
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణం తీసింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ (19) పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీలో స్నేహితులతో కలిసి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సోను కుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.కాగా మంగళవారం ఉదయం స్నేహితులు బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోని గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.