భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత | nampally court rejects bail plea of bhanukiran | Sakshi
Sakshi News home page

భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Published Mon, Jul 27 2015 4:57 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

nampally court rejects bail plea of bhanukiran

హైదరాబాద్: మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెలువరించింది.

గత మూడేళ్లుగా జైలులో ఉంటున్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించాడు. కాగా బెయిల్ మంజూరుచేస్తే భానుకిరణ్ పారిపోయే అవకాశం ఉందని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. 2011జనవరి 3న జరనిగిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement