
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాకు చెందిన ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 15 వేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో లో ఏడుగురు పట్టుబడగా.. వారిపై పోలీసులు కరీంనగర్ రూరల్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ తో రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపి అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment