ఈమధ్యకాలంలో రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు హోటల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నారు.
అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే మాత్రం మీకు గుండెదడ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ రెస్టారెంట్ పేరు హార్ట్ ఎటాక్. పేరుకు తగ్గట్లే హాస్పిటల్ థీమ్ మొత్తం హాస్పిటల్ మాదిరి ఉంటుంది. మరి ఈ వెరైటీ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? ఎలాంటి వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు రకరకాల వెరైటీ రెస్టారెంట్ పేర్లను విన్నాం, చూశాం. కానీ ఈ రెస్టారెంట్ పేరు వింటేనే గుండెనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటపేరు హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. అక్కడి ఫుడ్ ఐటెమ్స్ తింటే నిజంగానే మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో. ఇక్కడ దొరికే బైపాస్ బర్గర్లు తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్‌లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్ ఐటెంలో కొవ్వు అతిగానే ఉంటుంది.
2005లో జాన్ బాసో అనే వ్యక్తి ఈ ''హార్ట్ ఎటాక్ గ్రిల్'' రెస్టారెంట్‌ను ప్రారంభించగా వెరైటీగా ఉండటంతో కొద్ది నెలల్లోనే ఈ రెస్టారెంట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? లేక హాస్పిటల్‌కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ పేషెంట్స్‌లా గౌనులు వేసుకొని వెళ్లాలనే రూల్ ఉంది. ఇక అక్కడి వెయిటర్స్ నర్సులు, డాక్టర్లుగా డ్రెస్ చేసుకుంటారు.
అంతేకాకుండా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్‌ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు. ఒకవేళ ఆర్డర్ చేశాక ఫుడ్ ఐటెమ్స్ తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సులు వచ్చి సరదాగా బెల్ట్‌తో కొడతారట. ఇవన్నీ వింటుంటే..పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా. ఈ రెస్టారెంట్‌లో మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వాళ్లకు ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీగా పెడతారట.
అయితే కస్టమర్ల ఆరోగ్యాన్ని హానిచేసేలా విపరీతమైన జంక్‌ను ఎంకరేజ్ చేసేలా ఈ రెస్టారెంట్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ ఈ రెస్టారెంట్ వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ తినడం వల్ల ఆరోగ్యానికి హానీ అని తెలిసినా కస్టమర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment