Fingers
-
‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’
గాంధీ నగర్ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వరచా మినీ బజార్లో అనభ్ జెమ్స్‌లో మయూర్ తారాపర (32) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్‌కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు. ఈ తరుణంలో మయూర్ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్‌లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు. దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కి కేసును బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం మయూర్ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్ చెప్పినట్లుగా వేదాంత రింగ్ రోడ్, స్నేహితుల ఇళ్లు, మయూర్ ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.తారామార పోలీసుల వివరాల మేరకు.. సింగన్పూర్లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్‌రోడ్డు సమీపంలో తన బైక్‌ను పార్క్ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్‌లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. -
ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్‌క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్‌క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. -
ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!
Human Finger Inside Cone Ice Cream ఫింగర చిప్స్ గురించి విన్నాం కానీ, ఐస్ కీంలో ఫింగర్ గురించి విన్నారా?ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని చల్ల..చల్లగా.. ఐస్‌క్రీం తింటూ ఉండగా, గట్టిగా ఏదో తగిలినట్టైంది. దీంతో పరిశీలనగా చూడగా తెగిన మనిషి వేలు ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చదువుతోంటేనే.. యాక్ అనిపిస్తోంది కదా.. ముంబైలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. ముంబైలోని మలాడ్ ప్రాంత నివాసి డా. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అందుకొని ఉత్సాహంగా తింటున్న సమయంలో నాలుకకు ఏదో గట్టిగా తగలడంతో ఏంటా? అని పరికించి చూశారు. అంతే ఒక్కసారిగా వాంతి వచ్చినంత పనైంది. 2 సెంటీమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి ముక్కను చూసి దిగ్భాంతికి లోనయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు. This #Butterscotch ice cream was ordered online by a 27-year-old doctor in Mumbai, Orlem Brendan Serrao.He found a 2 cm piece of a human finger. Serrao had asked his sister to include the ice cream in her online grocery order. While enjoying the treat, he felt something… https://t.co/3uHXqorYIu pic.twitter.com/gbXFBqtH6U— Sneha Mordani (@snehamordani) June 13, 2024 తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ‘ఉదయం నాసోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే ఐస్‌క్రీం కోను ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది’ అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనషి ఫింగర్ ముక్కా, లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు. -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్ల చిన్నారికి మాట్లాడలేని పరిస్థితి ఎదురయ్యింది. ఆ చిన్నారి వేలుకి సర్జరీ చేయించుకోవడానికి వస్తే ఏకంగా ఎలాంటి సమస్యలేని నాలుకకి సర్జరీ చేశాడు ఓ వైద్యుడు. దీంతో ఆ చిన్నారి కుటుంబం నివ్వెరపోయింది. ఈ షాకింగ్ ఘటనతో ఆస్పత్రి వర్గాలు సదరు వైద్యుడుని తక్షణమే విధుల నుంచి తొలగించారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఎక్కడ జరిగిందంటే..కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్‌కి చెందిన ఒక వైద్యుడు నాలుగేళ్ల చిన్నారికి వేలికి బదులుగా నాలుకకి శస్త్ర చికిత్స చేశాడు. నిజానికి ఆమె చేతికి ఉన్న ఆరోవేలుని తొలగించుకునేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన తమ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆగ్రహంతో ఏం జరిగిందని ప్రశ్నించగా..బాలిక నాలుకపై తిత్తి ఉందని అందువల్తొల నాలుకను తొలగించినట్లు చెప్పాడు వైద్యుడు. అసలు అమెకు నాలుకకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఒకేరోజు రెండు సర్జరీలు జరగడంతో ఈ పొరపాటు జరిగిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందిచడంతో కేరళ రాష్ట్ర ఆరోగ్యగమంత్రి వీణా జార్జ్ అసోసీయేట్ ప్రొఫెసర్ డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. ఏదీఏమైనా..దీని కారణంగా ముద్దుముద్దు మాటాలతో తల్లిదండ్రులను మైమరిపించే చిన్నారి గొంతు మూగబోయింది. కొద్దిపాటి నిర్లక్ష్య వైఖరి ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందే ఈ ఉదంతమే ఉదాహరణ.(చదవండి: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో) -
భార్యతో గొడవ.. కోపంతో ఆమె చేతి వేళ్లను కొరికి తినేసిన భర్త
బెంగళూరు: దంపతుల మధ్య గొడవలు సహజం. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని సమీక్షించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి తప్పు .. గొడవలను పెద్దవి చేసుకోకూడదని పెద్దలు అంటుంటారు. అయితే ఇటీవల కొందరు భార్యాభర్తలు హత్యలకు కూడా కారణం అవుతున్నాయి. క్షణికావేశం కొంపల్ని వాళ్ల జీవితాలని నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. అతని భార్య పేరు పుష్ప. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయి 23 ఏళ్లు కావస్తున్న వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. కొన్నేళ్ల నుంచి విజయ్‌కుమార్ భార్యను వేధిస్తుండటంతో ఆమె వేరుగా ఉంటోంది. గత నెల 28న విజయ్‌కుమార్ ఆమె వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కోపం పట్టలేక ఆమెపై దాడి చేసి ఎడమ చేతి వేళ్లు కొరికి తినేశాడు. తన వద్దకు రాకపోతే ఆమెను చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నిందితులను పట్టుకున్నారు.. చివరికి కక్కుర్తి పడి పోలీసులే అరెస్టయ్యారు! -
వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా?
సముద్రతీరంలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రేమ జంటకు ఇసుకలో ఓ పొడవాటి వస్తువులాంటింది కన్పించింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అది అస్థిపంజరం చేతి. దాని పరిమాణం చూసి ఇద్దరూ కంగుతిన్నారు. ఇది కచ్చితంగా మనిషిది కాదని, భయాందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. అస్థిపంజరం చూసి హడలిపోయిన లెటిసియా గోమ్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్ డెవనీర్ సౌజ్ వెంటనే దాన్ని ఫొటో తీశారు. అది ఏ సైజులో ఉందో చెప్పేందుకు డెవనీర్ తన చెప్పును కొలమానంగా చూపాడు. దొరికిన అస్తిపంజరం చేతిలోని వేలు.. ఆ చెప్పు కంటే పెద్దగా ఉండటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ చేతి కచ్చితంగా సాధారణ మనుషులది కాదని, కొంపతీసి ఏలియన్స్ది అయి ఉంటుందా? అని ఈ ప్రేమికులు ఆందోళన చెందారు. మరోవైవు నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేశారు. ఇది కచ్చతింగా ఏలియన్ చేతి అయి ఉంటుంది, వెంటనే దీన్ని పరిశోధనకు పంపించండి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అది జల కన్య చేతి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ఇది డైనోసార్ చేతి అయి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన సముద్ర జీవి అస్థి పజరం అయి ఉంటుందని, 18 నెలల క్రితం అది ఆ ప్రాంతంలోనే చనిపోయిందని ఓ సముద్ర జీవ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేని స్పష్టం చేశారు. చదవండి: Guinness World Records: ఆ పిల్లి వయసు 26 -
బట్టలే కాదు, చేతి వేళ్లను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ ఉందని మీకు తెలుసా!
సాయంత్రం చిరుతిళ్లు చాలామందికి అలవాటే! పకోడీలు, చిప్స్ వంటివి పంటి కింద కరకరలాడిస్తూ కబుర్లాడుకోవడం చాలామందికి ఇష్టమైన కాలక్షేపం. నూనెలో వేయించిన చిరుతిళ్లు తినేటప్పుడు మధ్యలో అదే చేత్తో మరో వస్తువు అందుకోవాలంటే, చెయ్యి కడుక్కోవడమో లేదా కనీసం టిష్యూపేపర్తో తుడుచుకోవడమో తప్పదు. పదే పదే చేతులు తుడుచుకోవాల్సిన పరిస్థితులు కొంత చిరాకు కలిగిస్తాయి. అంతేకాదు, టిష్యూపేపర్ వృథాకు దారితీస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టడానికే అంతర్జాతీయ చిప్స్ తయారీ సంస్థ ‘లేస్’ ఒక సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. ఈ బుల్లి పరికరంలో అరచెయ్యంతా పట్టదు గాని, వేళ్లు ఇంచక్కా పట్టేస్తాయి. దీని ఎత్తు 15 సెం.మీ., వెడల్పు 11 సెం.మీ. ఇందులో వేళ్లు పెడితే చాలు, ఇట్టే శుభ్రమైపోతాయి. ఇందులో వేళ్లు పెట్టగానే, దీని పైభాగంలోని సెన్సర్లు గుర్తించి, ఇందులోని సిలిండర్ నుంచి ఆల్కహాల్‌ను స్ప్రే చేస్తాయి. ఇందులోని వేడిమి వల్ల క్షణాల్లోనే వేళ్లు పొడిగా శుభ్రంగా తయారవుతాయి. యూఎస్బీ పోర్ట్ ద్వారా దీనిని చార్జింగ్ చేసుకుని ఇంచక్కా వాడుకోవచ్చు. వాడకాన్ని బట్టి పైభాగంలోని సిలిండర్ లో ఆల్కహాల్‌ను ఎప్పటి కప్పుడు రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది ఎంత ముచ్చటగా ఉన్నా, మార్కెట్లో దీనిని కొనుక్కోవాలంటే కష్టమే! ‘లేస్’ సంస్థ ఇప్పటి వరకు ఈ పరికరాలను ఐదింటిని మాత్రమే తయారు చేసింది. -
రోబోతో చెస్ ఓపెన్... ఏడేళ్ల చిన్నారికి చేదు అనుభవం
మాస్కోలోని చెస్ ఓపెన్‌లో అనుహ్య ప్రమాదం చోటు చేసుకుంది. చెస్ ఆడే రోబోతో తలపడిని ఏడేళ్ల చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు ఏడేళ్ల బాలుడు ఒక రోబోతో చెస్ ఆడుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా ఆ చిన్నారి వేలుని రోబో విరిచేసింది. అసలేం జరిగిందంటే... ఆ చిన్నారి రోబోతో చెస్ ఆడుతున్నాడు. ఆట కూడా చాలా ఉత్కంఠంగా సాగుతోంది. ఐతే రోబోతో ఆడేటప్పుడూ కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. కానీ ఆ పిల్లాడు ఆ నియమాలను ఉల్లంఘించడంతోనే ఈ ప్రమాదాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ చిన్నారి రోబో వంతు ఆట వచ్చినప్పుడూ వేచి ఉండాలి. అలాకాకుండా ఆట మీద జిజ్ఞాస కొద్ది రోబో తన వంతు పూర్తి చేయకమునుపే చెస్ బోర్డుపై చేయిపెట్టి తదుపరి ఆటను ఆడేందుకు యత్నించడంతో ఈ ప్రమాదం సంభవించిందని రష్యన్ చెస్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, సెర్గీ స్మాగిన్ పేర్కొన్నారు. ఆ బాలుడి పేరు క్రిస్టోఫర్ అని మాస్కోలోని 30 మంది అత్యుత్తమ చెస్ ప్లేయర్లలో అతను ఒకడని చెప్పారు. అంతేగాదు ఈ రోబో కూడా పలు చెస్ మ్యాచ్‌లను ఆడిందని, ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. All acquisition that advanced AI will destroy humanity is false. Not the powerful AI or breaching laws of robotics will destroy humanity, but engineers with both left hands :/ On video - a chess robot breaks a kid's finger at Moscow Chess Open today. pic.twitter.com/bIGIbHztar — Pavel Osadchuk 👨💻💤 (@xakpc) July 21, 2022 (చదవండి: ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్) -
అతనికి 24 వేళ్లు.. సోదరికి 21, తమ్మునికి 22 వేళ్లు
బెంగళూరు: ప్రతి మనిషికీ కాళ్లు చేతులకు కలిపి 20 వేళ్లుంటాయి. కానీ శివమొగ్గ తాలూకాలో ఉన్న వ్యక్తికి రెండు కాళ్లు, రెండు చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉంటాయి. బసవనగంగూరులో నివసించే మంజునాథ్‌కు ఈ ప్రత్యేకత సొంతం. ఒక్కో చేతికి ఆరేసి వేళ్లు, ఒక్కో కాలికి ఆరు చొప్పున వేళ్లతో ఇతడు చూపరులను ఆశ్చర్యపరుస్తాడు. ఒక మనిషికి 24 వేళ్లు ఉండడం చాలా అరుదు అని స్థానిక ప్రజలు ఆంటున్నారు. కూలీ పనులు చేసుకునే మంజునాథ్ ఇంట్లో అతని తల్లి, సోదరికి 21 వేళ్లు, తమ్మునికి 22 వేళ్లు ఉన్నాయి. చదవండి: టీచర్ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి.. -
ఒంటివేలు బాహుబలి.. ఏకంగా 129.49 కిలోల బరువెత్తి!
మీకు వెయిట్ లిఫ్టింగ్ తెలుసుగా.. అదేనండి, బరువులెత్తే పోటీ.. మరి మీకు ఫింగర్ లిఫ్టింగ్ గురించి తెలుసా? ఒంటి వేలితో భారీ బరువులు ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకే ఒక వేలితో బరువులు ఎత్తడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ బ్రిటన్‌కు చెందిన స్టీవ్ కీలర్ (48) అనే వ్యక్తి కేవలం తన మధ్య వేలితో భారీ బరువును పైకెత్తి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఆయన పైకెత్తిన బరువు ఎంతో తెలుసా? ఏకంగా 129.49 కిలోలు. కెంట్ నగరంలోని యాష్ఫోర్డ్కు చెందిన కీలర్ ఓ కరాటే యోధుడు. తన 18 ఏట నుంచే కరాటే శిక్షణ పొందుతున్న కీలర్ గత నాలుగేళ్లుగా బలాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలా శిక్షణ పొందే క్రమంలో ఓసారి అలవోకగా 111 కిలోల బరువు ఎత్తేశాడట. అప్పటివరకు ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఇది కేవలం 10 కిలోలు మాత్రమే తక్కువట. దీంతో కొత్త రికార్డు నెలకొల్పడంపై దృష్టిపెట్టిన కీలర్.. తాజాగా 129.49 కిలోల బరువుగల ఆరు ఇనుప డిస్క్‌లను తన మధ్య వేలితో పైకిత్తి గిన్నిస్కెక్కాడు. కీలర్ ధాటికి 2012లో అర్మేనియాకు చెందిన బెనిక్ అనే యువకుడు ఒంటి వేలితో పైకెత్తిన 121.69 కిలోల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. తన రికార్డును ఇటీవల మరణించిన, తనకు బలాన్ని పెంచుకోవడంలో శిక్షణ ఇచ్చిన పినతండ్రికి అంకితమిచ్చాడు. చదవండి: ప్రపంచంలో తొలి సోలార్ పవర్ కారు.. విశేషాలు ఇవే -
'జెర్సీ' పేరు మీద ఓ జబ్బు ఉంది తెలుసా? చికిత్స వివరాలు ఇవిగో..
ఆటగాళ్లు ధరించే ప్రత్యేకమైన షర్ట్‌ను ‘జెర్సీ’ అంటారన్న సంగతి తెలిసిందే కదా. ఆ జెర్సీ పేరు మీద కూడా ఓ జబ్బు ఉంది. దాని పేరే ‘జెర్సీ ఫింగర్’! ఈ జబ్బు ఎందుకు వస్తుందో, దానికి చికిత్స ఏమిటన్న విషయాలు తెలిపే సంక్షిప్త కథనమిది. మైదానంలో ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ, ప్రత్యర్థిని నిలువరిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే వేళ్లన్నీ గుప్పిటలా బిగించి... ప్రత్యర్థి జెర్సీని అప్రయత్నంగానే లాగేస్తుతుంటారు. మరీ ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆటలో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు వేగంగా ఆడే సమయంలో... వారి వేళ్ల కండరాలు చురుగ్గా కదిలేందుకు కొన్ని టెండన్స్ తోడ్పడుతుంటాయి. ఈ టెండన్స్ అనేవి ఎముకలనూ, కండరాలను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి టెండన్స్‌లో ‘ఫ్లెక్సార్ టెండన్’ చాలా ప్రధానమైనది. ఆటగాళ్ల కదలికల సమయంలో ఈ ఫ్లెక్సార్ టెండన్ చీరుకుపోవడమో లేదా దెబ్బతినడమో జరగవచ్చు. ఇదే జరిగితే... ఆటగాళ్ల మణికట్టులోగానీ, అరచేతిలోగానీ లేదా నేరుగా వేళ్లకే తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ కారణంగా వచ్చే నొప్పినే ‘జెర్సీ ఫింగర్’ అంటారు. జెర్సీ ఫింగర్తో బాధపడే ఆటగాళ్లు... తమ వేలిని ఏమాత్రం ఒంచలేకపోవడం, అది పూర్తిగా మొద్దుబారడం, గాయపడిన భాగం ఎర్రబారడం, ముట్టుకోనివ్వకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మేనేజ్మెంట్ / చికిత్స : గాయపడ్డ చేతికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం లేదా దాని కదలికలను పూర్తిగా నివారించేలా ఓ స్లింగ్ అమర్చడం ద్వారా కొద్దిరోజుల్లోనే సమస్య దానంతట అదే తగ్గుతుంది. బాధ చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉంటే... అప్పుడు ఫ్లెక్సార్ టెండన్ అతుక్కుని ఉండవలసిన కండరానికి, ఎముకకూ దాన్ని కలిపేలా ఓ చిన్నపాటి శస్త్రచికిత్స అరుదుగా అవసరం పడవచ్చు. టెండన్ చిరిగినప్పుడు మాత్రమే ఈ శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
చూపుడు వేలుపై 3 గంటలకు పైగా
భవానీపట్న (ఒడిశా): హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆకట్టుకోగా... ఓ ఒడిశా యువకుడు మరో అరుదైన ఫీట్ చేశాడు. బొలాంగిర్ జిల్లాలోని జముత్జోలా గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజ్‌గోపాల్ భోయ్ కుడిచేతి చూపుడు వేలుపై ఏకంగా 3 గంటల 22 నిమిషాల 22 సెకన్లపాటు హాకీ స్టిక్‌ను నిలబెట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించాడు. గిన్నిస్ నిబంధనల మేరకు సమయాన్ని నమోదుచేసే వారు, జడ్జిలు, వీక్షకుల సమక్షంలో... వీడియో చిత్రీకరణ జరుగుతుండగా... రాజ్‌గోపాల్ ఈ అరుదైన ఫీట్ చేశాడు. అత్యధిక సమయం చూపుడు వేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టిన వరల్డ్ రికార్డు ప్రస్తుతం 2 గంటల 22 నిమిషాలతో బెంగళూరుకు చెందిన హిమాంశు గుప్తా పేరిట ఉంది. రాజ్‌గోపాల్ విన్యాసానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను నిశితంగా అధ్యయనం చేసిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు అతని ఘనతను గుర్తించి సర్టిఫికెట్ జారీచేయనున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తి కావాలని... సంకల్పబలంతోనే ఇది సాధ్యమని ఈ ఫీట్‌కు నిర్వాహకునిగా వ్యవహరించిన సత్యపిర్ ప్రధాన్ అన్నారు. -
మీ చేతివేళ్లే ఫోన్ చార్జర్! చెమట నుంచి కరెంట్
స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం గడవని పరిస్థితి. రోజూ ఒకట్రెండు సార్లు చార్జింగ్ పెట్టాలి. ఎక్కడికైనా వెళ్తే చార్జర్ కూడా వెంట తీసుకెళ్లాలి, లేకుంటే వెళ్లిన చోట చార్జర్ కోసం వెతుకులాట తప్పదు. ఇక ముందు అలాంటి తిప్పలు తప్పనున్నాయి. విడిగా చార్జర్ అవసరమేదీ లేకుండా.. మీ చేతి వేళ్లే చార్జర్‌గా మారిపోనున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అలాంటి ఓ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా? చిన్న ప్లాస్టర్‌లా వేసుకుంటే చాలు.. ఎప్పుడైనా చిన్నపాటి గాయమైతే వేసుకునే ప్లాస్టర్ తరహాలోనే.. ఈ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పరిమాణం ఒక చదరపు సెంటీమీటర్ మాత్రమే. దీన్ని అమర్చిన స్ట్రిప్‌ను చేతివేలి కొసలకు చుట్టేసి పెడితే చాలు.. ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని ఉన్నా, పడుకున్నా, ఇంకేదైనా పనిలో ఉన్నా సరే.. ఆటోమేటిగ్గా అదే చార్జ్ అవుతూ ఉంటుంది. చెమట నుంచి కరెంటు ఈ పరికరంలో కార్బన్ ఫోమ్‌తో తయారైన ఎలక్ట్రోడ్లు, కొన్నిరకాల ఎంజైమ్‌లు ఉంటాయి. అవి చేతి వేళ్ల వద్ద ఏర్పడే చెమటను గ్రహించినప్పుడు.. రసాయనిక చర్యలు జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంతేగాకుండా ఇందులోని ఎలక్ట్రోడ్ల దిగువన ‘పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ (ఒత్తిడికి లోనైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే పదార్థాలు)’ను అమర్చారు. దీనివల్ల మనం ఏదైనా వస్తువును పట్టుకోవడం, కీబోర్డుపై టైపింగ్ చేయడం, కారు, బైక్ నడపడం వంటివి చేసినప్పుడు వేళ్లకు ఉన్న స్ట్రిప్‌లపై ఒత్తిడిపడి.. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పరికరంలోని కెపాసిటర్‌లో ఆ విద్యుత్ నిల్వఅవుతుంది. టెస్టులు.. పరికరాలకు.. ప్రస్తుతం ఒక స్ట్రిప్‌ను పది గంటల పాటు ధరిస్తే.. ఒక సాధారణ చేతి గడియారాన్ని 24 గంటలపాటు నడిపేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే పది వేళ్లకు పది స్ట్రిప్‌లను ధరిస్తే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ స్ట్రిప్ ప్రస్తుతానికి ప్రాథమిక నమూనా మాత్రమేనని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. గుండెకు అమర్చే పేస్ మేకర్లు వంటి పరికరాలకు, బ్లడ్ షుగర్, విటమిన్, సోడియం సెన్సర్లు, ఇతర టెస్టుల కోసం శరీరానికి అమర్చే పరికరాలకు ఈ స్ట్రిప్‌ల సాయంతో విద్యుత్ అందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. హా ప్రస్తుతం ఒక్కో స్ట్రిప్‌తో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి మూడు వారాలు పడుతుందని.. భవిష్యత్తులో కొద్దిగంటల్లోనే చార్జ్ అయ్యే స్థాయికి అభివృద్ధి చేస్తామని వివరించారు. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
వింత: శిశువు కాలికి తొమ్మిది వేళ్లు
సాక్షి, బళ్లారి: కాలికి తొమ్మిది వేళ్లతో శిశువు జన్మించిన అరుదైన ఘటన హొసపేటెలో చోటు చేసుకుంది. హొసపేటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి కాన్పు కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే శిశువు ఎడమ కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలా తొమ్మిది వేళ్లతో జన్మించిన బాలురు ప్రపంచంలో 20 మంది ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
భార్యమీద కోపంతో వేళ్లు నరికిన కిరాతక భర్త..
భార్య భర్తల మధ్య అలకలు, గొడవలు సాధారణ విషయం. ఎప్పుడు గొడవపడినా కొంత సమయానికి దానిని మరిచిపోయి మళ్లీ నార్మల్ అయిపోయేవారు కొందరైతే, చిన్న చిన్న గొడవలకే ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. తాజాగా చిన్నగా గొడవపడి నిద్రపోతున్న భార్య వేళ్లను గొడ్డలితో నరికిన భర్త బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని బేతుల్ జిల్లా చిచోలి గ్రామానికి చెందిన రాజు వన్ష్కర్‌కు అతని భార్యతో కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు ఏర్పడేవి. ఈ క్రమంలో ఓ రోజు వీరిద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి వెళ్లడంతో.. భార్యపై కోపంతో రగిలిపోయిన రాజు గురువారం(మార్చి25) తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. గొడ్డలితో భార్య చేతి బొటనవేలు, మరో చేతి మూడు వేళ్లను కిరాతకంగా నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను బోపాల్ నగరంలోని హమీదియా ఆసుపత్రికి తరలించారు. భార్య వేళ్లు నరికిన భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్య క్యారెక్టర్‌పై అనుమానం వచ్చి తన చేతులను నరికి ఆమెను అడవిలో పడేశాడు. ఈ దారుణ ఘటన ఈనెల 22న మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. అనంతరం బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆమె చేతులను తిరిగి కుట్టేందుకు 9 గంటల సమయం పట్టింది. కాగా రాష్ట్రంలో వరుస దారుణ ఘటనలు చోటుచేసుకుండటంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోరమైన నేరాలను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు రూపొందిస్తామని సీఎం పేర్కొన్నారు. చదవండి: ప్రేమ వివాహం.. భార్యను దారుణంగా కొట్టి మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్.. -
వేళ్లు విరిస్తే చిటుకూ చిటుకూ అనడం ప్రమాదమా?
అపోహ: చాలాసేపు పనిచేశాక రిలాక్స్ అవడంలో భాగంగా చాలా మంది వేళ్లను విరుస్తుంటారు. ఇలా వేళ్లను వెనక్కి విరవగానే చిటుకూ... చిటుకూ అని ఓ శబ్దం వినిపించడం మనందరికీ అనుభవమే. అలాగే కొద్దిసేపటి వ్యవధిలోనే మళ్లీ రెండోసారి విరిస్తే ఈసారి అదే చిటపట శబ్దం రాదు. ఇలా... మరికాసేపటి తర్వాత రెండోసారి విరిచినప్పుడు ఎందుకు చిటపటలాడలేదు, ముందెందుకు శబ్దం చేశాయి, దీనివల్ల ఏదైనా ప్రమాదమా... అనే అపోహ కొందరిలో ఉంటుంది. వాస్తవం: చేతి వేళ్ల కీళ్లు పట్టేశాక వాటిని విరిచినప్పుడు చిటుక్కుమని శబ్దం చేయడం వల్ల ఎలాంటి అనర్థమూ వాటిల్లదు. దాంతో ఏదైనా ముప్పు కలుగుతుందన్నది అపోహ మాత్రమే. వేళ్ల కణుపుల దగ్గర (ఆ మాటకొస్తే ప్రతి కీలు దగ్గర) సైనోవియల్ ఫ్లూయిడ్ అనే కందెన లాంటి పదార్థం ఉంటుంది. వేళ్లలో కీళ్లమధ్య ఈ ఫ్లూయిడ్ చేరి, అక్కడున్న వాయువులతో ఓ చిన్న బబుల్లా ఏర్పడుతుంది. మనం వేళ్లను విరిచినప్పుడు, వాయువుతో నిండిన ఆ చిన్నచిన్న బుడగలు చటుక్కున పేలినట్లవుతాయి. వేళ్లు విరిచినప్పుడు మనం వినే శబ్దం ఆ బుడగలు పేలినప్పుడు వచ్చేదే. దీనివల్ల ఎలాంటి అనర్థమూ ఉండదు. ఒకసారి విరిచాక బబుల్స్ పగిలి, అవి మళ్లీ ఏర్పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే మళ్లీ విరిస్తే శబ్దం రాదు. -
ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 25 మందికి కాళ్లకు, చేతులకు దాదాపు 10కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. ఈ అరుదైన జన్యు క్రమరాహిత్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికి.. ఆ గ్రామానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులందరికీ పాలిడాక్టిలీ అనే జన్యులోపం ఉందని.. ఫలితంగా ప్రతీ ఒక్కరికీ 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయన్నారు. ఈ అరుదైన సమస్య వల్ల చదువు పూర్తి చేయలేకపోవడమే కాక.. మంచి ఉద్యోగాన్ని కూడా పొందలేకపోతున్నామని సదరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుడైన బల్దేవ్ యావలే మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో దాదాపు 25 మంది సభ్యులున్నారు. అందరికి కాళ్లకు, చేతులకు 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. దీని వల్ల మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. స్కూల్లో ఇతర పిల్లలు మా పిల్లలను ఎగతాళి చేస్తున్నారు. కాళ్లకు 10కంటే ఎక్కువ వేళ్లు ఉండటంతో.. సరైన చెప్పులు, షూలు దొరకడం లేదు. ఫలితంగా మాకు సరైన ఉద్యోగం లభించడం లేదు. మేం చాలా పేదవాళ్లం. మాకు భూమి కూడా లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి’ అని కోరాడు. యావలే కుమారుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘నాకు చేతులకు 12, కాళ్లకు 14 మొత్తం 26 వేళ్లు ఉన్నాయి. దీనివల్ల నాకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. గ్రామ పంచాయతీ నుంచి కూడా నాకు ఎలాంటి సాయం లభించడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని’ విజ్ఞప్తి చేశాడు. -
చూపుడు వేలు లేకుంటే.!
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడువేలుకు సిరా చుక్క పెడతారు. ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే ఎలా,.. దీనికి ఎన్నికల సంఘం ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. ఎడమచేతికి చూపుడు వేలు లేకుంటే మధ్య వేలుకు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క వేసే అవకాశం కల్పించింది. ఎడమ చేతికి అసలు వేళ్లు లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు అదీ లేకుంటే ఈ తర్వాత ఏది ఉంటే ఆ వేలుకు చుక్క పెడతారు. రెండు చేతులకూ వేళ్లు లేకుంటే వేళ్ల మొదళ్ల మధ్య భాగంలో లేకుంటే చేయిపై రాస్తారు. -
సైడ్ ఇవ్వమన్నందుకు వేలు కొరికేశాడు
మల్కాజిగిరి: దారి ఇవ్వాలని అడిగినందుకు కారులో వెళుతున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనదారుడి వేలు కొరికిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఈ నెల 24న అతను బైక్‌పై లాలాపేట్ వెళుతుండగా మౌలాలి కమాన్ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్ కోరడంతో ఆగ్రహానికి లోనైన కారు డ్రైవర్ మహ్మద్ ఆలి అతడిని దూషించడమే కాకుండా అతడిపై దాడి చేసి కుడిచేతి ఉంగరం వేలు కొరికివేయడంతో వేలే తెగి పడింది. తెగిపడ్డ వేలుతో వెంటనే ఆస్పత్రికి వెళ్లిన జాఫర్ చికిత్స అనంతరం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు మహ్మద్ ఆలిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ ఆలి మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
ఈ చిన్నారికి 15 వేళ్లే
సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారికి కాళ్లు, చేతులకు కలిపి 15 వేళ్లు మాత్రమే ఉన్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జీర్రావారిపాలెంకు చెందిన పి.సురేష్, సునీత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఐదు సంవత్సరాల క్రితం ప్రభుకుమార్ జన్మించాడు. పుట్టుకతోనే అతని కుడి చేతికి రెండు వేళ్లు, ఒక్కో కాలికి నాలుగేసి వేళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ప్రభుకు దివ్యాంగుల పింఛన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే రేషన్‌కార్డు లేకపోవడంతో ముందుగా దాని కోసం దరఖాస్తు చేశారు. అయితే అధికారుల నుంచి స్పందనలేదు. దీంతో సునీత మంగళవారం ప్రభుకుమార్తో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను వేడుకుంది. రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలువుతుందని త్వరగా స్పందించాలని కోరుతోంది.