కాన్స్‌లో కాకాని కుర్రాడు..
పెదకాకాని (గుంటూరు): గుంటూరు జిల్లా పెదకాకాని యువకుడు కాన్స్‌లో మెరిశాడు. ఫ్రాన్స్‌లోని కాన్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భాగంగా లఘు చిత్రాల విభాగంలో పెదకాకానికి చెందిన డక్కుమళ్ల భానుకిరణ్ కథానాయకుడిగా నటించిన గుల్జార్ (పూలతోట) చిత్రం మంగళవారం ప్రదర్శితమైంది. పెదకాకాని వెంగళరావునగర్‌లోని డక్కుమళ్ల నాగేశ్వరరావు మనుమడైన భాను.. బీటెక్ పూర్తి చేసి మధ్యప్రదే శ్‌లో మాస్టర్స్ డిజైన్ కోర్సు చేస్తున్నాడు. గతంలో కూలిబొమ్మలు, కళాభివందనం వంటి లఘుచిత్రాల్లో నటించాడు.
గుల్జార్ చిత్ర కథనం...
ముగ్గురు స్నేహితులు చిన్ననాటి నుంచి కలిసి చదువుకుంటుండగా.... వారిలో ఒకరి చదువు మధ్యలోనే ఆగిపోయి ఇంట్లో కొంత కాలం బంధీ అవడంతో పిచ్చివాడిగా మారిపోతాడు. కొంతకాలం తర్వాత బాగా వృద్ధిలోకి వచ్చిన మిగిలిన ఇద్దరు స్నేహితులు పిచ్చివాడిగా మారి రోడ్డుపై తిరుగుతున్న తమ స్నేహితుడిని చూసి చలించిపోయి అతడినీ తమలా ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. బాల కార్మికులు, కూలి పనులు చేస్తూ పడుతున్న అవస్థలతో రూపొందించిన గుల్జార్ లఘుచిత్రాన్నిహిందీ, ఆంగ్ల భాషల్లోనూ చిత్రీకరించారు. చిత్రానికి స్క్రిప్ట్ రైటర్‌గా జయేష్ పిళ్లై, దర్శకుడిగా అజిఫ్ ఇస్మాయిల్ పనిచేశారు. త్వరలోనే గుల్జార్ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో పెడతారని భానుకిరణ్ తండ్రి డక్కుమళ్ల శ్రీనివాసమూర్తి తెలిపారు.