సాక్షి, కరీంనగర్: కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆగిన గుండెకు పోలీస్ కానిస్టేబుల్ ఊపిరి పోశారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీ అతన్ని కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే పడిపోయి అపస్మారక స్థితికి చేరాడు. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండి పోయారు. కానీ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు.
అలా మూడు,నాలుగు నిమిషాలు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పట్ల సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు పలువురు అభినందించారు. సిపి కమలాసన్ రెడ్డి మాటలును ప్రేరణగా తీసుకుని, ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలతో సకాలంలో స్పందించి యువకుడు ప్రాణాలు కాపాడానని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఖలీల్ గొప్ప పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి హార్ట్ బీట్ ఆగిపోయింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్సలో భాగంగా గుండె పైన నిమిషం పాటు పంపింగ్ చేయండంతో యువకుడికి మొదలయిన హార్ట్ బీట్, వెంటనే అతనిని హాసుపత్రికి తరలించడమైనది. pic.twitter.com/zZEYMVHal1
— Telangana State Police (@TelanganaCOPs) June 23, 2021
Comments
Please login to add a commentAdd a comment