ఘటన జరిగిన మోర్కా గుహ
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన మార్క్ డికే(40)ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు.
జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గృహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజు్ఞలైన గృహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని టర్కిష్ కేవింగ్ ఫెడరేషన్ వివరించింది.
మార్క్ డికే కోసం ఆరు యూనిట్ల రక్తం పంపించామని టర్కీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. డికేను కాపాడేందుకు తుర్కియే, అమెరాకాతోపాటు హంగరీ, బల్గేరియా, ఇటలీ, క్రొయేíÙయా, పోలాండ్ దేశాలకు చెందిన 150 మంది నిపుణులను రప్పిస్తున్నట్లు యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ తెలిపింది. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment