సాక్షి, హైదరాబాద్: నగరంలో చదువుకుంటున్న కూతురును చూసేందుకు వెళ్తున్న తల్లిదండ్రు లతో పాటు వారి మరో కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కుమార్ తెలిపిన మేరకు.. ఫరూఖ్‌నగర్ మండలం కడి యాలకుంట తండాకు చెందిన గోపాల్ (47), అంజలి (42) దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
మూడో కూతురు మధులత నగరంలోని చంపాపేట్‌లోని సంక్షేమ హాస్టల్‌లో చదువుకుంటోంది. ఆమెను చూసేందుకు గోపాల్, అంజలి తమ చిన్న కూతురు స్వాతి (9)తో కలిసి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్ సమీపంలోకి రాగానే డీసీఎం వాహనం ఓ కారును ఢీకొంది. అదుపు తప్పి ముందు వెళ్తున్న వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి దంపతులు సహా కుమార్తె ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం వాహనం అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: దారుణం: దొంగతనం చేశాడని.. చెట్టుకు కట్టేసి మర్మాంగాల మీద తన్నారు)
Comments
Please login to add a commentAdd a comment