kamalasan reddy
-
వ్యాధులు నయం చేస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీలో రాళ్లు కరిగిస్తామని, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గించే మందులిస్తామని తప్పుడు ప్రకటనలిస్తూ.. నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న క్లినిక్‌ల్లో సోదాలు నిర్వహించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.దుండిగల్, గండిమైసమ్మతోపాటు హనుమకొండ పట్టణాల్లో బుధవారం జరిపిన సోదాల్లో రెండు నకిలీ క్లినిక్‌లను గుర్తించినట్టు తెలిపారు. ఈ సోదాల్లో స్టోన్నిల్ డీఎస్ సిరప్లు, మహాసుదర్శన్ కాదా.. అనే రెండు రకాల సిరప్‌లను స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులపై డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అబ్జక్షనబుల్ అడ్వరై్టజ్‌మెంట్) యాక్ట్ 1954 ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఆపరేషన్ ధూల్‌పేట్
సాక్షి, హైదరాబాద్: గంజాయికి నగరంలో కేంద్రంగా మారుతున్న ధూల్‌పేట్ ప్రాంతాన్ని ఆగస్టు 31లోపు గంజాయి రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ధూల్‌పేట్ చేపట్టినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. నగరంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు ఉంటున్నందున ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపారు. ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి రవాణా, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 15 మంది నిందితులను గుర్తించామని, ఇందులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. శనివారం ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషితో కలిసి కమలాసన్‌రెడ్డి మాట్లాడారు. ఎక్సైజ్ శాఖ పోలీసు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల సమన్వయంతో దాడులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ధూల్‌పేట్‌తోపాటు గంజాయికి అడ్డాలుగా మారుతున్న నానక్‌రామ్‌గూడ, లంగర్‌హౌస్, సీతాఫల్మండి సహా ఇతర ప్రాంతాల్లోనూ నిఘా పెంచినట్టు తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈఎస్ అంజిరెడ్డి బృందం శనివారం జరిపిన సోదాల్లో 54 కిలోల గంజాయి పట్టుబడిందని, గంజాయి రవాణా ముఠాలో కీలకంగా ఉన్న ఏ–1 రాహుల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌లో గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతున్న నాటుసారాపై సైతం దృష్టి పెట్టామని, మూడు నెలల్లో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4,200 కిలోల బెల్లాన్ని , 50 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎక్సైజ్‌శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ, ఆపరేషన్ ధూల్‌పేట్ ఈనెల 20 నుంచి ప్రారంభించామన్నారు. స్థానిక పోలీస్, ఎక్సైజ్‌శాఖ, టీజీఏఎన్‌బీ ఉమ్మడిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు ధూల్‌పేట్ ప్రాంతంలో 12 కేసులు నమోదు చేశామని, మొత్తం 37 మంది నిందితులను గుర్తించామన్నారు. ఈ ముఠాలు ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు నుంచి పెద్దమొత్తంలో తెచ్చిన ఎండు గంజాయిని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, బీబీనగర్ ప్రాంతాల్లో స్థావరాలు పెట్టుకుని, అక్కడ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోల్లో కొద్దికొద్ది మొత్తాల్లో నగరంలోకి తెస్తున్నట్టు గుర్తించామన్నారు. ధూల్‌పేట్‌తోపాటు ఇతర ప్రాంతాలపైనా గంజాయి ముఠాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
రక్తం, ప్లాస్మా ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి.. డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు. రూ.700కు కొని రూ.3,800కు విక్రయం తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ సీపీగా సత్యనారాయణ
సాక్షి, కరీంనగర్: ఐదేళ్ల సుదీర్ఘకాలం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన వీబీ కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాసన్‌రెడ్డిని ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. వి.సత్యనారాయణ రామగుండంలో సుమారు మూడేళ్ల పాటు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో డీసీపీగా వ్యవహరించారు. కాగా.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రమణకుమార్ నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రమణ కుమార్ హైదరాబాద్‌లో వివిధ శాఖల్లో ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్‌పై చెరగని ముద్ర కరీంనగర్ సీపీగా సుదీర్ఘకాలం పనిచేసిన కమలాసన్‌రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. కరుడుగట్టిన నేరస్థులపై పీడీయాక్టు అమలు చేశారు. బ్లూకోల్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వాలిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. సీపీ తీసుకున్న చర్యల కారణంగా దేశంలోనే ఉత్తమ పోలీస్స్టేషన్లుగా చొప్పదండి, జమ్మికుంట ఎంపికయ్యాయి. ప్రజల రక్షణ భద్రతలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, పీడీయాక్టు అమలులో 2వ స్థానం సాధించారు. కమిషనరేట్ పరిధిలో 10 వేల సీసీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకోగా దాతల సహాయంతో 8,500 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో ‘మియావాకీ’ చిట్టడవుల ప్రాజెక్టు ఏర్పాటు చేసి 12,500 మొక్కలు మొదటి దశలో, 14,800 మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు నక్షత్ర, రాశి వనాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికే కరీంనగర్ పోలీసులను ఆదర్శంగా నిలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ వినియోగంలో యువతలో జరిమానాల ద్వారా భయాన్ని కల్పించారు. ఆపరేషన్ నైట్ సేప్టీలో భాగంగా దొంగతనాలకు అడుకట్ట వేశారు. ప్రతిరోజూ కమిషరేట్‌లో నాఖాబందీ నిర్వహించి అక్రమార్కులకు, నేరగాళ్లకు సింహస్వప్నమయ్యారు. కమిషనరేట్‌లో 2 లక్షలకు పైగా ప్రజలు హ్యాక్ ఐ యాప్‌ను వినియోగింపచేశారు.లేక్ పోలీస్‌స్టేషన్, టాస్క్‌ఫోర్స్ విభా గాన్ని ఏర్పాటు చేసి అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడంలో తనవంతు పాత్ర పోషించారు. భూదందాలు, సెటిల్మెంట్లు చేసి అక్రమాలకు పాల్పడిన 102 మందిపై పీడీయాక్టు విధించారు. కరీంనగర్ టూటౌన్, త్రీటౌన్, జమ్మికుంట, రామడుగు, ఎల్ఎండీ, గంగాధరతో పాటు వివిధ పోలీసుస్టేషన్లను ఆధునికీకరించారు. దివ్యాంగులు పోలీసుస్టేషన్లకు వచ్చేందుకు వీల్చైర్లు, ర్యాంపులు నిర్మించారు. నిజాం కాలం నాటి గోల్‌బంగ్లాను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్నాజియం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఫీడ్ బ్యాక్డే ద్వారా కేసుల పురోగతిని సమీక్షించారు. ఆటోలు, టాక్సీలకు క్యూఆర్ కోడ్ అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రామగుండం నుంచి కరీంనగర్‌కు.. కొత్త జిల్లాల అనంతరం ఏర్పాటైన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెలివల సత్యనారాయణ కరీంనగర్ సీపీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2006 బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణ డీసీపీగా హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో విధులు నిర్వర్తించి సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 2018 సెప్టెంబర్ 26న రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడేళ్లపాటు రామగుండం సీపీగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రల పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల డివిజన్లలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. శాసనసభ, పార్లమెంటు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా తనదైన మార్కు చూపించారు. కమలాసన్ రెడ్డి వారసుడిగా కరీంనగర్‌కు రానున్నారు. ఐదేళ్లకు బదిలీ అయిన కమలాసన్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్‌కు 2016 అక్టోబర్ 11న తొలి కమిషనర్‌గా వీబీ కమలాసన్ రెడ్డి నియమితులయ్యారు. సుదీర్ఘంగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన కరీంనగర్‌పై చెరగని ముద్ర వేశారు. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న కమలాసన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదభిప్రాయం ఉండడంతో ఇన్నేళ్ల పాటు కొనసాగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కమలాసన్ రెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. డీఐజీ హోదాలో ఉన్న ఆయనను డీజీ కార్యాలయానికి అటాచ్ చేయగా, హైదరాబాద్‌లోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్
సాక్షి, కరీంనగర్: కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆగిన గుండెకు పోలీస్ కానిస్టేబుల్ ఊపిరి పోశారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీ అతన్ని కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే పడిపోయి అపస్మారక స్థితికి చేరాడు. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండి పోయారు. కానీ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు. అలా మూడు,నాలుగు నిమిషాలు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పట్ల సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు పలువురు అభినందించారు. సిపి కమలాసన్ రెడ్డి మాటలును ప్రేరణగా తీసుకుని, ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలతో సకాలంలో స్పందించి యువకుడు ప్రాణాలు కాపాడానని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఖలీల్ గొప్ప పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి హార్ట్ బీట్ ఆగిపోయింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్సలో భాగంగా గుండె పైన నిమిషం పాటు పంపింగ్ చేయండంతో యువకుడికి మొదలయిన హార్ట్ బీట్, వెంటనే అతనిని హాసుపత్రికి తరలించడమైనది. pic.twitter.com/zZEYMVHal1 — Telangana State Police (@TelanganaCOPs) June 23, 2021 చదవండి:జీవిత సమస్య: పోరుబాట వదలడమా? ప్రాణాలు పోవడమా? -
‘ఖాకీ’ని తలపించే చేజింగ్, 45 రోజుల ఆపరేషన్
సాక్షి, కరీంనగర్: కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఖాకీ కథ తెలుసుగా! ఉత్తర భారతం నుంచి సరుకు రవాణా లారీల్లో వచ్చే కొందరు దుండగులు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడతారు. వారిని పట్టుకోవడానికి ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు భారీ ఎత్తున జాయింట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన పోలీసులు అలాంటి జాయింట్ ఆపరేషన్ చేశారు. 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల పోలీసులు దాదాపు 45 రోజులపాటు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నవీ ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్, షోలాపూర్, బీదర్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఎట్టకేలకు గజదొంగ భాకర్ అలీని కరీంనగర్ పోలీసులు షోలాపూర్‌లో శనివారం అరెస్టు చేశారు. అయితే, అతను సాదాసీదాగా పోలీసులకు చిక్కలేదు. పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఆక్రమంలో భాకర్ అలీ చేతిలో పోలీసులు గాయపడ్డారు. చివరకు ఛేజింగ్ చేసి పోలీసులు అతని ఆట కట్టించారు. కాగా, భాకర్ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్టు కేసులు ఉన్నట్టు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. 2015 ముందే హైదరాబాద్‌లో వందకుపైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. (చదవండి: 200కు పైగా ఇన్స్టాంట్ లోన్‌యాప్స్ తొలగింపు..) -
గోల్మాల్ గేమ్!
సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్‌లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు. ఆశతో అడుగు పెడుతూ.. ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్లైన్ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్లైన్ గేమ్స్‌తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు.. ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్లైన్లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్‌ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్.. లాస్ కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్ కోసం ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బానిస కావద్దు.. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్లైన్ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. –వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ -
భారీగా ఐపీఎల్ బెట్టింగ్; ఏడుగురు అరెస్ట్
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాకు చెందిన ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 15 వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో లో ఏడుగురు పట్టుబడగా.. వారిపై పోలీసులు కరీంనగర్ రూరల్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ తో రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపి అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. -
యువతపై కమిషనర్ ఉక్కుపాదం!
సాక్షి, కరీంనగర్: సామాజిక మాధ్యమాలు... కొత్త కొత్త పోకడలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువకులు దురలవాట్లకు చేరువవుతూ సంఘ విద్రోహ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. రౌడీషీటర్లు, ల్యాండ్ మాఫియా నడిపే వ్యక్తులకు చేరువవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ యువత దారి తప్పకుండా వ్యవస్థను కూకటివేళ్లతో నరికే దిశగా చర్యలు చేపట్టింది. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వెర్రితలలు వేస్తున్న యువత పోకడలను ఆదిలోనే తుంచివేసేందుకు కమిషనర్లు విడివిడిగా చర్యలు చేపట్టారు. కరీంనగర్ శివార్లలో భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్లు సాగిస్తున్న వ్యక్తుల ను ఓ వైపు టార్గెట్ చేసుకుంటూనే... యువతరంతో గ్యాంగులు తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతూ జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపేందుకు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. లవన్‌కుమార్ అనే ఓ రౌడీషీటర్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిషనర్ అతనికి సహకరిస్తున్న వారిని, అతను పెంచిపోషిస్తున్న గ్యాంగ్‌ను టార్గెట్ చేశారు. గురువారం స్వయంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన లవన్ గ్యాంగ్, అతనికి సహకరిస్తున్న వారి గురించి ఆరా తీశారు. అదుపులోకి తీసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా యువకులు సాగిస్తున్న దందాలు, నమోదైన కేసులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 169 మంది రౌడీషీటర్లు, ఆస్తుల వివాదాల్లో జోక్యం చేసుకొనే మరో 241 మంది ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులను తూలనాడుతున్న వ్యక్తులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శివార్లలో పెరిగిన భూదందాలు కరీంనగర్ శివార్లలో భూ వివాదాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి రూట్లలో జిల్లా కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు భూముల క్రయ విక్రయాల్లో లాండ్ మాఫియా ప్రవేశించింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, కరీంనగర్ నుంచి భూదందా సాగించే మాఫియా ప్రధాన రోడ్ల పక్కన ప్లాట్లు కొన్న వారిని, భూములు కొన్న వారిని లక్ష్యంగా చేసుకొని లేని వివాదాలు సృష్టిస్తున్నారు. తరువాత సెటిల్మెంట్ల పేరుతో గతంలో భూములు కొన్నవారిని, అమ్మిన వారిని బెదిరించి తామే సొంతం చేసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన దందాల స్థాయిలో కరీంనగర్ చుట్టుపక్కల ల్యాండ్ మాఫియా భూ వివాదాలు సృష్టిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి భూ వివాదంలో జోక్యం చేసుకున్న లవన్ కుమార్ అనే రౌడీషీటర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించారనే అనుమానంతో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. బొమ్మకల్ ప్రాంతంలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఆగడాలు కూడా పెరిగిపోవడంతో ఆ వైపు కూడా దృష్టి పెట్టారు. చిన్న చిన్న భూవివాదాలను పెద్దవిగా చేసి, లబ్ధిపొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న ఈ దందాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించిన కమిషనర్ ఫిర్యాదులు అందిన వెంటనే ‘లోపలికి’ పంపించే దిశగా ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యలు పెట్టిన వారిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో చదువుకొంటూనో... ఉద్యోగాలు చేస్తూనో ఉండే యువకులు రెచ్చగొట్టేలా పెట్టే పోస్టింగ్‌లను కూడా సీరియస్‌గా తీసుకొని ‘రెడ్‌కార్నర్’ నోటీస్‌లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 241 మంది భూవివాదాల్లో జోక్యం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో కలిపి 536 మందిని వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు, పలు ‘షీట్ల’ను తెరిచారు. క్రిమినల్ కేసుల్లో బుక్కయిన వారు, బెదిరింపులకు పాల్పడుతూ రౌడీయిజం చేస్తున్న 169 మంది మీద ఇప్పటికే రౌడీషీట్లు తెరిచారు. వీరిలో కొందరిపై పీడీ యాక్టు ప్రయోగించి జైళ్లకు పంపించారు. మతపరమైన సమస్యలు వచ్చినప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించే 61 మంది జాతకాలు కూడా తీసుకున్నారు. ఇక ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకునే వారి జాబితా 241గా రికార్డు చేశారు. వీరిలో 100 మంది వరకు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మట్కా ఆడించేవారు ఐదుగురైతే, గుట్కా సరఫరా చేసేవారు 47 మంది. గంజాయి రవాణాలో పాల్గొనే నలుగురు వ్యక్తులతోపాటు ఇసుక మాఫియా కింద మరో 9 మందిపై ప్రత్యేక షీట్లు తెరిచారు. వీరంతా కరీంనగర్ నుంచి హుజూరాబాద్, చొప్పదండి వరకు విస్తరించి ఉండడంతో వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కమిషనర్ అన్ని పోలీస్స్టేషన్లను ఆదేశాలు జారీ చేశారు. కాగా 84 మందిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించడమే కాకుండా... జైలుకు వెళ్లివచ్చిన వారందరిపై రౌడీషీట్లు తెరవడం గమనార్హం. రౌడీయిజం, భూ దందాలను సహించం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు. యువత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యార్థి దశలో దారి తప్పితే చెడు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. బర్త్‌డే పార్టీలు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఇళ్లలోనే జరుపుకోవాలని తల్లిదండ్రులు చెప్పాలి. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ విషయంలో పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. అక్రమ పద్ధతుల్లో భూదందాలు సాగిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. బాధితులు సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ 0878 – 2240276కు గానీ, ఇన్స్పెక్టర్కు 9440795104 నెంబర్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ఎవరినీ వదలం. – కమలాసన్‌రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ చౌరస్తాల్లో... కత్తులతో కేకులు కట్ యువత ఆలోచనలు వెర్రితలలు వేసిందనడానికి ఇటీవలి కాలంలో పెరిగిన రోడ్లపై బర్త్‌డేలు నిర్వహించుకునే సంస్కృతే నిదర్శనం. బైపాస్‌లో బొమ్మకల్ వైపున్న బ్రిడ్జి మీద గతంలో అర్ధరాత్రి బర్త్‌డేలు జరుపుకొన్నట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లడం లేదు. కానీ నగరంలోని కాలనీలు, రోడ్లతోపాటు మునిసిపాలిటీలు, గ్రామాల్లో చౌరస్తాల్లో రాత్రి 12 తరువాత తాగి తందనాలాడుతూ బర్త్‌డేలు జరుపుకొనే వింత ధోరణి పెరిగింది. బర్త్‌డే కేకును ప్లాస్టిక్ లేదా స్టీల్ చాకుతో కోయడం ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో తల్వార్లు, పొడవాటి పెద్దపెద్ద కత్తులతో కేకులు కట్ చేస్తూ సినిమాల్లో తరహా వాటిని ప్రదర్శిస్తున్నారు. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ బర్త్‌డే పార్టీ కూడా ఓ అపార్ట్మెంట్లో రాత్రి నుంచి తెల్లవారు జాము దాక జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో లవన్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కాగా బర్త్‌డే సందర్భంగా గానీ, ఇతర ఏ సందర్భంలో గానీ కత్తులను ప్రదర్శిస్తే ‘ఆయుధ చట్టం’ కింద కేసు నమోదు చేయనున్నట్లు కమిషనర్ కమలాసన్ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
కరీంనగర్లో 'అతడు' సీన్ రిపీట్
సాక్షి, హైదరాబాద్ : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన అతడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటీకీ చూసినప్పుడల్లా తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే అచ్చు అతడు చిత్రంలో సన్నివేశం తరహాలోనే ఓ సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. అతడు చిత్రంలో విలన్ తనికెళ్ల భరణి, కొడుకు బ్రహ్మజీతో .. మర్డర్ చేయాలంటే కత్తులుండాలి కానీ, క్వాలీసులు, సుమోలు ఎందుకురా భుజ్జీ.. అన్ని బండ్లు వద్దురా పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా.. అందరూ కలిసి ఒకే బండిలో వెళ్లండిరా.. మీరెంత సైలెంట్‌గా ఉంటే మర్డర్ అంత వైలెంట్‌గా ఉంటది.. అంటూ చెబుతాడు ... తర్వాత సీన్లో అందరు రౌడీలు కలిసి ఇరుక్కుని మరీ ఒకే సుమోలో కూర్చోని వస్తారు.. సీరియస్ సిచ్చువేషన్‌లోనూ కామెడీ పూయించే ఆ సన్నివేశం అందరికీ గుర్తుండిపోతుంది. తెగ నవ్వు తెప్పించే అలాంటి సన్నివేశమే కరీంగర్‌లోని తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత పోలీసులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి లెక్కించారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతపై బాధ్యత వహించాలని దీనికి సంబంధించి వీడియోను కరీంనగర్ సీపీ కమాలాసన్ రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
లిఫ్ట్ పేరిట టోకరా
కరీంనగర్ క్రైం: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి.. చోరీలకు పాల్పడుతున్న యువకుడిని సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కన్నమల్ల మల్లేశం కొద్ది రోజుల క్రితం భగత్‌నగర్‌కు వెళ్లేందుకు స్థానిక బస్టాండ్ వద్ద నిరీక్షిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన గుంటి సురేష్(29) లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన స్కూటీపై తీసుకెళ్లి కట్టరాంపూర్‌లో శివారులో అతని వద్ద ఉన్న బంగారం, డబ్బులు లాక్కెళ్లాడు. ఈ ఘటనపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వేములవాడకు చెందిన పందిళ్ల అనిల్‌కుమార్ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఉండగా.. లిఫ్ట్ ఇస్తానని శివారులోకి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న బంగారం, విలువైన వస్తువులు చోరీచేశాడు. ఈ ఘటనపై సీసీఎస్ సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతడిని చాకచక్యంగా పట్టుకుని వన్‌టౌన్ పోలీసులు సహాయంతో రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, వన్‌టౌన్ ఎస్సై నాగరాజు, ఏఎస్సై వీరయ్య, సీసీఎస్ సిబ్బంది హసన్, లక్ష్మీపతి, అంజయ్యలను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి, రివార్డు అందజేశారు. -
అది పరువు హత్య కాదు.. మిత్రుడే..
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో సంచలనం సృష్టించిన గడ్డి కుమార్ హత్య మిస్టరీ వీడింది. ఎవరూ ఊహించనిస్థితిలో సమీప బంధువు అయిన అతడి స్నేహితుడే కుమార్‌ను గొంతునులిమి హత్య చేశాడు. విషయం ఎవరికీ తెలియకుండా పరువుహత్యగా చిత్రీకరించాడు. మృతుడి కుటుంబసభ్యుల వెన్నంటే ఉండి పోలీసుస్టేషన్ వెంట తిరిగాడు. తొమ్మిది రోజులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు సీసీఫుటేజీ, ఫోన్‌డాటా ఆధారంగా నిందితుడు తాడికల్‌కు చెందిన ఊరడి వెంకటేశ్‌గా తేల్చారు. బుధవారం అతడిని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకురాగా... కుమార్‌ను ఎలా చంపాడో సీపీ కమలాసన్‌రెడ్డి, పోలీసులకు వి వరించాడు. ఇది పరువు హత్య కాదని, తాగిన మైకంలో వెంకటేశే.. కుమార్‌ను గొంతునులిమి హత్య చేశాడని సీపీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదీ జరిగింది... తాడికల్‌కు చెందిన గడ్డికుమార్ హుజూరాబాద్‌లోని ఓ సెల్‌పాయింట్‌లో పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఈనెల 6న నిజామాబాద్ వెళ్లి వచ్చారు. మరుసటి రోజు నుంచి కుమార్ కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. శంకరపట్నం పోలీసుస్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న తాడికల్ శివారులోని పత్తిచేనులో శవమై తేలాడు. సదరు బాలిక బంధువులే హత్య చేశారని కుమార్ కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎస్సైపై దాడికి యత్నించారు. పోలీసు జీపు ధ్వసం చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటు.. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సీపీ కమలాసన్‌రెడ్డి విచారణకు టాస్క్‌పోర్స్ ఏసీపీ శోభన్‌కుమార్ నే తృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐ కి రణ్, సైబర్ఇన్వెస్టిగేషన్ ఎస్సై మరళి, హుజురా బాద్ రూరల్ సీఐ రవికుమార్ కేసును తొమ్మిదిరోజుల పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. బా లి క కుటుంబ సభ్యులను, కుమార్ కుటుంబసభ్యులను, స్నేహితులను, ఆటో డ్రైవర్‌ను పలు కో ణా ల్లో విచారించారు. 128మంది కాల్‌డేటాలను పరిశీలించారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. (కరీంనగర్ జిల్లాలో పరువు హత్య?) పట్టించిన సీపీ ఫుటేజీ... కేశవపట్నంలోని మద్యం దుకాణంలో సీసీ ఫుటేజీని పరిశీలించగా.. కుమార్‌తో పాటు అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన వూరడి వెంకటేశ్ కలిసి మద్యం తీసుకుని బైక్‌పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. ఆ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే విధంగా కాల్‌డాటా పరిశీలించగా.. కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యేంతవరకు ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన పద్ధతిలో పలుమార్లు విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మద్యంమత్తులోనే హత్య.. నిందితుడిని బుధవారం ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్కడే విచారించారు. కుమార్‌ను ఎలా చంపాడో వెంకటేశ్ అక్కడ వెల్లడించాడు. ‘ఇద్దరం మద్యం తీసుకుని తాడికల్ సమీపంలోని పత్తిచేలకు వెళ్లాం. తాగుతుండగా.. కుమార్ ప్రేమికురాలి నుంచి ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యులు తనను కొడుతున్నారని, పెళ్లి చేసుకుందామని అమ్మాయి ఒత్తిడి తేవడంతో కుమార్ అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో అమ్మాయితో మాట్లాడే పద్దతా అని గట్టిగా వారించా. కానీ నాతో దుర్బాషలాడాడు. ఆ తరువాత మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. మాటమాట పెరిగి... కుమార్‌ను గొంతునులిమాను. అక్కడి నుంచి వెళ్లి మరోసారి మద్యం తీసుకుని వచ్చే సరికి కుమార్ చనిపోయి ఉన్నాడు’ అని నిందితుడు వెంకటేశ్ పోలీసులకు వెల్లడించారు. పరువు హత్యకాదు.. అనంతరం సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. కుమార్‌ది పరువుహత్య కాదని, తాను ప్రేమించిన బాలిక కుటుంబసభ్యులకు, హత్యకు ఎలాంటి సబంధం లేదని, వెంకటేశ్ తాగిన మైకంలో కుమార్‌ను గొంతునులిమి చంపాడని సీపీ వెల్లడించారు. అయితే ఈ కేసును మరింత విచారిస్తామని, ఇంకెవరైనా నిందితులు ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. హత్య జరిగిన రోజున ఎస్సైపై దాడికి దిగి, పోలీసు జీపును ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసులను సీపీ ఈ సందర్భంగా అభినందించారు. (హైదరాబాద్‌లో మరో మారుతీరావు) -
పెళ్లికి.. పెద్దన్నలయ్యారు..
సాక్షి, గంగాధర(చొప్పదండి): వారిది పేదింటి కుటుంబం. కూతురుకు మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే ఇంటిపెద్దకు జబ్బు చేసింది. కూతురుపెళ్లికి దాచిన డబ్బులు వైద్యానికి ఖర్చయ్యా యి. పెళ్లి ఆగిపోతుందేమోనని ఆందోళనలో ఉన్న ఆ కుటుంబానికి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అండ గా నిలిచారు. దగ్గరుండి సదరు యువతి వివాహం జరి పించారు. వచ్చినవారికి భోజనాలు సైతం పెట్టించారు. గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన కొలెపాక అంజయ్య– బుజ్జమ్మ దంపతులకు కొడుకు అనిల్, కూతురు లత(రేణుక) ఉన్నారు. అనిల్ ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. లత(రేణుక)కు కొత్తపల్లి మండలం బాహుపేటకు చెందిన కొట్టెపల్లి లక్ష్మణ్‌కుమార్‌తో నెల 25న పెళ్లి జరిపించడానికి పదిహేను రోజుల క్రితం ముహూర్తం కుదిర్చారు. ఇంతలో లత తండ్రి అంజయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలిపారు. పెళ్లికోసం పోగుచేసిన డబ్బులు వైద్యానికే ఖర్చయ్యాయి. ముహూర్తం దగ్గరపడుతుండడంతో ఆందోళన చెందారు. పెద్దన్నలైన పోలీసులు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై పుల్లయ్య అంజయ్య కుటుంబాన్ని కలిసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. విషయాన్ని సీఐ రమేష్ ద్వారా ఏసీపీ ఉషావిశ్వనాథ్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి వివరించారు. స్పందించిన వారు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్ణయించారు. స్థానిక ఓ ఫంక్షన్హాల్లో బుధవారం లత(రేణుక)– లక్ష్మణ్‌కుమార్‌ల వివాహం ఘనంగా జరిపించారు. సీపీ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే శోభ, ఎంపీపీ దూలం బాల గౌడ్, ప్రజాప్రతినిధులుహాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం రూ. 5,116 అందించారు. -
మట్కాగ్యాంగ్ పట్టివేత
సాక్షి,కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్‌లో కొంతకాలంగా మట్కా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని మారుతినగర్‌కు చెందిన కమటం రమేÐశ్(56), చొప్పదండి మండలం గణేష్‌నగర్‌కు చెందిన ఒదెల రాజు(52), కరీంనగర్‌లోని పాతబజారుకు చెందిన వనం రాము(48), బొమ్మదేవి శ్రీనివాస్(45), కోతిరాంపూర్‌కు చెందిన బత్తిని సత్యనారాయణ(50), కొత్తపల్లి మండలానికి చెందిన కన్న అంజిబాబు(55), కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన కుక్కల నరేందర్(36) ముఠాగా ఏర్పడి కరీంనగర్లో మట్కా నిర్వహిస్తున్నారు. ఏజెంట్లుగా..! కొందరు మట్కా నిర్వహణకు ఏజెంట్లుగా మారారు. రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్ చేసి ఏజెంట్‌గా మారారు. కల్యాణిగా వ్యవహరించే ఈ మట్కా ఆటలో సింగిల్ డిజిట్ వస్తే రూ.100కు రూ.800, ఓపెన్, డబుల్ నంబర్లు వస్తే రూ.100కు రూ.8వేలు, మూడు నంబర్లు వస్తే ఓపెన్ పానగా పేర్కొంటూ రూ.100కు రూ.10వేలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. శని, ఆదివారాలు తప్పా మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, మళ్లీ 9 నుంచి రాత్రి 11.30 గంటల వరకు రెండుసార్లు డ్రాలు తీసి నంబర్లు చెబుతారు. వారు చెప్పిన నంబర్లపై పందెం కాసిన వారికి డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పటికీ ఈ ఆటలో ఎవరికీ డబ్బులు రాలేదు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. మాట్కా నిర్వాహకులు ఏడుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.50వేలు నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హిస్టరీషీట్లు ప్రజలు కష్టార్జీతాన్ని నమ్ముకోవాలే తప్పా ఇలాంటి వాటిని నమ్మొద్దని సీపీ కోరారు. రెండు అంతకన్న ఎక్కువ కేసులు ఉన్న జూదరులపై హిస్టరీషీట్లు ఓపెన్ చేసి నిఘా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు 30 మంది మట్కా నిర్వాహకులను పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో 10 మందిపై రెండు అంతకన్న ఎక్కువ కేసులున్నాయని.. వారిపై హిస్టరీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసుపత్రిపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో ఉన్న అరుణశివరాం ఆసుపత్రిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పరిశీలనకు వచ్చారు. విచారణలో భాగంగా లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లు ల్యాబ్ అసిస్టెంట్ ఒప్పుకున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమని, ఇటువంటి పనులకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని నగర సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. -
కరీంనగర్లో కార్డన్ సెర్చ్
కరీంనగర్: నగరంలోని హుస్సెనీపుర, ప్రియదర్శని కాలనీలను పోలీసులు దిగ్బంధం చేశారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం వేకువజామున 200మంది పోలీసులు ఒక్కసారిగా రెండు కాలనీల్లో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సదంర్భంగా సరైన పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రౌడీషీటర్‌తోపాటు నలుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమం మద్యాన్ని గుర్తించి బెల్ట్ షాప్‌ను సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహించామని సీపీ తెలిపారు. -
ల్యాప్‌ట్యాప్‌ల దొంగ దొరికాడు!
కరీంనగర్: కరీంనగర్ బస్టాండ్ వద్ద ల్యాప్‌ట్యాప్ చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడు చెంగల్పడ్ జిల్లా మహాలక్ష్మినగర్‌కు చెందిన వెంకటరమణ రాజశేఖర శాస్త్రిగా గుర్తించారు. గతంలో చోరీకి గురైన ల్యాప్‌ట్యాప్ కేసుల్లో ఇతడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మొత్తం 16 ల్యాప్‌ట్యాప్ చోరీ కేసుల్లో రాజశేఖర శాస్త్రి నిందితుడు. తెలంగాణ, ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాల్లో తెలివిగా చోరీలు చేసిన ల్యాప్‌ట్యాప్‌ను తమిళనాడులో బాలాజీ అనే వ్యక్తికి 10 నుంచి 15 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలిపాడు. బస్సుల్లో ల్యాప్‌ట్యాప్‌లతో ప్రయాణించే యువకుల్ని టార్గెట్‌గా చేసుకుని నిందితుడు చోరీలకు పాల్పడుతున్నాడని విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. -
దారిదోపిడీ ముఠా అరెస్ట్
► పట్టుబడ్డ తొమ్మి మంది ► అందరూ24 ఏళ్లలోపువారే ► మూడు వాహనాలు..ఏడు సెల్ఫొన్లు స్వాధీనం కరీంనగర్ క్రైం : కరీంనగర్ శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా దారిదోపిడీలకు పాల్పడుతున్న 9 మంది ముఠాను అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని కాపువాడకు చెందిన మిర్యాకార్ సారుు(20) స్థానిక మటన్‌షాపులో పని చేస్తాడు. అదే కాలనీకి చెందిన కోహెడ వేణు(20), కురెల్లి సారుుచంద్(21), హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన గుత్తం సారుురాం(19), గుమ్మడి రాజేశ్(24), హెచ్‌బీ కాలనీకి చెందిన దేవ కార్తీక్(24), శాషామహల్కు చెందిన మధిర హరీష్(20), మారుతినగర్‌కు చెందిన మామిడిపల్లి భువనేశ్వర్(19), అదే కాలనీకి చెందిన మరో బాలుడు(17) జల్సాలకు అలవాటుపడ్డారు. వీరిలో వేణు, సారుుచంద్, భువనేశ్వర్ డిగ్రీ చదువుతుండగా మిగతా వారు వివిధ పనులు చేస్తున్నారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి దారిదోపిడీలు ప్రారంభించారు. ఇలా వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేసేవారు డబ్బులు అరుుపోగానే మళ్లీ దారిదోపిడీలు చేసేవారు. క్లూ దొరకకుండా చోరీలు ఎలాంటి క్లూ లేకుండా రాత్రిపూట సీసీ కెమోరాలు లేనిచో ఈ ముఠా దారిదోపిడీలు చేసేది. దీంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తనిఖీలు చేసినప్పుడు వీరు తాము విద్యార్థులమని చెప్పుకుంటూ తప్పించుకునేవారు. ఈ ఏడాది మే 21న హరీష్, చంద్, మిర్యాకార్ సారుు, భువనేశ్వర్, మైనర్ బాలుడు కలిసి కరీంనగర్ బైపాస్ రోడ్డులోని రామచంద్రపూర్ పెట్రోల్ బంక్ వద్ద ప్రయాణిస్తున లారీ, ట్రాక్టర్లను నిలిపి అందులోని డ్రైవర్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.12,500 వేలు లాక్కుని పారిపోయారు. ఈ ఏడాది జూన్ 20న మిర్యాకార్ సారుు, వేణు, గుత్తం సారుురాం, దేవ కార్తీక్, గుమ్మడి రాజేశ్ కలిసి బైపాస్‌రోడ్డులో నిలిపి ఉంచిన లారీల అద్దాలు పగలకొట్టి డ్రైవర్లపై దాడిచేసి వారి నుంచి సెల్ఫొన్, రూ.17,500 ఎత్తుకెళ్లారు. ఈ ఏడాది జూలై 7, 16వ తేదీల్లో హరీష్, మిర్యాకార్ సారుు, భువనేశ్వర్, బాలుడు కలిసి సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో ఉన కొండ సత్యలక్ష్మి గార్డెన్ వద్ద రోడ్డుపై వస్తున్న ఐజర్ వాహనంపై రాళ్లు, కర్రలతో దాడిచేసి డ్రైవర్‌ను కొట్టి అతని వద్ద ఉన్న రూ.11 వేలు దోచుకున్నారు. ఆగస్టు 7న, నవంబర్ 2వ తేదీ ఇదే తరహలో దారిదోపిడీలకు పాల్పడ్డారు. అరుుతే వీరు రాత్రి పూట నేరాలు చేస్తుండడం ఎలాంటి అనవాళ్లు లభించకపోవడంతో పలువురి కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కొద్ది రోజుల క్రితం రాత్రిపూట నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో అనుమానితుడిని పట్టుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో దారిదోపిడీలకు చెందిన క్లూ లభించింది. దీంతో తొమ్మిది మంది కదిలిలకపై నిఘా పెట్టారు. మంగళవారం ఉదయం త్రిటౌన్ సీఐ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న తొమ్మిది మందిని పట్టుకుని విచారణ చేయగా ఏడు దారిదోపిడీ నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి నుంచి దోపిడీలకు వినియోగించిన మూడు బైకులు, ఏడు సెల్ఫొన్లు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.. యువతపై వారి కుటుంబసభ్యుల పర్యవేక్షణ ఉండాలని సీపీ సూచించారు. నగరంలో గతకొంతకాలంగా దారిదోపిడీలు చేసి పట్టుబడ్డ 9 మందిన కుటుంబ సభ్యులను విచారించగా వారి పర్యవేక్షణ ఉండడం లేదని తెలిసిందని తెలిపారు. ఇటీవల దారిదోపిడీ కేసుల్లో పట్టుబడ్డ 13 మందిలో ఇద్దరు ఇంజినీరింగ్, ఐదు గురు డిగ్రీ విద్యార్థులుండడం బాధాకరమని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న చోరీల నిగ్గు తెల్చడానికి ఏసీపీ రామారావు అధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తోం దని సీపీ తెలిపారు. ఓ వ్యక్తి, ఓ మహిళ, చిన్న పిల్లలతో అనుమానం రాకుండా సంచరిస్తున్నారని అనుమాని తుల కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే బ్లూకోట్స్ రంగంలోకి దిగాయని 24 గంటలు గస్తీ కొనసాగుతోందని పేర్కొన్నారు. దారిదోపిడీ ముఠాను పట్టుకున్న త్రీటౌన్, టుటౌన్ ఇన్స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, సీసీఎస్ ఎస్సైలు సాగర్, ఎల్లాగౌడ్, భాస్కర్, కానిస్టేబుళ్లను సీపీ సత్కరించారు. -
నిరంతరం నిర్బంధ తనిఖీలు
కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కరీంనగర్ క్రైం : నేరాల నియంత్రణ కోసం నిరంతరం నిర్బంధ తనిఖీలు కొనసాగిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ శివారులోని కిసాన్‌నగర్, పసుల నారాయణకాలనీల్లో గురువారం ఉద యం కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అనంతరం సీపీ కాలనీవాసులతో మాట్లాడారు. అసాంఘిక శక్తుల కదలికల నియంత్రణకు, అక్రమ కార్యకలాపాల అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్‌సెర్చ్‌లు చేపడుతున్నట్లు చెప్పారు. శివారు ప్రాంతాల్లోనే కాకుండా ఇక ముందు ప్రతి అనుమానిత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా తనిఖీలు చేపడతామన్నారు. నూతనంగా అద్దెకు వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని గ్రామ పోలీస్ అధికారులు(వీపీవో)లను ఆదేశించారు. వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటి నుంచి అనుమానితుల కదలికలు తగ్గాయని, ఇలాంటి తనిఖీలు కొనసాగించాని కాలనీవాసులు సీపీని కోరారు. సాయంత్రం వేళల్లో ముఖ్య కూడళ్ల వద్ద కొందరు ఆకతారుులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీపీ ఇప్పటి నుంచే ఈ ప్రాంతంలో ప్రత్యేక గస్తీతో పాటు షీటీం బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ట్రాక్టర్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న జంటను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో అటువైపుగా వచ్చిన దొంగ పో లీసులను చూసి తన వాహనం వదిలి పరారయ్యాడు. దొంగను పట్టుకునేందుకు రెండు బృందాలు రంగంలోకి దిగారుు. ఈ తనిఖీల్లో కరీంనగర్ ఏసీపీ రామారావు, ఇన్స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, కృష్ణగౌడ్, లక్ష్మిబాబు, ఎస్సైలు తిరుమల్, వెంకటేశ్వర్లు, నరేశ్, రవీందర్నారుుడు, నాగన్నతోపాటు మరో ఆరుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, మహిళ పోలీసులు, ఏఆర్ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ మొత్తం 200 మంది పోలీసులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్సై రాత పరీక్ష
25 కేంద్రాలు...11,879 మంది అభ్యర్థులు హాజరు కరీంనగర్ క్రైం : పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన రాత పరీక్షలు ఆదివారం ముగిశారుు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన 25 కేంద్రాల్లో 11,879 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కరీంనగర్‌లోని వాగేశ్వరీ, అపూర్వ, వాణినికేతన్, శ్రీచైతన్య , ఎస్ఆర్ఎం, కిమ్స్, వివేకానంద, ఎస్సారార్, అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కాలేజీలు, వాగేశ్వరీ, శ్రీచైతన్య, జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కాలేజీల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించలేదు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. పరీక్షలు ముగిసే వరకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేరుుంచారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సెంటర్లను సీపీ స్వయంగా పరిశీలించారు. అడిషనల్ సీపీ అన్నపూర్ణ, ఏసీపీ రామారావు, ఇన్స్పెక్టర్లు హరిప్రసాద్, సదానందం, మహేశ్, కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో 500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. -
19, 20 తేదీల్లో ఎస్సై రాత పరీక్ష
► 12,305 మంది అభ్యర్థులు ► 25 కేంద్రాలు ఏర్పాటు ► కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌క్రైం : పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ (సివిల్/ఏఆర్/టీఎస్ఎస్పీ/ఎస్పీఎఫ్/ఎస్ఏఆర్సీపీఎల్/ఎస్ఎఫ్వో) అభ్యర్థుల రాత పరీక్ష ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసుకమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్లో 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. వాగేశ్వరీ డిగ్రీ కాలేజీ, అపూర్వ, వాణినికేతన్, ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ, శ్రీచైతన్య డిగ్రీ, ఎస్ఆర్ఎం, కిమ్స్, వివేకానంద, ఎస్సారార్, అల్ఫోర్స్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలు, వాగేశ్వరీ, శ్రీచైతన్య, జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటారుుంచినట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. లాడ్జీలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఏసీబీ అన్నపూర్ణ, ఏసీపీ రామారావు, మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ కిషన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు హరిప్రసాద్, సదానందం, కృష్ణగౌడ్, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యర్థులకు సూచనలు టీఎస్ఎల్ఆర్బీ తుది నిర్ణయం మేరకు హాల్‌టికెట్లను జారీ చేశామని, డూప్లికేట్ హాల్‌టికెట్లు జారీ చేయరు. హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో, సంతకాలు స్పష్టంగా ఉండాలని, ఇందుకు హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్ ద్వారా తీసుకోవాలి.ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరుఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్‌టేబుళ్లు, పర్స్‌లు, చార్‌ట్స, విడి కాగితం లేదా రికార్డు చేసే పరికరాలు తీసుకురావద్దు. బ్లాక్ లేదా బ్లూ పారుుంట్ పెన్ను, హాల్‌టికెట్, ఏదైన ఒక ఒరిజినల ధ్రువీకరణపత్రం(పాస్‌పోర్టు,పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స) వెంట ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలి.పరీక్ష హాల్లో బయోమెట్రిక్ వివరాలు తీసుకోవడం సిబ్బంది మరిచిపోతే అభ్యర్థి అడిగి నమోదు చేసుకోవాలి. ఓఎంఆర్షీట్పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు, గుర్తింపుచిహ్నాలు రాస్తే పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థులు చేతులపై మెహందీ, సిరా రాసుకోవద్దు. -
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్
-
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్
కరీంనగర్: నగరంలోని శివారుకాలనీలలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్‌నగర్, రెడ్డి కళాశాల, అపోలో హస్పిటల్ ఏరియాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 50 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టారు. సరైన పత్రాలు లేని బైక్‌లను ఈ నెల 10 తేదిలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీపీ ఆదేశించారు. అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడానికి చేపట్టిన కార్డన్ సెర్చ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. -
ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్ధ కోసం కృషి
-
'హైదరాబాద్ తరహాలో ఆధునీకరిస్తాం'
జమ్మికుంట: హైదరాబాద్ తరహాలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తామని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం నిధుల కేటాయింపులు తక్కువగా ఉన్నందున దశలవారీగా ఆధునీకరణ పనులను చేపడతామని చెప్పారు. మంగళవారం ఆయన జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తామన్నారు. నేరాల సంఖ్య తగ్గిస్తామన్నారు. పోలీసులకు మరిన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. వ్యాపార వర్గాల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆకతాయితనంతోనే కుక్క పిల్లల సజీవ దహనం
- 8మంది మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. - మైనర్ల వయస్సు నిర్థారణ కోసం ఆసపత్రికి పంపాం. - వారు జువైనల్ కావడం వల్ల మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోతున్నాం. హైదరాబాద్‌సిటీ ఆకతాయి చేష్టలతోనే ముడు కుక్క పిల్లలను విచక్షణా రహితంగా సజీవదహనం చేశారని సెంట్రల్‌జోన్ డిసిపి వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటికే 8మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వయస్సు నిర్థారణ కోసం ఆసుపత్రిలో టెస్ట్‌లను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలికల మిస్సింగ్ వ్యవహారంపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డిసిపి వి.బి.కమాలన్‌రెడ్డి అబిడ్స్ ఏసిపి జె.రాఘవేందర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన దయారకమాన్ వద్ద ఉన్న స్మశానవాటికలో కొంతమంది మైనర్లు ప్రతి రోజు క్రికెట్ ఆడేందుకు వస్తారన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న మూడు కుక్క పిల్లలను వారు ఆకతాయితనంగా మంటల్లో వేసి కాల్చారన్నారు. ఈ ఘటనను వీడియో తీయడంతో ఎవరెవరు ఉన్నారన్నది గుర్తించామన్నారు. వీరి వయస్సు నిర్థారణ నిమిత్తం ఆసుపత్రిలో టెస్ట్‌లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎవరైనా మేజర్లు ఉంటే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు తమ విచారణలో భాగంగా 8మంది మైనర్లేనని చెప్పారు. వీరికి వీరి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ను కూడా ఇస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు మరోమారు పునరావత్తం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారు జువైనల్స్ కావడం వల్ల ఈ వ్యవహారాన్ని తాము మీడియా ఎదుట ప్రవేశపెట్టలేకపోయామన్నారు. -
రేపు, ఎల్లుండి చేప మందు పంపిణీ
హైదరాబాద్: శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి రేపటి నుంచి రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు డీసీపీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. రేపు (బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి( గురువారం) ఉదయం వరకు చేప మందు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో జనం తరలివస్తుండటంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. చేప మందు కోసం వచ్చే స్థానిక ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసులు సూచిస్తున్నారు. రద్దీ దృష్ట్యా 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసారి చేప మందు కోసం 50 నుంచి 60 వేల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు డీసీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. -
పోలీసుశాఖలో బదిలీల గోల
ఆదిలాబాద్ క్రైం : జిల్లా పోలీసు శాఖలో బదిలీలు గోల.. గోలగా మారాయి. జిల్లా ఎస్పీ పోస్టు భర్తీలో సైతం ఉత్కంఠ ఏర్పడింది. అక్టోబర్ 26న జిల్లా ఎస్పీగా సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వచ్చేందుకు ఆయన విముఖత చూపడంతో 20 రోజులు ఎస్పీ భూపాల్‌రెడ్డినే కొనసాగించారు. జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి నవంబర్ 13న తరుణ్జోషిని ఎస్పీగా ప్ర భుత్వం నియమించింది. ఇలా.. ఎస్పీ క్యాడర్ నుంచి ఎస్సై స్థాయి వరకు జిల్లాలో జరిగే పోలీసు శాఖ బదిలీలన్నీ గందరగోళంగానే కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల కంటే ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువ కావడంతో బదిలీలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అధికారి కోసం ఇద్దరు ప్రతిపాదనలు జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న పోలీసు శాఖ బది లీలు ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేపుతున్నాయి. ఒక్కో స్థానం లో ఒక పోలీసు అధికారి కోసం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపడం వివాదానికి కారణమవుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ సర్కిల్లో రెండు నియోజకవర్గాల మండలాలు ఉన్నాయి. సాధారణంగా ఒక పోలీసు సర్కిల్లో నాలుగు పోలీసుస్టేషన్ల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ సర్కిల్లో ఒక నియోజకవర్గం నుంచి రెండు పోలీసుస్టేషన్లో, మరో నియోజకవర్గం నుంచి రెండు పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇది పోలీసు శాఖ డివిజన్ల ప్రకారం వస్తాయి. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ స్టేషన్ల ఎస్సైలతోపాటు, సీఐ స్థానం స్థానాలు తాము సూచించిన వారికి అంటే తాము సూచించిన వారికంటూ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ కారణంగానే జిల్లా పోలీసు శాఖలో గత నెల రోజులుగా బదిలీలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ఎస్సైల బదిలీలతోపాటు, సీఐల బదిలీలు ఎప్పుడు జరుగుతాయా.. అని ఎదురుచూస్తున్న ఆశవాహుల్లో నిరాశ మొదలవుతుంది. ప్రజాప్రతినిధుల సమన్వయలోపంతో బదిలీలు తరచూ నిలిచిపోతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోటాపోటీగా.. జిల్లాలోని ఏడుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఉత్వర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆదిలాబాద్ ఏఎస్పీ, ఉట్నూర్, బెల్లంపెల్లి, భైంసా, కాగజ్‌నగర్, నిర్మల్ డీఎస్పీలందరనీ బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. వీరితోపాటు మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్‌ను సైబరాబాద్‌కు బదిలీ చేసినప్పటికీ ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఈ స్థానం కోసం ఓ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే పోటాపోటీగా ప్రతిపాదనలు పంపారు. మూడు రోజులపాటు ఉత్కంఠ గా నువ్వా నేనా.. అన్నట్లుగా లాబీయింగ్ చేశారు. చివరకు ఈ నెల 21న హైదరాబాద్‌లో సీబీసీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న కరుణాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఎంపీ, ఎమ్మెల్యేల వివాదం ఓ కొలిక్కి రావడంతో డీఎస్పీ పోస్టును ఖరారు చేశారు. ఇలా డీఎస్పీ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో పోటీ జరిగిందంటే పోలీసు శాఖలో ఏ స్థాయిలో ప్రజాప్రతినిధుల ముద్ర పడుతుందో తెలుస్తోంది. ఇక సీఐ, ఎస్సైల విషయంలోనూ ఇదే రకమైన వివాదం సాగుతుండడంతో ఈ బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా.. పోటీ ఉన్న ప్రాంతంలో వారిని ఒప్పించడమే తరువాయి అన్నట్లుగా ఉంది. లోపిస్తున్న పారదర్శకత.. రోజురోజుకు పోలీసుశాఖలో పారదర్శకత లోపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ శాఖలో అనిశ్చితి ఏర్పడుతోంది. ఏ పని చేసిన రాజకీయ జోక్యం పెరిగిపోవడం, ఏ అధికారి ఎప్పటి వరకు ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసు శాఖలో సీఐలు, ఎసై ్సల బదిలీలు జరగాలంటే ఐజీ, డీఐజీ, ఎస్పీల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు లేకుండా.. శాంతిభద్రతల్లో రాజీపడని.. బాగా పనిచేసే వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేసేవారు. కానీ ఇప్పుడు దీనికి విరుద్ధంగా నడుస్తోంది. పోలీసు శాఖ బదిలీలు పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలలో కొన్ని మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆయనను తిరిగి సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణ్ జోషీని సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, ఆయనను ఆదిలాబాద్ ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం తరుణ్ జోషీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ డీసీపీగా తాత్కాలికంగా కొనసాగుతున్నారు. -
'రూ. 406 కోట్ల నగదు బదిలీపై ఫిర్యాదు'
హైదరాబాద్: లేబర్ కమిషనర్ కార్యాలయంలో రూ. 406 కోట్ల నగదు బదిలీపై ఫిర్యాదు అందిందని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే విభజన చట్టం ప్రకారమే నిధులు బదిలీ చేశామని ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ మురళీసాగర్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. సంక్షేమ బోర్డు నిధులపై కస్టోడియన్ అధికారం తమకుందని వెల్లడించారు. -
నేరరహిత నగరానికి సహకరించండి
‘‘చారిత్రాత్మక హైదరాబాద్ నగరం జనాభా 80 లక్షలు పైమాటే. ఇంత మంది ప్రజలకు 12 వేల మంది పోలీసులే ఉన్నారు. ప్రతి చోటా, ప్రతి సమయంలో ప్రజలకు రక్షణగా పోలీసులు ఉండాలంటే కష్టమే. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలంటే నగర పౌరుల సహకారం ఎంతో అవసరం. మేము యూనిఫాంలో ఉన్న పోలీసులమైతే.. మీరు యూనిఫాం లేని పోలీసులు. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లేదా నేరం చేసిన వ్యక్తిని మీరే పట్టుకొని పోలీసులకు అప్పగించండి’ - మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి నాంపల్లి: నాంపల్లి చాపెల్ రోడ్డులోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో శుక్రవారం తోపుడు బండ్ల వ్యాపారులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ప్రోగ్రామ్ ఆన్ సేప్టీ అండ్ సెక్యూరిటీ మే జర్స్ టు ది హాకర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాలను అరికట్టడం ఎలా అనే అంశంపై లఘు చిత్రాలను ప్రదర్శించి వ్యాపారులను, సెక్యూరిటీ సిబ్బం దిని జాగృతం చేశారు. కార్యక్రమంలో డీసీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడు. అడిషనల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ అడిషన్ డీసీపీ వరప్రసాదరావు, ఏసీపీలు అమరకాంత్‌రెడ్డి, మహ్మద్ ఇస్మాయిల్, జైపాల్, ఇన్స్పెక్టర్లు మధు మోహన్‌రెడ్డి, అశోక్, జగ్గారెడ్డి తదితరులు ఆగస్టు 15న పోలీసు శాఖకు కొత్త వాహనాలు... హైదరాబాద్‌లోని పోలీసుస్టేషన్లు న్యూయార్క్, లండన్ తరహాలో పనిచేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రూ. 300 కోట్లు వెచ్చించి, 2 వేల కొత్త వాహనాలు,3 వేల ద్విచక్రవాహనాలను కొనుగోలు చేశారని డీసీపీ కమలాసన్‌రెడ్డి చెప్పారు. ఇవి ఈనెల 15న పోలీసుస్టేషన్లకు చేరుతాయన్నారు. హై దరాబాద్ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేం దుకు కమిషనర్ మహేందర్‌రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపడతున్నారన్నారు. పేలుళ్లు పునరావృతమైతే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది... తీవ్రవాదులు పేలుళ్లు జరిపేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారని డీసీపీ అన్నారు. గతంలో మక్కామసీదు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్, దిల్సుఖ్నగర్లలో పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు పోలీసులా వ్యవహరించి పేలుళ్లు జరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరించాలి. వ్యాపార సముదాయాలు, థియేటర్లు తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, ఎవ్వరూ నేరం చేయాలంటేనే బయపడే విధంగా అమెరికా, ఇంగ్లాండ్ తరహాలో నగరంలో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. చిరువ్యాపారులకు ఎస్ఎంఎస్ అలర్ట్ సౌక ర్యం... తోపుడు బండ్ల వ్యాపారులు, సెక్యూరిటీగార్డుల ఫోన్ నంబర్లను సేకరించాం. ఈ ఫోన్ నంబర్లను సాఫ్ట్వేర్ ద్వారా భద్రపరిచాం. వీరితో ఎలాంటి అభిప్రాయాలు పంచుకోవాలన్నా ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్ చేస్తాం. తోపుడు బండ్లు, సెక్యూరిటీగార్డుల భాగస్వామ్యంతో నేరాలను అరికట్టవచ్చును. ఈ విధానం మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. తీవ్రవాదుల ఊహా చిత్రాల విడుదల ... పేలుళ్లతో సంబంధం ఉన్న తీవ్ర వాదుల ఊహాచిత్రాలను పోలీసులు తోపుడు బండ్ల వ్యాపారులు, సెక్యూరిటీ గార్డులకు అందజేశారు. వీరి వివరాలు చెప్తే రూ. 25 లక్షల రివార్డు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. వీరిలో తీవ్రవాదులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, యాసీన్ భత్కల్, అక్తర్, వాఖాస్ , అసదుల్లా అక్తర్, మోహిసీన్ చౌదరి, తౌఖీర్, అరీజ్ ఖాన్, డాక్టర్ షానావాజ్, మహ్మద్ ఖాలిద్, సాజిద్ ఖురేసీ అలియాస్ బడా సాజిద్, మిర్జా సాదబ్ బేగ్, ముద్దాసిర్ యాసిన్, అలమ్బేజ్ అఫ్రిది, అహ్మద్ మొయిన్, మౌలానా సుల్తాన్ తదితరులు ఉన్నారు. వివరాలను తెలియజేయాల్సిన ఫోన్ నంబర్లు హైదరాబాద్ కంట్రోల్ రూం 100 లేదా 9490618941, సైబరాబాద్ కంట్రోల్ రూమ్ 100 లేదా 9440700975, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మలక్‌పేట్ పీఎస్ 040-24152069 లేదా 9490616387, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సరూర్‌నగర్ పీఎస్ 040-27853903 లేదా 9490617170లలో సంప్రదించవచ్చు. -
మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడు
హైదరాబాద్ : అసెంబ్లీ ద్వారాన్ని పగులగొట్టిన ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి బుధవారం ఘటనాస్థలాన్ని సందర్శించి అసెంబ్లీ సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు వరంగల్ జిల్లాకు చెందిన అశోక్‌రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు అతడు మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడని చెప్పారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 6 వద్ద తలుపులను పగలగొట్టాడని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ద్వారాన్ని బయట వ్యక్తులు బద్దలు కొట్టడం అసెంబ్లీకి భద్రత లేదనటానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీ బ్లాక్‌లో అగ్నిప్రమాదంపై విచారణ
హైదరాబాద్ : సచివాలయం సీ బ్లాక్‌లో అగ్నిప్రమాదంపై విచారణ ప్రారంభం అయ్యింది. డీసీపీ కమలాసన్ రెడ్డి విచారణ జరుపుతున్నారు. సాధారణ పరిపాలనాశాఖ ఉన్నతాధికారులు సోమవారం విచారణకు హాజరయ్యారు. కాగా ముఖ్యమైన ఫైళ్లు దగ్ధం కాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్థారణ అయ్యింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్సీడీ (ఐపీఎస్ అధికారుల సర్వీసు రికార్డులు, నక్సల్‌కు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని ఇందులో భద్రపరుస్తారు) విభాగం నుంచి పొగలు రావటం గమనించిన సిబ్బంది వెంటనే ఫైరింజన్ సాయంతో మంటల్ని ఆర్పివేశారు. ప్రమాదంలో ఎస్సీడీ విభాగానికి చెందిన ఒక రూం కాలిపోయింది. మరోవైపు ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. -
'సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటాం'
హైదరాబాద్ : తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. కనీస వేతనం పదివేలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు ఇందిరా పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరారు. కాగా అంగన్వాడీలు తలపెట్టిన సభకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి అంగన్వాడీ కార్యకర్తలు సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలకు తాము భయపడేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్ఫష్టం చేశారు. సభ నిర్వహించి తీరుతామని వారు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఏం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది. -
బాకీ డబ్బులివ్వలేదని దారుణం
= మారుణాయుధాలతో దాడి = అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం = అబిడ్స్‌లో ఘటన అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: అప్పుగా తీసుకున్న డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా అప్పు ఇచ్చిన వ్యక్తిని హతమార్చాలని చూస్తున్న మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మారణాయుధాలతో దాడి చేసి సదరు వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. ఈఘటనలో పోలీసులు నిందితులను 24 గంటల్లోపు అరెస్ట్‌చేసి కటకటాల్లోకి తరలించారు. ఈ దారుణం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఏసీపీ జైపాల్, సీఐ గురురాఘవేంద్రలతో కలిసి మీడియాకు వివరించారు. ఎంజేమార్కెట్ శంకర్బాగ్కు చెందిన ఉదయ్‌ఆనంద్(32)కు నేరచరిత్ర ఉంది. 15 ఏళ్లక్రితం అబిడ్స్ రామకృష్ణ థియేటర్లో సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయించేవాడు. తర్వాత పండ్లవ్యాపారం చేసి కాస్త డబ్బుకూడ బెట్టి ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించాడు. ఇలా స్థానికంగా ఉంటున్న తోపుడుబండ్లు, ఇతర వ్యాపారులకు 5శాతం వడ్డీకి డబ్బులిచ్చేవాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రమేష్‌రాజు (45) నగరానికి వలసొచ్చి ఎస్సార్‌నగర్ కళ్యాణ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. బ్లాక్టికెట్లు విక్రయించిన రమేష్రాజుకు అప్పట్లోనే ఉదయ్ఆనంద్తో పరిచయమైంది. అయితే రమేష్‌రాజు తన అవసరం నిమిత్తం ఉదయ్‌ఆనంద్ వద్ద రూ.6లక్షలు 5శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న దానికి ప్రతినెలా రూ.30వేలు వడ్డీ చెల్లించేందుకు బాండ్‌పేపర్‌పై లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత బాండ్‌పేపర్ కనిపించకపోవడంతో ఉదయ్‌ఆనంద్ మరో బాండ్‌పేపర్ రాయాలని రమేష్‌రాజును అడిగాడు. ఇక అప్పటినుంచి వడ్డీ డబ్బులు కట్టడం మానేశాడు. ఇది ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు చంపుకునే యత్నం: ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతుండడంతో ఒకరినొకరు చంపుకునేందుకు పథకం పన్నారు. రమేష్‌రాజు తనను చంపేందుకు యత్నిస్తున్నాడని ఇతరుల ద్వారా తెలుసుకున్న ఉదయ్‌ఆనంద్ తనపై దాడికి రాకముందే రమేష్‌రాజును మట్టుబెట్టాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా పాతనేరస్తుడైన సయ్యద్‌సలీం, గౌలిగూడకు చెందిన డి.విజయ్, బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్అహ్మద్లను సంప్రదించాడు. మంగళవారం సాయంత్రం అప్పు కావాలని వచ్చిన రమేష్‌రాజును ప్లాన్ప్రకారం బిగ్‌బజార్ సమీపంలోని ఫైనాన్స్ కార్యాలయానికి రమ్మన్నాడు. అక్కడ్నుంచి టీ తాగుదామని హోటల్‌కు తీసుకెళ్లిన ఉదయ్‌ఆనంద్ అప్పటికే మాటువేసిన తన అనుచరుల సాయంతో కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. సమాచారమందుకున్న అబిడ్స్ పోలీసులు రక్తపుమడుగులో పడివున్న రమేష్‌రాజును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న అబిడ్స్ పోలీసులకు మృతుని వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు డాగర్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. 24గంటల్లో నిందితులను అరెస్ట్‌చేసిన ఏసీపీ జైపాల్, సీఐ గురురాఘవేంద్ర, ఎస్ఐలు శ్రవణ్‌కుమార్, నాయుడు ఇతర సిబ్బందికి త్వరలో రివార్డులను అందించనున్నట్లు డీసీపీ వెల్లడించారు.