ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్ల చిన్నారికి మాట్లాడలేని పరిస్థితి ఎదురయ్యింది. ఆ చిన్నారి వేలుకి సర్జరీ చేయించుకోవడానికి వస్తే ఏకంగా ఎలాంటి సమస్యలేని నాలుకకి సర్జరీ చేశాడు ఓ వైద్యుడు. దీంతో ఆ చిన్నారి కుటుంబం నివ్వెరపోయింది. ఈ షాకింగ్ ఘటనతో ఆస్పత్రి వర్గాలు సదరు వైద్యుడుని తక్షణమే విధుల నుంచి తొలగించారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఎక్కడ జరిగిందంటే..
కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్‌కి చెందిన ఒక వైద్యుడు నాలుగేళ్ల చిన్నారికి వేలికి బదులుగా నాలుకకి శస్త్ర చికిత్స చేశాడు. నిజానికి ఆమె చేతికి ఉన్న ఆరోవేలుని తొలగించుకునేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన తమ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆగ్రహంతో ఏం జరిగిందని ప్రశ్నించగా..బాలిక నాలుకపై తిత్తి ఉందని అందువల్తొల నాలుకను తొలగించినట్లు చెప్పాడు వైద్యుడు.
అసలు అమెకు నాలుకకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఒకేరోజు రెండు సర్జరీలు జరగడంతో ఈ పొరపాటు జరిగిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు చైల్డ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందిచడంతో కేరళ రాష్ట్ర ఆరోగ్యగమంత్రి వీణా జార్జ్ అసోసీయేట్ ప్రొఫెసర్ డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. ఏదీఏమైనా..దీని కారణంగా ముద్దుముద్దు మాటాలతో తల్లిదండ్రులను మైమరిపించే చిన్నారి గొంతు మూగబోయింది. కొద్దిపాటి నిర్లక్ష్య వైఖరి ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందే ఈ ఉదంతమే ఉదాహరణ.
(చదవండి: ఘోస్ట్ మ్యారేజ్‌లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్‌లో)
Comments
Please login to add a commentAdd a comment