లేబర్ కమిషనర్ కార్యాలయంలో రూ. 406 కోట్ల నగదు బదిలీపై ఫిర్యాదు అందిందని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: లేబర్ కమిషనర్ కార్యాలయంలో రూ. 406 కోట్ల నగదు బదిలీపై ఫిర్యాదు అందిందని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి తెలిపారు. తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అయితే విభజన చట్టం ప్రకారమే నిధులు బదిలీ చేశామని ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ మురళీసాగర్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. సంక్షేమ బోర్డు నిధులపై కస్టోడియన్ అధికారం తమకుందని వెల్లడించారు.