Bhanukiran
-
సూరీ హత్యకేసులో సీఐడీ కోర్టు తుది తీర్పు
సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. సూరి హత్యకేసులో భానుకిరణ్‌ను దోషిగా తేలుస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భానుకు సహకరించిన మన్మోహన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా ఖరారు చేసింది. సూరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బయ్య, హరిబాబు, వంశీ, వెంకటరమణలను నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. 2011, జనవరి 3న సూరి హత్య జరిగింది. సూరీ అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధుమోహన్ జూబ్లీహిల్స్ నుంచి సనత్‌నగర్ వెళ్తుండగా యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీ సమీపంలో సూరిపై భానుకిరణ్ పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చాడనే ఆరోపణలపై కోర్టు విచారించింది. డ్రైవర్ మధు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 8 ఏళ్లపాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో కోర్టు 117 మంది సాక్షులను విచారించింది. భాను కిరణ్‌పై పోలీసులు మూడు చార్జి షీట్లు నమోదు చేశారు. -
బెంగళూరులో గ్యాంగ్ వార్
బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ ఆస్తి వివాదంలో భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ ఆగ్రహించి మధును కిడ్నాప్ చేసి చితకబాదింది. ఇక ముందు తాను ఎలాంటి సెటిల్ మెంట్లకు పాల్పడబోనని ఎంతగానో వేడుకోవడంతో మంజునాథ్ గ్యాంగ్ మధును విడిచిపెట్టింది. గతంలో మధును బెదిరించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోను మంజునాథ్ గ్యాంగ్ విడుదల చేసింది. భానుకిరణ్ పేరుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు సెటిల్ భారీ మొత్తాలలో సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలే సూరి హత్యకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
కాన్స్‌లో కాకాని కుర్రాడు..
పెదకాకాని (గుంటూరు): గుంటూరు జిల్లా పెదకాకాని యువకుడు కాన్స్‌లో మెరిశాడు. ఫ్రాన్స్‌లోని కాన్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భాగంగా లఘు చిత్రాల విభాగంలో పెదకాకానికి చెందిన డక్కుమళ్ల భానుకిరణ్ కథానాయకుడిగా నటించిన గుల్జార్ (పూలతోట) చిత్రం మంగళవారం ప్రదర్శితమైంది. పెదకాకాని వెంగళరావునగర్‌లోని డక్కుమళ్ల నాగేశ్వరరావు మనుమడైన భాను.. బీటెక్ పూర్తి చేసి మధ్యప్రదే శ్లో మాస్టర్స్ డిజైన్ కోర్సు చేస్తున్నాడు. గతంలో కూలిబొమ్మలు, కళాభివందనం వంటి లఘుచిత్రాల్లో నటించాడు. గుల్జార్ చిత్ర కథనం... ముగ్గురు స్నేహితులు చిన్ననాటి నుంచి కలిసి చదువుకుంటుండగా.... వారిలో ఒకరి చదువు మధ్యలోనే ఆగిపోయి ఇంట్లో కొంత కాలం బంధీ అవడంతో పిచ్చివాడిగా మారిపోతాడు. కొంతకాలం తర్వాత బాగా వృద్ధిలోకి వచ్చిన మిగిలిన ఇద్దరు స్నేహితులు పిచ్చివాడిగా మారి రోడ్డుపై తిరుగుతున్న తమ స్నేహితుడిని చూసి చలించిపోయి అతడినీ తమలా ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. బాల కార్మికులు, కూలి పనులు చేస్తూ పడుతున్న అవస్థలతో రూపొందించిన గుల్జార్ లఘుచిత్రాన్నిహిందీ, ఆంగ్ల భాషల్లోనూ చిత్రీకరించారు. చిత్రానికి స్క్రిప్ట్ రైటర్‌గా జయేష్ పిళ్లై, దర్శకుడిగా అజిఫ్ ఇస్మాయిల్ పనిచేశారు. త్వరలోనే గుల్జార్ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో పెడతారని భానుకిరణ్ తండ్రి డక్కుమళ్ల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. గత మూడేళ్లుగా జైలులో ఉంటున్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించాడు. కాగా బెయిల్ మంజూరుచేస్తే భానుకిరణ్ పారిపోయే అవకాశం ఉందని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 2011జనవరి 3న జరనిగిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. -
భానుకిరణ్ బ్యారక్ మార్పు
హైదరాబాద్ సిటీ: అనంతపురం కాంగ్రెస్ నాయకుడు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్డెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను చర్లపల్లి జైలులో ఒక బ్యారక్ నుంచి మరొక బ్యారక్‌కు మార్చారు. ప్రస్తుతం ఉంటున్న మానస బ్యారక్ నుంచి మంజీరా బ్యారక్‌కు మార్చారు. మద్దెల చెరువు సూరి వెంటే నమ్మకంగా ఉంటూ 2010లో కారులో కాల్చి పరారైన సంగతి తెలిసిందే. తర్వాత మహారాష్ట్రలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంగతి విదితమే. -
భానుకిరణ్ కోర్టుకు..
విజయవాడ లీగల్, న్యూస్‌లైన్ : అక్రమంగా శ్రీ సాయి అన్నపూర్ణ ప్యాకేజెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడి, సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా దాఖలైన కేసులో నాలుగో నిందితుడు మలిశెట్టి భానుకిరణ్‌ను పోలీసులు మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇన్చార్జి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. నిందితుడిని విచారించి అతని వద్ద విలువైన సమాచారం రాబట్టేందుకు తమ కస్టడీకి ఆరు రోజులు అప్పగించాలని కోరుతూ సి.ఐ.డి. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై వాదనలు వినేందుకు నిందితుడిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. నిందితుడు న్యాయవాదిని పెట్టుకోక పోవడంతో కేసు విచారణను శనివారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. నిందితునికి కస్టడీ పిటిషన్ కాగితాలను సి.ఐ.డి. పోలీసులు కోర్టులోనే అందజేయడం విశేషం. స్థానిక పటమటలోని టీచర్స్ కాలనీకి చెందిన వేమూరి శ్యామ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వేమూరి కృష్ణప్రసాదు, భానుకిరణ్, మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. నిందితులపై ఉన్న సెక్షన్లు 448, 506, 471లతోపాటు 420, 468, 109 ఐ.పి.సి. సెక్షన్లను చేర్చాలని కోరుతూ సి.ఐ.డి.పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి శనివారానికి వాయిదా వేశారు. నిందితుడు భానుకిరణ్ సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు.