ipl betting
-
భార్య ప్రాణాలు తీసిన భర్త ఐపీఎల్ బెట్టింగ్.. రూ. కోటికిపైగా అప్పులు!
క్రికెట్ బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనానికి భార్య బలైంది. భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. ఈ విషాదం కర్ణాటక రాష్ట్రంలో మార్చి 18న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లాకు చెందిన దర్శన్ బాబు హోసదుర్గలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా(ప్రభుత్వ ఉద్యోగి) పనిచేస్తున్నాడు. రంజితతో 2020లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దర్శన్‌కు క్రికెట్‌పై బెట్టింగ్ అంటే సరదా. ఈ సరదా కాస్తా నెమ్మదిగా వ్యసనంగా మారింది. 2021 నుంచి 23 వరకు బెట్టింగ్‌లో ఇరుకున్నాడు. ఈక్రమంలో పలుమార్లు పందెంలో ఓడిపోవడంతో ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. బెట్టింగ్‌లకు డబ్బులు సరిపోని సమయంలో ఇంట్లోని ఏదో ఒక వస్తువును వాళ్ల వద్ద తాకట్టు పెట్టేవాడు. రుణదాతల నిత్యం వేధింపులతో విసిగిపోయిన అతని భార్య(23) మార్చి 18న అత్మహత్య చేసుకుంది. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. కూతురు మరణంపై తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. దర్శన్‌కు బెట్టింగ్‌లో పాల్గొనడం ఇష్టం లేకపోయినా.. త్వరగా డబ్బులు సంపాదించవచ్చని, తక్కువ సమయంలో ధనవంతులు కావొచ్చంటూ తన అల్లుడిని ట్రాప్ చేశారని ఆరోపించారు. తన భర్త క్రికెట్ బెట్టింగ్‌ల ద్వారా డబ్బులు పొగొట్టుకుంటున్నట్లు రంజితకు 2021లో తెలిసినట్లు వెంకటేష్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ విచారణలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె ఎదుర్కొన్న వేధింపులను వివరించింది. దర్శన్‌కు దాదాపు రూ. కోటి వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. 2021 నుంచి 2023 వరకు ఐపీఎల్ బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పొగొట్టుకున్నాడు. అతను పందెం కాసేందుకు దాదాపు రూ. 1.5 కోట్లకు పైగా అప్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రూ.1 కోటి తిరిగి ఇచ్చేశాడని.. ఇంకా రూ. 84 లక్షల కట్టాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్ మ్యాచ్ చూస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్(ఏఆర్ఎస్) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్‌కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్‌లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్‌లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం -
పోస్ట్‌మాస్టర్ యవ్వారం.. ఐపీఎల్ బెట్టింగ్‌లో కోటి లాస్.. అంతా మంది సొమ్మే!
భోపాల్: తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకుంటే.. ఆ కర్మఫలితాన్ని కూడా తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. మంది సొమ్ముతో ఐపీఎల్లో బెట్టింగ్ వేయడమే కాదు.. ఆ సొమ్మంతా పొగొట్టి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఓ పోస్ట్‌మాస్టర్. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్‌లో విశాల్ అహిర్వార్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగులు పెడుతున్నాడు అతను. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలకు పైనే పొగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బంతా మంది సొమ్మని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 24 కుటుంబాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఐపీఎల్లో బెట్టింగ్ కోసం వాడుకున్నాడు. విశాల్ చేసిన మోసం వెలుగులోకి రావడంతో మే 20న బినా గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్నాడు అతను. నిందితుడు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఎఫ్డి ఖాతాల కోసం నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడని, గత రెండేళ్ల నుండి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చీటింగ్, ఖాతాదారులను మోసం చేయడం సెక్షన్ల కింద విశాల్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
ఖాతాలు తెరిచి.. కోట్లు తరలించి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు పాకిస్తాన్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ నడిపించారు. ఇది చాలదన్నట్టు బెట్టింగ్ సొమ్మును హవాలా మార్గంలో దేశం దాటించారు. ఇందుకోసం బ్యాంకుల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ధ్రువపత్రాలతో ఖాతాలు తెరిచారు. బ్యాంకు అధికారుల వత్తాసుతో కోట్ల కొద్దీ సొమ్మును వేరే దేశాలకు చేర్చారు. 2013, 2019 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో జరిగిన బెట్టింగ్‌లోని చీకటి కోణాలివి. ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన రెండు బెట్టింగ్ కేసుల్లో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కోట్ల లావాదేవీలపై పట్టింపేది? ఢిల్లీకి చెందిన దిలీప్‌కుమార్.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన గుర్రం సతీశ్, గుర్రం వాసుతో కలిసి పాకిస్తాన్లో ఉన్న వకాస్ మాలిక్‌తో నేరుగా టెలిఫోన్ సంభాషణలు సాగించారు. క్రికెట్ బెట్టింగ్ కోసం పలు జాతీయ బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలతో ఖాతాలు తెరిచారు. ఎలాంటి వ్యాపారం లేని సతీశ్, వాసు.. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలు తెరిచారు. ఢిల్లీలోని దిలీప్‌కుమార్ ఖాతాల ద్వారా 2013, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.49 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ డబ్బు బెట్టింగ్ ద్వారా వచ్చిందేనని సీబీఐ గుర్తించింది. సతీశ్ 2012–13, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.4.55 కోట్ల బెట్టింగ్ లావాదేవీలు జరిపాడని, విదేశాల నుంచి రూ.3.05 లక్షలను బెట్టింగ్ కోసం తీసుకున్నాడని సీబీఐ గుర్తించింది. వాసు అకౌంట్ల నుంచి 2012–13, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.37 కోట్ల లావాదేవీలు జరిగినట్టు దర్యాప్తు విభాగం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ డబ్బును హవాలా రూపంలో వకాస్ మాలిక్ చెప్పిన దేశాలకు పంపినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. నిద్రపోయారా.. నటించారా? ఇంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగు తుంటే బ్యాంకు అధికారులు నిద్రపోయారా లేదా నటించారా అన్న కోణంలో సీబీఐ కూపీ లాగు తోంది. సామాన్యుడు ఖాతా తెరవాలంటే సవాలక్ష పత్రాలు అడిగే బ్యాంకు అధికారులు.. నకిలీ బర్త్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలు సమర్పించిన దిలీప్‌కుమార్‌తో పాటు గుర్రం సతీశ్, వాసులను ఎందుకు గుర్తించలేదు? ఆ పత్రాలు అసలువా, నకిలీవా ఎందుకు విచారించలేదని సీబీఐ అనుమానిస్తోంది. పైగా ఈ ముగ్గురూ కేవలం సేవింగ్ పేరుతో తెరిచిన ఖాతాలో రూ.11 కోట్ల మేర నగదు లావాదేవీల వ్యవహారాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు, ఏటా జరిగే ఆడిటింగ్‌లో ఎందుకు ఇది బయటపడలేదో సీబీఐ అధికారులను విస్తుపోయేలా చేస్తున్నట్టు తెలిసింది. బ్యాంకు అధికారులపై నజర్ సీబీఐ ఢిల్లీ విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాదు ‘అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులు’ అని కూడా పేర్కొంది. దీనితో సంబంధిత బ్యాంకుల్లోని అధికారుల్లో వణుకు మొదలైనట్టు తెలుస్తోంది. నిందితులకు సహకరించి ఖాతాల తెరిచిన దగ్గరి నుంచి డబ్బు విదేశాలకు తరలివెళ్లిన వ్యవహారాల్లో ఏయే స్థాయి అధికారు లున్నారో సీబీఐ విచారించబోతోంది. దీంతో దిలీప్‌కుమార్, సతీశ్, వాసు నకిలీ పత్రాలతో ఖాతాలు తెరిచిన బ్యాంకు బ్రాంచుల్లో సోదాలు చేసేందుకు సీబీఐ సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. -
‘ఐపీఎల్ బెబెట్టింగ్’పె సీబీఐ దూకుడు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచుల్లో బెట్టింగ్ వ్యవహారంపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిపినట్టు పక్కా సమాచారం అందటంతో శనివారం దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బు కోసం బ్యాంక్ అకౌంట్లు సైతం తీసినట్టు సీబీఐ గుర్తించింది. దీనితో పలు ప్రైవేట్ వ్యక్తులతోపాటు అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్‌ల గెలుపు ఓటములను సైతం నిర్ణయించేలా బెట్టింగ్ మాఫియా పాకిస్తాన్ నుంచి కథ నడిపించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. లావాదేవీల నిర్వహణ కోసం ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు అకౌంట్లు తెరవడంతోపాటు కేవైసీ(నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్లలో పలువురు బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇలా ఒక గ్యాంగ్ రూ.11 కోట్లకు పైగా లావాదేవీలు జరపగా, మరో గ్యాంగ్ రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది. రెండు ఎఫ్ఐఆర్లు పాకిస్తాన్‌లోని వఖాస్ మాలిక్ అనే వ్యక్తితో రెండు గ్యాంగులు బెట్టింగ్ దందా సాగించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. రూ.11 కోట్ల మేర లావాదేవీ నడిపిన కేసులో హైదరాబాద్‌కు చెందిన దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసును నిందితులుగా చేర్చినట్టు తెలిసింది. వీరు 2013 నుంచి ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. మరో ఎఫ్ఐఆర్లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్‌కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభులాల్మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మతోపాటు మరికొంత మంది గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులను నిందితుల జాబితాలో చేర్చినట్టు తెలిసింది. వీరు 2010లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పాల్పడినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. -
ఐపీఎల్-2021: బంతి బంతికీ బెట్టింగ్
‘ఏలూరుకి చెందిన రామకృష్ణ నగరంలో ద్వితీయ శ్రేణి బుకీతో క్రికెట్ బెట్టింగ్ కట్టాడు. తన సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగులు కాస్తున్నాడు. రెండు, మూడు మ్యాచ్‌లలో డబ్బులు రావడంతో ఆసక్తి పెరిగింది. దీంతో జోరుగా పందేలు కాయడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే రూ.70 వేలు బుకీలకు బకాయిపడ్డాడు. బుకీలకు చెందిన రౌడీషీటర్లు అతని ఇంటికి వెళ్లి డబ్బుల కోసం వేధింపులకు దిగటంతో ఏం చేయాలో పాలుపోక మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు రామకృష్ణ.’ ‘భీమవరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వెంకటేష్ గత ఐపీఎల్ సీజన్లో జోరుగా క్రికెట్ బెట్టింగులు కట్టాడు. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు చెప్పి డబ్బులు తెచ్చి బెట్టింగులు కాసాడు. మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి లక్షల్లో అప్పు అయ్యింది. బుకీలకు చెందిన వ్యక్తులు వెంకటేష్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను సైతం వేధించారు. బయటకు చెబితే పరువుపోతుందని వీరు అప్పులు చేసి కొంతమేర డబ్బులు కట్టారు.’ ఏలూరు టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగులకు వారధిగా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత లక్ష్యంగా బెట్టింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. బంతి బంతికీ, ఓవర్ ఓవర్‌కు, మ్యాచ్ విజేతలు ఇలా పలురకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. క్రికెట్ బుకీల వలలో చిక్కుకుంటున్న యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగులు కడుతున్నారు. ఎర చూపుతూ.. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ ఎరవేయడంతో యువత, విద్యార్థులు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ కేసుల్లో అత్యధికంగా పట్టుబడేది కూడా యువత, విద్యార్థులు కావడం విశేషం. బెట్టింగులకు అలవాటు పడిన యువత వ్యసనాలకు బానిసలై దొంగలుగానూ మారుతున్నారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, నిడదవోలు, కొవ్వూరుతోపాటు పల్లెల్లోనూ బెట్టింగ్ సంస్కృతి విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం గత ఐపీఎల్ సీజన్లో ఏలూరు ప్రాంతంలో పోలీసులు బెట్టింగ్ కేసుల్లో 35 మంది వరకూ అదుపులోకి తీసుకుంటే వారిలో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు దాడులు చేసి 46 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 30 మందికి పైగా యువతే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. పల్లెల్లోనూ విష సంస్కృతి : గ్రామాలకు సైతం బెట్టింగ్ మాఫియా విస్తరించడంతో చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులు సైతం వీరి బారిన పడుతున్నారు. కీలకమైన జట్లు తలపడితే బెట్టింగ్ హీట్ పెరిగిపోతుంది. ఈ ఐపీఎల్ సీజన్లో సుమారుగా జిల్లాలో రూ.వంద కోట్లకు పైగానే బెట్టింగులు జరుగుతాయని అంచనా. ఆన్లైన్ యాప్‌లతో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధాన బుకీలు ప్రత్యేక యాప్‌లలో సెకండ్ స్టేజ్ బుకీలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. వాటికి అనుగుణంగా సెల్‌ఫోన్‌తోనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటికంటే రెండు, మూడు నిమిషాలు ముందుగానే ప్రత్యేక యాప్‌లలో మ్యాచ్ వివరాలు తెలిసిపోతూ ఉండటం గమనార్హం. కఠిన చర్యలు జిల్లాలో క్రికెట్ బెట్టింగులు, పేకాట, జూదక్రీడలపై ప్రత్యేక నిఘా ఉంది. క్రికెట్ బెట్టింగుల పేరుతో యువత, విద్యార్థులను పెడదోవ పట్టించే అసాంఘిక శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. బెట్టింగులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోనూ పటిష్ట చర్యలు చేపట్టాం. – కె.నారాయణనాయక్, జిల్లా ఎస్పీ ఓ కంట కనిపెట్టాలి యువత, విద్యార్థులు సమాజాభివృద్ధికి కీలక వనరులు. వీరిని వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. విలాసాలకు అలవాటు పడితే పెడదారిపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల బంగారు భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంది. – డాక్టర్ హరికృష్ణ, జిల్లా ఆస్పత్రి వైద్యులు -
మేడ్చల్: తల్లి, సోదరి దారుణ హత్య
-
అన్నంలో విషం: తల్లి, సోదరి దారుణ హత్య
సాక్షి, మేడ్చల్ : ఐపీఎల్ బెట్టింగ్‌లకు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషం హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావలకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణ చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలు నగదు అందింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయినాథ్ రెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ మొత్తం డబ్బులను ఖర్చు చేశాడు. ఈ విషయంపై తల్లి, చెల్లిలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన అతను ఈ నెల 23న ఉదయం అన్నం వండి అందులో విషం కలిపి తల్లి సునీతా రెడ్డి (42), సోదరి అనూష (20)లకు పెట్టాడు. (విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్ ఆత్మహత్య) పథకం ప్రకారం ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం అన్నం తిన్న సునీత, అనూష అస్వస్థతకు గురయ్యారు. తల్లి సునీత కుమారుడికి ఫోన్ చేసి ఆ తిన్నం తినవద్దని చెప్పింది. 23వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన సాయినాథ్ రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, చెల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత 27న మృతిచెందగా.. అనుష 28మ కన్నుమూసింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికి సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు. -
‘యాప్’సోపాలు.. యువతకు తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఫ్రెండ్ రాజేందర్‌కు యాక్సిడెంటైంది. అర్జంటుగా డబ్బులు పంపండి’ అంటూ సందేశాలు రావడంతో అవాక్కయిన మిత్రులు వెంటనే రాజేందర్‌కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ మెసేజ్‌లు ఎవరు పంపారో మొదట అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేందర్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని తేలింది. ‘మీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఏదుంటే అది ఎత్తుకు పోతాం..’ అంటూ ఫోన్లో వచ్చిన బెదిరింపుతో ఓ తండ్రి హతాశుడు అయ్యాడు. ఇంజనీరింగ్ చదివే తన కొడుకు రూ. లక్షలు అప్పు చేసిన ఫలితమని తెలిసి ఆయన తలపట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు. వీరంతా వివిధ మనీలెండింగ్ యాప్స్ (అప్పులు ఇచ్చే యాప్స్) కోసం పని చేస్తుంటారు. ఏం చేసైనా ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఇటీవల హద్దుమీరుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేస్తూ, ఆ నంబర్లకు ఫోన్లుచేసి, తప్పుడు సందేశాలు పంపి సమాజంలో చులకన చేస్తున్నారు. వారిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు దూకుడుగా వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా అప్పిచ్చి.. అలా వేధిస్తూ.. మనీ లెండింగ్ యాప్స్‌కు మొబైల్ ప్లేస్టోర్స్‌లో కొదవేం లేదు. ఇవి రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో కంపెనీ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ నంబర్ అందించాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్ నంబర్లన్నీ యాప్ యాజమాన్యానికి యాక్సెస్ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్‌లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇబ్బందుల పాల్జేస్తున్నారు. అప్పు మీద అప్పు.. పెరుగుతున్న ముప్పు లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, సినిమా టాకీస్ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలకు చెందినవారు ఏడు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తిరిగి తీర్చలేక, ఇంటి అవసరాల కోసమని మరోసారి అప్పులు చేసేందుకు అప్పుల యాప్‌లపై ఆధారపడుతున్నారు. చిన్నమొత్తంలో అప్పు చేసేవారికి ఫర్వాలేదు గానీ, భారీ మొత్తాల్లో అప్పుచేస్తే ఆ అప్పుల వసూళ్లకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ యాప్‌ల ద్వారా అప్పుచేసే యువకులు పెరిగారు. వీరు ఆన్లైన్ గేమ్స్ కోసం కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే తరహాలో అప్పుచేసి.. తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం అప్పు వసూలుకు వేధించడం, ఫోన్ కాంటాక్టులను యాక్సెస్చేసి బ్లాక్మెయిల్ చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూలులోనూ కలెక్షన్ ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరించడంపై బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్‌ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీ సహకారం లేకుండా.. కాంటాక్ట్స్ కలెక్షన్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు అంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే సంప్రదించండి అప్పు తీసుకున్న వారి కాంటాక్టులు యాక్సెస్ చేసి బ్లాక్మెయిల్ చేయడం చట్టవిరుద్ధం, నేరం. ఇలాంటి వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు. వెంటనే సైబర్ సెల్‌ను సంప్రదించాలి. బాధితులు విద్యార్థినులు, మహిళలైతే విమెన్ సేఫ్టీవింగ్‌ను ఆశ్రయించాలి. – స్వాతి లక్రా, ఏడీజీ ఆ ఉచ్చులో పడనీయొద్దు నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీ మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్, మనీలెండింగ్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి. –డాక్టర్ శారద, ప్రొఫెసర్, ఓయూ -
ఐపీఎల్ బెట్టింగ్‌కు యువకుడు బలి
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణం తీసింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ (19) పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీలో స్నేహితులతో కలిసి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సోను కుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.కాగా మంగళవారం ఉదయం స్నేహితులు బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోని గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా ఐపీఎల్ బెట్టింగ్; ఏడుగురు అరెస్ట్
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాకు చెందిన ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 15 వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో లో ఏడుగురు పట్టుబడగా.. వారిపై పోలీసులు కరీంనగర్ రూరల్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ తో రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపి అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. -
జనంగాంలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు విప్పిన సల్మాన్ సోదరుడు
-
అంతా ఐపీఎల్ మాయ
వీరఘట్టం : రాష్ట్రంలో పార్థిగ్యాంగ్ సంచరిస్తున్నట్టు ఎవరు పుకార్లు సష్టిస్తున్నారు... ఎందుకు సృష్టిస్తున్నారు... ఇలా చేస్తే వారికి ప్రయోజనం ఏంటి... అని ఆలోచిస్తున్నారా... ఈ వదంతుల వెనుక పెద్ద వ్యవహారమే ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యక్తులు ముఠాలుగా మారి వారి స్వప్రయోజనం కోసం ఇటువంటి పుకార్లు పెడుతూ పోలీసులను, ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి వదంతులు సష్టిస్తున్నవారిలో ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ ముఠా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. క్వాలీఫయిర్, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. శుక్రవారం క్వాలీఫయిర్ మ్యాచ్, ఈ నెల 27న ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు రూ. కోట్లలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు చివరి దశలో కూడా బెట్టింగ్‌లు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమపై పోలీసులు దృష్టి సారించకుండా ఉండాలంటే వారిని దారి మళ్లించాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పార్థి గ్యాంగ్ ఉన్నట్టు... మనుషులను భయంకరంగా చంపేస్తున్నట్టు గ్రాఫిక్‌లో సృష్టిస్తూ తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ గుట్టుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు వినిపిస్తుంది. చావ బాది... అయ్యో! గత పది రోజులుగా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా కంటి మీద కునుకు లేకుండా రాత్రి వేళల్లో పహరా కాస్తున్నారు. అపరిచితులు గాని అనుమానితులు గాని ఎవరైనా తమ ప్రాంతాల్లో సంచరిస్తే చితక బాదేస్తున్నారు. తర్వాత పోలీసులు వచ్చి విచారించే సరికి దెబ్బలు తిన్న బాధితులకు పార్థిగ్యాంగ్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుండడంతో అయ్యో అంటూ బిక్క మొహాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి వదులుతున్న వారిపై పోలీసులు కఠినంగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో ఇంకా ఘోరాలు జరిగే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదీ విషయం ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా భారీగా రూ. కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ బెట్టింగ్‌లను అదుపుచేసేందుకు, బెట్టింగ్ రాయుళ్లను పట్టుకునేందుకు నిత్యం పోలీసులు నిఘా వేస్తున్నారు. దీంతో పోలీసుల దృష్టి తమపై పడకుండా ఉండేందుకు పార్థిగ్యాంగ్ రాష్ట్రంలో సంచరిస్తున్నట్టు, పోలీసులు అత్యవసర సమావేశాలు పెడుతున్నట్టు వాట్సాప్‌ల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను వదిలారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అనుమానితులు, అపరిచితులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వడం... పోలీసులు వచ్చి పరిశీలిస్తే వారు సామాన్య ప్రజలేనని తేలడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అమాయకులు బలైపోతున్నారు ఈ నెల 20వ తేదీన పాలకొండ మండలం కస్పావీధికి చెందిన రాము అనే యువకుడు తన తాతగారి గ్రామమైన కొర్లవలస వెళ్లేందుకు గురవాం నుంచి కొర్లవలస బయలుదేరాడు. గురవాం నుంచి పొలాల గట్లు మీదుగా నడిచి వెళుతుండగా అనుమానితునిగా భావించి స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ వ్యక్తికి దొంగలతో ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో అంతా కంగుతిన్నారు. అదే రోజు విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాంకు చెందిన ఇద్దరు యువకులు మద్యం కోసం వీరఘట్టం కొత్త బస్టాండ్‌కు వచ్చారు. వీరి వేషధారణ చూసి దొంగలుగా భావించి స్థానికులు చుట్టిముట్టి పోలీసులకు అప్పగించారు. తర్వాత పోలీసులు విచారించగా వీరికి దొంగల ముఠాకు ఎటువంటి సంబంధం లేదని విడిచిపెట్టారు. అలాగే రెండు రోజుల క్రితం వైజాగ్‌లో మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను అనుమానితులుగా భావించిన స్థానికులు చితక బాది పోలీసులకు అప్పగించారు. తర్వాత వారు మతిస్థిమితం లేనివారని పోలీసులు తెలియజేశారు. ఈ వీడియోలు కూడా ప్రస్తుతం వాట్స్‌ప్‌లలో హల్చల్ చేస్తున్నాయి. ఇలా పార్థిగ్యాంగ్ పేరుతో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను కొందరు బయపెడుతున్నారని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు, ఎవరు చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తే అసలు దొంగలు దొరుకుతారు. కఠిన చర్యలు తీసుకుంటాం పార్థిగ్యాంగ్ పేరుతో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నవారు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే శుక్ర, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై నిఘావేస్తాం. – జి.స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ -
విద్యార్ధి ఆత్మహత్యకు కారణమైన ఐపీఎల్ బెట్టింగ్
-
పాకెట్ మనీతో పక్కదారి పడుతున్న యూత్
-
బతుకు బౌల్డ్
► జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగులు! ► రూ.10నుంచి వెయ్యి వరకు సాగుతున్న పందేలు ► నిమిషాల్లో చేతులు మారుతున్న నగదు ► బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో భారీగా జరిగిన బెట్టింగ్‌లు ► రోడ్డున పడుతున్న కుటుంబాలు ఐపీఎల్ క్రికెట్ పుణ్యమా అని జిల్లాలో క్రికెట్ బెట్టింగులు శ్రుతి మించాయి. నిమిషాల వ్యవధిలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్ ఉచ్చులో పడి యువత, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు, చిరు వృత్తులవారు చిత్తవుతున్నారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు సైతం ఈ జూదంపై ఆసక్తి చూపుతున్నారు. పలమనేరు: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్ సంస్కృతి నేడు మండల కేంద్రాలు, గ్రామాలకు సైతం వ్యాపించింది. క్రికెట్ గ్యాంబ్లింగ్‌పై సరైన చట్టాలు లేకపోవడంతో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. గత కొద్దిరోజులుగా ఐపీఎల్ క్రికెట్మ్యాచ్ సాగుతోంది. కొందరు టీవీల్లోనూ మరికొందరు స్మార్ట్ ఫోన్లోనూ లైవ్ మ్యాచ్‌ను చూస్తూ బెట్టింగులకు పాల్పడుతున్నారు. బాల్ టు బాల్, ఓవర్ బై ఓవర్, ఎక్స్‌ట్రాస్, ఫోర్, సిక్స్, వికెట్.. ఇలారకరకాల బెట్టింగులు ప్రస్తుతం నిత్యకృత్యంగా మారాయి. చిన్న జట్లపై మూడుకొకటి బెట్టింగ్‌లు వేస్తున్నారు. సాయంత్రం మ్యాచ్‌లకన్నా రాత్రి 8గంటలకు మొదలై 11కు ముగిసే మ్యాచ్‌లకే బెట్టింగ్‌లు ఎక్కువ. ఐపీఎల్లో మొత్తం 9 జట్లు పాల్గొంటుండగా హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, ముంబ యి టీమ్‌లపైనే భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. మొన్న జరిగిన బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో జిల్లాకు సంబంధించి రూ.30 లక్షలదాకా బెట్టింగ్‌లు సాగినట్టు కర్ణాటకకు చెందిన ఓ బెట్టింగ్ బ్రోకర్ తెలిపాడు. నలుగురు కలిస్తే బెట్టింగ్‌లే క్రికెట్ బెట్టింగ్ చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, రోజువారీ పనులకేళ్లే వారు, ఆటోడ్రైవర్లు, చిరువృత్తులవారు ఈ మత్తులోనే వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు. వీరు ధరించిన బంగారు ఆభరణాలు, మొబైల్ఫోన్లు, బైక్‌లు సైతం పందెలో పోగొట్టుకుంటున్నారు. ఇదిగో సాక్ష్యం జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరులలోపాటు మారుమూల గ్రామాల్లో సైతం బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం రహస్య ప్రదేశాలు, దాబాలు అడ్డాలుగా మారాయి. వీటి నిర్వహణ కోసం పదుల సంఖ్యలో ఏజెంట్లు, బుకీలు సైతం స్థానికంగా తతయారయ్యేరంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. మొత్తం ఫోన్ల ద్వారానే ఈ ముఠా కార్యకలాపాలను నడిపిస్తోంది. గెలిచినవారికి ఆన్లైన్లోనే నగదును జమచేస్తున్నారు. పోలీసులు బెట్టింగ్ జరిగే చోట్లకు వెళ్లినా ఎటువంటి ఆధారాలుండవు కాబట్టి వారు ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఆందోళనలో తల్లిదండ్రులు క్రికెట్ జూదానికి బానిసలుగా మారిన ఎందరో యువకులను ఎలా దారిలో పెట్టాలో అర్థం గాని తల్లిదండ్రులు, ఇలాంటి వ్యసనానికి ఆలవాటు పడిన భర్తలను ఏం చేయాలో దిక్కుతోచని భార్యలు జిల్లాలో ఎందరో ఉన్నారు. కొందరైతే పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఏదేమైనా క్రికెట్ బెట్టింగులతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -
ఐపీఎల్ బుకీలపై పంజా.. భారీ సొత్తు స్వాధీనం
హైదరాబాద్: ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాపై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. శనివారం హైదరాబాద్, పుణె జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పోలీసులు దాడిచేసి ఇద్దరు బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్షల్లో నగదు సహా టీవీ, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్. కోటిరెడ్డి వెల్లడించిన వివరాలివీ.. సికింద్రాబాద్ బేగంపేట్ పాటిగడ్డ కాలనీకి చెందిన నితీష్ సింగ్ ఠాకూర్ (23), ఉప్పల్ బాలాజీ హిల్స్ ప్రాంతానికి చెందిన హరి విశాల్ (28) జట్టుగా ఏర్పడ్డారు. వీరు 2015 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు, వన్డే, టెస్టు, ఐపీఎల్, చాంపియన్స్ ట్రోఫీల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతుంటారు. ఇందులో భాగంగా నితీష్ సింగ్, హరి విశాల్‌లు షాహినాథ్‌గంజ్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ (35), జాంబాగ్‌కు చెందిన మోహిత్ (32) కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి నితీష్ సింగ్‌ను అబిడ్స్‌లో, మనోజ్ కుమార్ షాహినాథ్‌గంజ్‌లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7,01,500 నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బేగంపేట్, షాహినాథ్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. నితీష్ సింగ్, మనోజ్ కుమార్‌లు మోహిత్, హరివిశాల్లతో కలిసి 2015 నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. 2015లో మనోజ్ కుమార్‌పై షాహినాథ్ గంజ్, హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధం కలిగి ఉన్న కేసులు నమోదై ఉన్నాయి. నితీష్ సింగ్ తనకు వరుసకు సోదరుడయ్యే హరివిశాల్ సహయంతో ఫంటర్స్ వద్ద డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఈ కేసులో మోహిత్, హరివిశాల్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
బంతి బంతికీ బెట్టింగ్ !
= ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు జోరుగా పందేలు = జిల్లాలో రోజుకు రూ.10కోట్లకు పైగా లావాదేవీలు = బెట్టింగ్ రాకెట్‌కు కేంద్రంగా విజయవాడ బావాజీపేట = టీడీపీ ప్రజాప్రతినిధి సన్నిహితులే సూత్రధారులు = రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ రాకెట్‌కు ఇదే కేంద్ర స్థానం ఓకే... డన్... బస్... ఈటింగ్... టీజింగ్... ఫైనల్... ఇవీ కొన్ని రోజులుగా విజయవాడ బావాజీపేటలోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద సెల్ఫోన్లలో మార్మోగుతున్న పదాలు. ఈ కోడ్ భాష వెనుక కోట్ల రూపాయల క్రికెట్ బెట్టింగ్ దందా దాగి ఉంది. మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా నోట్ల వర్షం కురిసే కిటుకు ఉంది. ఆన్లైన్లోనే కోట్ల రూపాయలు అకౌంట్లు మారే గమ్మత్తు ఆట ఉంది. బహిరంగ రహస్యంగా మారిన ఈ బెట్టింగ్ రాకెట్ వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. నగరంలో వివాదాస్పదుడిగా పేరున్న టీడీపీ ప్రజాప్రతినిధి సన్నిహితులు ఈ బెట్టింగ్ దందాకు సూత్రధారులు కావడమే ఇందుకు కారణం. మరోవైపు జిల్లా అంతటా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. సాక్షి, అమరావతిబ్యూరో : బెట్టింగ్ రాయుళ్లు ‘ఐపీఎల్ పండుగ’ చేసుకుంటున్నారు. మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానుల కన్నా వారే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వన్డే, టీ–20 టోర్నమెంట్లు మొదలైతే చాలు... బావాజీపేట ప్రధాన కూడలిలోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద సందడి నెలకొంటుంది. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లో ఇక్కడ కోలాహలంగా మారింది. నగరంలో వివాదాస్పదుడైన టీడీపీ ప్రజాప్రతినిధి, ఆయన కుమారుల సన్నిహితులు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పేరుకు రియల్ ఎస్టేట్ కార్యాలయమని బోర్డు పెట్టినప్పటికీ ఆ ప్రజాప్రతినిధి దందాలకు ఇదే కేంద్ర స్థానం. ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. ముంబయి, ఢిల్లీలోని క్రికెట్ బెట్టింగ్ ప్రధాన బుకీలకు సదరు ప్రజాప్రతినిధి వర్గీయులు రాష్ట్రంలో ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన మల్టీకాల్ లైన్ సూట్‌కేస్, ఎక్కువ సంఖ్యలో సెల్ఫోన్లు, ఇతర పరికరాలను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు రూ.10కోట్లకు పైగా బెట్టింగ్: ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ వ్యామోహం వెర్రితలలు వేయడం ఈ రాకెట్‌కు కలసి వస్తోంది. అధికారుల నుంచి చిల్లరవర్తకుల వరకూ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం బారిన పడటం గమనార్హం. బావాజీపేట కేంద్రం నుంచి వివిధ జిల్లాల్లోని బెట్టింగ్‌రాయుళ్లతో ఫోన్లలోనే మాట్లాడుతూ పందేలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా కోడ్ భాషలోనే సాగుతుంది. ముందుగా ఆన్లైన్లో చెల్లింపులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ ఏజెట్లను పెద్ద మొత్తంలో డిపాజిట్ తీసుకోవడం, ఇతరత్రా విధానాలు అనుసరిస్తున్నారు. ఒక ఓవర్‌కు సంబంధించి కనీస పందెం రూ.2వేల నుంచి మ్యాచ్ విజేత ఎవరనే దానిపై రూ.50 వేల వరకూ పందేలు కాస్తున్నారు. ఒక మ్యాచ్‌కు సంబంధించి బావాజీపేట కేంద్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.10కోట్ల వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారని అంచనా. మరోవైపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. -
ఐపీఎల్ టెన్త్ సీజన్లో బెట్టింగ్ జోరు
-
ఐపీఎల్ బెట్టింగ్ : నలుగురు అరెస్ట్
హైదరాబాద్: ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 51 వేల నగదుతో పాటు 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని నల్లకుంట బాయమ్మబస్తీలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బేగంబజారుకు చెందిన వేణుగోపాల్, అనిల్‌కుమార్, శైలేందర్, ప్రదీప్ కుమార్‌లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు -
ఐపీఎల్ బెట్టింగ్ నిందితుల అరెస్టు
మదనపల్లె క్రైం: మదనపల్లెలో ఆరుగురు ఐపీఎల్ బెట్టింగ్ నిందితులను ఒకటవ పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హుస్సేన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.1 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్చార్జ్ సీఐ హనుమంతునాయక్ తెలిపారు. కదిరి రోడ్డు అమ్మచెరువుమిట్ట సమీపంలోని తులసీ దాబా వద్ద పట్టణంలోని కమ్మవీధికి చెందిన దేవరెడ్డి నరసింహులు కుమారుడు శ్రీధర్(42), గుండ్లూరి వీధికి చెందిన సోంపాళ్యం కృష్ణయ్య కుమారుడు రమేష్‌బాబు(37), సిపాయి వీధిలో ఉంటున్న రెడ్డి వెంకటరామయ్య కుమారుడు లక్ష్మణరావు అలియాస్ లల్లు(24), దేవళం వీధికి చెందిన సురేష్(32), అదే వీధిలోని ఆకుల నాగరాజు కుమారుడు శ్రీకాంత్(23), త్యాగరాజు వీధికి చెందిన జక్కల వెంకటేష్ కుమారుడు వెంకటస్వామి(27) ఒకచోట సమావేశమయ్యారని తెలిపారు. ఎస్ఐ సుకుమార్, సిబ్బంది శంకర, సిద్దు, రాజేష్, రాఘవతో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హుస్సేన్‌కు జిల్లా బహిష్కరణ తప్పదు మాలిక్ ఫంక్షన్హాల్లో నివాసముంటున్న హుస్సేన్ గతంలోనూ పెద్ద ఎత్తున ఐపీఎల్ బెట్టింగ్‌లు ఆడుతూ అరెస్టు అయ్యాడని సీఐ హనుమంతునాయక్ తెలిపారు. బెయిల్‌పై వచ్చినా తన తీరులో మార్పులేదన్నారు. నిందితుడిని జిల్లా నుంచి బహిష్కరిస్తామని పేర్కొన్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ. కోట్లు ఓడి.. ఆత్మహత్య
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులో కోట్లాది రూపాయలు ఓడిపోవడంతో.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా దేశ రాజధానిలోని పార్లమెంటు ఎదురుగా!! పార్లమెంట్ పార్కింగ్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు తెలిపారు. మృతుడు మధ్యప్రదేశ్ లోని శివపూర్‌కు చెందిన రామ్ దయాళ్ వర్మ(39)గా పోలీసులు గుర్తించారు. మృతుడి జేబులోని 23 పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడు గురువారం ఉదయమే ఢిల్లీకి వచ్చి, నేరుగా విజయ్‌చౌక్ వద్దకు వెళ్లి, అక్కడ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆ చెట్టుపక్కనే ఒక బ్యాగులో ఉన్న పలు పత్రాలు, రైల్వే టికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఐపీఎల్, ఇతర క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్ వేసి కోట్లాది రూపాయలు నష్టపోయానని, బెట్టింగ్ వేయడం కోసం చాలా మంది దగ్గర అప్పులు చేశానని అతడు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఇక చావుతప్ప వేరే మార్గం లేదని ఇక్కడికొచ్చినట్లు అందులో రాశాడు. ఓ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. రైల్లోనే 23 పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంటాడని పోలీసులు తెలిపారు. అతడి భార్యకు కూడా ఇతడి బెట్టింగుల గురించి తెలుసని, తాము ఫోన్ చేయగానే అతడిని అరెస్టు చేశారా అని ఆమె ప్రశ్నించారని అన్నారు. -
జోరుగా ‘ఐపీఎల్’ బెట్టింగ్
మిర్యాలగూడలో బెట్టింగ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20-20 క్రికెట్ కప్‌పై కొనసాగిన బెట్టింగ్‌లు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్‌పై సాగుతున్నాయి.గతంలో కంటే బెట్టింగ్ జోరందుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్‌పై యువత జోరుగా బెట్టింగ్‌కు సాగిస్తున్నారు. యువరాజ్, ధోని, రోహిత్‌శర్మ.. ఇలా క్రికెటర్లపై వ్యక్తిగతంగా బెట్టింగ్ కడుతున్నారు. గతంలో ఆట మొత్తానికి బెట్టింగ్ నిర్వహించిన వారు ప్రస్తుతం క్రికెటర్ నైపుణ్యంపై బెట్టింగ్ సాగిస్తున్నారు. ప్రతి రోజు సాగుతున్న ఈ ఆటపై సాయంత్రం అయ్యిందంటే బెట్టింగ్‌లకు బేరాలు సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని పలు చోట్ల యువత కూర్చొని క్రికెట్ ఆటను పరిశీలిస్తూ ఫోన్ల ద్వారానే బెట్టింగ్‌లు సాగిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహకులు మిర్యాలగూడతో పాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండి సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో బెట్టింగ్‌లు నిర్వహంచడానికి ఉన్న బుకీలకు మిర్యాలగూడలో ఉన్న ఏజెంట్లు స్థానికుల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా స్థానికులకు ఫోన్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ అందుబాటులో ఉంటున్నారు. వేలాది రూపాయలు పొగొట్టుకుంటున్న యువత క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల యువత వేలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రూ.వెయ్యికి రెండు, మూడు వేల రూపాయలు ఇస్తామని చెబుతున్న బుకీలు ఆకర్షించి వేలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం వల్ల కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సైతం బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు లేక ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోయిన విషయం విధితమే. కాగా ఇలాంటి బెట్టింగ్‌లతో యువత భారీగా నష్టపోతోంది. మందలించడంతోనే సరి.. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సమాచారం పోలీసులకు తెలిస్తే ఇక్కడికి వెళ్లి వారిని మందలించి వదిలేస్తున్నట్లు సమాచారం. దామరచర్ల మండలం వాడపల్లిలో ఇటీవల ముగ్గురు వ్యక్తులను క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు మందలించి వదిలేసినట్లు తెలిసింది. బెట్టింగ్‌ల గురించి పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల జోరు కొనసాగుతోంది. పోలీసులు మందలించినా యథావిథిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. -
'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'
లండన్: రోజుకో సంచనం రేపుతానన్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ అన్నట్టుగానే చేశారు. ఇప్పటివరకు రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా క్రికెటర్లకు కూడా బురద అంటించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రావోలు బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాత్రి ట్విట్టర్ లో పలు అంశాలు వెల్లడించారు. బాబా దీవాన్ అనే బుకీ ఈ ముగ్గురు ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడమేకాకుండా పలు చోట్ల ఫ్లాట్లు కూడా కొనిచ్చాడని చెప్పారు. ఇదే విషయమై ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్కు 2013 తాను రాసిన లేఖను మోదీ బహిర్గతం చేశారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు బెట్టింగ్, ఫిక్సింగ్ కు పాల్పడి అనర్హులుకాగా, మోదీ తాజా ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. -
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
మిర్యాలగూడ : ఐపీఎల్-8 క్రికెట్ ఆటపై మిర్యాలగూడలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. కొంతమంది డబ్బులు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నాటి నుంచి బెట్టింగ్‌లు సాగుతున్నప్పటికీ క్వాలిఫై మ్యాచ్‌ల దశకు చేరుకోవడంతో బెట్టింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల వరల్డ్‌కప్ క్రికెట్లో కూడా బెట్టింగ్‌లు సాగినప్పటికీ అంతకుమించి ఐపీఎల్-8లో బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్, పాత బస్టాండ్, హౌసింగ్ బోర్డు, రెడ్డికాలనీ, డాక్టర్స్ కాలనీ, బంగారుగడ్డ ప్రాంతాలలో బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులు కావడం వల్ల యువకులు పూర్తిగా క్రికెట్ బెట్టింగ్లపైనే దృష్టి సారించారు. యువతతో పాటు విద్యార్థులు సైతం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు ఆటలు కొనసాగుతుండటం వల్ల రాత్రి 11 గంటల వరకు కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బెట్టింగ్‌లలో వందలాది మంది పాల్గొంటుండగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వెయ్యికి మూడు వేలు బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలు వెయ్యి రూపాయలకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. కేవలం ఒక ఆటలో గెలుపు, ఓటములు మాత్రమే కాకుండా సిక్స్‌లు, ఫోర్లతో పాటు స్కోరుపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. చివరి ఓవర్లో ఎంత స్కోరు చేస్తారనే విషయంపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలు ఎక్కడ ఉన్నా బెట్టింగ్ పెట్టే వారు మాత్రం ఫోన్లో మాట్లాడి నిర్వహిస్తున్నారు. ఈ విధంగా సాయంత్రం అయిందంటే యువకులు గుంపులు, గుంపులుగా చేరి ఫోన్లో మాట్లాడుతూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. చెన్నై - ముంబై ఆటకు భారీగా బెట్టింగ్ ఐపీఎల్ -8లో ఫైనల్ బెర్త్ కోసం సాగే పోరులో చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియాతో సాగే మ్యాచ్‌కు భారీగా బెట్టింగ్‌లు సాగాయి. ఈ రెండు జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. కానీ మొదటి మ్యాచ్‌లోనే ఫైనల్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందని భావించి ఈ రెండు మ్యాచ్‌ల మధ్య సాగిన పోరుకు భారీగా బెట్టింగ్‌లు కొనసాగాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం ఉదయం నుంచే బెట్టింగ్‌లు సాగుతున్నాయి. డబ్బులు చెల్లించలేక అజ్ఞాతంలోకి ఫోన్లో పరిచయాల ఆధారంగా బెట్టింగ్‌లు సాగిస్తున్న యువత, విద్యార్థులు డబ్బులు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు సమాచారం. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌లు నిర్వహించి డబ్బులు చెల్లించలేక ముగ్గురు విద్యార్థులు ఇల్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన వారి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మిన్నకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా పట్టణంలో ఉన్నట్లు సమాచారం. -
మూడు ఫోర్లు.. ఆరు సిక్స్‌లు
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ ప్రతి రోజూ చేతులు మారుతున్న రూ. కోట్లు కళాశాల విద్యార్థులు సైతం బెట్టింగ్‌లకు బానిసలు ఆస్తులు పోగొట్టుకుంటున్న వివిధ వర్గాల జనం భీమవరం కేంద్రంగా విసృ్తతంగా సాగుతున్న జూదం తూతూ మంత్రం దాడులతో సరిపెడుతున్న పోలీసులు భీమవరం : పంటర్ : హలో నేను కేఎస్ఆర్ను మాట్లాడుతున్నాను. మ్యాచ్ రేటెంత బుకీ : 56-59 చెన్నై ఫేవరెట్ పంటర్ : 59లో 10 వేలు ఈటింగ్ బుకీ : ఒకే బెర్త్ కన్ఫాం ఇంకో పందర్ : మ్యాచ్ రేటెంత బుకీ : 63-66 ముంబ య్ ఫేవరెట్ పంటర్ : 63లో ముంబ య్‌పై 10 వేల ప్లేయింగ్ వేరే పంటర్ : నేను జీఆర్కే ఫ్యాన్సీ ఎంత - మిగతా 2లోఠ బుకీ : 10 ఓవర్లలో 74-75 పంటర్ : 75 ఎస్ 10 వేలు బుకీ : ఒకే కన్ఫాం ఇదేం భాష అనుకుంటున్నారా.. ఇది క్రికెట్ బెట్టింగ్ భాష. మ్యాచ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మ్యాచ్ ముగిసే దాకా పందర్లకు, బుకీలకు మధ్య సంభాషణ ఎడతెరిపి లేకుండా కొనసాగుతుంది. పెద్దఎత్తున కంప్యూటర్లు, 50-100 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బెట్టింగ్‌కు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన ల్యాప్‌టాప్ బాక్స్... అబ్బో ఇదంతా మనకు అర్థం కాదులెండి... ఇదంతా పందర్లు, బుకీలకు మాత్రమే తెలుస్తుంది. ఈ విధంగా జిల్లాలో భీమవరం కేంద్రంగా పట్టణాలు, గ్రామాలతోపాటు క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. దేశంలో ఐపీఎల్ - 8 క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో క్రికెట్ బుకీలు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా నిర్వహిస్తూ బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లు గుల్ల చేస్తున్నారు. పొట్టి క్రికెట్‌కు ఆదరణ లభించడంతోపాటు జోరుగా బెట్టింగ్ కూడా జరుగుతోంది. ప్రతి రోజు మ్యాచ్ జరగడంతో రూ.కోట్లు ఈ బెట్టింగుల్లో చేతులు మారుతున్నాయి. సాయంత్రం తీరిక సమయాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు సైతం పెద్దఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. జిల్లాలో బెట్టింగ్గులకు భీమవరం ప్రధాన కేంద్రం కాగా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు సమీప గ్రామాలు బుకీ కేంద్రాలుగా ఉన్నాయి. బుకీలు అపార్ట్మెంట్లతోపాటు ఇతర రహస్య ప్రదేశాల్లో ఉంటూ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా ఈ జూదం పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఒకొక్క మ్యాచ్‌కు జిల్లాలో రూ.50 కోట్లు చేతులు మారుతున్నాయనేది నమ్మశక్యం కాని నిజం. మ్యాచ్ ప్రారం భం నుంచి చివరి వరకు కూడా బాల్ బాల్కి బెట్టిం గ్లు జరుగుతున్నాయి. క్రేజీ సిరీస్ కావడంతో అం దరి దృష్టి దీనిపైనే ఉంది. మొదట్లో సరదాగా ప్రారంభిస్తున్నా తరువాత దానికి బానిసలై ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. మ్యాచ్ అయిన మరునాడు బుకీలు బ్యాంకుల ద్వారానో, తమ ఏజెంట్ల ద్వారానో డబ్బు లు వసూలు చేసుకుంటున్నారు. భీమవరానికి చెం దిన కొందరు బుకీలు బెంగళూరు, హైదరాబాద్‌లలో మకాంవేసి మరీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అడపాదడపా దాడులతో సరి ఐపీఎల్ సీజన్ చివరికి రావడంతో బెట్టింగ్ మరింత ముమ్మరమైంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అడపా దడపా చిన్న చిన్న దాడులు చేయడం తప్పితే పెద్ద బుకీలను అదుపులోకి తీసుకోవడం లేదు. ఇటీవల పట్టణ పోలీసులు ఒకరిద్దరు చిన్న తరహా బుకీలను అదుపులోకి తీసుకుని చేతులు దులిపేసుకున్నారు. దేశంలో ముంబ య్ ప్రధాన కేంద్రంగా ఒక చైన్‌లింక్ పద్ధతిలో ఈ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. షేర్ మార్కెట్ మాదిరిగా నిమిష నిమిషానికి మ్యాచ్ రేటు మారిపోతూనే ఉంటుంది. బుకీలు పందర్లకు (పంటర్ అంటే పందెం కాసేవారు, బుకీ అంటే పందెం కాయించుకునేవారు) ఇన్ని రెట్లు అని ఆశ చూపించడంతో యువత ఆశతో ఎగబడి పందాలు కాసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది యువకులు సొమ్ములు పోగొట్టుకుని చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. భీమవరం పట్టణం నుంచి ప్రతిరోజు సుమారు రూ.4 , 5 కోట్ల సొమ్ము బుకీలకే వెళ్లిపోతోంది. క్రికెట్ బెట్టింగ్వల్ల అనేకమంది తమ ఆస్తులను, పొలాలను అమ్ముకోవలసి వస్తోంది. కళాశాల విద్యార్థి నిలువుదోపిడీ భీమవరం పట్టణంలోని ఓ కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థి రెండు రోజుల క్రితం క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని తన ఒంటిపై ఉన్న బంగారాన్ని మొత్తం పోగొట్టుకుని లబోదిబోమంటూ వెనుతిరిగాడు. భీమవరం పట్టణ సమీపంలోని గ్రామానికి చెందిన ఆక్వా రైతు రూ.2 కోట్లు డబ్బును బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకోవడంతో మనోవేదనతోఅనారోగ్యం పాలయ్యాడు. బెట్టింగ్ తీరు క్రికెట్ బెట్టింగ్ మొత్తం ఫోన్లోనే జరుగుతుంది. ముందుగా తమ వద్ద క్యాష్ డిపాజిట్ చేసిన వ్యక్తుల నుంచి బుకీలు ఫోన్ ద్వారా పందాలు తీసుకుంటారు. ఫోన్లో బెర్త్ ఓకే అయిన వెంటనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్‌తో బెర్త్‌ను నమోదు చేస్తారు. అలా అన్ని బెర్త్‌లు నమోదు చేస్తారు. మ్యాచ్‌లు ముగిసిన అనంతరం ఆ సాఫ్ట్వేర్ నుంచి రిజల్ట్ తీసుకుని ఎవరు సొమ్ము గెలిచారో, ఎవరు ఓడారో జాబితా చూసుకుని డబ్బుల వసూళ్లు, పంపిణీ చేస్తుంటారు. చిన్న మొత్తాలను ఏజెంట్ల ద్వారా, పెద్ద మొత్తాలను బ్యాంకుల ద్వారా బట్వాడా సాగిస్తుంటారు. కొంతమంది నమ్మకస్తులకు అరువు బెట్టింగ్ కూడా ఇస్తారు. బుకీలు బెట్టింగ్‌లలో వచ్చిన కొంత సొమ్మును తమ వద్ద ఉంచుకుని మరికొంత తమ పై బుకీలకు పాస్ చేస్తుంటారు. ప్రతిరోజు డబ్బు రవాణా జరుగుతూనే ఉంటుంది. బుకీలు బెంగళూరు, ఇతర ప్రదేశాల్లో ఉన్నా వారి ఏజెంట్లు, గుమస్తాలు భీమవరంలోనే ఉండి డబ్బు మార్పిడి చేస్తుంటారు. -
రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ
న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు కొనసాగించినట్లు ముద్గల్ కమిటీ తేల్చింది. దీంతో పాటు క్రికెట్ అడ్మినిస్టేటర్ సుందర రామన్ కు కూడా బుకీలతో సంబంధాలున్నట్లు స్పష్టం చేసింది. ఓ బుకీకి సుందర రామన్ ఎనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించాయని ముద్గల్ కమిటీ పేర్కొంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తో పాటు అతని మేనల్లుడు గురునాథన్ మెయప్పన్ లకు క్లీన్ చిట్ లభించింది. ఆ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి మెయప్పన్ లపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కమిటీ పేర్కొంది. ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఏజీఎంపై నేడు సమావేశం
చెన్నై: బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బోర్డు ఉన్నతాధికారులు నేడు (ఆదివారం) సమావేశం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏజీఎం ఈనెల 30లోగా జరగాల్సి ఉంది. అయితే మెజారిటీ సభ్యులు మాత్రం... ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్పై ముకుల్ ముద్గల్ కమిటీ తుది నివేదిక ఇచ్చే దాకా వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఈ భేటీలో పాల్గొనే దాదాపు 20 మంది సభ్యులు శ్రీనివాసన్ మద్దతుదారులే. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల కారణంగా ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నారు. ముద్గల్ కమిటీ నివేదికలో శ్రీనివాసన్‌కు క్లీన్చిట్ లభిస్తే మరోసారి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని ఆయన మద్దతుదారుల ఆలోచన. ప్రస్తుతం శ్రీనివాసన్ ప్రత్యర్థి శశాంక్ మనోహర్‌కు నాలుగు రాష్ట్రాల యూనిట్ల మద్దతు మాత్రమే ఉంది. -
కట్టి‘బెట్టు’డు కానరాదే..!
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ఐపీఎల్ బెట్టింగ్ దందా నెలరోజులుగా జిల్లాలో భారీగా సాగుతోంది. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్కో మ్యాచ్‌పై రూ.వెయ్యి నుంచి రూ.ఐదు లక్షల వరకు బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా సరిహద్దు మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మరింత జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కృష్ణ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన కొంతమంది ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యసనం విద్యార్థుల్లోనూ వ్యాపిస్తోంది. ఇటీవల ఖమ్మం నగ రానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి తనకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బులతో ఐపీఎల్ బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకున్నాడు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు తమ తల్లితండ్రులు కొనిచ్చిన ల్యాప్‌టాప్‌లను, సెల్ఫోన్లను సైతం ఐపీఎల్ బెట్టింగ్ కోసం తాకట్టుపెడుతున్నట్లు తెలిసింది. ప్రముఖుల పిల్లలు కూడా తమ సరదా తీర్చుకోవడం కోసం విచ్చలవిడిగా ఈ తంతులో పాల్గొంటున్నారు. టెన్త్, ఇంటర్, డీగ్రీ కళాశాలలకు సెలవులు రావడం, మరికొన్ని ఇంజ నీరింగ్ కళాశాలలకు ప్రిపరేషన్ సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఈ మాయలో పడుతున్నారు. గతంలో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ఈసారి మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించింది. కాకా హోటళ్లే అడ్డా... బెట్టింగ్ తంతు ఎక్కువగా చిన్న చితకా హోటళ్లు, బార్‌షాపుల లో జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఇలాంటి చోటైతే ఎవరికీ అనుమానం రాదని భావించిన కొందరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా నగరంలోని ప్రధాన లాడ్జీలు, రెస్టారెంట్లు వేలకు వేలు అద్దెలు వసూలు చేస్తూ బెట్టింగ్ రాయుళ్లకు ఆశ్రయం ఇస్తున్నట్లు తెలిసింది. పట్టించుకోని అధికారులు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవారం రోజుల్లో ఐపీఎల్ ముగుస్తుడండంతో ఈ జోరు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిస్థితి మరింత తీవ్రం కాకముందే అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం
న్యూఢిల్లీ : ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్ స్కామ్ విచారణ నేపథ్యంలో శ్రీనివాసన్ బోర్డు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ కార్యకలాపాలకు దూరంగా వుంటేనే బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలను శ్రీనివాసన్ చేపట్ట వచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌పై విచారణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ముద్గల్ అధ్యక్షతన అడ్వకేట్ నాగేశ్వరరావు, నీలయ్ దత్తాలతో కూడిన త్రి సభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. -
మోడిపై జీవితకాల నిషేధం!
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. ఈనెల 25న జరిగే ప్రత్యేక సాధారణ సమావేశం (ఎస్జీఎం)లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలపై జ్యోతిరాదిత్య సింధియా, అరుణ్ జైట్లీ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదికపై ఆదివారం నాటి వర్కింగ్ కమిటీలో చర్చకు వచ్చినట్టు సీనియర్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. మోడిపై ఇలాంటి చర్యకు దిగితే కనీసం 21 మంది సభ్యులు నిషేధానికి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది.