
ఆహార ప్రాసెసింగ్ రంగంలో కృత్రిమ మేధా వినియోగాన్ని వేగవంతం చేయాలని భారత్ చూస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐఎప్‌టీఈఎం) నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. నిజానికి ఇది భారత్‌లో ప్రారంభ దశలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఆహార ప్రాసెసింగ్ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని వేగవంతం చేయాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సీనియర్ బ్యూరోక్రాట్‌లు, ప్రభుత్వ సలహాదారులు ఏఐ పరిష్కారాలను అమలు చేసేందుకు సరైన రోడ్‌మ్యాప్ వ్యూహం అవసరమని అన్నారు. ఈ ఎన్‌ఐఎప్‌టీఈఎం సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ అనితా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఒక పరిశ్రమగా మనం ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈటీవై) మద్దతు కూడా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నీతీ అయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన ఆహార ప్రాసెసింగ్‌కి ఈ "వాతావరణ స్మార్ట్" రైతు ఆదాయాలను పెంపొందించడానికి, వినియోగదారులను సంతృప్తిపరచడానికే కాకుండా పెరుగుతున్న వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో గొప్ప సహాయకారిగా ఉంటుందన్నారు.
అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి సులభమైన పోర్టబుల్ పరికరాలను అవపసరమని, అందుకసం ఏఐని ఉపయోగించాలని చెప్పారు. అదీగాక 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ ఏఐ పరిష్కారాలు మొత్తం రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.
ఆహార పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ..
ఆహార రంగంలో కృత్రిమ మేధస్సు అనేది ఆహార ఉత్పత్తి, ఖచ్చితమైన వ్యవసాయం, నాణ్యత నియంత్రణ, వ్యక్తిగతీకరించిన పోషణ, సరఫరా గొలుసు నిర్వహణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతలు, డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్లికేషన్లు సమర్థవంతమైన ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తూ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయని అర్థం.
(చదవండి: ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!)