొదటిది, దశోపనిషత్తుల్లో రెండవది కేనోపనిషత్తు. సామవేదానికి చెందిన ఏ ఉపనిషత్తు అయినా మొదటా చివరా చదివే శాంతిమంత్రం అందరికీ తెలిసిందే. ఓం సహనా వవతు సహనోభువన్తు సహవీర్యం కరవావహై తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః (మేము ఇద్దరమూ శక్తిమంతులం అగుదుముగాక! కలిసి భుజింతుము గాక కలసి మహాకార్యాలను చేయుదుముగాక! అధ్యయనంతో తేజోవంతులం అగుదుముగాక ఒకరినొకరు ద్వేషించకుందుముగాక!) ఈ శాంతిమంత్రంలో మేమిద్దరం అనేది గురుశిష్యులకు, జీవబ్రహ్మములకు వర్తిస్తుంది. మొదటి ఖండం మొదటి మంత్రంలో శిష్యుడు గురువుగారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ‘‘గురుదేవా! ఎవరి ప్రేరణతో మనస్సు దూకుతోంది? ఎవరి చేత నియోగించబడి ప్రాణం కదులుతోంది? ఎవనిచేత మాట్లాడే శక్తి వాక్కుకు, చూసే శక్తి కంటికి, వినే శక్తి చెవికి వస్తున్నాయి? ఏ దేవుడు వీటినన్నిటినీ వినియోగిస్తున్నాడు?’’ అనే ప్రశ్నలు అడిగాడు. గురువు సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేస్తున్నాడు - ‘‘ఆత్మ శక్తితోనే చెవి వినగలుగుతోంది. మనస్సు గ్రహిస్తోంది. వాక్కు పలుకుతోంది. ప్రాణం ఉంటోంది. కన్ను చూస్తోంది. ఈ సత్యాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు’’ అన్నాడు. ఈ ఆత్మను అనగా బ్రహ్మపదార్థాన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పాలి? మొదలైన ప్రశ్నలు శిష్యునికి వస్తాయని గురువే ఊహించి సమాధానం చెబుతున్నాడు. ‘దానిని కళ్లతో చూడలేము. వాక్కుతో చెప్పలేము. మనసుతో తెలుసుకోలేము. దానిని మేము తెలుసుకోలేకపోయాము. అది మనకు తెలిసిన వాటన్నింటికీ వేరైనది. తెలియని వాటికి పైన ఉంటుంది. ఇట్లా మా పూర్వికులు మాకు వివరించారు’ అనే సమాధానం తరతరాలుగా జరుగుతున్న అన్వేషణను తెలుపుతోంది. తెలియనిదానిని గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించి అదే సత్యం అనుకుంటారు. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒకడు తొండం పట్టుకుని తొండమే ఏనుగు అన్నాడు. మరొకడు తోక పట్టుకొని తోకే ఏనుగు అన్నాడు. ఇంకొకడు కాలు, మరొకడు దంతాన్ని పట్టుకుని అవే ఏనుగు అనుకున్నారు. వారికి తెలిసిన పాక్షిక సత్యాన్ని అజ్ఞానంతో అహంకారంతో సంపూర్ణ సత్యంగా ప్రకటిస్తున్నారు. పాక్షిక సత్యాన్ని విని మోసపోవద్దని గురువు శిష్యునికి పదే పదే చెప్పడం ఈ ఉపనిషత్తు విశిష్టత. ‘‘దేనిని మాటలతో చెప్పలేమో, దేనితో మాటలు ఏర్పడ్డాయో అదే అసలైన బ్రహ్మపదార్థం. నువ్వు భ్రమతో అనుకునేది నిజమైనది కాదు’’ ‘‘ఏది మనస్సుకు తెలియదో, దేనివల్ల మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతోందో అదే అసలైన బ్రహ్మం’’ ‘‘దేనిని కళ్లతో చూడలేమో, దేనివల్ల కళ్లు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం అని తెలుసుకో’’. ‘‘దేనిని చెవితో వినలేమో, దేనివల్ల చెవి వినగలుగుతోందో అదే బ్రహ్మం అని తెలుసుకో’’. ‘‘దేనిని ప్రాణం బతికించలేదో ప్రాణం దేనివల్ల ఉంటున్నదో అదే బ్రహ్మం అని తెలుసుకో’’ - అని మొదటి ఖండంలో గురువు పాక్షిక సత్యాలను తాత్కాలిక ఫలితాలను నమ్మి మోసపోవద్దని చెబుతున్నాడు. మాటలతో, మనసుతో, చూపుతో, వినికిడితో, ప్రాణంతో పరబ్రహ్మజ్ఞానం కలిగినట్లు భావించరాదు. అంతరిక్షంలోకి పోయే వాహనంలో కొన్ని భాగాలు ఎక్కడికక్కడ విడిపోయి పడిపోతూ ఉంటాయి. అసలైన ఉపగ్రహాన్ని పైకి చేర్చటమే వాటి పని. అంతేకాని అవి ఉపగ్రహం కావు. వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ప్రాణం అలాంటివి. సగుణోపాసన అలాంటిదే అని ఈ ఉపనిషత్తు స్పష్టంగా చెబుతోంది. (ద్వితీయ ఖండంలో గురువు ఇంకా సూటిగా, పరిశోధన, అన్వేషణ ఎలా జరగాలో చెబుతాడు. అది వచ్చేవారం) - డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’!
చుక్కల లోకం గుట్టు విప్పాలి. గామా కిరణాల లోగుట్టు పసిగట్టాలి. ఖగోళ చరిత్రను మలుపు తిప్పాలి. ఈసీఐఎల్ మేస్ టెలిస్కోపు అదే చేయబోతోంది అందుకే లడఖ్‌కు బయలుదేరింది... విశ్వాంతరాళాల నుంచి దూసుకువచ్చి లిప్తపాటులో మాయమయ్యే కాంతిపుంజాలను ఒడిసిపడితేనే అల్లంత దూరంలోని చుక్కల లోకం గుట్టు తెలుస్తుంది. నక్షత్రాలు, వాటి పేలుళ్ల వెనక ఉన్న మర్మం అంతు పడుతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే రూపుమార్చుకునే గామా కిరణాల ఉనికిని గుర్తిస్తేనే ఖగోళం సంగతులు అర్థమవుతాయి. అందుకే.. గామా కిరణాల గుట్టు విప్పేందుకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) శాస్త్రవేత్తలు మేస్ టెలిస్కోపును తయారు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు, ఎత్తై ప్రదేశంలో ఏర్పాటుచేసే అతిపెద్ద టెలిస్కోపు అయిన మేస్ ఇంతకూ ఏం చేస్తుంది? దీని కథాకమామిషు ఏమిటి? గామా కిరణాలపై నిఘా నేత్రం... విశ్వం పుట్టు, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలంటే రోదసిలో సుదూర తీరాల నుంచి దూసుకువచ్చే శక్తిమంతమైన గామా కిరణాలపై అధ్యయనం ఓ మంచి అవకాశం. మిలమిల మెరిసే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రపేలుడు అవశేషాలు, గెలాక్సీ కేంద్రాలు, మొదలైన వాటి నుంచి వెలువడే గామా కిరణాలపై అధ్యయనం వల్ల వాటి గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా ఖగోళ భౌతికశాస్త్రం, ప్రాథమిక భౌతికశాస్త్రం, గామా కిరణాల ఆవిర్భావం, వాటి వేగం వెనక ఉన్న ప్రక్రియ గురించి మరింత బాగా అవగాహన చేసుకోవచ్చు. అయితే ఈ గామా కిరణాలు అత్యధిక శక్తితో దూసుకొస్తుంటాయి. చాలా శక్తితో కూడిన ఈ ఫొటాన్లను భూమిపై నుంచి నేరుగా గుర్తించడం సాధ్యం కాదు. మామూలుగా అయితే ఇవి నేరుగా భూమికి చేరితే జీవకోటి ఉనికికే ప్రమాదకరం. కానీ ఈ కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే విద్యుదావేశ కణాలను వెదజల్లుతాయి. ఫలితంగా నీలికాంతితో కూడిన రేడియేషన్ ఫ్లాష్ మాదిరిగా మెరిసి మాయమైపోతుంది. ఇదెంత వేగంగా జరుగుతుందంటే ఒక సెకనులో కొన్ని వందల కోట్ల వంతు సమయంలోనే. దీనినే సెరెంకోవ్ కాంతి లేదా సెరెంకోవ్ రేడియేషన్ అంటారు. ఈ కాంతిని గుర్తించి ఫొటోలు తీయడంతోపాటు ఇతర సమాచారాన్ని అందించడమే మేస్ టెలిస్కోపు పని అన్నమాట. పనితీరు ఇలా... మేస్ టెలిస్కోపులో కాంతిని పసిగట్టేందుకు 356 అద్దాల పలకలు ఉంటాయి. టెలిస్కోపు కేంద్రభాగంలో ప్రతిఫలించే సెరెంకోవ్ ప్రక్రియలు, వాటి లక్షణాలను పసిగట్టేందుకు 1200 కిలోల బరువైన హైరెసోల్యూషన్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. ఇది సెరెంకోవ్ కాంతిని ప్రతిఫలింపచేసే లైట్ కలెక్టర్లకు అభిముఖంగా ఉంటుంది. వీటన్నిటి సమన్వయంతో గామా రే ఫొటాన్ను శక్తిని, చిత్రాన్ని ఈ టెలిస్కోపు రికార్డు చేస్తుంది. సమాచారాన్ని గంటకు 50 జీబీల వేగంతో ఆప్టికల్ ఫైబర్ ద్వారా కంట్రోల్‌రూంలోని కంప్యూటర్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. ఆరు చక్రాలతో ఉండే మేస్ ఆకాశంలో ఏ దిక్కున ఉన్న ఖగోళ వస్తువునైనా పరిశీలించేందుకు అనుగుణంగా తిరగగలదు. ఇప్పటిదాకా అమెరికా, యూరోప్వంటి దేశాలు, సమాఖ్యలే ఇంత భారీ టెలిస్కోపులను నిర్మించాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై) సహకారంతో దీనిని ఈసీఐఎల్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే మేస్ ప్రారంభమైతే.. గామా రే అధ్యయనంలో భారత్ కీలక స్థానంలో నిలవనుంది. ప్రత్యేకతలు... ప్రపంచంలో ఎక్కడినుంచైనా దీనిని రిమోట్‌తో నియంత్రించవచ్చు. గంటకు 30 కి.మీ. వేగంతో గాలులు వీచినా స్థిరంగా నిలబడగలదు. పార్కింగ్ పొజిషన్లో ఉంచితే గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. నిర్దేశిత ఖగోళ వస్తువును నిరంతరాయంగా, కచ్చితత్వంతో అనుసరిస్తుంది. దిశను, ఎత్తును కూడా ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ‘మేస్’డేటా! పూర్తిపేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ సెరెంకోవ్ ఎక్స్పెరిమెంట్ (మేస్) గుర్తింపు: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు ఎత్తై ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద టెలిస్కోపు ఎత్తు: సముద్రమట్టానికి 4,500 మీటర్లు వ్యాసం: 21 మీటర్లు బరువు: 180 టన్నులు ఖర్చు: రూ.45 కోట్లు స్థలం: హన్లే, లడఖ్ ప్రారంభం: 2016, జనవరిలో