
నకిలీ మందులు విక్రయిస్తున్న క్లినిక్‌లలో డీసీఏ సోదాలు
రెండు నకిలీ క్లినిక్‌లపై కేసు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీలో రాళ్లు కరిగిస్తామని, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గించే మందులిస్తామని తప్పుడు ప్రకటనలిస్తూ.. నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న క్లినిక్‌ల్లో సోదాలు నిర్వహించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దుండిగల్, గండిమైసమ్మతోపాటు హనుమకొండ పట్టణాల్లో బుధవారం జరిపిన సోదాల్లో రెండు నకిలీ క్లినిక్‌లను గుర్తించినట్టు తెలిపారు. ఈ సోదాల్లో స్టోన్‌నిల్ డీఎస్ సిరప్‌లు, మహాసుదర్శన్ కాదా.. అనే రెండు రకాల సిరప్‌లను స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులపై డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అబ్జక్షనబుల్ అడ్వరై్టజ్‌మెంట్) యాక్ట్ 1954 ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.