bike accidant
-
ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఖమ్మం, సాక్షి: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా బొడ్రాస్ కుంట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో కారేపల్లి మండలం గుట్ట కింద గుంపుకు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.చదవండి: మతపరమైన ర్యాలీల్లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం: సీవీ ఆనంద్ -
రక్షణ చత్రమంటున్నా.. రెక్లెస్!
2024 ఫిబ్రవరి 6: షేక్‌పేట గుల్షన్ కాలనీకి చెందిన వ్యాపారి మొహమ్మద్ అర్షద్ (22) ఈ ఏడాది ఫిబ్రవరి 6న యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్నాడు. టోలీచౌకీలోని షేక్‌పేట్ నాలా నుంచి సెవెన్ టూంబ్స్ మెయిన్ రోడ్డు వరకు ఉన్న çశ్మశానానికి సరిహద్దు గోడ ఉంది. అక్కడ అర్షద్ వాహనం అదుపుతప్పి ఆ గోడను బలంగా ఢీ కొంది. ఆ సమయంలో అతడి తలకు హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.2024 మే 26: మాసబ్‌ట్యాంక్‌లోని ఎంజీ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (45) ప్రైవేట్ ఉద్యోగి. మే 26 తెల్లవారుజామున తన కుమారుడితో (15) కలిసి ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు బయలుదేరారు. మైనర్ వాహనాన్ని డ్రైవ్ చేస్తుండగా అలీ వెనుక కూర్చున్నారు. కాగా హుమయూన్‌నగర్ ఠాణా సమీపంలో ఆ బాలుడు వాహనాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. దీంతో వెనుక కూర్చున్న అలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మూడు రోజులకు కన్ను మూశారు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే గాయాల తీవ్రత తగ్గేదని, ప్రాణం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేస్తున్న ప్రమాదాలు, హెల్మెట్ ధారణ విషయంలో ఏపీ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల జారీ చేసిన కీలక ఉత్తర్వులు.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం ఎంత తప్పనిసరో తేల్చి చెబుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ప్రమాదాలు నమోదవుతున్నాయి.2023లో మొత్తం 2,548 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇందులో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే దాదాపు సగం (1,263) ఉన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మరణిస్తే, ఇందులో టూ వీలర్లకు సంబంధించిన మరణాలు దాదాపు 40 శాతం వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ టూ వీలర్ వాహనాలు నడిపేవారిలో ఇంకా అనేకమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ ధరించినా ఎక్కువమంది స్ట్రాప్ పెట్టుకోవడం లేదు.కొందరు అలంకారంగా బండి మీద పెట్టుకునో, తగిలించుకునో వెళ్తున్నారు. కొందరు పోలీసుల్ని చూసి హెల్మెట్ పెట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలూ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి పిలియన్ రైడర్ (ద్విచక్ర వాహనం వెనుక కూర్చునేవారు) సైతం విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తున్నా దాన్ని పట్టించుకునేవారే లేరు.అడపాదడపా పోలీసుల స్పెషల్ డ్రైవ్లుహెల్మెట్ ధారణను హైదరాబాద్‌లో 2012 లోనే తప్పనిసరి చేశారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వాహనచోదకుల అవగాహన రాహిత్యం/నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా కన్పిస్తోంది. నగర వ్యాప్తంగా దాదాపు 70 శాతం, పాతబస్తీ సహా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే హెల్మెట్ వినియోగంలో ఉంది. వాస్తవానికి మోటారు వాహనాల చట్టం పుట్టిన నాటి నుంచే ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ విషయాన్ని నగర పోలీసులు పట్టించుకోలేదు.తేజ్ దీప్ కౌర్ మీనన్ హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుండగా 2005లో తొలిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ట్రాఫిక్ చీఫ్‌గా వచ్చిన అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్) సైతం హెల్మెట్ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నిబంధనను అమలు చేయడానికి ముందు వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అప్పట్లో మొదటి పేజీ తరువాయి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆపై స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాహనచోదకుల్లో నిర్లక్ష్యంనగరంలోని ద్విచక్ర వాహనచోదకులందరితో హెల్మెట్ పెట్టించాలని ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాలకు చెందినవారు దీనికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్ హెల్మెట్లు, హెల్మెట్ ధరించినా స్ట్రాప్ బిగించుకోకపోవడం, హెల్మెట్ వెంటే ఉన్నప్పటికీ కేవలం జంక్షన్లు, పోలీసులు సమీపిస్తున్నప్పుడే తలకు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.నగరానికి చెందిన అనేకమంది వాహనచోదకులు తాము నివసిస్తున్న ప్రాంతం దాటి బయటకు వస్తేనే హెల్మెట్ ధరిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవనే భావన వీరికి ఉండకపోవడమే దీనికి కారణం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం, ఆపై మిన్నకుండి పోవడంతో 100 శాతం హెల్మెట్ ధారణ సాకారం కావట్లేదు. నగరంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టిహైదరాబాద్లో వాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయడమెట్లా అనే విషయంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దృష్టి పెట్టింది. ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం, వీటిలో తలకు దెబ్బతగలడం కారణంగా మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.ఆ ఏడాది హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డబ్ల్యూహెచ్ఓలోని రోడ్ సేఫ్టీ అండ్ ఇన్జ్యూరీ ప్రివెన్షన్ విభాగం టెక్నికల్ ఆఫీసర్ స్వేర్కర్ అల్మ్క్విస్ట్.. హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన అమల్లో తమ సహకారంపై నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకం 30 శాతమే ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.హెల్మెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలుతలకు రక్షణ: శిరస్త్రాణాలు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. తల అంతర్గత, బహిర్గత గాయాల తీవ్రత, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది.మెదడు రక్షణ: హెల్మెట్ అనేది ప్రమాద సమయంలో తలకు కుషన్‌లా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు (ట్రుమాటిక్ బ్రెయిన్ ఇన్జ్యూరీస్) కాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.ఫేస్ ప్రొటెక్షన్: చాలా హెల్మెట్లు ఫేస్‌షీల్డ్ లేదా విజర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదాల సమయంలో, అలాగే ప్రతికూల వాతావరణంలో ముఖాన్ని రక్షిస్తాయి.కంటి రక్షణ: విజర్ లేదా గాగుల్స్‌తో కూడిన హెల్మెట్లు గాలి, దుమ్ము, సూక్ష్మస్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తాయి.ధ్వని తీవ్రత తగ్గింపు: కొన్ని హెల్మెట్లు చెవి రక్షణ బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. హెల్మెట్ పెట్టుకుంటే శబ్ద కాలుష్యం తక్కువగాఉంటుంది. ప్రమాద సమయంలో వినికిడి దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.మార్పు కోసం కృషి చేస్తున్నాంగతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో పరిస్థితి బాగా మెరుగైందనే చెప్పాలి. జంక్షన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌తో పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ కొందరు.. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్ పెట్టడం, హెల్మెట్ పెట్టుకున్నా దాని స్ట్రాప్ బిగించుకోకపోవడం వంటివి చేస్తున్నారు. వీరి విషయంలోనూ మార్పు కోసం కృషి చేస్తున్నాం. - పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం
ఆలేరురూరల్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆలేరు మండలంలోని గొలనుకొండ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన సీసా మహేష్(35) సోమవారం సంక్రాంతి పండుగకు బైక్‌పై ఆలేరు మండలంలోని గొలనుకొండలో గల తన అత్తగారింటికి వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం పెద్దకందుకూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గొలనుకొండ సమీపంలోని కుమ్మరికుంట వద్దకు చేరుకోగానే జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన ఎల్లల నరేష్ పల్సర్ బైక్‌పై అమ్మనబోలు నుంచి వస్తూ మహేష్ బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేష్ రోడ్డుపై పడిపోగా తల పగిలి అక్కడిక్కడే మృతిచెందా డు. నరేష్‌కు తీవ్ర గాయాలు కాగా హై దరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు పల్లిలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి. వెంకటశ్రీను తెలిపారు. -
పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. విషాద ఘటన!
మహబూబ్‌నగర్: రైలు పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. అకస్మాతుగా రైలు రావడంతో బైక్ పూర్తిగా ధ్వంసమై దంపతులు ప్రాణాలతో బయటపడిన సంఘటన బుధవారం డోకూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరూర్‌కి చెందిన అశోక్ తన భార్యకు వైద్యం నిమిత్తం డోకూర్‌కు వచ్చాడు. గ్రామంలో ఉన్న రైల్వే గేట్ వద్ద వారం రోజుల కిందట రైల్వే అధికారులు అండర్‌పాస్ నిర్మాణం చేపట్టి ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియకపోవడంతో గతంలో ఉన్న మార్గంలో వచ్చిన అశోక్ తన ద్విచక్రవాహనాన్ని (అండర్‌పాస్ నిర్మాణం పక్క నుంచి) పట్టాల పైనుంచి దాటిస్తున్న క్రమంలో అకస్మాతుగా రైలు వచ్చింది. దీంతో పట్టాలపై బైక్‌ను వదిలేసి పక్కకు తప్పుకొన్నాడు. ఈ సంఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా.. దంపతులు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ రైలు ముందు భాగంలో చిక్కుకపోవడంతో లోకోపైలెట్ రైలును నిలిపివేశాడు. స్థానిక సిబ్బంది సాయంతో రైలు కింద చిక్కుకున్న బైక్‌ను తొలగించిన అనంతరం రైలు ముందుకు కదిలింది. ఈ సంఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇవి చదవండి: వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని.. -
అతివేగంలో రెండు బైక్‌లు ఢీ! యువకుడు..
మంచిర్యాల: మండలంలోని పోలంపల్లి సమీపంలో మంచిర్యాల–చెన్నూరు జాతీయ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజవర్ధన్ కథనం ప్రకారం.. వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన కంపెల ప్రశాంత్ (24) మంచిర్యాలకు స్కూటీపై వస్తున్నాడు. మంచిర్యాల నుంచి కొట్టవాడ మహేశ్ బైక్‌పై తన స్వగ్రామమైన మహారాష్ట్రలోని సిరొంచకు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అక్కడిక్కడే మృతిచెందగా మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహేశ్‌ను అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
నిర్లక్ష్యంగా బైక్ నడిపిన వారికి ఇదే శిక్ష..!
భూదాన్‌పోచంపల్లి: బైక్‌ను అజాగ్రత్తగా నడిపి ఎదురుగా వస్తున్న వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి 6నెలల జైలు శిక్షతో పాటు రూ.8వేలు జరిమానా విధిస్తూ చౌటుప్పల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోయలకొండ మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన దేవర అంజనేయులు పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అంజనేయులు 2014 అక్టోబర్ 23న తన బైక్‌పై వేగంగా వెళ్తూ ఇబ్రహీంనగర్ గ్రామ శివారులో ఎదురుగా బైక్‌పై వస్తున్న రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన గుంజె కృష్ణ, అతడి భార్య లక్ష్మిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ ఆర్. జగన్మోహన్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ పీవీ అవినాష్ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న చౌటుప్పల్ జ్యుడిషియన్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ టి. మహతి వైష్టవి విచారణ జరిపి నేరం రుజువైనందున నిందితుడు అంజనేయులుకు 6నెలల జైలు శిక్ష, రూ.8వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్ష పడేలా కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు కానిస్టేబుల్ ముత్తయ్య, సమన్స్ అందించిన శివకుమార్‌ను ఎస్ఐ విక్రమ్‌రెడ్డి అభినందించారు. -
సీఎం సభకు వెళ్లి వస్తుండగా.. రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి..!
హాలియా: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దబావితండాకు చెందిన రమావత్ బాలు(26) మంగళవారం హాలియా పట్టణంలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యాడు. సభ ముగిసిన తర్వాత బైక్‌పై తిరిగి వెళ్తుండగా.. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమావత్ బాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ శోభన్‌బాబు తెలిపారు. మృతదేహంతో రాస్తారోకో పెద్దవూర: రమావత్ బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతుడి కుటుంబ సభ్యులు, తండావాసులు, బంధువులు వాహనాన్ని పెద్దవూర మండల పరిధిలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వాహనం నుంచి మృతదేహాన్ని కిందికి దించి రోడ్డుపై అరగంటకు పైగా రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా సుద్దబావితండాకు చెందిన రమావత్ బీమా, చంద్రకళ దంపతులకు ముగ్గురు సంతానం. రమావత్ బాలు పెద్ద కుమారుడు. మృతుడి తండ్రి మానసిక రోగి. బాలు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేయడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ సీఐ బీషన్న ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. -
మన స్నేహం మరణంలో కూడ.. మిత్రమా..!
మహబూబ్‌నగర్: కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి మృత్యుఒడికి చేరారు. స్కూటీని కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లా గుడిగండ్లలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన ఉదయ్‌కుమార్(28) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అంబర్‌పేటకు చెందిన అఖిల్ (26)తో పరిచయం ఏర్పడింది. అఖిల్ ఐటీఐ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి ఉదయ్‌కుమార్, అఖిల్ ఇద్దరు కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా స్కూటీపై హైదరాబాద్ నుంచి బయలుదేరి మక్తల్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గుడిగండ్ల దగ్గర రాయచూర్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న కర్ణాటక బస్సు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో అఖిల్‌ను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం సమాచారం అందుకున్న ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అఖిల్ తల్లి ఉమ, ఉదయ్‌కుమార్ తండ్రి మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బైక్ పై వెళ్తు ఆగి ఉన్న లారీని ఢీకొన్న యువకుడు..
కామారెడ్డి: ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి శివారులో విశ్వ ఆగ్రోటెక్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రయాన్‌పల్లికి చెందిన అనిల్(33) మృతి చెందినట్లు డిచ్పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. వివరాలు.. అనిల్ బుధవారం సాయంత్రం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాదు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నవనీత ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు ఢీకొని ఒకరు.. కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ బైపాస్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిపినగండ్ల గ్రామానికి చెందిన దూదెకుల బాబు (55) సెంట్రింగ్ పనుల నిమిత్తం కామారెడ్డికి వచ్చాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో టేక్రియాల్ సమీపంలో నడుచుకుంటు వెళ్తుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి అతడిని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతుడి తమ్ముని కుమారుడు సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
ఫ్లై ఓవర్ పై.. అదుపుతప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: మితి మీరిన వేగంతో ఫ్లై ఓవర్ రెయిలింగ్‌ను ఢీ కొట్టి కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, కల్వాల గ్రామానికి చెందిన విగ్నేష్(24) శ్రీరాంనగర్‌లో ఉంటూ డ్రైవింగ్ యాప్‌లో రైడర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితుడు మనీష్‌కు తెలియకుండా అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని బయటికి వచ్చాడు. కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి కుడివైపు రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోగా విగ్నేష్ ఎగిరి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విగ్నేష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలో చదువుకుంటున్న కూతురును చూసేందుకు వెళ్తున్న తల్లిదండ్రు లతో పాటు వారి మరో కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్‌కుమార్ తెలిపిన మేరకు.. ఫరూఖ్‌నగర్ మండలం కడి యాలకుంట తండాకు చెందిన గోపాల్ (47), అంజలి (42) దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మూడో కూతురు మధులత నగరంలోని చంపాపేట్‌లోని సంక్షేమ హాస్టల్లో చదువుకుంటోంది. ఆమెను చూసేందుకు గోపాల్, అంజలి తమ చిన్న కూతురు స్వాతి (9)తో కలిసి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్ సమీపంలోకి రాగానే డీసీఎం వాహనం ఓ కారును ఢీకొంది. అదుపు తప్పి ముందు వెళ్తున్న వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి దంపతులు సహా కుమార్తె ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం వాహనం అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దారుణం: దొంగతనం చేశాడని.. చెట్టుకు కట్టేసి మర్మాంగాల మీద తన్నారు) -
రోడ్డుపై గుంత ఎంతపని చేసింది.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు!
ముంబై: రోడ్లపై పడిన గుంతలను సకాలంలో పూడ్చకుండా అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గుంత కారణంగా బైక్ అదుపుతప్పి లారీ టైర్ కింద పడి నుజ్జునుజ్జయ్యాడు ఓ యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడిని గణేష్ ఫాలే(22)గా గుర్తించినట్లు థానే మున్సిపల్ కర్పోరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. అదుపుతప్పి లారీ టైర్ల కింద పడిపోయిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దివా-అగసాన్ రోడ్డులో యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ట్యాంకర్ లారీ వస్తోంది. దీంతో పక్కనుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ మార్గంలో గుంత ఉంది. బైక్ వెనుక చక్రం అందులోకి వెళ్లగానే అదుపుతప్పింది. దీంతో లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు బాధితుడు. లారీ డ్రైవర్ చూసుకోకపోవటం వల్ల అతడిపై నుంచి వెళ్లింది. ఎదురుగా వస్తున్న కొందరు వెంటనే స్పందించి లారీ ఆపాలని సూచించారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. బాధితుడిని వెంటనే కల్వా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారిన క్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎమ్మెల్యే రాజు పాటిల్ ట్వీట్ చేశారు. రోడ్డుపై గుంతల కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులపై విమర్శలు చేశారు. ఏక్నాథ్ షిండేకు ట్యాగ్ చేస్తూ రోడ్డు పనులు కేవలం పేపర్‌పైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. दिवा ठाण्यात, आणि ठाण्याचेच मुख्यमंत्री…..दिव्यात आज पुन्हा एकदा खड्ड्यामुळे बळी गेला. कामांच्या फक्त कागदावर घोषणा होत आहेत पण कामं होत नाहीत. @TMCaTweetAway अजून किती बळी घेणार ? @mieknathshinde @CMOMaharashtra pic.twitter.com/vKo3K8bBWa — Raju Patil ( प्रमोद (राजू) रतन पाटील ) (@rajupatilmanase) August 28, 2022 ఇదీ చదవండి: వాహనదారులకు అలర్ట్: ఆ హైవేపై భారీ వాహనాలకు నిషేధం -
పెళ్లై ఏడు నెలలే ... తల్లిదండ్రులను చూడటానికని వెళ్లి ....
బనశంకరి: కొయ్యదిమ్మెలు తరలిస్తున్న లారీ బోల్తా పడటంతో నవ వరుడు మృతి చెందిన ఘటన కామాక్షిపాళ్య పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన ముకేశ్ (28) బెంగళూరు నందినీ లేఔట్లో నివాసం ఉంటున్నారు. ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. తిరువణ్ణామలైలో ఉంటున్న తల్లిదండ్రులను చూడటానికి వెళ్లిన ముకేశ్ అక్కడి నుంచి బస్సులో శుక్రవారం బెంగళూరు శాటిలైట్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఇంటికి వెళ్లడానికి స్నేహితుడు డేవిడ్ బైక్ తీసుకువచ్చాడు. వెనుక సీట్లో ముకేశ్ కూర్చున్నాడు. నాగరబావి నమ్మూరదిణ్ణె సమీపంలో వస్తుండగా వీరి పక్కనే వస్తున్న కొయ్యదిమ్మెల లారీ బోల్తా పడింది. రెండు కొయ్య దిమ్మెలు బైక్‌పై పడటంతో ముఖేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్‌తో పాటు పక్కనే మరో బైక్‌పై వెళ్తున్న శివు అనే యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ముకేశ్ భార్య ఐదు నెలల గర్భిణి. భర్త మరణవార్త విన్న ఆమె కన్నీరు మున్నీరైంది. (చదవండి: బాధ్యతలు తీసుకున్న తొలిరోజే షాకైన ప్రిన్సిపల్.. ఆమె కుర్చీ కింద..) -
సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్
Sai Dharam Tej Accident Video: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. (చదవండి: వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స) ప్రస్తుతం సాయిధర్మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియో మీ కోసం.. -
బాలానగర్ వంతెనపై దారుణం
-
నేల బావి ప్రమాదం.. ముగ్గురు మైనర్ల మృతి
సాక్షి, తూర్పుగోదావరి: నిన్న బైక్ అదుపు తప్పి పాడు పడిన నేలబావిలో పడి గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను మంగవారం వెలికితీశారు. తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, దోసకాయలపల్లిలో జరిగిన ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, దోసకాయలపల్లికి చెందిన లలిత పద్మాకుమారి కొడుకు గుమ్మడి సనీల్ (17), తుమ్మలపల్లి నుంచి సెలవులకు వచ్చిన తన చిన్నమ్మ కస్తూరి అచ్చుతరాణి కుమారుడు కస్తూరి అభిరామ్ (7)తో కలిసి బైక్‌పై గుమ్ములూరులో ఉంటున్న మరో చిన్నమ్మ చిన్నం పాప ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి వారి పిల్లలు చిన్నం వీర్రాజు (17), చిన్నం శిరీష (13)తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఒకే బైక్‌పై నలుగురు దోసకాయలపల్లికి బయలు దేరారు. అయితే ఈ మార్గంలోని పుంత రోడ్డు మలుపులో బైకును తిప్పే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పాడుపడిన నేలబావిలో పడిపోయారు. ఇదే సమయంలో బైక్‌పై చివరన కూర్చున్న అభిరామ్ దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడిచ్చిన సమాచారం మేరకు.. వెంటనే గజఈతగాళ్లను రప్పించారు. డీఎస్పీ నార్త్ జోన్ కడలి వెంకటేశ్వర్రావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, సిబ్బందితోపాటు రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. చదవండి: పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు -
శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్
సాక్షి, కరీంనగర్: కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆగిన గుండెకు పోలీస్ కానిస్టేబుల్ ఊపిరి పోశారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండి అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీ అతన్ని కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే పడిపోయి అపస్మారక స్థితికి చేరాడు. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండి పోయారు. కానీ అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అపస్మారక స్థితికి కు చేరుకున్న యువకుడు ఛాతిపై ప్రెసింగ్ చేశాడు. అలా మూడు,నాలుగు నిమిషాలు చేయడంతో యువకుడిలో చలనం వచ్చింది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తి పట్ల సీపీ కమలాసన్ రెడ్డి తో పాటు పలువురు అభినందించారు. సిపి కమలాసన్ రెడ్డి మాటలును ప్రేరణగా తీసుకుని, ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలతో సకాలంలో స్పందించి యువకుడు ప్రాణాలు కాపాడానని కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ తెలిపారు. ఖలీల్ గొప్ప పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి హార్ట్ బీట్ ఆగిపోయింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్సలో భాగంగా గుండె పైన నిమిషం పాటు పంపింగ్ చేయండంతో యువకుడికి మొదలయిన హార్ట్ బీట్, వెంటనే అతనిని హాసుపత్రికి తరలించడమైనది. pic.twitter.com/zZEYMVHal1 — Telangana State Police (@TelanganaCOPs) June 23, 2021 చదవండి:జీవిత సమస్య: పోరుబాట వదలడమా? ప్రాణాలు పోవడమా? -
బైక్‌తో బీటెక్ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని
హైదరాబాద్: మియాపూర్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌తో బీభత్సం సృష్టించాడు. అతి వేగంతో 8 నెలల గర్భిణి అయిన భానోత్ అచ్చిబాయిని బైక్‌తో డీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అచ్చిబాయికి ప్రమాదం తప్పినా.. గర్భం శోకం తప్పలేదు. ఆమెకు అబార్షణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే విద్యార్థి బైక్ నడిపినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి:అమెరికాలో మియాపూర్ వాసి మృతి -
మరణంలోనూ వీడని స్నేహబంధం
కడెం(ఖానాపూర్): వారిద్దరూ ప్రాణ స్నేహితులు. అతిగా మద్యం సేవించి, మితిమీరిన వేగంతో ప్రయాణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కడెం మండలంలో చోటు చేసుకుంది. మాసాయిపేట్ గ్రామానికి చెందిన పంజాల తరుణ్, దుర్గం గంగాధర్ అనే యువకులు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట్ గ్రామానికి చెందిన లక్ష్మి–లక్ష్మీనర్సయ్య దంపతులకు ఇద్దరు సంతానం. అలాగే లక్ష్మి–లింగన్న దంపతులకు ముగ్గురు సంతానం. లింగన్న అనారోగ్యంతో మృతి చెందగా, కూతురు అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. పెద్ద కొడుకు ఉపాధి నిమిత్తం ముంబాయిలో ఉంటున్నాడు. చిన్న కొడుకు గంగాధర్ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తరుణ్ నిర్మల్‌లోని జీఎస్ఆర్ కళాశాలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయగా, గంగాధర్ ఖానాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. వీరిద్దరివి నిరుపేద కుటుంబాలు. కరోనా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్న వీరు గ్రామంలో చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు, వాదోడుగా మెలుగుతున్నారు. సోమవారం గ్రామంలో కూలీ పనికి వెళ్లిన వీరిద్దరూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి బైక్‌పై నచ్చన్ఎల్లాపూర్ నుంచి మాసాయిపేట్ వస్తూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీకి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 11 తర్వాత ప్రమాదం జరగడంతో అర్ధరాత్రి స్థానికులు గమనించిగా ఇద్దరు యువకులు మృతిచెంది రక్తపు మడుగులో పడి ఉన్నారు. మద్యం మత్తు, అతి వేగంతో ఢీకొట్టడంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయి, ఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందరితో కలివిడిగా ఉండే యువకులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని మంగళవారం ఖానాపూర్ సీఐ జయరాం, ఇన్చార్జి ఎస్సై ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విధి రాత.. మృత్యువాత
ఘట్కేసర్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన శంకర్, భార్య లహరి దంపతులు స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరారు. మండలంలోని అవుషాపూర్ సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న లహరి (30) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను మేడిపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మలుపే ఆయువు తీసిందా?
మలుపులే ప్రమాదానికి పిలుపు అంటూ రోడ్డు రవాణా శాఖ సందేశాలకే పరిమితమవుతోంది. ఫలితంగా ఎంతోమంది మృత్యువాతతోపాటు క్షతగాత్రులవుతున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా మలుపే మృత్యువుగా మారి ఒక యువకుడిని అనంతలోకాలకు తీసుకుపోగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా మార్చేసింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాశీబుగ్గ: పలాస మండలం తర్లాకోట çపంచాయతీ పరిధిలో తీవ్ర భయంకరమైన మలుపు కలిగిన చెరువు వద్ద రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి మోటారుబైక్ అదుపు తప్పి బోల్తాపడగా కుమ్మరి గోపాల్ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుకనే కూర్చున్న కుమ్మరి ఉమాశంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెంటికోట గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిద్దరిదీ పలాస–కాశీ»బుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడుకు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో సకాలంలో చికిత్సకు తరలించే దిక్కు లేకపోయింది. చివరకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే గోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ యువకుడు పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తికాగా, ద్వితీయ సంవత్సరం చదవాల్సి ఉంది. తల్లి బుద్ధి జీడిపరిశ్రమలో పనిచేస్తుండగా, తండ్రి మోహనరావు మేస్త్రీగా పని చేస్తున్నాడు. సోదరుడు నరసింహమూర్తి ఐటీఐ పూర్తి చేసి ఒడిశాలో తన మామయ్య వద్ద వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్నాడు. అందరితో సరదాగా ఉండే గోపాల్ మృతి చెందిన విషయం తెలుసుకుని గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు కాశీబుగ్గ ఎస్సై రాజేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సూచికలేవి? చెరువు వద్ద మలుపు రోడ్డులో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. పలు గ్రామాల్లో ఎక్కువగా మలుపులున్న బీటీరోడ్లు ఉన్నాయి. వీటి నిర్మాణ పనుల సమయంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకు ప్రమాదాలు అరికట్టవచ్చు. ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఎముకలు, పుర్రె లభ్యం
ఎన్ఏడీ జంక్షన్(విశాక పశ్చిమ): మర్రిపాలెం డీజిల్ లోకో షెడ్ సమీపంలో మంగళవారం ఓ బైక్, దాని పక్కనే మృతదేహం ఎముకలు, పుర్రె, లభ్యమయ్యాయి. ఈ విషయం తెలియడంతో దుర్గాపురం ప్రాంతంలో సంచలనంగా మారింది. ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గాపురానికి చెందిన యువకుడు కలమటి ప్రవీణ్‌కుమార్(23) 2018 సెప్టెంబర్ 26 నుంచి కనిపించడంలేదు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్లో అదే నెల 28న ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం స్థానికులు మర్రిపాలెం డీజిల్ లోకో షెడ్ సమీపంలో ద్విచక్ర వాహనం పడిపోయి ఉండడం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ ద్విచక్ర వాహనం సమీపంలో కొన్ని ఎముకులు, మృతుడి వస్త్రాలు కనిపించాయి. అక్కడికి కొద్ది దూరంలో పుర్రె ఉంది. అయితే ప్రవీణ్‌కుమార్ తన వాహనంపై మర్రిపాలెం శ్రావణి బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లాడని... మద్యం సేవించాక అక్కడే ఉన్న మరో వాహనాన్ని తనదిగా భావించి తీసుకుని వెళ్లిపోయాడని... ఈ విషయం సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైందని పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి మర్రిపాలెం డీజిల్ లోకోషెడ్ రహదారి మీదుగా వెళ్లాడని.., లోకోషెడ్‌కు సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోట దట్టమైన పొదలు ఉండడంతో ఎవరూ గుర్తించలేదు. మంగళవారం స్థానికులు ఎండు కర్రలు ఏరుకునేందుకు వెళ్లగా విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ లభించిన దుస్తులు ఆధారంగా మృతుడు దుర్గాపురం వాసి ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. అయితే అతని తల్లి మాత్రం తన బిడ్డ కాదని రోదిస్తోంది. దీనిపై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్ఐ నరసింహరాజు కేసు నమోదు చేశారు. -
కల్వర్టును ఢీకొని జియో మొబైల్ టవర్ సూపర్వైజర్ దుర్మరణం
సాక్షి, పర్లాకిమిడి: స్థానిక పట్టణంలోని సెంచూరియన్ గ్రామ తరంగ్ వద్ద ఉన్న ఓ కల్వర్టును మోటార్‌బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఫారెస్ట్ గేట్ నుంచి కోర్టు జంక్షన్ వరకు కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అదే దారిలో ఇద్దరు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి మోటారుబైక్‌తో వస్తూ అదే దారిలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని దగ్గరలోని బరంపురం ఆసుపత్రికి తరలించగా, అతడు కూడా మృతి చెందాడు. సంఘటనా స్థలంలో మృతి చెందిన వ్యక్తిని స్థానిక తెల్లిగుడ వీధికి చెందిన జియో మొబైల్ టవర్ సూపర్వైజర్ తిరుపతి ప్రధాన్‌గా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో ఇదే కల్వర్టును ఓ ప్రైవేట్‌బస్సు ఢీకొన్న ఘటనలో పూజారి అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాద విషయంపై మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి, స్థానిక ఫారెస్ట్గేట్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి మధ్యలో టైర్లు కాల్చి, అటువైపుగా వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలాస, బరంపురం, హిరమండలం,ఆర్.ఉదయగిరిలనుంచి చ్చిపోయే బస్సులు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి.ప్రమాదానికి కారణమైన రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చెల్లించాలని కోరారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న పోలీసు అధికారి ఠాకుర్ ప్రసాద్, తహసీల్దారు సింహాచలం ప్రధాన్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ లక్ష్మీకాంత పాఢి, సబ్ కలెక్టర్ స్వయంగా వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని సద్దుమణిగించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మరో నాలుగురోజులు గడిస్తే పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో పెనువిషాదం అలుముకుంది. కూతురి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించి మురిసిపోవాలని ఆ తండ్రి కన్న కలలు ఆదిలోనే కల్లలయ్యాయి. కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా విధి వక్రించింది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు బైక్‌ను ఢీకొట్టడంతో ఆ తండ్రితో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన నకిరేకల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ : నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన వంగూరి నగేశ్ (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు కుమార్తె, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె పూజకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 17న వివాహం జరగనుంది. కూతురు వివాహ శుభలేఖలను బంధువులకు పంచి ఆహ్వానించేందుకు నగేశ్ తన అన్న అల్లుడైన పాలడుగు గోపి (27)తో కలిసి బైక్ మీద బయలుదేరారు. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి వెళ్లి శుభలేఖలు ఇవ్వాల్సి ఉంది. హైవేను క్రాస్ చేస్తుండగా.. చందంపల్లి నుంచి హైవే మీదుగా నకిరేకల్ వైపునకు బైక్ మీద వెళ్తున్నారు. స్థానిక పద్మనగర్ వద్ద ఉన్న బంక్‌లో పెట్రోల్ పోసుకుని కడపర్తి వెళ్లేందుకు జాతీయ రహదారిని క్రాస్ చేస్తూ నకిరేకల్‌కు చేరుకునే క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న అతివేగంగా వెళ్తున్న కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంగూరి నగేశ్ (55)తో పాటు బైక్ నడుపుతున్న పాలడుగు గోపి (27) హైవే రోడ్డు డివైడర్లపై పడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పాలడుగు గోపికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపి వృత్తిరీతా సుతారీ పని చేస్తూ పెళ్లీల సమయంలో బ్యాండ్ మేలం వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మిన్నంటిన రోదనలు చందంపల్లి గ్రామానికి చెందిన వంగూరి నగేశ్, పాలడుగు గోపిలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరో ఐదు రోజుల్లో కుమార్తె వివాహం జరగనున్న నేపథ్యంలో తండ్రి మృత్యువాత పడడంతో పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లింట్లో విషాదం నెలకొనడంతో గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు. హైవేపై ఆందోళన.. గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం నకిరేకల్‌లోని పద్మనగర్ బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చందంపల్లికి చెందిన నగేŠ, గోపి మృతిచెందడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. భారీగా ఘటనాస్థలికి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో సుమారు 5కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రాసింగ్‌ల వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్న జీఎమ్మార్ సంస్థ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చందంపల్లి క్రాసింగ్ వద్ద 40కి పైగా ప్రమాదాలు జరగగా 20మందికిపైగా మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయిన చందంపల్లి క్రాసింగ్ వద్ద నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తాజాగా నకిరేకల్ దగ్గరలో ఉన్న పద్మనగర్ బైపాస్‌లో వద్ద క్రాసింగ్ ప్రమాదకరంగా ఉన్న ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. చందంపల్లి గ్రామానికి హైవే వెంట సర్వీస్ రోడ్డు నిర్మిస్తే ఈ ప్రమాదాలు కొంతైన తగ్గే అవకాశం ఉందని వాపోయారు. గంటసేపు రాస్తారోకో చేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఘటన స్థలానికి కట్టంగూర్ ఎస్ఐ అంతిరెడ్డితో పాటు చెర్వుగట్టు బందోబస్తులో ఉన్న నకిరేకల్ సీఐ గౌరినాయుడు కూడా చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. రెండుచోట్ల ప్రమాదాలు జరగకుండా జీఎమ్మార్ సంస్థతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
బైక్ లారీ ఢీ ముగ్గురు యువకులు మృతి