కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్‌ ధర ఏకంగా..! | Cannes 2024: Sobhita Dhulipala Shines In Deep Purple Cape Jumpsuit, Know More Details Inside | Sakshi
Sakshi News home page

Cannes 2024: కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్‌ ధర ఏకంగా..!

Published Fri, May 17 2024 6:13 PM | Last Updated on Fri, May 17 2024 7:00 PM

Cannes 2024: Sobhita Dhulipala Shines In Deep Purple

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్‌ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అక్కడున్న వారందర్నీ తమ స్టన్నింగ్‌ లుక్‌తో మైమరిపించారు. అందాల సుందరీ, బాలీవుడ్‌ ​నటి ఐశ్వర్యారయ​ చక్కటి డిజైనర్‌ గౌనుతో అలరించిగా, మిగతా సెలబ్రిటీలో తమదైన శైలిలో మిస్మరైజ్‌ చేశారు.

ఇక సూపర్ మోడల్, మాజీ మిస్ ఎర్త్ ఇండియా, బాలీవుడ్‌ నటి శోభితా ధూళిపాళ కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే శోభితా తొలిసారిగా ఈ రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. ఆమె ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అధ్భతంగా కనిపించారు. శోభిత నమ్రత జోషిపురా జంప్‌సూట్‌ ధరించి రెడ్‌కార్పెట్‌పై ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఆమె అత్యుత్తమ స్టైల్‌ని ఎంపిక చేసుకుని మరీ ఈ వేడుకలో మెరిశారు. 

మిరుమిట్లు గొలిపే ఊదారంగు డ్రస్‌లో ఆకర్షణీయంగా కనిపించారు. దానిపై ఉన్న సీక్విన్‌ వర్క్‌ శోభితా లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. వీ నెక్‌ డ్రస్‌కి తగ్గట్టుగా ఉంగరాల జుట్టుతో గ్లామరస్‌గా కనిపించింది శోభిత. అయితే ఆమె ధరించి డిజైనర్‌వేర్‌ ప్రధాన ఆకర్షణగాక కనిపించినప్పటికీ..ఇది గతంలో అతియ శెట్టి ధరించిన డిజైనర్‌వేర్‌కి దగ్గరగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

అతియా 2023లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఇదే నమ్రత జోషిపురా జంప్‌సూట్‌ డిజైనర్‌వేర్‌ని ధరించింది. రెండు కలర్‌లు కొంచెం వేరుగానీ డిజైన్‌ దగ్గరగా దగ్గరగా ఒకేలా ఉండటం విశేషం. ఇక శోభితా సెలక్ట్‌ చేసుకున్న ఈ డిజైనర్‌ వేర్‌ ధర ఏకంగా రూ. 1.8 లక్షలు ధర పలుకుతుందట. 

 

(చదవండి: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌లో కృత్రిమ మేధ!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement