![Man On Anger Bite Off Wife Finger Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/4/Wife-Finger-Karnataka.jpg.webp?itok=ZxZsDfzY)
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: దంపతుల మధ్య గొడవలు సహజం. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని సమీక్షించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి తప్పు .. గొడవలను పెద్దవి చేసుకోకూడదని పెద్దలు అంటుంటారు. అయితే ఇటీవల కొందరు భార్యాభర్తలు హత్యలకు కూడా కారణం అవుతున్నాయి. క్షణికావేశం కొంపల్ని వాళ్ల జీవితాలని నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. అతని భార్య పేరు పుష్ప. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయి 23 ఏళ్లు కావస్తున్న వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు.
కొన్నేళ్ల నుంచి విజయ్‌కుమార్ భార్యను వేధిస్తుండటంతో ఆమె వేరుగా ఉంటోంది. గత నెల 28న విజయ్‌కుమార్ ఆమె వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కోపం పట్టలేక ఆమెపై దాడి చేసి ఎడమ చేతి వేళ్లు కొరికి తినేశాడు. తన వద్దకు రాకపోతే ఆమెను చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నిందితులను పట్టుకున్నారు.. చివరికి కక్కుర్తి పడి పోలీసులే అరెస్టయ్యారు!
Comments
Please login to add a commentAdd a comment