canes
-
మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..
కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు. అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్. తనకు గనుక ఆఫీస్‌లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్. ఓ బిజినెస్‌మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్‌లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు. అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!. (చదవండి: వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!) -
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల గౌనులు, డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్‌లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్‌తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్ఖారు ధరించి ర్యాంప్‌పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?) -
కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అక్కడున్న వారందర్నీ తమ స్టన్నింగ్ లుక్‌తో మైమరిపించారు. అందాల సుందరీ, బాలీవుడ్ నటి ఐశ్వర్యారయ చక్కటి డిజైనర్ గౌనుతో అలరించిగా, మిగతా సెలబ్రిటీలో తమదైన శైలిలో మిస్మరైజ్ చేశారు.ఇక సూపర్ మోడల్, మాజీ మిస్ ఎర్త్ ఇండియా, బాలీవుడ్ నటి శోభితా ధూళిపాళ కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే శోభితా తొలిసారిగా ఈ రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. ఆమె ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో అధ్భతంగా కనిపించారు. శోభిత నమ్రత జోషిపురా జంప్‌సూట్ ధరించి రెడ్‌కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేసింది. ఆమె అత్యుత్తమ స్టైల్‌ని ఎంపిక చేసుకుని మరీ ఈ వేడుకలో మెరిశారు. మిరుమిట్లు గొలిపే ఊదారంగు డ్రస్‌లో ఆకర్షణీయంగా కనిపించారు. దానిపై ఉన్న సీక్విన్ వర్క్ శోభితా లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. వీ నెక్ డ్రస్‌కి తగ్గట్టుగా ఉంగరాల జుట్టుతో గ్లామరస్‌గా కనిపించింది శోభిత. అయితే ఆమె ధరించి డిజైనర్‌వేర్ ప్రధాన ఆకర్షణగాక కనిపించినప్పటికీ..ఇది గతంలో అతియ శెట్టి ధరించిన డిజైనర్‌వేర్‌కి దగ్గరగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతియా 2023లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఇదే నమ్రత జోషిపురా జంప్‌సూట్ డిజైనర్‌వేర్‌ని ధరించింది. రెండు కలర్లు కొంచెం వేరుగానీ డిజైన్ దగ్గరగా దగ్గరగా ఒకేలా ఉండటం విశేషం. ఇక శోభితా సెలక్ట్ చేసుకున్న ఈ డిజైనర్ వేర్ ధర ఏకంగా రూ. 1.8 లక్షలు ధర పలుకుతుందట. View this post on Instagram A post shared by A Fashionista's Diary (@afashionistasdiaries) (చదవండి: ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!) -
తాళమేచెవి
అమాయకత్వానికి స్వేచ్ఛనివ్వాలంటే తాళం కావాలి.పసి బతుకులకు విముక్తి కావాలంటేతాళం కావాలి.చిన్నారులను చెర తప్పించాలంటే..తాళం కావాలి. మనం ఒక్కరం తాళం వేసుకుంటేవేలాదిమందికి తాళంచెవి దొరుకుతుంది. మల్లిక క్యాంపెయిన్ మొదలుపెట్టింది.మీరూ.. ‘తాళం’ వెయ్యండి.కాన్స్‌లో ఇంకేం చూడ్డానికి ఉండదు. గౌన్స్.. గౌన్స్.. గౌన్స్! ఐశ్వర్య గౌన్. సోనమ్ గౌన్. దీపికా గౌన్. కంగనా గౌన్. ఇంకా.. సో మెనీ బాలీవుడ్ గౌన్స్. కాన్స్ అంటేనే గౌన్స్ అన్నట్లు ఉంటుంది ఈవెంట్. ఆ గౌన్లన్నీ రెడ్ కార్పెట్‌పై నడుస్తూనో, విహరిస్తూనో కనిపిస్తాయి. నడవడం స్వేచ్ఛ. విహరించడం విముక్తి. మల్లికా శెరావత్ కూడా కాన్స్‌కు వెళ్లిన మొదటి రెండు రోజూలూ గౌన్లోనే కనిపించారు. ఆ తర్వాతే.. రెక్కలు తెగిన పక్షిలా, సంకెళ్లు లేని ఖైదీలా.. ఒక బోనులో, ఆ ఊచల్లోంచి పిచ్చిచూపులు చూస్తూ కనిపించారు! కాన్స్ ప్రాంగణం ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది! నాకు తాళం వెయ్యండి మల్లికను ఎవరు ఆ బోనులో బంధించారు? ఎవరో కాదు, తనను తానే చిన్న పెట్టె లాంటి ఆ బోనులో ఆమె బందీ అయ్యారు. ‘పన్నెండు గంటలుగా నేను ఈ బోనులో ఉన్నాను. నాకు అండగా ఉండండి’ అని ఆ బోనుకు పైన తగిలించిన తెల్లటి బోర్డు పైన నల్లటి అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల పక్కన.. తెరిచి ఉన్న తాళం కప్ప ‘లాక్ మీ అప్’ (నాకు తాళం వెయ్యండి) అని ఉంది. ఆ తాళంకప్ప పక్కన.. మల్లిక ఈ ప్రపంచానికి ఇవ్వదలచుకున్న సందేశం ఉంది. ‘ఫ్రీ ఎ గర్ల్’బాలికలకు విముక్తి కల్పించండి. అది వట్టి సందేశం కాదు. అభ్యర్థన. విజ్ఞప్తి. వేడుకోలు. ప్రార్థన. ‘చూడండి.. బందీ అయిన బాలిక జీవితం ఎలా ఉంటుందో నన్ను చూడండి’ అని చెప్పడం. కాన్స్‌కి వచ్చి ఇదేం పని. చక్కగా సీతాకోక చిలకలా రెపరెపలాడక! రెపరెపలాడాలంటే కదలిక ఉండాలి. కదలిక ఉండాలంటే బంధనాలు లేకుండా ఉండాలి. ఇది చెప్పడానికే మల్లిక ఇక్కడికి వచ్చారు. ఊరికే వచ్చి ప్రసంగిస్తే, చర్చిస్తే, వాదిస్తే, అరిస్తే, ఆగ్రహిస్తే, గర్జిస్తే, గాండ్రిస్తే, అక్రమాలపై ఆక్రోశిస్తే.. ఎవరు వింటారు? ఎవరు తలతిప్పి చూస్తారు. బందీలను చేసి వినిపించాలి. అందుకోసం తను బందీ అయ్యారు మల్లిక! అప్పుడు మల్లిక ఒక్కరే కనిపించరు. మల్లికలోని ఆవేదన కనిపిస్తుంది. వినిపించే ఆవేదన కన్నా కనిపించే ఆవేదన పవర్ఫుల్. దగాపడిన చెల్లెళ్ల కోసం తొమ్మిదేళ్లుగా మల్లిక శెరావత్ కాన్స్‌కు వస్తున్నారు. ఇక్కడేం మాట్లాడినా ప్రపంచం వింటుందనీ, ఇక్కడే అభిప్రాయం వెలిబుచ్చినా ప్రపంచం గౌరవిస్తుందని, ఇక్కడి ప్రతి అడుగుకు, ప్రతి మూవ్‌మెంట్‌కు విలువ ఉంటుందని మల్లిక గ్రహించారు. కాన్స్పై అంత గమనింపు, అంత పట్టింపు ఉన్న ప్రపంచం కాన్స్‌లో బందీగా పడి ఉన్న ఒక అమ్మాయిని చూడకుండా ఉంటుందా? చూసీ చూడనట్లు వెళ్లిపోతుందా! అందుకే మల్లిక బోనులో కూర్చున్నారు. బయట తాళం కప్ప వేసుకుని తాళం వెయ్యమని అడుగుతున్నారు. బోనులో ప్రపంచానికి కనిపించేది మల్లికే కావచ్చు. కానీ మల్లిక.. దగాపడిన చెల్లెళ్లకు, నమ్మి మోసపోయి, రవాణా అయి, బందీ అయిన చిన్నారి బాలికలకు ప్రతిరూపం. ఆ విషయాన్నే మల్లిక చెప్పదలచుకున్నారు. ‘బంధన విముక్తి కల్పించండి’ అనే మాటనే, రివర్స్‌లో ‘బయట తాళం వెయ్యండి’ అనే మాటగా చెప్పారు. ఆలోచన రేపి, హృదయాన్ని తట్టి లేపే బంధనమిది! విముక్తి శక్తి.. శెరావత్ ‘ఫ్రీ ఎ గర్ల్’ అనే ఎన్జీవో సంస్థకు అంతర్జాతీయ రాయబారి మల్లికా శెరావత్. అక్రమ రవాణా నుంచి, లైంగిక దోపిడీ నుంచి బాలికలకు విముక్తి కల్పించడం ఆ సంస్థ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా గత ఏడాది కూడా కాన్స్‌లో చురుకైన పాత్రను పోషించారు మల్లిక. ఈ ఏడాది ‘లాక్ మీ అప్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. మోసగించి అపహరించుకు వచ్చిన బాలికల్ని ‘ట్రాఫికింగ్ మాఫియా’ పన్నెండు, ఎనిమిది అడుగుల చిన్న గదిలో బంధించి ఉంచుతుంది. ఎప్పుడు బయట పడతారో తెలీదు. ఎవరి చేతుల్లో పడతారో తెలీదు. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతారో తెలీదు. ఏ నిముషానికి ఏ తరహాలో లైంగిక హింస జరుగుతుందో తెలీదు. చీకటి బతుకు. ఆ చీకట్లో అలా ఎన్నేళ్లు బతకాలో, అసలు బతుకంటూ మిగిలుందో లేదో తెలియని బతుకు. ఆదుకునే వారుండరు. అక్కున చేర్చుకునే వారుండరు. ఈ దుస్థితి ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పడానికే, చూసేవాళ్లకు ఒక్కచూపులో తెలియడానికే మల్లిక ఇలా బోనులో బందీ అయ్యారు. ‘స్కూల్ ఫర్ జస్టిస్’ అనే సంస్థకు కూడా మల్లిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇండియాలో, మిగతా దేశాల్లో పసిపిల్లల్ని బాలవేశ్యలుగా మారుస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యంగా చొరవ చూపుతున్నారు. ఇందుకు.. ఐక్యరాజ్య సమితి తరఫున స్త్రీ, శిశు సంక్షేమం కోసం పని చేసిన అనుభవం, పరిచయాలు మల్లికకు తోడ్పడుతున్నాయి. -
కాన్స్‌లో కాకాని కుర్రాడు..
పెదకాకాని (గుంటూరు): గుంటూరు జిల్లా పెదకాకాని యువకుడు కాన్స్‌లో మెరిశాడు. ఫ్రాన్స్‌లోని కాన్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భాగంగా లఘు చిత్రాల విభాగంలో పెదకాకానికి చెందిన డక్కుమళ్ల భానుకిరణ్ కథానాయకుడిగా నటించిన గుల్జార్ (పూలతోట) చిత్రం మంగళవారం ప్రదర్శితమైంది. పెదకాకాని వెంగళరావునగర్‌లోని డక్కుమళ్ల నాగేశ్వరరావు మనుమడైన భాను.. బీటెక్ పూర్తి చేసి మధ్యప్రదే శ్లో మాస్టర్స్ డిజైన్ కోర్సు చేస్తున్నాడు. గతంలో కూలిబొమ్మలు, కళాభివందనం వంటి లఘుచిత్రాల్లో నటించాడు. గుల్జార్ చిత్ర కథనం... ముగ్గురు స్నేహితులు చిన్ననాటి నుంచి కలిసి చదువుకుంటుండగా.... వారిలో ఒకరి చదువు మధ్యలోనే ఆగిపోయి ఇంట్లో కొంత కాలం బంధీ అవడంతో పిచ్చివాడిగా మారిపోతాడు. కొంతకాలం తర్వాత బాగా వృద్ధిలోకి వచ్చిన మిగిలిన ఇద్దరు స్నేహితులు పిచ్చివాడిగా మారి రోడ్డుపై తిరుగుతున్న తమ స్నేహితుడిని చూసి చలించిపోయి అతడినీ తమలా ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. బాల కార్మికులు, కూలి పనులు చేస్తూ పడుతున్న అవస్థలతో రూపొందించిన గుల్జార్ లఘుచిత్రాన్నిహిందీ, ఆంగ్ల భాషల్లోనూ చిత్రీకరించారు. చిత్రానికి స్క్రిప్ట్ రైటర్‌గా జయేష్ పిళ్లై, దర్శకుడిగా అజిఫ్ ఇస్మాయిల్ పనిచేశారు. త్వరలోనే గుల్జార్ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో పెడతారని భానుకిరణ్ తండ్రి డక్కుమళ్ల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
బంగారు వర్ణం గౌనులో మెరిసిన ఐశ్వర్యరాయ్