ఓటింగ్‌ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్‌ కస్టమర్లకు భలే ఆపర్‌ అందించింది! | Mumbai Voters Get 20 Percent Off Restaurant Bill: NRAI | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్‌ కస్టమర్లకు భలే ఆపర్‌ అందించింది!

May 17 2024 1:23 PM | Updated on May 17 2024 2:15 PM

Mumbai Voters Get 20 Percent Off Restaurant Bill: NRAI

ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా స్వయం సహాయక బృందాల నుంచి ఆఫీసర్ల వరకు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించే యత్నం చేశారు.  అలానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) కూడా చేరి తన వంతుగా ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించింది. ఓటు వేస్తే మా రెస్టారెంట్‌లలో తక్కువ బిల్లుకే మంచి భోజనం తినొచ్చు అంటూ చక్కటి 'డెమోక్రసీ డిస్కౌంట్‌'ని అందిచింది కస్టమర్లకు. ఎక్కడంటే..

ముంభైలోని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసీయేషన్‌ ఆప్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) ఈ ఆఫర్‌ అందిస్తోంది. ఈ ఎన్నికల సీజన్‌లో బయటకు వెళ్లేందుకు కారణం కోసం చూస్తున్నారా! ఐతే ఇది మీకు మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో ఓటు వేయండి. ఓటువేసినట్లు సిరా చుక్క వేయించకున్నా.. మీ వేలుని చూపించి ముంబై నగరంలోని రెస్టారెంట్‌లో చక్కటి భోజనం ఆస్వాదించి బిల్లులో 20% డిస్కౌంట్‌ పొందండి అంటూ ప్రచారం చేస్తోంది ఎన్‌ఆర్‌ఏఐ. 

నగరంలో దాదాపు వంద రెస్తారెంట్లు ఈ ఆఫర్‌ని అందిస్తున్నాయిని ఎన్‌ఆర్‌ఏఐ పేర్కొంది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూసేందుకు తమ వంతుగా చేస్తున్న ప్రయత్నం అని ముంబై ఎన్‌ఆర్‌ఏఐ సీఈవో రాచెల్ గోయెంకా చెప్పారు. మహారాష్ట్రలో మే 20, 21వ తేదీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా వినూత్నమైన రీతీలో ప్రచారం చేస్తోంది ఎన్‌ఆర్‌ఏఐ. 

ఇప్పటికే ముంభైలో సుమారు 150 రెస్టారెంట్లు ఈ ఆపర్లను అందిస్తున్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన డెమోక్రసీ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఇచ్చే రెస్టారెంట్‌ల పూర్తి జాబితాను కూడా వెల్లడించారు. మీ సమీపంలో  ఉన్న రెస్టారెంట్‌ని ఎంచుకుని చక్కగా ఓటు వేసి 20% డిస్కౌంట్‌లో చక్కటి భోజనం ఆస్వాదించడని చెబుతున్నారు గోయెంకా.  

(చదవండి: వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement