క్రికెట్ బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనానికి భార్య బలైంది. భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. ఈ విషాదం కర్ణాటక రాష్ట్రంలో మార్చి 18న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలు.. చిత్రదుర్గ జిల్లాకు చెందిన దర్శన్ బాబు హోసదుర్గలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా(ప్రభుత్వ ఉద్యోగి) పనిచేస్తున్నాడు. రంజితతో 2020లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దర్శన్‌కు క్రికెట్‌పై బెట్టింగ్ అంటే సరదా. ఈ సరదా కాస్తా నెమ్మదిగా వ్యసనంగా మారింది. 2021 నుంచి 23 వరకు బెట్టింగ్‌లో ఇరుకున్నాడు. ఈక్రమంలో పలుమార్లు పందెంలో ఓడిపోవడంతో ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం ప్రారంభించాడు.
బెట్టింగ్‌లకు డబ్బులు సరిపోని సమయంలో ఇంట్లోని ఏదో ఒక వస్తువును వాళ్ల వద్ద తాకట్టు పెట్టేవాడు. రుణదాతల నిత్యం వేధింపులతో విసిగిపోయిన అతని భార్య(23) మార్చి 18న అత్మహత్య చేసుకుంది. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. కూతురు మరణంపై తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. దర్శన్‌కు బెట్టింగ్‌లో పాల్గొనడం ఇష్టం లేకపోయినా.. త్వరగా డబ్బులు సంపాదించవచ్చని, తక్కువ సమయంలో ధనవంతులు కావొచ్చంటూ తన అల్లుడిని ట్రాప్ చేశారని ఆరోపించారు. తన భర్త క్రికెట్ బెట్టింగ్‌ల ద్వారా డబ్బులు పొగొట్టుకుంటున్నట్లు రంజితకు 2021లో తెలిసినట్లు వెంకటేష్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమ విచారణలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె ఎదుర్కొన్న వేధింపులను వివరించింది. దర్శన్‌కు దాదాపు రూ. కోటి వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం.
2021 నుంచి 2023 వరకు ఐపీఎల్ బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పొగొట్టుకున్నాడు. అతను పందెం కాసేందుకు దాదాపు రూ. 1.5 కోట్లకు పైగా అప్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రూ.1 కోటి తిరిగి ఇచ్చేశాడని.. ఇంకా రూ. 84 లక్షల కట్టాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment