కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..
రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు.
అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్.
తనకు గనుక ఆఫీస్‌లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్.
ఓ బిజినెస్‌మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్‌లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్‌ల నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు.
అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్‌లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!.
(చదవండి: వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!)
Comments
Please login to add a commentAdd a comment