speed
-
Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవవారికి, కంటెంట్ క్రియేటర్స్‌కు, స్మార్ట్ హోమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి. ఇందుకోసం వినియోగించే వైఫై కాలం గడిచేకొద్దీ స్పీడ్ తగ్గుతుంటుంది. దీంతో యూజర్స్‌లో అసహనం తలెత్తుతుంది. ఇలా జరగకూడదంటే కొన్ని ట్రిక్కులను, స్టెప్స్‌ను ఫాలో చేయడం ద్వారా Wi-Fiని పరిగెత్తించవచ్చు.మన ఇంటిలోని కొన్ని ఉపకరణాలను వినియోగించి Wi-Fi సిగ్నల్స్‌ను రిఫ్లక్ట్ లేదా రీడెరెక్ట్ చేయవచ్చు. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడందుకుంటుంది. రూటర్ వెనుక భాగాన అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా దానిని ఒక షిఫ్ట్ రిఫ్లెక్టర్‌గా మార్చవచ్చు. ఫలితంగా దాని సిగ్నల్‌ను ఇంప్రూవ్ చేయవచ్చు. ఇందుకోసం అల్యూమినియం ఫాయిల్‌ను ఒక అట్టకు అతికించాల్సి ఉంటుంది. తరువాత దానిని రూటర్ వెనుక భాగాన ఉంచాలి. అయితే దీనిని అమర్చేటప్పుడు ఫాయిల్ రూటర్‌లోని ఏ భాగానికీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది Wi-Fi రూటర్‌కు సిగ్నల్ అవాంతరాలను నివారిస్తుంది.Wi-Fi రూటర్ ఓవర్ హీటింగ్‌కు గురికాకుండా చూసుకోవడం మరొక ముఖ్యమైన పని. ఇందుకోసం Wi-Fi రూటర్‌ను ఎండ తగలని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి వేడి వెలువడని ప్రాంతంలో ఉంచడం తప్పనిసరి. Wi-Fi రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచడం ద్వారా అది వేడెక్కకుండా చూడగలుగుతాం. Wi-Fi స్పీడ్ స్లో అయినప్పుడు దానిని రోజుకు ఒక్కసారైనా స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన Wi-Fi కనెక్టివిటీ రిఫ్రెష్ అవుతుంది. ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఈ ఉపాయాలను అనుసరించి మీ Wi-Fi సిగ్నల్‌ను మెరుగుపరుచుకోండి.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెంచే బెస్ట్ టిప్స్
ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొన్నప్పుడు ఉన్న స్పీడ్.. కొన్ని రోజుల ఉపయోగించిన తరువాత బహుశా ఉండకపోవచ్చు. దీనికి కారణం అనవసరమైన యాప్స్ కావొచ్చు.. లేదా అవసరం లేని డేటా స్టోరేజ్ కూడా కావొచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్ మళ్ళీ వేగంగా పనిచేయాలంటే.. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయాలి (Clear Cache and Data)మొబైల్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. యూజర్ అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ, కొన్ని సార్లు అవసరం లేదు అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటాడు. వాటిని తాత్కాలికంగా డిలీట్ చేసినప్పటికీ.. అవి బ్యాక్ఎండ్లో స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఎక్కువవ్వడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. వీటన్నింటినీ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి క్లియర్ చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.ఉపయోగించని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలి (Uninstall Unused Apps)కొన్ని సార్లు మొబైల్ ఫోనులో ఉపయోగించని లేదా అనవసరమైన యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాప్ ఫోన్లో కొంత స్టోరేజిని ఆక్రమిస్తుంది. మరికొన్ని యాప్స్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన వెంటనే వాటి స్టోరేజ్‌ని విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ మొబైల్ స్పీడ్ తగ్గిస్తాయి.అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్లను డిసేబుల్ చేయాలి (Disable Unnecessary Background Processes)మీరు ఉపయోగిస్తున్న మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లు కూడా అంత వేగంగా గుర్తించలేరు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. డిలీట్ చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం వంటివి చేయాలి.పర్ఫామెన్స్ బూస్టర్ (Performance Booster) ఉపయోగించడంపర్ఫామెన్స్ బూస్టర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్లోని అనవసరమైన ఫైల్లు.. అనవసరమైన డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ఫోన్లలో ఈ బూస్టర్ యాప్‌లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళా మీ మొబైల్ ఫోనులో లేదంటే ప్లే స్టోర్‌కి వెళ్లి ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ఐడియా 4జీ నెట్వర్క్ అత్యుత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో కంపెనీ మెరుగైన నెట్వర్క్ అందించినట్లు ఓపెన్‌సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్‌విడ్త్ అప్‌గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం..కంపెనీ వినియోగదారులు నవంబర్ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.యూజర్లు 17.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్‌గ్రేడ్ చేసింది.ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. -
ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్
సోన్ పూర్ : బీహార్‌లో సోన్పూర్ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జంతు మేళాకు పలు ప్రత్యేకతలు కలిగిన జంతువులను వాటి యజమానులు తీసుకువచ్చారు. వాటిలో ఒకటి అనంత్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్‌కు చెందిన గుర్రం. దీని పేరు డార్లింగ్. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెడుతుంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీని ధర వింటే ఒకపట్టాన ఎవరూ నమ్మలేరు.గుర్రపు యజమాని రుడాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ గుర్రం ఏకే 56 సింధీ జాతికి చెందినదనని తెలిపారు. ఇది యజమాని దగ్గర ఎంతో విధేయంగా మెలుగుతుందన్నారు. ఈ జాతికి చెందిన గుర్రాల సగటు ఎత్తు 64 అంగుళాలు. అయితే ‘డార్లింగ్’ ఎత్తు 66 అంగుళాలు. సాధారణ గుర్రాల నిర్వహణకు ప్రతినెలా రూ. 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రత్యేక గుర్రం సంరక్షణకు ప్రతినెలా రూ.35 వేలు ఖర్చవుతుంది.ఈ గుర్రాన్ని సంరక్షణలో దాని యజమాని రుడాల్ యాదవ్ ప్రత్యేక మెళకువలను అవలంబిస్తుంటాడు. ఈ గుర్రానికి ప్రతీరోజు ప్రత్యేకమైన నెయ్యితో మాలిష్ చేస్తుంటాడు. ఈ గుర్రం వేగం విషయానికి వస్తే రికార్డులు తీరగరాయాల్సిందే. ఈ గుర్రానికి ఏడాది వయస్సు నుంచే పరుగులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రుడాల్ యాదవ్ తెలిపారు. ఈ గుర్రం సాధారణంగా గంటకు 45 కి.మీ వేగంతో పరిగెడుతుంది. అయితే దీని పూర్తి వేగం గంటకు 100 కి.మీ.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింధీ జాతి గుర్రాలు ఓర్పు, చురుకుదనానికి ప్రసిద్ధి చెందాయి. గుర్రపు ప్రేమికులు ఈ జాతి గుర్రాలను అమితంగా ఇష్టపడుతుంటారు. దీని ధర విషయానికొస్తే గుర్రం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏకే 56’ ధర సుమారు రూ.1.11 కోట్లు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
స్పీడ్ తక్కువ.. సమయం ఎక్కువ
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది. 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మనోహరాబాద్ టు కొత్తపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు. మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది. ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది. స్పీడ్ పెరిగితేనే మెరుగు.. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్ -
హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
న్యూఢిల్లీ: వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఈ ఏడాది దీపావళి నాటికి పది నగరాలకు కార్యకలాపాలను విస్తరించనుంది. గురువారం తమ అయిదో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియం ఈ విషయం తెలిపారు.ఇటీవలే 1,000 వాహనాల డెలివరీలను పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 బైక్‌ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎఫ్77 మాక్ 2 మోడల్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉందని, ఒకసారి చార్జి చేస్తే 323 పైచిలుకు కిలోమీటర్ల రేంజి, గంటకు 165 కి.మీ. గరిష్ట వేగం ఉంటుందని నారాయణ్ వివరించారు. బ్యాటరీపై అత్యధికంగా 8,00,000 కి.మీ. వారంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్‌కి సంబంధించి 4 విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా జర్మనీ తదితర దేశాల్లో 50 పైచిలుకు సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణ్ చెప్పారు. టీవీఎస్ మోటర్స్, శ్రీధర్ వెంబు (జోహో) తదితర ఇన్వెస్టర్లు సంస్థలో 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. సుమారు 3,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టోర్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. -
సరికొత్త ప్రేమకథగా స్పీడ్220.. ఆసక్తిగా ట్రైలర్!
గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్పీడ్220'. ఈ సినిమాకు హర్ష బీజగం దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా తమారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..' ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభ ఇందులో చూపించారు' అని కొనియాడారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు.. ఆర్ఎక్స్ 100 లాంటి మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకముందని దర్శకుడు హర్ష బీజగం అన్నారు.ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..' మంచి కథతో దర్శకుడు హర్ష రావడం జరిగింది. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాం.ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్లకు కట్టినట్లుగా చూపించేలా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు' అని అన్నారు. ఈ మూవీని ఆగస్టు 23న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతమందించారు. -
నిర్ణీత వేగాన్ని అధిగమించిన రెండు రైళ్లు.. లోకోపైలట్లు సస్పెండ్!
భారతీయ రైళ్లు దేశంలోని లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఒక్కోసారి రైళ్లు నడిపే పైలట్ల పొరపాటు కారణంగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఉదంతం యూపీలో చోటు చేసుకుంది. నిర్ణీత వేగ పరిమితి కంటే అధిక వేగంతో రైళ్లను నడిపిన ఇద్దరు లోకో పైలట్లు (డ్రైవర్), రైలు సహాయకులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు, వారి సహాయకులపై రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించిన సెక్షన్లో 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతున్నందుకు వారిని సస్పెండ్ చేశారు. రైలు బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కారణంగా తాత్కాలిక వేగ పరిమితి అమలులో ఉన్న ఆగ్రా కాంట్‌కు సమీపంలోని జాజౌ- మణియన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు సిబ్బంది వేగంగా రైలును పోనిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆగ్రా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సంఘటనలో రైలు ఆగ్రా కాంట్ నుంచి గ్వాలియర్‌కు బయలుదేరిన తర్వాత గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వేగ పరిమితిని ఉల్లంఘించారు. మరో ఘటనలో కత్రా (జమ్మూ)- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య నడిచే మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ కూడా నిబంధనలను ఉల్లంఘించారు. ఈ సెక్షన్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల నది వంతెన మరమ్మతు పనుల కారణంగా గంటకు 20 కిలోమీటర్ల పరిమితిని నిర్ణయించారు.ఈ విషయమై ఆపరేషన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ వారు చెప్పిన సెక్షన్లో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించడం మరచిపోయి ఉండవచ్చు. అయినా ఇది రైలు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే చర్య. అందుకే రైల్వే శాఖ దీనిని సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సాధారణంగా ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం తదితర సందర్భాల్లో రైల్వేశాఖ ఆ రూట్లో వైళ్లే రైళ్లకు వేగ పరిమితులను విధిస్తుంది. -
దీన్నే పిచ్చి అంటారు..మారండి ప్లీజ్! వైరల్ వీడియో
లేని పోని ప్రయోగాలకు పోతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేగంగా కదులుతున్న ట్రైన్లోంచి ఒక బాలిక దూకేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విపరీత పోకడలతో సాహసాలు చేయొద్దని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక బాలిక చాలా వేగంగా కదులుతున్న రైలు ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.. మెల్లిగా మెట్లు దిగుతూ సడెన్‌గా పట్టాలపైకి దూకేసింది. అయితే ఆమెను నివారించాల్సిన వారు వీడియో తీయడం విమర్శలకు తావిచ్చింది. ఇది కావాలనే చేశారా? లేదా ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? ఎక్కడ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఆమె తీవ్ర గాయాలతో బతికే ఉందని మాత్రం కొంత మంది కమెంట్ చేశారు. Girl jumps from a running train expecting to get off like in Bollywood 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/5ktDKMus6o — Pagan 🚩 (@paganhindu) April 12, 2024 -
విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్‌లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్ వన్’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
మితిమీరిన వేగం, ఎగిసిపడిన మంటలు: తృటిలో తప్పిన ఘోరం
బెంగుళూరులో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.నాగరభావి-నాయండహళ్లి మధ్య రింగ్‌రోడ్డుపై కారు వెనుక నుంచి బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) బస్సును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు లోనయ్యారు. అయితే అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయట పడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైత్రయాణపుర ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగరభావి ప్రధాన రహదారిలోని చంద్రా లేఅవుట్ బస్టాండ్ వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉండగా, వేగంగా వచ్చిన కారు బస్సు వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బస్సు పాక్షికంగా దగ్ధమైంది. అయితే ప్రయాణికులందరూ వెంటనే బస్సు నుండి క్రిందికి దిగి పోయారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి స్వల్ప గాయం కాగా, మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. -
వేగానికి చెక్ పెట్టే కొత్త ఫీచర్ - ఇదెలా పనిచేస్తుందంటే?
రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. మితిమీరిన వేగం. ఈ వేగాన్ని నియంత్రిస్తే సగం ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో గూగుల్ తన మ్యాప్స్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహన వినియోగదారుడు తన మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, దానికి కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి, ఆ తరువాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేస్తే.. అక్కడ న్యావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్లో స్పీడోమీటర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు పొందవచ్చు. వేగం పెరిగినటప్పుడు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది కూడా. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలు పరిమితిని మించిన వేగంతో వాహనదారుడు ప్రయాణించినట్లైతే.. అత్యవసర సమయంలో వాహనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం, అలాంటి సమయంలో అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టాయి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ పరిమిత వేగాన్ని మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. వారికి భారీ జరిమానాలు విధించడం లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంలో వెళ్తున్నామని విషయాన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది, అలంటి వారికి గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్..!
కరీంనగర్: రాత్రి సమయంలో బైక్ స్పీడ్ బ్రేకర్ పైనుంచి వెళ్లడంతో ఓ యువకుడు ఎగిరి బండరాయిపై పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట్‌కు చెందిన బోయిని అజయ్(27) శుక్రవారం ద్విచక్రవాహనంపై హుస్నాబాద్ వెళ్లాడు. రాత్రి 9.30 గంటల సమయంలో స్వగ్రామం వస్తున్నాడు. గ్రామ క్రాసింగ్ వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా వెళ్లడంతో ఎగిరి బండరాయిపై పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడికి తల్లి అనసూర్య, తండ్రి లక్ష్మయ్య, ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. అక్కకు వివాహం చేశారు. అజయ్ అవివాహితుడు కాగా హుస్నాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
క్షణాల్లో తలపాగా కట్టించి గిన్నిస్ రికార్డ్.. వీడియో వైరల్
భారతీయ సంప్రదాయంలో తలపాగాను వివాహాలు వంటి శుభకార్యాల్లో ధరిస్తారన్న సంగతి తెలిసిందే. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సిక్కులు మత పరంగా దీన్ని తప్పనిసరిగా ధరిస్తారు. టర్బన్ లేదా దస్తర్ పేర్లతో పిలిచే తలపాగాను ఎవరైనా కట్టుకుంటారు. కానీ క్షణాల్లో, మెరుపువేగంతో తలపాగా కట్టేయగలగడం ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య పచోలి అతి తక్కువ సమయంలోనే తలపాగాను కట్టించి గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. వృత్తిరీత్యా లాయర్ అయిన పచోలి తన వృత్తిని కొనసాగిస్తూనే, అభిరుచి మేరకు 15 ఏళ్లుగా తలపాగా కట్టే పని చేస్తున్నాడు. ఇటీవలె ఓ వ్యక్తికి కేవలం 14.12 సెకన్లలోనే తలపాగా చుట్టేసి ఆదిత్య రికార్డ్ సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వైరల్ వీడియోపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు పచోలి టాలెంట్‌కు ఫిదా అవుతుందటే, మరికొందరు మాత్రం గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేస్తూ దాని విలువను కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
వాహనాదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్ స్పీడ్ లిమిట్ పెంపు
సాక్షి, మైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ గంటకు 100 కి మీ ఉండగా దానిని120కి పెంచాలని నిర్ణయించింది. మేరకు పురపాలక, ఓఆర్ఆర్ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, దీనిని 120కి.మీకి పెంచుతున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే స్పీడ్ లిమిట్ పెంచిన నేపథ్యంలో వాహనాదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏను ఆదేశించారని అర్వింద్ కుమార్ తెలిపారు. ఓఆర్ఆర్ (కోకాపేట నుంచి ఘట్కేసర్ వరకు, తారామతిపేట – నానక్‌రామ్‌గూడ వరకు) ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు 1066, 105910 నంబర్లలో డయల్ చేయాలని హెచ్ఎండీఏ సూచించింది. చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ The maximum speed limit on #ORR is increased to a maximum of 120 kms/ hour from the present maximum limit of 100 kms/ hour In the review meeting held today, minister @KTRBRS reviewed the arrangements & has instructed @HMDA_Gov to ensure all safety protocols in place pic.twitter.com/yz5Wobsoq8 — Arvind Kumar (@arvindkumar_ias) June 27, 2023 -
రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడి.. వీడియో వైరల్
యూపీ : షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. గంటకు 110కి.మీ వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ నుండి ఒక యువకుడు పొరపాటున జారి పడ్డాడు. కానీ అతడు లేచిన వేళావిశేషం బాగున్నందుకో ఏమో గానీ అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి గాయాలు తగలకుండా తప్పించుకున్నాడు. రెప్పపాటులో.. యూపీలోని షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ మీదుగా పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ గంటకు 110 కి.మీ వేగంతో దూసుకుపోతోంది. ప్లాట్ ఫారం మీద జనమంతా రైలు వేగానికి దూరంగా నిలబడి ఉన్నారు. అంతలోనే ఒక యువకుడు ఈ ట్రైన్ నుండి జారిపడ్డాడు. కింద పడ్డ ఆ యువకుడిని ట్రైన్ ఈడ్చుకుంటూ పోవడంతో ఆ స్పీడుకి ప్లాట్ ఫారంపై చాలా దూరం దొర్లుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో యువకుడికి చిన్న గాయం కూడా కాలేదు సరికదా.. దొర్లడం ఆగిన తర్వాత రిలాక్స్ గా లేచి నిలబడి చేతులు దులుపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను లైవ్‌లో చూసినవారంతా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ప్లాట్ ఫారం మీదనున్న ఓ ప్రయాణికుడు మాత్రం ఈ సన్నివేశాన్ని తన ఫోన్లో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. బ్రతికి బయటపడటమంటే మనకు తెలుసు కానీ బయటపడి బ్రతకడమంటే ఇదేనేమో..! On Camera, Man Falls From Speeding Train In UP; Survives https://t.co/NYg3myF4VF pic.twitter.com/znlzXNBRUD — NDTV (@ndtv) June 21, 2023 ఇది కూడా చదవండి: International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం -
చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు..
చైనా లోకల్ ఉత్పత్తులను భారత్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. చాలామంది చైనా వస్తువులకు ఎటువంటి గ్యారెంటీ ఉండదంటూ హేళన చేస్తుంటారు. అయితే చైనా టెక్నాలజీ, అధునాతన ఉత్పత్తులు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంటాయి. టెక్నాలజీ పరంగా చైనా ఎంత వేగంగా దూసుకుపోతున్నదనే విషయాన్ని అవి తెలియజేస్తుంటాయి. అధునాతన రైళ్లు అనగానే ముందుగా చైనా, జపాన్ గుర్తుకువస్తాయి. ఈ దేశాల రైళ్ల వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చైనా రైల్వే టెక్నాలజీ మరో అద్భుతాన్ని చేసి చూపింది. తాజాగా చైనా19వ అంతస్థుల నివాసిత బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్‌ను రూపొందించింది. ప్రజలు ఉండే ఈ భవనం ఇప్పుడు రైల్వే స్టేషన్‌గానూ మారిపోయింది. బిల్డింగ్ మధ్య నుంచి వెళ్లే రైలు చైనా రైల్వే సిస్టం అద్భుతమైనది. ప్రపంచంలో ట్రాక్ లేకుండా రైలు నడిపిన ఘనత కూడా చైనాకే దక్కింది. హైస్పీడ్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తూ ప్రయాణికులకు చైనా మరింత ఉత్తమ సేవలు అందిస్తోంది. అందుకే కొందరు చైనా రైల్వే సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమని అంటుంటారు. తాజాగా చైనా ఒక బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్ నిర్మించింది. ఈ బిల్డింగ్ మధ్య నుంచి రోజూ రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. 19 అంతస్థుల ఈ బిల్డింగ్‌లోని 6వ, 8వ ఫ్లోర్లపై రైల్వే ట్రాక్ నిర్మించారు. భవనం మధ్య నుంచి ట్రాక్ నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలుగకుండా.. చైనా ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నప్పుడు ఈ మార్గంలో 19 అంతస్థుల బిల్డింగ్ అడ్డుగా నిలిచింది. అయితే రైల్వేశాఖ బిల్డింగ్ యజమానులను సంప్రదించి బిల్డింగ్ మధ్యగా ట్రాక్ వేసేందుకు అనుమతి పొందింది. అనంతరం బిల్డింగ్ మధ్య నుంచి ట్రాక్ వేశారు. ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ భవనంలో ఉంటున్నవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఈ ట్రాక్ రూపొందించారు. ఈ ట్రాక్ వలన భవనంలో నివాసం ఉంటున్నవారికి మరో ప్రయోజనం కూడా చేకూరింది. వారికంటూ ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ఏర్పడింది. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి, నేరుగా రైలులోనే కూర్చుని తదుపరి స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక రైలు నుంచి వచ్చే శబ్ధం బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు సైలెన్సింగ్ టెక్నిక్ వినియోగించారు. ఇది కూడా చదవండి: ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు? -
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
వందేభారత్ రైళ్లు: గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం.. యావరేజి స్పీడ్ 83 కి.మీ.
న్యూఢిల్లీ: దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది. -
వందే పాలమూరు.. కర్నూలు! వేగం తగ్గినా సరే.. నడిపేద్దాం.. మారిన వైఖరి
వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఆ రైలు అంటేనే వేగం అన్న మాటగా మారింది. గంటకు 160 కి.మీ.వేగంతో ఆ రైళ్లు సులువుగా పరుగు పెట్టగలవు.. ఆ మేరకు గంటకు 130 కి.మీ. వేగానికి తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యాన్ని రైల్వే పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆ సామర్థ్యానికి సరిపోని ట్రాక్‌పై గరిష్టంగా 110 కి.మీ. వేగానికి పరిమితమవుతూ ఆ రైళ్లు దూసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రైళ్ల విషయంలో రైల్వే శాఖ తీరు మారినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ట్రాక్ సామర్థ్యం మెరుగుపడని ట్రాక్ మీదుగా కూడా వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. వీలైనంత వేగంగా ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్న రైల్వే శాఖ, ప్రస్తుతానికి వేగానికి సరిపడా ట్రాక్ సామర్ధ్యం పెరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేసింది. –సాక్షి, హైదరాబాద్ అదే కోవలో హైదరాబాద్–బెంగళూరు.. ఇటీవలే సికింద్రాబాద్– విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లను సమకూర్చుకున్న దక్షిణ మధ్య రైల్వేకు వచ్చే నెలలో ముచ్చటగా మూడో వందేభారత్ రైలు కూడా అందనుంది. హైదరాబాద్– బెంగుళూరు మధ్య కొత్త వందేభారత్ రైలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలల్లోనే ఇది పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. విశాఖ వందేభారత్ రైలు ప్రారంభమైన కొద్ది రోజులకే మరో మూడు రైళ్లను కేటాయిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో తిరుపతి రైలు ఇప్పటికే మొదలు కాగా, తదుపరి బెంగళూరు రైలు, ఆ తర్వాత హైదరాబాద్–పుణే రైలు ప్రారంభం కానున్నాయి. మహబూబ్‌నగర్ మీదుగానే ఆసక్తి.. నగరం నుంచి బెంగుళూరుకు ప్రధాన మార్గంగా ఉన్న మహబూబ్‌నగర్–కర్నూలు ట్రాక్ మీదుగానే కొత్త వందేభారత్‌ను నడిపేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. కాచిగూడ–మహబూబ్‌నగర్–కర్నూలు–డోన్– మీదు గా బెంగళూరు చేరుకుంటుంది. మరో మార్గం వాడి–రాయచూర్ మీదుగా ఉంది. నిజానికి, ఈ రెండో మార్గంలో ఎక్కువ నిడివి 130 కి.మీ. వేగానికి తగ్గట్టుగా మార్చారు. ఇందులో ఎక్కువ దూరం డబుల్ లైన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో పోలిస్తే మహబూబ్‌నగర్ మార్గంలో ట్రాక్‌ను పటిష్ట పరచలేదు. మహబూబ్‌నగర్–డోన్ మధ్య ఇంకా సింగిల్ లైనే ఉంది. అయినా కూడా.. రాయచూర్ మార్గంతో పోలిస్తే బెంగళూరుకు 80 కి.మీ. దూరం తక్కువగా ఉండటం, మహబూబ్‌నగర్, కర్నూలు లాంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఉండటంతో పాలమూరు, కర్నూలు మార్గాన్నే ఎంపిక చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే తప్ప ఇదే ఖరారు అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఈ మార్గం ఖరారైతే... ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరుగుపెడుతున్న రెండు వందేభారత్ రైళ్ల కంటే ఈ వందేభారత్ రైలు తక్కువ వేగంతో నడవనుంది. దీని గరిష్ట వేగం సగటున 70 కి.మీ. కంటే తక్కువే ఉంటుందంటున్నారు. -
గర్లఫ్రెండ్‌ని టైంకి డ్రాప్ చేయాలన్న ఇంటెన్షన్ పోలీసులకు పట్టించి..చివరికి..
గర్లఫ్రెండ్ కోసం అరెస్టు అయ్యాడో ఓ వ్యక్తి. చివరికి అదే అతడి బండారం మొత్తం బయట పెట్టించి.. జైలు పాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన జెవోన్ పియర్ జాక్సన్ అనే వ్యక్తి తన స్నేహితురాలికి ఇంటర్యూ ఉండటంతో తానే డ్రాప్ చేయాలని అనుకున్నాడు. ఆమెను కరెక్ట్ టైంకి తీసుకెళ్లి సాయం చేయాలనకున్నాడు జాక్సన్. ఐతే అప్పటికే అతని కారు వెనుక సీటులో తన ముగ్గురు పిల్లలు ఉన్నా..ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. ఐతే అతను తన గర్లఫ్రెండ్‌కి సాయం చేసి ఇంప్రెస్ చేయాలన్న ఆతృతలో వేగంగా కారుని నడిపాడు. ఈ క్రమంలో రద్దీగా ఉండే ఫాల్స్ చర్చ్రోడ్ వద్ద స్పీడ్‌గా కారుని పోనిచ్చాడు. బ్లాక్ మెర్సిడేజ్ కారులో వేగంగ వెళ్లిపోతున్న జాక్సన్ పోలీసుల వాహనాన్ని సైతం పట్టించుకోకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై జాక్సన్ కారుని అడ్డుకున్నారు. అతను రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక తెల్లటి పికప్ కారుని ఢీ కొట్టయేబోతుండగా..త్రుటిలో ప్రమాదం తప్పినట్టు సమాచారం దీంతో పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని.. విచారించడం ప్రారంభించారు. అతడు గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. అదీగాక కారులో పిల్లలు ఉన్నా కూడా ఇంత ప్రమాదకరమైన వేగంతో నడిపినందుకుగానూ జాక్సన్‌పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి 22 ఏళ్ల జాక్సన్‌ని బ్రెవార్డు కౌంటి జైలుకి తరలించారు. అతను ఈ కేసు విషయమై ఏప్రిల్ 18న కోర్టు ఎదుట హాజరుకావల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! పగవాడికూడా వద్దంటూ విలపిస్తున్న మహిళ) -
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్.. వామ్మె అంత స్పీడ్!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్ ఇది. భారీ వాహనాల తయారీ సంస్థ జేసీబీ దీనిని రూపొందించింది. ఎంతటి అధునాతనమైన ట్రాక్టర్లయినా వాటి గరిష్ఠ వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జేసీబీ తాజాగా రూపొందించిన ఐదు టన్నుల ఈ భారీ ట్రాక్టర్ గరిష్ఠవేగం గంటకు 247 కిలోమీటర్లు. ఆరు సిలిండర్ల డీజిల్మ్యాక్స్ ఇంజన్‌తో తయారు చేసిన ఈ వాహనం అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రాక్టర్‌గా గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం. జేసీబీ ఇదివరకు రూపొందించిన ఫాస్ట్‌ట్రాక్ ట్రాక్టర్ గరిష్ఠంగా 217.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ట్రాక్టర్ పనితీరును బ్రిటన్‌లోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షించారు. దీని సాంకేతికతలో మార్పులు చేసి కొత్తగా రూపొందించిన ట్రాక్టర్ ఏకంగా 247 కిలోమీటర్ల వేగం అందుకోవడం ఆనందంగా ఉందని జేసీబీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ టిమ్ బమ్హోప్ తెలిపారు. శరవేగంగా పరుగులు తీసే ఇలా ట్రాక్టర్లు సువిశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో పనులను వేగంగా చేయడానికి ఉపకరిస్తాయని, సాంకేతికంగా మరిన్ని మెరుగులు చేసిన తర్వాత దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నామని బమ్హోమ్ తెలిపారు. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలో చదువుకుంటున్న కూతురును చూసేందుకు వెళ్తున్న తల్లిదండ్రు లతో పాటు వారి మరో కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్‌కుమార్ తెలిపిన మేరకు.. ఫరూఖ్‌నగర్ మండలం కడి యాలకుంట తండాకు చెందిన గోపాల్ (47), అంజలి (42) దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మూడో కూతురు మధులత నగరంలోని చంపాపేట్‌లోని సంక్షేమ హాస్టల్లో చదువుకుంటోంది. ఆమెను చూసేందుకు గోపాల్, అంజలి తమ చిన్న కూతురు స్వాతి (9)తో కలిసి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్ సమీపంలోకి రాగానే డీసీఎం వాహనం ఓ కారును ఢీకొంది. అదుపు తప్పి ముందు వెళ్తున్న వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి దంపతులు సహా కుమార్తె ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం వాహనం అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దారుణం: దొంగతనం చేశాడని.. చెట్టుకు కట్టేసి మర్మాంగాల మీద తన్నారు) -
4జీ స్పీడ్, మరోసారి టాప్‌లో జియో
న్యూఢిల్లీ: అతి వేగవంతమైన 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అక్టోబరు 4జీ స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. జియో సగటు 4G డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. (మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్) సగటు డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి నెలకొంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ డౌన్లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో 4జీ సగటు డౌన్లోడ్ వేగం 5 Mbps ఎక్కువ. (త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన) సగటు 4G అప్లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్టెల్ అప్లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ అప్లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్టెల్ అప్లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్!
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై–గూడూరు మార్గంలో రైలు వేగాన్ని పెంచే విధంగా నిర్వహించిన ట్రైల్ రన్ సంతృప్తికరంగా జరిగినట్లు దక్షిణ రైల్వే జీఎం బీజీ మాల్య తెలిపారు. రైల్వే డివిజనల్ మేనేజర్ గణేష్, ప్రధాన ఇంజినీర్ దేశ్ రతన్ గుప్తాతో కలిసి గురువారం ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 110 కి.మీ వేగం నుంచి 130 కి.మీ వరకు పరిశీలించారు. చివరకు 143 కి.మీ వరకు నడిపారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా ప్రయాణ సమయం తగ్గతుందని, తద్వారా ప్యాసింజర్ల విలువైన సమయం ఆదా కానుంది. సంతృప్తికరం ట్రయల్ రన్ గురించి శుక్రవారం రైల్వే జీఎం బీజీ మాల్య మీడియాతో మాట్లాడారు. చెన్నైగూడూరు మార్గంలో అన్ని స్టేషన్లలో ఇంటర్‌లాకింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచామని తెలిపారు. ట్రాక్, సిగ్నల్, టీఆర్డీ, రోలింగ్ స్టాక్‌ల నిర్వహణ అవసరం పెరిగినట్లు వివరించారు. ఈ మార్గంలో వేగంగా సాగిన ట్రయల్ రన్ సంతృప్తిని కలిగించిందన్నారు. వేగం పెరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, హౌరా, ముంబై వైపుగా వెళ్లే అనేక రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపారు. తదుపరి పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతిని కలిపే విధంగా చెన్నై–రేణిగుంట మార్గంలో వేగం పెంపునకు ట్రయల్ రన్ నిర్వహించనున్నామని తెలిపారు. ఆ తర్వాత అరక్కోణం–జోలార్‌పేట–పొత్తనూరు, సేరనూర్, తిరువనంతపురం, ఆలపులా, మంగళూరు తదితర మార్గాలపై దృష్టి పెడతామన్నారు. చివరగా, ఎగ్మూర్ నుంచి విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్ మార్గంలో వేగం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా రైళ్లు నడిపేందుకు తగ్గ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని తెలిపారు. చదవండి: క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! -
ట్రయల్ రన్లో దూసుకెళ్లిన ‘వందే భారత్’.. 180 కిలోమీటర్ల వేగంతో రికార్డ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ మూడో ప్రాజెక్ట్ ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. ఈ ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసి ఔరా అనిపించింది. ట్రయల్ రన్లో రైలు వేగాన్ని చూపుతున్న వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. 2019లో తొలి వందేభారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ- వారణాసి మధ్య దీన్ని నడుపుతున్నారు. ఢిల్లీ- జమ్మూలోని వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా రాజస్థాన్‌లోని కోటా- మధ్యప్రదేశ్‌లోని నగ్దా మధ్య మూడో రైలు నడపనున్న నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది ట్రైను. రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్ చేసి దాన్ని రైలు కిటికీ పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. आत्मनिर्भर भारत की रफ़्तार… #VandeBharat-2 at 180 kmph. pic.twitter.com/1tiHyEaAMj — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022 Superior ride quality. Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022 ఇదీ చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు -
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంపునకు CMRS గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంటకు 80 కి.మీ నుంచి 90 కి.మీకి స్పీడ్ పెంచుకునేందుకు CMRS అనుమతిచ్చింది. అయితే, మార్చి 28,29,30 తేదీల్లో మెట్రో రైలు స్పీడ్, సెక్యూరిటీని అధికారులు పరిశీలించారు. తనిఖీల అనంతరం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో స్పీడ్‌ను పెంచుకునేందుకు అనుమతించింది. కాగా, మెట్రో రైలు స్పీడ్ పెంపుతో ప్రయాణికులకు ట్రావెల్ సమయం ఆదా కానుంది. నాగోల్-రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్-ఎల్బీనగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య ఒకటిన్నర నిమిషం ఆదా అవుతుంది. ఇదిలా ఉండగా.. ప్రయాణికులు కోసం సూపర్ సేవర్ కార్డును మెట్రో ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డుతో హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య సెలవు రోజుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. -
మూడు రెట్లు పెరగనున్న గ్యాస్ వినియోగం
న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా 174 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్ (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను వినియోగిస్తుండగా.. 2030 నాటికి 550 ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుందని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ తెలిపారు. ఈటీఎనర్జీ వరల్డ్ గ్యాస్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నికరంగా సున్నా స్థాయికి తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుద్ధమైన, తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనున్నట్టు రంగనాథన్ చెప్పారు. ‘‘ప్రధాన ఇంధనాల మిశ్రమం నుంచి బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పుడు స్పష్టమైన విధాన మార్గదర్శకత్వం ఉంది. నికర సున్నా స్థాయికి ఉద్గారాలను తగ్గించడంలో గ్యాస్‌తోపాటు బ్లూ హైడ్రోజన్, అమ్మోనియా గొప్ప పాత్రను పోషించబోతున్నాయి’’ అని చెప్పారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను ప్రస్తుతమున్న 6.2 శాతం నుంచి 2030 నాటికి 15 శాతానికి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశీయంగా పెరగనున్న ఉత్పత్తి ‘‘ప్రస్తుత 174 ఎంఎంఎస్‌సీఎండీ డిమాండ్‌లో ఎక్కువ భాగం ఫెర్టిలైజర్ ప్లాంట్లు, పట్టణ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లు, విద్యుత్ యూనిట్ల నుంచే వస్తోంది. ఇందులో 49 ఎంఎంఎస్‌సీఎండీ దేశీయంగా ఉత్పత్తి అవుతుంటే, మిగిలినది ఎల్ఎన్జీ దిగుమతుల రూపంలో సమకూర్చుకుంటున్నాం. 2029–30 నాటికి దేశీయంగానే సరఫరా 380ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుంది’’ అని రంగనాథన్ వివరించారు. -
అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది
రోల్స్ రాయిస్‌కు చెందిన 'స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్' ఎలక్ట్రిక్ ఫ్లైట్ ఇప్పటి వరకు అన్నీ రికార్డ్లను తుడిచిపెట్టింది. మూడు సరి కొత్త ప్రపంచ రికార్డ్లను క్రియేట్ చేసి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ప్రసిద్ధికెక్కింది. ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ATI) సంస్థ నిధుల్ని అందించింది. ఆ నిధులతో రోల్స్ రాయిస్ 'యాక్సిలరేటింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్' పేరుతో స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఎలక్ట్రిక్ ఫ్లైట్‌ను తయారు చేసింది. అయితే తాజాగా యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోస్కోంబ్ డౌన్ ఎయిర్‌క్రాఫ్ట్ టెస్టింగ్ నిర్వహించింది. ఈ టెస్టింగ్‌లో రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ విమానం 3 కిలోమీటర్లను 555.9 కేఎం/హెచ్ (345.4 ఎంపీహెచ్ ) అత్యధిక స్పీడ్‌తో అధిగమించింది. దీంతో ఇప్పటికే ఉన్న రికార్డ్‌ను 213.04 కేఎం/హెచ్ (132ఎంపీహెచ్) బద్దలు కొట్టింది. అంతేకాదు విమానం 532.కేఎం/హెచ్ (330 ఎంపీహెచ్) స్పీడ్‌తో 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి ఈ అరుదైన ఫీట్‌ను సాధించగా, ఒకే సమయంలో 3000 కిలోమీటర్ల ఎత్తును ఒకేసారి 60 సెకన్ల నుంచి 202 సెకన్ల సమయంలో అధిగమించింది. రికార్డ్‌ను క్రియేట్ చేసే సమయంలో విమానం 623కేఎం/హెచ్ (387.4ఎంపీహెచ్) గరిష్ట వేగాన్ని అందుకుంది. తో ఇదే ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌గా నిలిచింది. ఈ రికార్డ్లను వరల్డ్ ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ రికార్డులను నియంత్రించే, ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ - ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (FAI)రోల్ రాయిస్ రికార్డ్లను ధృవీకరించాయి. చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎలక్ట్రిక్ స్కూటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
ఈ ఎలక్ట్రిక్ కారు స్పీడ్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో చాలా కంపెనీలు తక్కువ ధరకు మంచి ఫీచర్స్ తో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ భూమి మీద అత్యంత వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ కారు ఉంది అంటే అది "Rimac Nevera" అని చెప్పుకోవాలి. దీని గరిష్ఠ వేగం గంటకు 412 కి.మీ. ఇప్పుడు ఈ వేగాన్ని 'లిటిల్ జెయింట్' అనే ఎలక్ట్రిక్ కారు అధిగమించింది. ఇటీవల పరీక్ష సమయంలో ఈ కారు వేగం గంటకు 574.5 కిలోమీటర్లుగా ఉంది. టీమ్ వెస్కో 444 రీవోల్ట్ సిస్టమ్స్ రూపొందించిన 'లిటిల్ జెయింట్' ఎలక్ట్రిక్ వాహనం అమెరికాలో ఫుల్ బ్యాటరీతో నడిచే అత్యంత వేగం గల ఈవీగా రికార్డును బద్దలు కొట్టింది. 'లిటిల్ జెయింట్' గంటకు 574.5 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకింది. ఈ లిటిల్ జెయింట్ కారు 1,152 ప్రిస్మాటిక్ లిథియం-అయాన్ బ్యాటరీల చేత నడుస్తుంది. అయితే, పెట్రోల్ తో నడిచే వాహనంతో పోలిస్తే దీని వేగం తక్కువ. భూమి మీద అత్యంత వేగంగా నడిచే కారు పేరు ThrustSSC. దీని గరిష్ఠ వేగం తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ ThrustSSC కారు గంటకు 1227.9 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. (చదవండి: భారత రోడ్లపై చక్కర్లు కొడుతున్న టెస్లా కారు!) -
ఒక్కో కాలేజీకి.. 20 ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వేగం పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభ మయ్యేలా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు రెండు నెలల్లో వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని సమకూర్చాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి వైద్య పరికరాలు, సామగ్రిని అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలం గాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ ఐడీసీ) ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అలాగే విద్యార్థులకు హాస్టళ్ల వసతిని అద్దె భవనాల్లో కల్పించాలని నిర్ణ యించారు. దీని కోసం ఆ కాలేజీలకు సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు కూడా ఆ పనిలో నిమగ్నమయినట్లు అధికారులు తెలిపారు. టీఎస్ఎంఎస్ఐడీసీ అసంతృప్తి... రాష్ట్రంలో ఒకేసారి ఏడు కాలేజీలు, 1,050 సీట్లు పెరగడం ఇదే తొలిసారి. కొత్త కాలేజీ భవనాలను నిర్మించే బాధ్యత రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. వాస్తవంగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టీఎస్ఎంఎస్ఐడీసీ ఉన్నా, దాని సామర్థ్యం ఆ మేరకు లేకపోవడంతో ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో టీఎస్ఎంఎస్ఐడీసీలో అసంతృప్తి నెలకొంది. కాగా, ఒక్కో కాలేజీ కోసం 20 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అందుకోసం భూ సేకరణ జరుగుతోంది. జగిత్యాలలో గోదాముల స్థలాన్ని తీసుకోవాలని నిర్ణయించి, ఫైలు ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. తొలి ఏడాది తరగతుల ప్రారంభానికి ముందే జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు చేస్తుంది. కాబట్టి ఆ తనిఖీల నాటికి లెక్చరర్ హాళ్లు, లైబ్రరీ, డెమో రూములు, పరిపాలనా కార్యాలయం తదితరాలను సమకూర్చాలి. అదనపు పడకల ఏర్పాటుపై దృష్టి... ఇక మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆసుపత్రులను స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేస్తారు. అయితే ప్రతీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రికి తప్పనిసరిగా 330 పడకలు ఉండాలి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలోనే 400 పడకలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పడకల సమస్య లేదు. వనపర్తి, జగిత్యాల ఆసుపత్రుల్లో 150 పడకల చొప్పున, మహబూబాబాద్‌లో 170, నాగర్‌కర్నూలులో 120, కొత్తగూడెంలో 100, మంచిర్యాలలో 200 మాత్రమే ఉన్నాయి. వీటన్నింటిలో అదనంగా పడకలను నెలకొల్పాల్సి ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిల్లో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి పడకల ఏర్పాటు పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలను జారీచేసేందుకు ఆర్థికశాఖకు ఫైలు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇక కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి కోసం దరఖాస్తు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 9 కొత్తగా వచ్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 7 మొత్తం ప్రభుత్వ కాలేజీల సంఖ్య 16 వీటిల్లోని ఎంబీబీఎస్ సీట్లు1,640 వీటిల్లో 150 చొప్పున అందుబాటులోకి వచ్చే ఎంబీబీఎస్ సీట్లు 1,050 మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య : 2,690 ఒక్కో ఆసుపత్రికి సిబ్బంది ఇలా... కావాల్సిన ప్రొఫెసర్ల సంఖ్య 6 అసోసియేట్ ప్రొఫెసర్ల సంఖ్య 17 అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య 31 7 మెడికల్ కాలేజీలకు కావాల్సిన వారు 377 పలుచోట్ల నుంచి సరెండర్ ద్వారా సమకూరినవారు 115 కాంట్రాక్టు పద్ధతిన నియమించు కోనున్నవారు 262 -
కరోనా ఉధృతి: ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతోంది: కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వృద్ధిని తెలియజేసే ఆర్ ఫ్యాక్టర్ (రీప్రొడక్టివ్ నంబర్) పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ సహా 8 రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. కోవిడ్ సోకిన ఒక వ్యక్తి సగటున ఎంతమందికి వ్యాధిని వ్యాప్తి చేస్తున్నాడన్న విషయాన్ని వైద్య పరిభాషలో ఆర్ ఫ్యాక్టర్‌గా చెబుతారు. ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కంటే తక్కువ ఉంటే కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని ఒకటికంటే ఎక్కువ నమోదైతే వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందని అర్థం. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సూచిస్తోంది. దేశంలో సెకెండ్ వేవ్ ఇంకా ముగియలేదని అధికారులు పేర్కొంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 4.7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. భారత్‌లో సైతం 44 జిల్లాల్లో వారాంతపు పాజిటివిటీ రేటు 10కి పైగా నమోదవుతోందని కేంద్రం తెలిపింది. మరోవైపు గత నాలుగు వారాలుగా కేరళ, మహారాష్ట్ర, మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్‌లలోని 18 జిల్లాల్లో కరోనా కేసులు ఆరోహణ క్రమంలో పెరుగుతూ రావడం కూడా ఆందోళనకరమని చెప్పింది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 50శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. 42,625 మందికి కరోనా పాజిటివ్ దేశవ్యాప్తంగా బుధవారం నాటి గణాంకాల ప్రకారం మరో 42,625 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,17,69,132కు చేరుకుందని కేంద్రం తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి బారిన పడిన మరో 562మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,25,757కు పెరిగాయి -
BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా
ముంబై: జర్మనీ విలాస వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మంగళవారం భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. ‘‘ఎస్ 100 ఆర్’’ పేరుతో వస్తున్న ఈ ప్రీమియం బైక్ ధర రూ.17.9 లక్షలుగా ఉంది. కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) రూపంలో భారత్‌లోకి దిగుమతి అవుతోంది. స్టాండర్డ్, ప్రో, ప్రో ఎం స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో కొత్తగా డెవలప్ చేసిన వాటర్ కూల్డ్ 4–సిలిండర్ ఇన్–లైన్ ఇంజిన్‌ను అమర్చారు. 3 సెకన్లలో బీఎండబ్ల్యూ ఎస్ 100 ఆర్ బైకు కేవలం 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగం ప్రయాణించగలదు. ప్రీమియం బైకులను కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకొని రెండో తరానికి చెందిన బీఎండబ్ల్యూ ఎస్ 100 ఆర్ బైక్‌లను రూపొందించామని భారత్ విభాగపు ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉండే అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌ల వద్ద కొత్త మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
అమ్మ బాబోయ్.. రైలు వేగానికి స్టేషన్ భవనం కూలింది
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్ అందరు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన బుర్హన్‌పూర్ జిల్లాలోని చందాని రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే భూసవాల్ రైలు డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేపానగర్-అసిగర్ మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ 110 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ గుండా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సుమారు 14 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేషన్ భవనం రైలు వేగంగా వెళ్లడంతో ఆ ప్రకంపనలను తట్టుకోలేక కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందు రైలుకు గ్రీన్ సిగ్నల్ చూపించడానికి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ప్రదీప్ కుమార్ పవార్ తన కార్యాలయం నుంచి బయటికు రావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు భవనంలో ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ తరహా ఘటన జరగడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. జీఆర్పీ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కారణంగా పుష్పక్ రైలును 30 నిమిషాల పాటు రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లూప్ లైన్ ద్వారా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. చదవండి: ‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’ -
అతి వేగానికి బ్రేకులు..
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై అతి వేగంతో దూసుకెళ్లే వాహనాలకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. నిర్దేశించిన వేగ పరిమితిని దాటితే భారీ జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం హైవేలపై టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఎంత వేగంతో వాహనం ప్రయాణిస్తుందో తెలుసుకోనున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని పోలీసులు రహదారి భద్రత కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రత నిధి నుంచి రూ.6 కోట్లతో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను కొనుగోలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి ఓ అధికారిని నామినేట్ చేయాలని కోరింది. హైవేలపై నిర్దేశించిన వేగానికి అనుగుణంగానే ఇకపై వాహనాలను నడపాల్సి ఉంటుంది. ఇప్పటివరకు హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో కార్లు వెళ్లేందుకు అనుమతి ఉండగా, దాన్ని 100 కి.మీ.కు. ద్విచక్ర వాహనాలకు 60 కి.మీ. నుంచి 80 కి.మీ.కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. బస్సులు, లారీలు కూడా గంటకు 80 కి.మీ. వేగంలోపే ప్రయాణించాల్సి ఉంటుంది. హైవేలపై ఆటోలు ప్రయాణించడానికి వీల్లేదు. అయినా కొన్నిచోట్ల ఆటోలు హైవేలపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ల ద్వారా వేగ నిర్ధారణ హైవేలపై వాహనాలు ఎంత వేగంతో వెళుతున్నాయో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు అంచనా వేస్తాయి. ఒక టోల్‌ప్లాజా నుంచి మరో టోల్‌ప్లాజాకు ఎంత సమయంలో చేరుతున్నాయో శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. దీన్నిబట్టి అతివేగానికి భారీ జరిమానాలు విధించనున్నారు. తొలుత ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా), ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్) మధ్య ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకే.. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని దీనిపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో జాతీయ రహదారులపై 38 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ–విశాఖ (ఎన్‌హెచ్–16), విజయవాడ–హైదరాబాద్ (ఎన్‌హెచ్–65) మధ్య హైవేలపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అంచనా. గతేడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు మొత్తం 17,910 జరిగితే 7,059 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో విజయవాడ–విశాఖ మధ్య 6,843 రోడ్డు ప్రమాదాల్లో 1,866 మంది, విజయవాడ–హైదరాబాద్ మధ్య 4,589 రోడ్డు ప్రమాదాల్లో 1,235 మంది మృతి చెందారు. అతివేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమంటున్న రవాణా శాఖ ఇక వేగ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టనుంది. స్పీడ్ గన్లు, టోల్‌ప్లాజాల్లో బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేసి వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. చదవండి: పట్టణాలకు కొత్తరూపు మారుమూల పల్లెలకు బడిబస్సులు -
1జీబీ స్పీడ్‌తో దూకుడు : జియో, క్వాల్కామ్ జట్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీ మొబైల్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రిలయన్స్ జియో, క్వాల్కామ్ టెక్నాలజీస్ వెల్లడించాయి. క్వాల్కామ్ 5జీ ఆర్ఏఎన్ ప్లాట్‌ఫాంపై రిలయన్స్ జియో 5జీఎన్ఆర్ సొల్యూషన్ తో 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌ను సాధించగలిగినట్లు తెలిపాయి. మరింత వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్కు 5జీ టెక్నాలజీ తోడ్పడుతుంది. దేశీ అవసరాలకు అవసరమైన 5జీ సొల్యూషన్స్, నెట్వర్క్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియోవెల్లడించింది. స్థానికంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, ఆత్మనిర్భర భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ తెలిపారు. క్వాల్కమ్ టెక్నాలజీస్, 4జీ /5జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్ దుర్గా మల్లాడి కూడా సంతోషం వ్యక్తం చేశారు. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ] -
'డెత్' స్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 196 ఫాటల్ యాక్సిడెంట్స్ (మరణాలు సంభవించిన ప్రమాదాలు) జరిగాయి. వీటిలో అత్యధికంగా 119 (60.71 శాతం) అతివేగంతోనే (ఓవర్ స్పీడ్) చోటుచేసుకున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్‌తో 46 ప్రమాదాలు జరగ్గా... డ్రంకన్‌డ్రైవ్‌తో 12 మందిమృత్యువాతపడ్డారు. మైనర్లు డ్రైవింగ్ చేసిన కారణంగా ఆరుగురు మృతి చెందారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ విభాగం చీఫ్ అనిల్‌కుమార్ గురువారం వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ఫాటల్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గాయని చెప్పారు. యాక్సిడెంట్స్ చోటుచేసుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారి భద్రత నిపుణులు నిబంధనల ఉల్లంఘనలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహన చోదకుడికి ముప్పుగా మారేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పుగా మారేవి. రెండు, మూడో తరహా ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ ఉల్లంఘన అయితే వాహనం నడిపే వారితో పాటు ఏ పాపం ఎరుగని ఎదుటి వారికీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందో వాటిపై వరుసపెట్టి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టారు. దీని ప్రభావం సైతం రోడ్డు ప్రమాదాలు తగ్గడంపై ఉందని ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు కేవలం ప్రమాదాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు/ వాహన చోదకులకు ఎదురవుతున్న ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకున్నారు. వీటిని నిరోధించడానికి ఈ ఏడాది చర్యలు తీసుకున్నారు. ఆ తరహా ఉల్లంఘనలపైనా పలుమార్లు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రధానంగా రహదారులపై నడిచే పాదచారుల కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఆక్రమణల తొలగింపు, మౌలిక వసతుల కల్పన తదిరాలతో ప్రమాదాల సంఖ్యను తగ్గించగలిగారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఫలితంగానే గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలివీ... ♦ నగరంలోని 174 విద్యాసంస్థల్ని సందర్శించిన అధికారులు 88,721 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ♦ సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా నగరంలో మొత్తం 60 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. ♦ ఈ ప్రాంతాల్లో పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ♦ ఆయా విభాగాల సహకారం, సమన్వయంతో కీలక ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్, క్యారేజ్‌వేలు, కాజ్‌వేలు ఏర్పాటు చేయించారు. ♦ బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్స్ ప్రాంతంలో ఎన్‌హెచ్ నంబర్ 44పై గార్డ్ రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ♦ టిప్పుఖానా–రామ్‌దేవ్‌గూడ మధ్య వీధి లైట్లు, మార్కింగ్స్ ఏర్పాటు చేయించారు. ♦ రాజ్‌భవన్ రోడ్లో డివైడర్‌పై పాదచారుల కోసం పెడస్ట్రియన్ గార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ♦ మిధానీ పరిధిలోని ధాతునగర్‌లో సెంట్రల్ మీడియన్ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ♦ మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు దాటే వారు వాటికి సంబంధించిన మెట్లు, ఎలివేటర్స్, ఎస్కలేట ర్స్ వినియోగించేలా ప్రోత్సహించారు. ♦ ఎన్టీఆర్ మార్గ్‌లో, టోలిచౌకి వద్ద రంబ్లర్ స్ట్రిప్స్, సైనేజెస్ ఏర్పాటు చేశారు. సమన్వయంతో పని చేస్తున్నాం నగరంలో ప్రమాదాలను తగ్గించడానికి అన్ని విభాగాలతో కలిసి పని చేస్తున్నాం. ట్రాఫిక్ విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేయడం ద్వారా సమస్యలు గుర్తించి ఆయా ప్రభుత్వ సంస్థల సాయంతో వాటిని పరిష్కరించడం ఫలితాలు ఇచ్చింది. బ్లాక్‌స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అవసరమైన చర్యలు తీసుకున్నాం. మైనర్ డ్రైవింగ్, డ్రంకన్డ్రైవ్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాం. రాంగ్ సైడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా నడపటం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్... ఇవన్నీ అత్యంత ప్రమాదకరం. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠిన చర్యలు చేపట్టాం. ఫలితంగా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గించగలిగాం. – అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలో సుమారు వందకు పైగా రైళ్ల వేగాన్ని పెంచారు. కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 125 నిమిషాల వరకు వేగం పెరగడం గమనార్హం. దూరప్రాంతాల మధ్య పరుగులు తీసే రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచారు. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్ల వేగం మాత్రం 10 నుంచి 15 నిమిషాల వరకే పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు ముంబై చేరుకొనే దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి అదే సమయానికి గమ్యంచేరుకుంటుకుంది. నగరం నుంచి బయలుదేరే ప్రయాణికుల సదుపాయం కోసం ఇక్కడి నుంచి బయలుదేరే సమయాన్ని మధ్యాహ్నం 12 నుంచి 1.25 గంటలకు పొడిగించారు. కానీ పాత సమయం ప్రకారమే అది గమ్యం చేరుకుంటుంది. అంటే ట్రైన్ వేగం గంటకు పైగా పెరగడమేఇందుకు కారణం. అలాగే సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నర్సాపూర్–నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ 25 నిమిషాల వేగం పెరిగింది. సికింద్రాబాద్–నాగ్‌పూర్, సికింద్రాబాద్–రాజ్‌కోట్, కాచిగూడ–మధురై తదితర రైళ్ల వేగం సైతం 15 నుంచి 30 నిమిషాల వరకు వేగం పెరిగాయి. పటిష్టమైన ట్రాక్‌లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం గల కోచ్‌లు, సమయాభావాన్ని నియంత్రించే నిర్వహణతో మన రైళ్ల పరుగులో వేగం పెరిగింది. పెరిగిన పట్టాల సామర్థ్యం ద.మ. రైల్వే పరిధిలో ప్రతిరోజు 744 రైళ్లు తిరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్, ట్రాక్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఏటా రైళ్ల సమయపాలనలో మార్పులు చేస్తున్నారు. జోన్ పరిధిలో మొత్తం 6,234 కి.మీ ఉండగా, ఇప్పటి వరకు 3.538 కి.మీ విద్యుదీకరించారు. మరో 2,777 కి.మీ మార్గాన్ని విద్యుదీకరించేందుకు ప్రణాళికలను రూపొందించారు. దీంతో రైళ్ల వేగం పెరిగింది. బ్రిటీష్ కాలం నాటి గ్రాండ్ ట్రంక్ పట్టాల పునుద్ధరణతో పట్టాలపై ఎక్కువ రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించింది. అలాగే కాపలాలేని రైల్వేగేట్లను తొలగించడం కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం లకుండా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపర్చారు. కలిసొచ్చిన బైపాస్ రూట్లు చాలాచోట్ల సుదీర్ఘమైన రైలు మార్గాలను కుదించడం వల్ల కొంత సమయం కలిసొచ్చింది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖకు రాకపోకలు సాగించే రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లాలి. అయితే, రాయనపాడు నుంచి వాటిని నేరుగా విశాఖ వైపు మళ్లించడం వల్ల విజయవాడకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. దూరం తగ్గడంతో రైళ్ల సమయ పాలనలోనూ మార్పు వచ్చినట్టు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాజీపేట్, బల్లార్ష మీదుగా వచ్చి బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్‌తో సంబంధం లేకుండా మౌలాలీ నుంచి కాచిగూడ మీదుగా వెళ్లేలా మార్పులు చేయడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు సమయం కలిసొచ్చింది. ఏపీ సంపర్క్ క్రాంతి వంటి పలు రైళ్లు నేరుగా కాచిగూడ మీదుగా బయలుదేరుతున్నాయి. గౌతమి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లకు సికింద్రాబాద్‌లో కాకుండా లింగంపల్లి రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఇచ్చారు. దీనివల్ల సికింద్రాబాద్ వద్ద రైళ్లను టర్మినేట్ చేసి యార్డుకు మళ్లించే సందర్భంగా చోటుచేసుకొనే జాప్యానికి తావు లేకుండా పోయింది. మరోవైపు గంటకు 120 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లలేని పాతకాలం నాటి కన్వెన్షనల్ ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లింక్ హాఫ్‌మెన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ప్రవేశపెట్టడం వల్ల రైళ్ల సామర్థ్యం గంటకు 140 కి.మీ పెరిగింది. కొన్నింటిలో 160 కిలోమీటర్లు కూడా పెరగడం గమనార్హం. ‘ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. నిరంతర ప్రణాళికలు, కార్యాచరణలో తగిన మార్పులు చేసుకోవడం, అన్నింటికీ మించి లైన్ల సామర్థ్యాకి చేపట్టిన చర్యలతో రైళ్ల వేగం క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్‌లో మన పట్టాలపై మరింత వేగంతో పరుగులు తీసే రైళ్లు అందుబాటులోకి వస్తాయి’ అని ద.మ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. వేగం ఇలా పెరిగింది.. ♦ జోన్ పరిధిలో మొత్తం 100 రైళ్ల వేగంలో మార్పులు చేశారు. కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 125 నిమిషాల వరకు ఈ వేగం ఉంది. ♦ 68 ఎక్స్‌ప్రెస్‌ల సగటు వేగం 23 నిమిషాలు పెరగ్గా, మరో 32 ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 25 నిమిషాల వరకు పెరిగింది. ♦ మొత్తం 100 రైళ్లలో 58 రైళ్ల వేగం 15 నిమిషాల వరకు పెరగ్గా, మరో 21 రైళ్ల వేగం 15 నుంచి 30 నిమిషాల వరకు పెంచారు. మరో 15 రైళ్ల వేగం 30 నుంచి 60 నిమిషాల వరకు పెరిగింది. ♦ యశ్వంత్‌పూర్–టాటానగర్ (18112) ఎక్స్‌ప్రెస్ వేగం ఏకంగా 125 నిమిషాలు పెరగడం విశేషం. ♦ సికింద్రాబాద్–ముంబై సీఎస్టీ, గుంటూరు–విశాఖ, సికింద్రాబాద్–దేవగిరి, సికింద్రాబాద్–రాజ్‌కోట్, తదితర రైళ్ల వేగం గంట వరకుపెరిగింది. ♦ ఈ రైళ్లన్నీ గతంలో నిర్థారించిన సమయపాలన కంటే తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో వెళుతున్నాయి. ట్రాక్ సామర్థ్యం, రైళ్ల నిర్వహణ పెరగడమే ఇందుకు కారణం. -
అతివేగం తెచ్చిన అనర్థం
సాక్షి, మదనపల్లె టౌన్ : అతివేగం కారణంగా ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు, డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ములకలచెరువు మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఇన్చార్జి ఏఎస్ఐ శ్రీహరి కథనం మేరకు.. మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏ–1 క్లర్క్ బి.పాండురంగయ్య(56), లైటింగ్ సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న జి.నాగరాజ(58), ఆయన భార్య జి.రెడ్డీశ్వరి(ఏ–1 క్లర్క్)లు అనంతపురంలో సోమవారం మున్సిపల్ ఆర్డీ నిర్వహిస్తున్న బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మదనపల్లె నుంచి బొలెరో వాహనంలో బయలుదేరారు. వాహనం ములకలచెరువు మండలం వేపూరికోట వద్ద వెళుతున్న సమయంలో ముందు వెళుతున్న స్కూటర్‌ను అధిగమించబోయి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బి.పాండురంగయ్య, నాగరాజ, రెడ్డీశ్వరితో పాటు బొలెరో వాహన డ్రైవర్ సురేంద్ర(29) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న బి.కొత్తకోట 108 సిబ్బంది రాజు, లోకేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెడ్డీశ్వరి గాయపడిన వారిలో పాండురంగయ్య, రెడ్డీశ్వరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. క్షతగాత్రులను మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, డీఈ మహేష్‌తో పాటు సహచర ఉద్యోగులు పరామర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ములకలచెరువు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
విభిన్న బైక్‌లు.. విశిష్ట హంగులు
మాదాపూర్: యూత్ అంటేనే దూకుడు. ఆపై బైక్ ఉంటే దానికి కళ్లెమే ఉండదు. కిక్ కొడితే చాలు కిక్కెక్కించే సూపర్ మోడళ్లు ఇటీవల హైదరాబాద్ నగర విపణిలోకిఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. పలు ఇంటర్నేషనల్ సూపర్ బైక్‌లు అదరగొడుతున్నాయి. లెజెండరీ ఎంవీ అగస్టా నుంచి సూపర్ స్పోర్ట్స్, స్ట్రీట్ నెకెడ్, నార్టన్ మోటార్ సైకిల్స్, క్లాసిక్స్ బెస్ట్ ఇన్ క్లాస్ ఎస్డబ్ల్యూఎం నుంచి ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ చార్మింగ్ ఎఫ్బీ మోండియల్ నుంచి హిప్స్టార్స్, హ్యోసంగ్ నుంచి క్రూయిజర్లు, స్పోర్ట్స్ బైక్‌లు యూత్నుఆకట్టుకుంటున్నాయి. బైక్‌లను ఇష్టపడే ఔత్సాహికులకు కావాల్సిన అన్ని రకాల వాహనాలు రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మల్టీబ్రాండ్ సూపర్ బైక్‌ల తయారీదారు కైనటిక్ తన మోటో రాయల్‌ను తీసుకొచ్చింది. దీంతో నగరంలోని యువతరయ్రయ్మంటూ దూసుకెళ్తున్నారు. కాగా..అతి వేగం, ప్రమాదకర విన్యాసాలు ముప్పు అనేవిషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరముంది. కేవలం లగ్జరీ, అందం కోసమే వీటిని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్‌పీఎస్ 300.. ♦ శక్తిమంతమైన సింగిల్ సిలిండర్ 250 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ♦ 147 కిలోల బరువుతో, గాలితో పోటీ పడుతూ ప్రయాణించే వీలు ♦ బాస్, ఏబీఎస్ మాడ్యులర్తో ఫ్రంట్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ♦ త్రోటరీ ఎగ్జాస్ట్ నోట్‌తో పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ♦ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్‌తో విలక్షణ, అందమైన హిప్స్టర్ డిజైన్ నార్టన్ డామినేటర్.. ♦ నార్టన్ డామినేటర్ రెండు సిలిండర్ల సూపర్ బైక్. ♦ 961 సీసీ ఇంజిన్ పరిమాణం, గరిష్ట టార్కు 67ఎన్ఎం, 70.94బీహెచ్పీ. హ్యోసంగ్.. ♦ కొరియాకు చెందిన అతి పెద్ద మోటార్ సైకిల్ బ్రాండ్. ♦ క్రూయిజర్లు, 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ల తయారీలో ప్రత్యేకత ♦ హ్యోసంగ్‌కు దేశంలో దీనిని 7 వేల మంది వినియోగిస్తున్నారు ♦ మరింత విస్తరించేందుకు మోటో రాయల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఎక్విలా ప్రో 650.. ఎక్విలా ప్రో 650 ఎక్విలా సిరీస్‌లో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైంది ♦ ఇది 647 సీసీ, 8 వాల్వుల ఇంజిన్ 73 బీహెచ్‌సీ, 62 ఎన్ఎమ్ టార్కు ♦ ఇది బెల్డ్‌తో నడుస్తుంది. ఫై స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. ♦ క్రూయిజర్‌ను పెరిమీటర్ ట్యూబ్యులార్ స్టీల్ క్రాడెల్పై నిర్మించారు. ఆఫ్ సైడ్ డౌన్స్ టెలిస్కోపిక్ ఫ్రండ్ సస్పెస్షన్, హైడ్రాలిక్ డబుల్ షాక్ అబ్జర్వర్లు వెనక వైపు ఉండేలా రూపొందించారు ఎస్డబ్ల్యూఎం.. ఎస్డబ్ల్యూఎం సిరోని వెర్గానీ వెర్మకేట్ మిలానోకి సంక్షిప్త రూపం. ఇటాలియన్ బ్రాండ్‌కు చెందిన స్పీడీ వర్కింగ్ మోటార్స్‌ను 1970లో ఆప్ రోడ్ విభాగం కోసం ప్రత్యేక ఉత్పత్తిని ప్రారంభించారు. ఎస్డబ్ల్యూఎం ప్రస్తుతం మిలాన్కో సమీపంలోని వెర్షేలో ఉండగా బీఎండబ్ల్యూ హుస్కురానా పరిశ్రమను సొంతం చేసుకుంది. ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్స్ విభాగంలో ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా గుర్తింపు పొందింది. అతివేగం.. ప్రమాదకరం.. మార్కెట్లోకి వివిధ రకాల సూపర్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ ఎక్కువ సీసీతో కలిగిన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. యువత సరదా కోసం బైక్ రైడ్ చేయాలే తప్ప రోడ్లపై మితిమీరిన వేగంతో, విచిత్ర విన్యాసాలు చేయకూడదు. – మధుసూదన్‌రావు,ఐటీ ఉద్యోగి, బైక్ రైడర్ -
వేగం.. తీస్తోంది ప్రాణం!
మహబూబ్‌నగర్ క్రైం/ వనపర్తి క్రైం : దేశంలో రోగాల బారినపడి చనిపోయేవారి కన్నా.. ప్రమా దాల్లో మరణించే వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. కానీ మృత్యువుకు ఎదురెళ్లాలని ఎవరూ కోరుకోరు.. అయితే అస్తవ్యస్త రహదారులు, అధికారు ల అలసత్వం, వాహనదారుల నిర్లక్ష్యం ఎంతోమందిని బలిగొంటోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నా ఉన్నతాధికారులు తమ కుర్చీ వీడటంలేదు. నిగనిగలాడే రహదారులు.. గంటకు 100–150 కి.మీ వేగం అందుకోగల వాహనాలు.. ఇంకేముంది డ్రైవర్ల చేతిలో స్టీరింగ్ కళ్లెం లేనిగుర్రమవుతోంది. మితిమీరిన వేగం ప్రయాణికులకే కాదు ప్రజలకూ ప్రాణాంతకమవుతోంది. అద్భుతంగా రహదారు లు నిర్మించామని గొప్పలు చెప్పుకునే పాలకులు భద్రతా ప్రమాణాలపై నిర్లక్ష్యం చూపడం శాపం గా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన జాతీయ రహదారిపై కనీసం కొన్ని జంక్షన్లలో కనీసం వెలుగునిచ్చే విద్యుత్ లైట్లు లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 185 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ.. అమాయకులు బలైపోతున్నాయి. ఇరువైపులా భారీ వాహనాలు జిల్లాలోని అన్ని రహదారులపై నిబంధనలు అమ లు కావడం లేదు. ముఖ్యంగా రోడ్డు వెంట ఉండే దాబాల ముందు లెక్కకు మించి భారీ వాహనా లు, కార్లు నిలుపుతున్నారు. అక్కడే వాహనాలకు మరమ్మతు, పంక్చర్లు చేసుకోవడమే కాకుండా భోజనం తయారు చేసుకుంటున్నారు. దీంతో రోడ్డు పై వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రహదారి వెంట 24 గంటలు వాహనంలో తిరుగుతూ పర్యవేక్షించాల్సిన (హైవే పెట్రోలింగ్) అధికారులు కనిపించడం లేదు. దీం తో డ్రైవర్లకు నచ్చిన చోట వాహనాలను నిలుపుతున్నారు. వాహనాలను నిలిపి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను తక్కువ మంది వినియోగించుకుంటున్నారు. 65 శాతం దాటుతున్న బాధితులు అంగవైకల్యాలు, అనారోగ్యంతో జబ్బుల బారిన పడుతున్న వారు, ముందస్తు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై సర్వే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిధులు సమకూర్చి 29 రాష్ట్రా ల్లో ఆయా అంశాలపై అధ్యయనం చేశారు. ఇందు లో భారత వైద్య పరిశోధన మండలి, భారత ప్రజారోగ్య ఫౌండేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యుయేషన్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. అంగవైకల్యం, ముందస్తు మరణాలు ఇతర వ్యాధులకు రోడ్డు ప్రమాద క్షతగాత్రుల వేదనలే కారణంగా నిర్ధారించాయి. గతంతో పోల్చితే క్షతగాత్రులు, అంగవైకల్యానికి గురయ్యే వారి సంఖ్య ప్రస్తుతం 65 శాతానికి చేరుకుందని తేల్చాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్, యువత అజాగ్రత్త డ్రైవింగ్, విశ్రాంతి లేకుండా పెద్ద వాహనాలు నడపడంతో ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. అయితే సర్వే ఆధారంగా చూస్తే గాయపడే వారి సంఖ్యలో మూడో వంతుకు పైగా పురుషులే ఉన్నట్లు నివేదికలో తేల్చారు. ప్రమాదకర ప్రాంతాలు ఇవే.. ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను ఆర్టీఏ, పోలీస్ అధికారులు గుర్తిం చారు. వాటిలో తిమ్మాపూర్ ఎక్స్‌రోడ్, ఆశన్నదాబా, తిమ్మార్‌పూర్ క్రాస్‌రోడ్, షాద్‌నగర్ ఎక్స్‌రోడ్, రాయికల్, బాలానగర్ వంతెన దగ్గర, రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, గొల్లపల్లి, కావేరమ్మపేట అర్అండ్బీ అతిథి గృహం, జడ్చర్ల, మల్లెబోయిన్పల్లి, భూత్పూర్, కందూరు, అడ్డాకుల, వెల్టూరు, మోజర్ల, కనిమెట్ట, కొత్తకోట మధర్ థెరిస్సా జంక్షన్, పాలెం, రాణిపేట ఎక్స్‌రోడ్, బీచుపల్లి, ఎర్రవల్లి ఎక్స్‌రోడ్, కొట్టం ఇంజనీరింగ్ కళాశాల, జింకలపల్లి, నారాయణపురం, బోరవెల్లి స్టేజీల దగ్గర నిత్యం లేదో ఒక ప్రమాదం జరుగుతుంది. -
స్పీడ్ రన్!
హైదరాబాద్ మెట్రో రైల్ వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం 30 కేఎంపీహెచ్ (కిలోమీటర్ పర్ అవర్)తో పరుగులు తీస్తోన్న రైలు ఇకపై60 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకోనుంది. ఇప్పుడు నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిరుగుతుండగా దీన్ని8 నిమిషాలకు తగ్గించనున్నారు. మియాపూర్– అమీర్‌పేట్ రూట్లో ప్రతి 8 నిమిషాలకో రైలు పరుగులు పెడుతుండగా ఈ మార్గంలో రైళ్లఫ్రీక్వెన్సీ ఆరు నిమిషాలకు తగ్గించనున్నారు. ఈ రెండు మార్గాల్లో రైళ్ల సంఖ్యను సైతం 16కు పెంచనున్నట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల వేగం కనిష్టంగా ఉండడం, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిబంధనలు ప్రతిబంధకంగా మారడంతో ప్రయాణ సమయం 45–50 నిమిషాలు పడుతోంది. అయితే ఫ్రీక్వెన్సీ, వేగం పెరిగితే ప్రయాణ సమయం 25 నిమిషాలకు తగ్గే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గంలో ప్రయాణానికి 25 నిమిషాల సమయం పడుతోంది. రైళ్ల వేగం, ప్రీక్వెన్సీ పెరిగితే ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గుతుంది. దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలుపై ఈ నెలలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో రోజుకు సరాసరి 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పండగలు, సెలవు దినాల్లో రద్దీ 75 వేల నుంచి లక్ష వరకు ఉంటోంది. జూన్‌లో ఆ రెండు రూట్లలో డౌటే..? అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఈ ఏడాది జూన్ నాటికి మెట్రో రైళ్లను అందుబాటులోకి తేవాలని మెట్రో వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ.. స్టేషన్ల నిర్మాణం, ట్రయల్ రన్ వంటి సాంకేతిక కారణాలతో మరో రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఇక జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో సుల్తాన్ బజార్లో ఆస్తుల సేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో ఈ రూట్లో డిసెంబర్ నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ఇటీవలే లైన్ క్లియర్ కావడంతో ఈ రూట్లో 2020 నాటికే పాతనగరానికి మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో సబ్స్టేషన్లు రెడీ ఎల్బీనగర్–గాంధీభవన్ మార్గంలో మెట్రో స్టేషన్లు, రూటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్(సీఈఐజీ) డీవీఎస్‌రాజు గురువారం తనిఖీ చేశారు. ఎల్బీనగర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీభవన్ మెట్రో స్టేషన్లను పరిశీలించారు. విద్యుదీకరణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్, ఆటోమేటిక్ టిక్కెట్ కలెక్షన్ యంత్రాల ఏర్పాటు, ఆయా వ్యవస్థల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మార్గంలోని మెట్రో స్టేషన్లకు ఎంజీబీఎస్ వద్దనున్న రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. ఈ పనులు పూర్తితో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నట్లు డీవీఎస్‌రాజు తెలిపారు. ఆయన వెంట పి.శ్రీనివాసమూర్తి, ఆనంద తదితరులు ఉన్నారు. -
అతి వేగం.. ప్రాణం తీసింది
రఘునాథపాలెం : అతి వేగం.. అతడిని బలిగొంది. మండలంలోని వీవీ పాలెం వద్ద ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి ఘంటా సాయినా««థ్(20) అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పాల్వంచలోని కేటీపీఎస్ ఉద్యోగి ఘంటా కొండలరావు కుమారుడైన సాయినాధ్, ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (మెకానికనల్) ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన సైదారావుతో కలిసి బైక్‌పై వైరా వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. వీవీ పాలెం వద్ద, ముందు వెళుతున్న వాహనాన్ని దాటేందుకు వేగం పెంచాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఖమ్మం నుంచి వైరా వైపు వెళుతున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. తీవ్ర గాయాలతో సాయినాధ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సైదారావుకు స్వల్ప గాయాలయ్యాయి. సాయినా«ధ్ మృతి విషయం తెలియడంతోనే అతను చదువుతున్న కాలేజీలోని విద్యార్థులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో విగతుడైన సాయినాధ్‌ను చూసి కన్నీరు పెట్టారు. ఈ దుర్వార్తను అతడి కుటుంబీకులకు స్నేహితులు తెలిపారు. గుండెలు పగిలేలా, దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి అర్బన్ ఎస్ఐ రాము తరలించారు. సాయినాథ్ కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మీ స్మార్ట్ ఫోన్ స్పీడ్ తగ్గిందా.. అయితే ఇలా!
నిడమర్రు : స్మార్ట్ ఫోన్ కొత్తలో మంచి స్పీడ్‌గా ఉంటుంది. అప్లికేషన్లు వేగంగా కదులుతాయి, కానీ కొన్ని నెలల వాడకం తర్వాత మీ ఫోన్ స్పందించే తత్వం తగ్గిపోయి, దాని స్పీడ్ నెమ్మదిస్తుంది. అత్యవసరం అయినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదరవుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ వేగంగా పెంచాలంటే అందుకు అవసరమైన సూచనలు నిపుణులు వివరిస్తున్నారు. యాప్స్, వాల్‌పేపర్స్ స్మార్ట్ ఫోన్లో స్టోరేజీ ఉందని నచ్చిన ప్రతీ యాప్ ఇన్స్టాల్ చెయ్యడం వల్ల ఫోన్ వేగం తగ్గుతుంది. అవసరమైన యాప్ మినహా మిగిలినవి అన్ఇన్స్టాల్ చేయండి. లైవ్ వాల్పేపర్లు, హోమ్ స్క్రీన్‌పై కదిలే వాల్ పేపర్లు అధికంగా ఉంచుకోవద్దు. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్.. ఫోన్లోని కొన్ని యాప్స్ ఫోన్‌తో పాటే ప్రారంభం అవుతుంటాయి. కొన్ని ఆన్లైన్ సర్వీసులను వినియెగించుకుంటుంటాయి. ఈ రెండూ స్మార్ట్ ఫోన్ స్లో అయ్యేందుకు కారణం అవుతాయి. బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లో యాప్స్ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లో యాప్స్‌కు వెళ్లాలి. అక్కడ రన్నింగ్ అనే దాన్ని ఎంచుకుంటే బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది. యాండ్రాయిడ్ సాప్ట్వేర్ సహా పలు యాప్స్ రన్ అవుతుంటాయి. అందులో మీకు అవసరం లేనివి ఉంటే వాటిని వెంటనే ఆన్ ఇన్స్టాల్ లేదా డిజేబుల్ చేసుకోవాలి. ♦ అలాగే బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ సింకింగ్ అవుతున్నాయా? లేదా అన్నది గమనించాలి. వీటి సింక్రనైజేషన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. దీనివల్ల డేటాతోపాటు సిస్టమ్ రీసోర్సెస్ కూడా ఆదా అవుతాయి. ఇందుకోసం సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్‌కు వెళ్లాలి. కొన్నింటిలో వైర్లెస్ అండ్ నెట్ వర్క్స్‌లో యూసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్క్రోల్ డౌన్ చేస్తే ఏ యాప్స్ డేటాను ఎక్కువగా వాడుతున్నామనే వివరాలు తెలుస్తాయి. విడిగా ఒక్కో యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సింక్రనైజేషన్‌ను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. యాప్ కిల్లర్‌తో.. అడ్వాన్స్డ్ టాస్క్ కిల్లర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అధికంగా ర్యామ్‌ను వినియోగించుకునే, ఫోన్‌ను స్లో చేస్తున్న ఏ యాప్‌ను అయినా సులభంగా కిల్ చేయవచ్చు. క్యాచే డేటా క్లియర్ చేయాలి యాప్స్‌ను వాడుతున్నప్పుడు క్యాచే డేటా పోగవుతుంది. వాటిని క్లియర్ చేస్తుండాలి. క్యాచే అంటే మీరు ఓ వెబ్సైట్ లేదా యాప్‌ను యాక్సెస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్ క్యాచే ఫైల్స్ రూపంలో నిల్వ చేస్తుంది. తర్వాత మరోసారి అదే వెబ్సైట్ లేదా యాప్‌ను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అంతకుముందు నిల్వ ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే ఓపెన్ చేస్తుంది. క్యాచే డేటా నిల్వ చేయడానికి ప్రధాన కారణం సంబంధిత వెబ్సైట్లు, యాప్స్‌ను తిరిగి ఓపెన్ చేసినప్పుడు వేగంగా లోడ్ చేసేందుకే, ఇందుకోసం యాక్సెస్ చేసిన ప్రతీ సైట్, యాప్ సమాచారం క్యాచేలుగా లోడ్ అయి ఉంటుంది. ఇది అంతా ఫోన్ మెమొరీపై భారాన్ని మోపుతుంది. దీంతో ఎప్పటికప్పుడు క్యాచే డేటా క్లియర్ చేసుకోవాలి అంతర్గత స్టోరేజ్.. స్మార్ట్ ఫోన్లో ఇన్ బిల్ట్‌గా ఉండే స్టోరేజీ పూర్తిగా నిండిపోయినా ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంది. స్టోరేజ్ సున్నాకు చేరితే కొన్ని ఫంక్షన్ల నిర్వహణ కష్టమైపోతుంది. ఫైల్స్‌ను ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు ట్రాన్స్ఫర్ చేసే విషయంలోనూ వేగం మందగిస్తుంది. ఎప్పుడూ కనీసం 10 నుంచి 20 శాతం ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఖాళీగా ఉంచుకోవాలి. ఒక వేళ అదనపు స్టోరేజ్ కావాలనుకుంటే మైక్రో ఎసీడీ లాంటివి వాడుకోవాలి. సాఫ్ట్వేర్ అప్ టు డేట్.. సిస్టమ్‌లో సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు ఆప్ టు డేట్ (తాజా వెర్షన్‌తో) ఉండాలి. సాఫ్ట్వేర్ ఆప్ టు డేట్ వల్ల కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంటాయి. పనితీరుపై ప్రభావం చూపించే బగ్స్‌ను తొలగించి ఆప్డేట్ వెర్షన్ తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లో ఆప్డేట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్యాక్టరీ డేటా రీసెట్ పైన తెలిపిన సూచనలు పాటించినా వేగం పెరగకపోతే చివరి అస్త్రంగా ఫ్యాక్టరీ డేటా రీసెట్ క్లిక్ చేయాలి. దీనికి ముందు మీ ఫోన్లోని ముఖ్యమైన ఫైల్స్, డేటా అంతటినీ ఎక్స్టర్నల్ మెమొరీలోకి కాపీ చేసుకోవాలి. దీంతో మీరు ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో తిరిగి అదే స్థాయికి వెళుతుంది. దీంతో మీకు అవసరమైన అప్లికేషన్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. -
8 కి.మీ... 8 నిమిషాలు
సాక్షి, సిటీబ్యూరో: నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు దూరం..8 కి.మీ. ఈ దూరాన్ని కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే మెట్రో రైలులో చేరుకోవచ్చు. అదేంటి ప్రతి నిమిషానికి ఓ కిలోమీటరు దూరం ప్రయాణించడం ఎలా సాధ్యం అంటే...80 కేఎంపీహెచ్ వేగంతో మార్గమధ్యంలోని ఏడు స్టేషన్లలో ఎక్కడా మెట్రోరైలు నిలపకుండా జర్నీ చేస్తే ..కేవలం నిమిషానికో కిలోమీటరు జర్నీని హ్యాపీగా పూర్తి చేయవచ్చని మెట్రో రైడ్ నిరూపించింది. శనివారం మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులతో కలిసి మెట్రో జర్నీ చేశారు. ఈ రైడ్ పట్ల వారంతా సంతృప్తి వ్యక్తంచేశారు. రణగొణ ధ్వనులు..ట్రాఫిక్ రద్దీ....గతుకుల రహదారులపై కుదుపుల ప్రయాణం, కాలుష్యం వంటి సమస్యలకు మెట్రో జర్నీ చెక్పెట్టనుందని పేర్కొన్నారు. ఈ జర్నీలో నగర ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌స్ ప్రభాకర్, వివేకానంద, గోపీనాథ్, చింతల రాంచంద్రారెడ్డి, మేయర్ రామ్మోహన్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ శివానంద్ నింబార్గీ తదితరులు పాల్గొన్నారు. మెట్రో వేళలే ప్రతిబంధకం! ఈ నెల 29 (బుధవారం) నుంచి నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ)రూట్లో సిటీజన్లకు మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో తొలి మూడునెలలపాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ప్రయాణికుల ఫీడ్బ్యాక్నుబట్టి ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే మెట్రో రైళ్లను నడుపుతామని మెట్రో అధికారులు చెబుతున్నారు. అయితే ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల్లో దూసుకుపోతున్న విశ్వనగరంలో ఉద్యోగుల పనివేళలు షిఫ్టులవారీగా 24 గంటలపాటు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లను కనీసం ఉదయం 5 నుంచి అర్థరాత్రి ఒంటింగట వరకు నడపాలని సిటీజన్లు కోరుకుంటున్నారు. మెట్రో ప్రయాణ సమయం ఇలా... నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ): ఈ రూట్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రూట్లోని 14 స్టేషన్ల వద్ద ఒక్కో స్టేషన్లో రైలు 20 సెకన్లపాటు ఆగుతుంది. 25 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ): ఈ రూట్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రూట్లోని మొత్తం 10 స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్లో 20 సెకన్లపాటు రైలు ఆగుతుంది. 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. బాలారిష్టాలివే... ♦ స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం లేదు. మొత్తం 24 స్టేషన్లకు 11 చోట్లనే పార్కింగ్ వసతులున్నాయి. ♦ ప్రతీస్టేషన్వద్ద సుందరీకరణ పనులు కొలిక్కిరాలేదు. ప్రారంభ ముహూర్తం దగ్గరపడుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల నిర్మాణ వ్యర్థాలు డంప్‌గా పడిఉన్నాయి. ♦ ప్రతీ స్టేషన్ వద్ద క్యాబ్‌లు, ఆటోలు, బస్సులు నిలిపేందుకు స్థలాలు లేవు. ♦ పలు స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ఫర్నీచర్ ఇంకా ఏర్పాటుకాలేదు. ♦ స్టేషన్లకు సమీపంలో ఉన్న ముఖ్యభవంతులకు స్కైవాక్‌లు ఏర్పాటుచేయలేదు. ♦ 24 స్టేషన్ల నుంచి ఆర్టీసీ కేవలం 50 ఫీడర్ బస్సులు మాత్రమే నడుపుతుంది. వీటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. -
త్వరలో హైపర్ సోనిక్ వాహనాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ధ్వనివేగానికి మించిన వేగం (హైపర్ సోనిక్)తో ప్రయాణించే వాహనాల తయారీ సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుందని రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ కంది ప్రాంగణంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)తోపాటు విద్యా, పారిశ్రామిక రంగాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు హాజరయ్యారు. వచ్చే పదేళ్లలో మిలటరీ ఆపరేషన్స్‌లో, 2050 నాటికి మానవ రవాణాలో హైపర్ సోనిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైపర్ సోనిక్ వాహనాల తయారీలో 1800 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకునే మిశ్రమ లోహాలు కీలకపాత్ర పోషిస్తాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీర్.వి.కామత్ వెల్లడించారు. ఈ లోహం తయారీనే అతిపెద్ద సవాలుగా నిలవబోతోందన్నారు. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబొరేటరీ ఈ దిశగా సానుకూల అడుగులు వేస్తోం దని కామత్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే లోహాల తయారీపై అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ తదితర దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని డీఆర్డీఓ డైరెక్టర్ ఎం ఎస్ఆర్ ప్రసాద్ వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పరిశోధనల్లో ముందంజలో ఉందన్నారు. ఇప్పటివరకు ఐదారు సెకన్లు మాత్రమే నడిచే వాహనాలు రూపొందించిన విషయాన్ని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొత్తగా కనుగొనే మిశ్రమ లోహం పునర్ వినియోగానికి వీలుగా ఉండటంతోపాటు.. అందుబాటు «ధరల్లో ఉండేలా చూడాల్సి ఉందన్నారు. రెండు గంటల్లోనే న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ హైపర్సోనిక్ వాహనాలు అందుబాటులోకి వస్తే న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వరకు కేవలం రెండు గంటల వ్యవధిలో ప్రయాణం చేయొచ్చని ఎంఎస్ఆర్ ప్రసాద్ వెల్లడిం చారు. హైపర్ సోనిక్, సంబంధిత రంగాల్లో పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయని హైపర్సోనిక్ టెస్ట్ వెహికల్ ప్రోగ్రాం ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.శర్మ వెల్లడించారు. అత్యంత వేగంగా ప్రయాణించాలనే కలను హైపర్సోనిక్ సాంకేతికత సు«సాధ్యం చేయబోతోందని ఇస్రో శాస్త్రవేత్త శ్యాంమోహన్ వెల్లడించారు. మిలిటరీ ఆపరేషన్స్, అంతరిక్ష వాహనాలు, మానవ రవాణాలో హైపర్ సోనిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తు తం ఉపగ్రహాల ప్రయోగంలో వినియోగిస్తున్న శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను తిరిగి ఉపయోగించుకునే అవకాశం లేదన్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీకి వినూత్న ఆవిష్కరణలు జోడించి.. శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌ను తిరిగి ఉపయోగించే పరిస్థితి రావాలన్నారు. -
పనులు వేగం పెంచండి
2019కి మిగులు జలాలు సాధించనున్నారు... పోలవరాన్ని సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం : ప్రాజెక్టు పనులు 2019 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. కమిటీ చైర్మన్ హుకుంసింగ్ నేతృత్వంలో 9 మంది పార్లమెంట్ సభ్యుల బృందం శుక్రవారం పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించింది. తొలుత విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం పట్టిసీమ చేరుకుని ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం డెలివరీ పాయింట్‌ను సందర్శించిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని అక్కడ పోలవరం ప్రాజెక్టు మ్యాప్ చూసి ప్రాజెక్టు నిర్మాణం గురించి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్, íస్పిల్‌వే కాంక్రీట్ పనులు, రేడియల్ గేట్ల తయారీ పనులూ వారు పరిశీలించారు. అనంతరం హుకుంసింగ్ మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నాటికి మిగులు జలాలు సాధించే ఘనత దక్కించుకోనుందని హుకుంసింగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న జలవనరుల ప్రాజెక్టులను సందర్శిస్తున్న తమ కమిటీ పోలవరం వచ్చిందని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. తమ బృందం ఏపీతోపాటు పంజాబ్, చండీఘడ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో క్షేత్ర పరిశీలన చేసి వివిధ జలవనరుల ప్రాజెక్టులను పరిశీలించిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో నీటికొరత లేకుండా నీటిభద్రత కల్పించే విషయంపై దృష్టి పెట్టేందుకు అవసరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ అందిస్తుందన్నారు. తొలుత సీఎంతో భేటి రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించేందకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తొలుత విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని, ఆయన ప్రాజెక్టు వివరాలను వారికి వివరించారని వెల్లడించారు. విజయవాడ నుంచి పోలపవరం చేరుకున్న ఈ బృందం సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను కళ్ళారా చూసిన తరువాత సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అనుకున్న ప్రకారం 2019 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని 2018లో కొంతమేర గ్రావిటీ ద్వారా నీరందించేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి 97 సార్లు వర్చ్యువల్ ఇన్స్పెక్షన్, 18 సార్లు ప్రాజెక్టును సందర్శించారని చెప్పారు. నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులు జరుగుతున్న తీరుపై కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందించాలని స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి పోలవరంపై సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రతి నెల 3వ సోమవారం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పనులను శరవేగం చేస్తున్నారని వివరించారు. అధికారులతో మాటామంతి తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న కమిటీ సభ్యులకు పోలవరం ప్రాజెక్టు నమూనా పటాన్ని, ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన ఛాయాచిత్రాలను చూపిస్తూ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒనగూరే ప్రయోజనాలను, నిర్మాణ పనుల పురోగతిని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పోలవరం ప్రాజెక్టు సీఈ రమేష్‌బాబులు వివరించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం జరిగిన భూసేరణపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో వి.సత్యభా, అపూరూపకొద్దార్, సర్ధార్ బల్విందర్ ఎస్.గుహంథర్, హర్షవర్ధన్ సింగ్దుంగార్పూర్, రాపోలు ఆనందభాస్కర్, ప్రదీప్ తమటా, డాక్టర్ సిద్ధాంత్మహోపాత్రాలతోపాటు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖామంత్రి పితాని సత్యనారాయణ, ఎంపీ మాగంటి బాబు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారిని బలిగొన్న అతివేగం
-
ఇంత వేగంగా ఎప్పుడైనా లెక్కపెట్టారా?
బీజింగ్: నోట్ల కట్టలు లెక్కపెట్టడానికి కౌంటింగ్ మెషిన్లు వాడుతుంటారు. మెషీన్ అందుబాటులో లేకపోతే పెద్ద మొత్తాన్ని లెక్కగట్టడానికి గంటలు గంటలు టైం వృథా చేస్తారు. కానీ చైనాలోని షాంగ్డాంగ్కి చెందిన ప్రైవేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఓ యువతి డబ్బులను కౌంటింగ్ మెషిన్ కన్నా వేగంగా లెక్కపెడుతోంది. చైనా కరెన్సీ(యువాన్)లను 550 నోట్ల వరకు సెకన్లలోనే లెక్కపెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను బ్యాంక్‌లో క్యాషియర్‌గా కాకుండా కౌంటింగ్ మెషిన్‌గా పిలుస్తున్నారట. బ్యాంక్‌కి వచ్చే వినియోగదారులు కూడా త్వరగా తమ పనైపోవాలని ఆ యువతి వద్దకే వెళుతుంటారట. -
ప్రాణం తీసిన అతివేగం
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం - ఒకరికి స్వల్ప గాయాలు మిడుతూరు: అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఆత్రుతతో వేగంగా వెళ్లి వరిగడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నందికొట్కూరు–నంద్యాల ప్రధాన రహదారిపై చెరుకుచెర్ల బాట సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్ఐ సుబ్రమణ్యం తెలియజేశారు. ఆత్మకూరుకు చెందిన షేక్ నబిరసూల్ (కారు డ్రైవర్) (47), షేక్ మహమ్మద్ జాకీర్ (30), మెహతుల్లా ఆత్మకూరు నుంచి గడివేముల జిందాల్ ప్యాక్టరీకి పని నిమిత్తం ఏపీ 21 ఆర్ 1697 టాటా ఇండికా కారులో బయలుదేరారు. చెరుకుచెర్ల బాట సమీపంలో తలముడిపి నుంచి మిడుతూరుకు వస్తున్న వరిగడ్డి ట్రాక్టర్‌ను వీరి కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కారు డ్రైవర్ నబిరసూల్, షేక్ మహమ్మద్ జాకీర్ అక్కడిక్కడే మృతి చెందగా మెహతుల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జై రోడ్డు పక్కన గుంతలో పడింది. నందికొట్కూ సీఐ వెంకటరమణ, ఎస్ఐ సుబ్రమణ్యం సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
‘పసిమొగ్గపై పైశాచికం’పై కదలిన పోలీసులు
అఘమేఘాలపై అదుపులోకి నిందితుడు సాక్షి ఎఫెక్ట్ సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘పసిమొగ్గపై పైశాచికం’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. పోలీసు అధికారుల్లో కదలిక తెచ్చింది. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ మానవ మృగానికి అండదండలు అందించి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన ముఖ్యనేత సహా చోటామోటా నాయకులు తోకముడిచారు. కాకినాడ నగరంలోని ఏటిమొగ కొండబాబు కాలనీలో ఐదేళ్ల వయసు కలిగిన చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డ అదే ప్రాంతానికి చెందిన నిందితుడు పెమ్మాడి ముని అనే యువకుడిని అరెస్టు చేయకుండా కేసును మాఫీ చేసేందుకు ఒక ముఖ్యనేత ద్వారా రాజీ ప్రయత్నాలు, రూ.రెండున్నర లక్షలకు బేరం పెట్టిన విషయాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నిందితుడి తరఫున కొమ్ముకాస్తోన్న స్థానిక నేతల ద్వారా కుటుంబ సభ్యులు బుధవారం మరోసారి ముఖ్యనేత వద్దకు వెళ్లి రాజీ చేయాలని ప్రయత్నించారు. అయితే ఈ ఘోరాన్ని ‘సాక్షి’బయటపెట్టడంతో ఆ ముఖ్యనేత వెనుకడుగు వేసి ఈ వ్యవహారంలో లాగొద్దని చెప్పి పంపేశారని సమాచారం. ఈ క్రమంలో మహిళా, ప్రజాసంఘాలు రోడ్డెక్కుతాయనే భయంతో అధికార పార్టీ నేతలు వెనకడుగు వేశారు. ఇంతలో జిల్లా పోలీసు ఉన్నతాధి కారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నిందితుడిని అరెస్టు చేయాలని కింది స్థాయి పోలీసు అధికారులను బుధవారం ఆదేశించారు. ఈ క్రమంలో స్పెషల్ పార్టీ పోలీసులు తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకుని పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని పోర్టు సీఐ రాజశేఖర్ ధ్రువీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడం వాస్తవమేనని, కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి కారణమైన ‘సాక్షి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలియచేశారు. -
నియంత్రణేది
- అతివేగమే ప్రాణాంతకం - ఔటర్ మరణాలన్నీ మానవతప్పిదాలే - వేగనియంత్రణ వ్యవస్థేదీ లేదు పటాన్చెరు : ప్రతి రోడ్డు ప్రమాదానికి ఏదోక కారణం ఉంటుంది. జాతీయ రహాదారిపై జరుగుతున్న ప్రమాదాలకు ప్రభుత్వాన్ని ప్రభుత్వ శాఖలను నిందించే అవకాశం ఉంది. కాని అత్యాధునిక పద్దతిలో నిర్మించిన ఔటర్‌పై ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలే అని చెప్పక తప్పని పరిస్థితి ఉంది. విశాలమైన రోడ్డు ఉండటంతో చోదకులు బ్రేకులున్నాయన్న సంగతే మరచి అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. అదుపుతప్పిన వేగంతో ప్రయాణించడంతోనే ఔటర్‌పై ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మహానగరం చుట్టూర ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై గత ఏడాది వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. పటాన్చెరు పరిధిలో సుల్తాన్పూర్, ముత్తంగి, కొల్లురు జంక్షన్ల పరిధిలో గత అయిదు నెలల కాలంగా మొత్తం పదకొండు ప్రమాదాలు జరిగాయి. అయితే ఇందులో 11 మంది మృతి చెందారని పోలీసుల రికార్డులున్నాయి. ఔటర్‌పై గుర్తు తెలియని రెండు శవాలను పోలీసులు గుర్తించారు. ఎక్కడో చంపి ఔటర్‌పై పడేసిన శవాలుగా భావించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న సర్వీసు రోడ్లపై కూడ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగ నియంత్రణతోనే సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులు ఆయా కూడళ్ల వద్ద స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. కానీ వాటి పనితీరును ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ స్పీడ్ గన్స్ కరువయ్యాయి. ఇటీవల ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వాహాక కమిటీ సమావేశంలో స్పీడ్ నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఔటర్‌పై ఎక్కే వాహానాల వేగ నియంత్రణ పరిమితిని ఏర్పాటు చేశారు. హీన పక్షంగా 40 కిలోమీటర్ల వేగంగా వెళ్లాలని వంద కిలోమీటర్లు/గంటకు తక్కువ కాకుండా వెళ్లాలని పరిమితులు విధించారు. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన వేగ నియంత్రికలను ఏర్పాటు చేయలేదు. పరిమితికి మించి వెళ్లే వారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. వేగంగా వెళ్తున్న వాహానాలు గుర్తించి వాటికి నోటీసులు పంపుతున్నారు. కాని అవి వాహాన యజమానికి చేరడం లేదు. ప్రత్యక్షంగా వాహాన యజమానులను ఆపి హెచ్చరించే వ్యవస్థ ఏది లేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బొల్లారం(సుల్తాన్పూర్ జంక్షన్) పరిధిలో మొత్తం ఎనిమిది ప్రమాదాలు జరిగాయి.. ఇందులో ఇద్దరు మృతి చెందారు. పటాన్చెరు (ముత్తంగి జంక్షన్)పరిధిలో ఒక ప్రమాదం జరిగింది.. ఇందులో ఒకరు మృత్యువాత పడ్డారు. ఆర్సీపురం(కొల్లూరు జంక్షన్) పరిధిలో రెండు ప్రమాదాలు జరిగితే.. అందులో 8 మంది మృతి చెందారు. పటాన్చెరు ముత్తంగి సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రీతమ్ రెడ్డి అనే బిటేక్ విద్యార్థి మృతి చెందారు. 2011 డిసెంబర్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరో ఇద్దరు యువకులు ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీసు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై అతి వేగంగా ప్రయాణించడంతోనే ఆ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా ఎక్కుడో చంపిన మృత దేహాలను పటాన్చెరు ఓఆర్ఆర్ పరిధిలో పడేసిన సంఘటనలు రెండున్నాయి. అసాంఘీక శక్తులకు అడ్డాగా.. పటాన్చెరు, బొల్లారం, బీడీఎల్ పోలీస్స్టేషన్ల్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లపై అసాంఘీక శక్తులకు అడ్డాగా మారాయి. విశాలమైన సర్వీసు రోడ్లపై తాగు బోతులు పోకిరిలు కూర్చుని పిచ్చాపాటిగా కాలక్షేపం చేస్తున్నారు. తాగిన మద్యం బాటిళ్లను రోడ్డుపక్కన ఉన్న పేవ్‌మెంట్‌పై పాడేస్తున్నారు. ఆలాగే బాటిళ్ల గాజు ముక్కలు రోడ్లపై పారేస్తున్నారు. ఆయా గ్రామాలకు ద్విచక్రవాహానంపై వెళ్తున్న వారిని ఆ పోకిరిలు వేధిస్తున్నారు. ముత్తంగి నుంచి పాటి వెళ్లే దారిలో చాలా మంది మందుబాబులు రాత్రి 6 నుంచి 10 గంటల వరకు కూర్చుంటున్నారు. రాత్రి పూట గస్తీ తిరుగుతున్నాం రాత్రి పూట ఓఆర్ఆర్పై గస్తీ వాహానాలు తిరుగుతున్నాయి. అతి వేగంగా అజాగ్రత్తగా నడిపే వాహానాలను గుర్తించి వారిని హెచ్చరిస్తున్నాము. జంక్షన్ వద్ద తనిఖీలు కూడ చేపడుతున్నాము. - వేణుగోపాల్‌రెడ్డి, సీఐ బీడీఎల్ పోలీస్‌స్టేషన్ జరిమానాలు విధిస్తున్నాం ఔటర్‌పై ప్రమాదాల నివారణకు తమ ఉన్నతాధికారు సూచనల మేరకు వేగ నియంత్రణపై దృష్టిపెట్టాం. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. స్పీడ్‌ను కొలిచే వ్యవస్థలున్నాయి. వాటితో అతి వేగంగా వెళ్తున్న వారికి నోటీసులు వెళ్తున్నాయి. -రాజు, ఏజీఎం, హెచ్‌జీసీఎల్ -
ప్రాణం తీసిన వేగం
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి శిరివెళ్ల: వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. మండల పరిధిలోని గోవిందపల్లె, కానాలపల్లె మధ్య 18వ జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్‌ను ఢీకొని మోటార్ సైకిల్‌పై వెళ్తున్న బి. సుదర్శన్‌రెడ్డి ( 21 )మృతి చెందాడు. నంద్యాల పట్టణం క్రాంతినగర్‌కు చెందిన ఇతను.. మంగళవారం మైదూకూరులో ఉన్న తన పెద్దనాన్నను చూసి తిరిగి రాత్రి మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. వేగంగా వస్తూ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించగా కోలుకోలేక అర్ధరాత్రి దాటాక మృతి చెందాడు. మృతుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మృతుని తమ్ముడు ఓబులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకరరెడ్డి తెలిపారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
- ఐచర్, ఆటో ఢీ - ఇద్దరు యువకులు మృతి - పరారీలో ఐచర్వాహన డ్రైవర్ - కప్పట్రాళ్లలో విషాదం కోతిరాళ్ల (పత్తికొండ రూరల్): అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది. వివాహ రిసెప్షన్‌కు సప్లయి సామగ్రి తీసుకొద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు షేక్ అఫ్రోజ్(20), ముల్లా అజారుద్దీన్(22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన కోతిరాళ్ల గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో పత్తికొండకు చెందిన గూడుసాబ్ కుమార్తె రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నగరం అంబర్పేట్, న్యూ పటేల్ నగర్‌కు చెందిన నజీర్ కుమారుడు షేక్ అఫ్రోజ్, అలాగే గోనెగండ్లకు చెందిన నూర్‌బాషా కుమారుడు ముల్లా అజారుద్దీన్ వచ్చారు. సప్లయి సామగ్రి తీసుకొచ్చేందుకు వీరు పత్తికొండకు ఆటోలో బయలు దేరారు. ఆటోను అఫ్రోజ్ నడుపుతుండగా.. పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామ సమీపంలో దేవనకొండ వైపుకు వెళ్తున్న ఎపి 02 ఎ 3296 ఐచర్ వాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయి రోడ్డు పక్కన గుంతలో పడింది. ఆటో తోలుతున్న షేక్ అఫ్రోజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ముల్లా అజారుద్దీన్‌ను రోడ్డుపై వెళ్తున్న ఎమ్మిగనూరుకు చెందిన ఆటో డ్రైవర్ అంజనేయులు గమనించి తన ఆటోలో పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగా కోలుకోలేక అతను మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టడంతో సుమారు 15మీటర్ల దూరంలోకి పల్టీలు కొడుతూ ఆటో రోడ్డుపక్కన గుంతలో పడిపోవడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. ఐచర్ వాహనం డ్రైవర్ పరారీలో ఉండగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్‌రావు తెలిపారు. రిసెప్షన్ (వలిమా)లో విషాద ఛాయలు : సప్లయి సామగ్రి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందండంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో రిసెప్షన్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కొద్ది గంటల్లో పెళ్లి సామాన్లతో వస్తారనుకున్న యువకుల దుర్మరణం పొందారన్న విషయం తెలుసుకున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. -
ఇద్దరు స్నేహితులు దుర్మరణం
- సల్కాపురం సమీపంలో బైక్, లారీ ఢీ - యువకుడి, యువతి మృతి - పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ కల్లూరు/ గూడూరు రూరల్: అతి వేగం ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. కర్నూలు - బళ్లారి జాతీయ రహదారిపై సల్కాపురం సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి దుర్మరణం చెందారు. మృతులు ఇద్దరు స్నేహితులు. కర్నూలులోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న రాజేష్ (21) ఓ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలో ఫీల్డ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కర్నూలులోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో నివాసముంటున్న రేణుక(20) నగరంలోని జ్యోతి మాల్లోని వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం వీరు బైక్‌పై నాగులాపురం వైపు వెళ్తుండగా సల్కాపురం సమీపంలో కర్ణాటక నుంచి విజయవాడకు అల్లం లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వీరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఏసు, సుశీలమ్మ దంపతులకు రాజేష్ ఒక్కగానొక్క కుమారుడు. ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. చిన్నతనంలోనే రాజేష్ తండ్రినికోల్పోయాడు. సుశీలమ్మ పిల్లలను పెంచి పెద్ద చేసింది. చేతికొచ్చిన కుమారుడు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న సమయంలో మృతి చెందడంతో తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కరూలు నగరంలోని టెలికాంనగర్‌లో నివశిస్తున్న సాయిబాబు, ప్రమీళమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చివరి సంతానం రేణుక డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం జ్యోతిమాల్‌లో వర్కర్‌గా చేరింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రోడ్డు ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ ఆకె రవికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను, ప్రమాదానికి కారణమైన లారీ, ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. ఓవర్టేక్ చేస్తూ అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. లారీ డ్రైవర్ షేక్ సుభాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ డీవీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఆటో డ్రైవర్ దుర్మరణం
ఆలూరు రూరల్ : ఆలూరు గ్రామశివారులోని మొలగవళ్లి మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఆలూరు నుంచి ఆటో డ్రైవర్ కొండప్ప మొలగవళ్లి గ్రామంలో ఉన్న ఒక కిరాణాషాపు వ్యాపారికి సరుకులు తీసుకొని బయలుదేరాడు. అదే ఆటోలో మొలగవళ్లికి చెందిన వెంకటేశ్వర్లు కూడా ఎక్కాడు. ఆటో చాకలికుంట వద్దకు వెళ్లగానే ఆలూరువైపు వస్తున్న గాలిమరల కంపెనీకి చెందిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర కొండప్ప తీవ్రంగా గాయపడగా, వెంకటేశ్వర్లు పక్కనే ఉన్న నీటి గుంతలోకి ఎగిరిపడ్డాడు. ఆ మార్గంలో వస్తున్న ప్రయాణికులు గుంతలో పడిన వెంకటేశ్వర్లను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. వారిద్దరిని ఆలూరు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అపస్మారక స్థితికి చేరుకున్న కొండప్ప కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య జయంతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆలూరు ఎస్ఐ ధనుంజయ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన ఆటోను, కారును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీ కొని 20 జీవాలు మృతి
ఎమ్మిగనూరు రూరల్ : చెన్నాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తు తెలియని కారు ఢీకొని 20 జీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఉరుకుందు తన గొర్రెలు, మేకలను మేత కోసం రోడ్డు దాటిస్తుండగా ఆదోని నుంచి కర్నూలు వైపు వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గొర్రెల యజమాని తేరుకునేలోపే కారు వేగంగా వెళ్లిపోయింది. బాధితుడు లబోదిబోమంటు కుప్పకూలడంతో వాహనదారులు ఓదార్చారు. ఒక్కొక్క దాని విలువ రూ.6 వేలు ఉంటుందని, ఈ లెక్కన రూ. 1.20 లక్షలు నష్టం జరిగినట్లు బాధితుడు చెపుతున్నాడు. -
దీని బండ బడా.. ఎద్దుల బండి మేలురా!
- కడప- నంద్యాల డెమూ ప్యాసింజర్‌పై ప్రయాణికుల అసంతృప్తి - ట్రాక్ పటిష్టతలో లోపాలు.. 30 కి.మీ.కి మించని పరుగు - ఎండింగ్ పాయింట్‌కు ముందు గంటల తరబడి నిలిపివేత అసలే కొత్త ట్రాక్.. ఆపై సాంకేతిక లోపాల భయంతో ట్రైన్ స్పీడును 60 కి.మీ.లుగా నిర్ణయించగా అమలులో ఆ వేగం 50కి మించలేదు. కొంతకాలం కొనసాగిందో లేదో ట్రాక్‌లో లోపాలు బయటపడడంతో ఇంజిన్ డ్రైవర్లు 30 కి.మీ.కు మించి స్పీడుగా నడపకపోవడంతో నంద్యాల-కడప పర్వాలేదనిపించినా కడప-నంద్యాల(77404) డెమూ ప్యాసింజర్ ప్రయాణం మాత్రం ఎద్దుల బండిని తలపిస్తోంది. నంద్యాల: ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో ఇటీవలే పట్టాలెక్కిన కడప-నంద్యాల డెమూ ప్యాసింజర్ పరుగులో ఎద్దుల బండితో పోటీ పడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ ఉందన్న మాటే కానీ గంటల తరబడి ప్రయాణం.. ఎక్కడిక్కకడ ఆపేయడం కారణంగా ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. కడపలో బయల్దేరిన రైలు గంటల జాప్యంతో 30కి.మీ వేగంతో నంద్యాలకు చేరుకుంటోంది. కొత్తలైన్ పనులు పూర్తికాకపోవడం, అక్కడక్కడ లోపాలు తలెత్తడంతో అధికారులు పూర్తిస్థాయి వేగంతో రైలును తిప్పడానికి సాహించడం లేదు. మే 16 నుంచి ఈలైన్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించినా ట్రాక్ పనులు చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. లోపాల సవరణకు గడువు ముగిసినా.. 123 కి.మీ.నిడివి కల్గిన నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను రూ.9.50కోట్లతో నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 23న రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత డెమూ రైలు, గూడ్స్ రైలు రాకపోకలు మొదలయ్యాయి. అయితే ట్రాక్ నిర్మాణంలో పలు చోట్ల లోపాలు బయటపడడం, రైలు రాకపోకల కారణంగా కుంగిపోవడాన్ని గుర్తించిన సాంకేతిక నిర్మాణ సంస్థ నిర్ణీత ఆరు నెలల వ్యవధిలో పటిష్టం చేసి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది. అయితే ఈ గడువు జనవరికే పూర్తయినా ఇప్పటి వరకు ట్రాక్‌ను అధికారికంగా అప్పగించలేదు. ఇదే ట్రాక్‌పై మే 16 నుంచి విజయవాడ-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలును తిప్పుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సాంకేతిక రైలును తెప్పించి ట్రాక్‌ను పటిష్టత పనులు చేస్తున్నారు. అయితే పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తికాకుంటే ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు అనుమానమే. 60 కి.మీ. వేగంతో వెళ్లాల్సి ఉన్నా.. వాస్తవానికి ఈ రైలు ట్రాక్‌పై 60కి.మీ.వేగంతో వెళ్లాల్సి ఉంది. అయితే ట్రాక్ పటిష్టంగా లేకపోవడంతో వేగాన్ని 50కి తగ్గించారు. దీనికితోడు ట్రాక్ పటిష్టంగా లేకపోవడం, స్టాపింగ్‌ల కారణంగా నంద్యాల నుంచి ఉదయం 6గంటలకు బయల్దేరిన రైలు 11 గంటలకు కానీ కడప చేరుకోవడం లేదు. తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20గంటలకు రావాల్సిన రైలు 4గంటలకు చేరుతుంది. తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరిన రైలు కడపకు రాత్రి 8గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి బయల్దేరిన రైలు(77404) రాత్రి సమయంలో ప్రయాణించి రావడంతో స్పీడును 30కి.మీ. కే పరిమితం చేశారు. ఫలితంగా నిర్ణీత సమయానికి రెండు గంటలు అంటే నంద్యాలకు 22.30 గంటలకు రావాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటలు దాటుతోంది. ఈ సమయంలో క్రాసింగ్ ఉంటే నంద్యాల శివారులోని వెంకటేశ్వరపురం వద్ద సుమారు గంటకుపైగా నిలిపేస్తుండడంతో ఇదెక్కడి రైలురా బాబు అంటూ ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. -
మట్టి పనులు వేగవంతం చేయాలి
ఏపీ జెన్కో డైరెక్టర్ నాగేశ్వరరావు దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పవర్ హౌస్ నిర్మాణానికి అవసరమైన మట్టి పనులను వేగంగా పూర్తిచేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనికోసం దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామం వద్ద కొండపై జరుగుతున్న పనులను ఏపీ జెన్కో సలహాదారు జి.ఆదిశేషు, పలువురు అధికారులతో కలిసి నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి జెన్కో ఈఈ కొలగాని వీవీఎస్ మూర్తి వారికి వివరించారు. ఈ సందర్భంగా జెన్కో డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకూ 68 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరిగిందన్నారు. మరో 40 లక్షల క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉందని, దానిని మార్చి నాటికి పూర్తిచేస్తే ఏప్రిల్ నెలలో పవర్‌హౌస్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. ఇప్పటికే విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ కె.రత్నబాబు, ఎస్ఈ పి. రంగనాగన్, ఈఈ వీఎస్ఎన్ రాజు, డీఈలు కోటేశ్వరరావు, రాజ్‌కుమార్, ట్రాన్స్ట్రాయ్ మేనేజర్ మల్లికార్జునరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
- నూతన సంవత్సర వేడుకల్లో విషాదం - రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చనుగొండ్ల(గూడూరు రూరల్): కొత్త సంవత్సరాది వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించుకునేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వేడుకలు చేసుకోకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడుపుతూ అదుపుతప్పి బ్రిడ్జి దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. చనుగొండ్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో కోడుమూరుకు చెందిన గాజుల రుద్రప్ప(20) మరణించాడు. రుద్రప్ప గోరంట్ల రోడ్డులోని పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. చనుగొండ్ల సమీపంలోని వై.ఖానాపురంలో స్నేహితుడితో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరాడు. చనుగొండ్ల దాటిన తరువాత వేగంగా బైక్‌ను నడుపుతున్న రుద్రప్ప అదుపుతప్పి దిగువ కాలువపై నిర్మించిన బ్రిడ్జి దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై నుంచి కాలువలోకి పడి మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
తల్లిదండ్రులకు టెన్షన్..టెన్షన్!
► ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు ►త్రుటిలో తప్పించుకున్న చిన్నారులు శివాపురం (పెద్దారవీడు): ఉదయాన్నే లేచి స్నానం.. టిఫెన్ చేసిన చిన్నారులు బస్సులో స్కూల్‌కు బయలుదేరారు. ఇంతలోనే వాహనం ప్రమాదానికి గురైందన్న వార్త వినడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కానీ ఎలాంటి ఘోరం జరగకపోవడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. వివరాలు.. మండల పరిధిలోని శివాపురం నుంచి మార్కాపురం వెళ్తున్న స్కూల్ బస్సు మార్గమధ్యంలోని రోడ్డు మార్జిన్లో పక్కకు ఒరిగింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పెద్దారవీడు, కొత్తపల్లె, శివాపురం, దేవరాజుగట్టు గ్రామాలకు చెందిన విద్యార్థులు మార్కాపురం పట్టణంలో ఉన్న సారుు చైతన్య హై స్కూల్‌కు ప్రతి రోజూ వెళుతుంటారు. శుక్రవారం డ్రైవర్ ఆయా గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుంటూ శివాపురం చేరుకున్నాడు. ఆ సమయంలో మొత్తం 40 మంది విద్యార్థులున్నారు. అక్కడ నుంచి రోడ్డు గుంతలమయంగా ఉంది. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడంతో ముందు టైరుకు ఉన్న ఇనుప ప్లేట్ విరిగిపోరుుంది. దీంతో వాహనం రోడ్డు మార్జిన్ నుంచి పక్కకు ఒరిగిపోరుుంది. భయాందోళనలకు గురైన చిన్నారులు హాహాకారాలు చేశారు. సీటు ముందు ఉన్న రాడ్‌కు తగిలిన ఇద్దరు చిన్నారుల తలలకు బొప్పి కట్టింది. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు వారిని బయటకు తెచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి – ఒకరికి తీవ్ర గాయాలు – హెబ్బటం వద్ద ఘటన హొళగుంద: మండల పరిధిలోని హొళగుంద–ఆదోని మార్గంలో లింగంపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. హొళగుందకు చెందిన వడ్డే రాజు (20).. మోటారు సైకిల్‌పై ఆదోనిలోని కల్లుబావిలో జరుగుతున్న శుభకార్యానికి రాత్రి బయల్దేరారు. హెబ్బటం గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న (25), శేషగిరి.. కర్ణాటకలోని ఉత్తనూరుకు మోటార్ సైకిల్ వెళ్తున్నారు. లింగంపల్లి క్రాస్ వద్ద ఇరువురి మోటార్ సైకిళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్డే రాజు, చిన్నలక్ష్మన్న, శేషగిరి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా వడ్డే రాజు, చిన్న లక్షమన్న మార్గమధ్యలో మృతి చెందారు. శేషగిరి..తీవ్రంగాయాలతో చికిత్స పొందుతున్నాడు. -
నోట్ల మార్పిడి వేగవంతం
బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : నోట్ల మార్పిడి ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ కోన శశిధర్ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 34 బ్యాంకులకు సంబంధించి జిల్లాలో 454 శాఖలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నగదు, నోట్ల మార్పిడిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు, జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌ల నుంచి కరెన్సీ చెస్ట్‌ని పంపించాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద సమాచార కేంద్రాలు, షామియానాలు, తాగునీటి సౌకర్యం తప్పక కల్పించాలన్నారు. క్యూలో ఉన్న వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం జయశంకర్, ఎస్బీఐ ఏజీఎం, చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, హరిబాబు, సిండికేట్ బ్యాంక్ డీసీఎం ఆశీర్వాదం, ఏపీజీబీ ఆర్ఎం జయశంకర్, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ శశికుమార్, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచి చీఫ్ మేనేజర్ బాలయ్య, ఎస్బీహెచ్ సీనియర్ మేనేజర్ సాయికృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చుకునేందుకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంక్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. ఈ నెల 24 వరకు పాత నోట్లను తీసుకోవాలని మీ సేవ కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన రాంనగర్‌లోని ఆంధ్ర బ్యాంక్, మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. నోట్ల మార్పిడి ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది పరిశీలించారు. తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నోట్లను మార్చుకోవాలన్నారు. -
భద్రతే ముఖ్యం..
-
భద్రతే ముఖ్యం..
వేగం కన్నా భధ్రత మిన్న అంటూ యువత నినదించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదమని హెచ్చరించింది. హిమాయత్‌సాగర్ రోడ్‌లోని షాదన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వార్షికోత్సవ ఈవెంట్ ‘పల్సేషన్’లో భాగంగా గురువారం విద్యార్థులు, వైద్యులు బైక్‌ర్యాలీ, కరపత్రాల పంపిణీతో అవగాహన కల్పించారు. - సాక్షి, సిటీబ్యూరో -
ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు
శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే.. గంటకు... 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు. చాలా స్వల్పమైన శారీరక కదలికలతో... నిలబడి వంటచేయుడమే కాకుండా సింక్‌లో వంటపాత్రలు కడగటం, ఇస్త్రీ చేయుడం, చాలా మెల్లిగా నడవటం వంటివి చేస్తే... గంటకు... 110 -160 క్యాలరీలు ఖర్చవుతారుు. ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండేవి... కాస్తంత వేగంగా నడవటం, ఊడ్చటం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం వంటివాటికి... గంటకు 120-240 క్యాలరీలు ఖర్చవుతారుు. శారీరక కదలికలు ఎక్కువగా ఉండే పనులు... కారును కడగటం, గోల్ఫ్ ఆడటం, పరిగెత్తినట్టుగా నడవటం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం వంటి వాటికి... గంటకు 250-350 క్యాలరీలు ఖర్చవుతారుు. భారీ శరీర కదలికలు అవసరవుయ్యే పనులు... పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడటం.... వంటి వాటికి గంటలకు 350- ఆ పైన క్యాలరీలు ఖర్చవుతారుు. -
వేగాన్ని నియంత్రిస్తే ఏకాగ్రత కుదురుతుంది
ఆర్తచింత అంటే... ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదలడం. ఈ కదలికలు ఊపిరిమీద, దాని వేగంమీద ఆధారపడతాయి. అందుకే బాగా కోపంగా ఉన్నా, ఒక భోగం అనుభవించినా ఊపిరిలో వేగం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనసు బాగా కదులుతుంది. అక్కడ మనసును కదలకుండా నిలబెట్టడం చేతనయి ఉండాలి. అలా నిలబెట్టడం ప్రాణాయామంతో సాధ్యం. ఇది బాగా సాధనచేస్తే ఊపిరిని నియమిత వేగంతో పీల్చడం, విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. అందుకే పూజకు కూర్చున్నప్పుడు ముక్కుపట్టుకోమని ఊరికే చెప్పరు, ప్రాణాయామం చేయమని చెప్పేది ఎందుకంటే... ఊపిరి వేగాన్ని నియంత్రిస్తే, మనసు కుదురుగా నిలబడి భగవంతుడికి ఉపచారం ఏకాగ్రతతో చేస్తుంది. అలా చేసిన పూజనే పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు. ఇక ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు. విడిచిపెట్టి తీయకపోవచ్చు. ఈ రెండింటిలో ఏదయినా కావచ్చు మృత్యువు. ఆఖరి ఊపిరియందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్నమాటకు ముందు రుచి అని ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు. ఒక్క మనుష్యుడినే రుచి, వాసన వేధిస్తాయి. రుచి అంటే... మనసుకు ఒక ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి. ఆ సుఖం దానికి తెలియదు. ఒక చెట్టుకి ఊయల కట్టి భూమికి కాళ్ళు తగలకుండా ఊగుతుంటే ఎంత బాగుంటుందో... అన్నప్పుడు దానికి తెలియదు. ఒకసారి ఎక్కి ఊగించారనుకోండి. దానికి బాగా నచ్చిందనుకోండి. వాసన లోపల బాగా పట్టుకుంటుంది. అది రుచి. చివరకు మనింట్లో కూడా ఊయలుంటే బాగుండుననే అన్వేషణ మొదలవుతుంది. ఇంట్లో దూలానికి ఊయలబల్ల ఏర్పాటుచేసుకుంటుంది. దానిలో ఉన్న హాయిని పట్టుకుంటుంది. దానిని వాసన అంటారు. ఈ వాసనలలో బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుంటుంది. పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు పరమేశ్వరుడు. ఆయనేం జోక్యం చేసుకోడు. ఆఖరున నీవు దేనిని స్మరించావో ఆయన పట్టగలడు. ఆయన చిత్రగుప్తుడు. చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాస్తాడు. ఏమిరా, నీకు మనుష్య శరీరం ఇచ్చాను. ఆఖరున దేన్ని పట్టుకున్నావ్! ఒకడు పొలాన్ని పట్టుకున్నాడు, ఒకడు ఫలానా వాడిమీద కక్షతో రౌద్రచింతతో పోతాడు. వీరు చేసుకున్న పాపాలు మళ్ళీ అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మల కిందకు వెళ్ళిపోతారు. తిర్యక్కులుగాగానీ, స్థావరములుగా గానీ, జంగమములుగా గానీ వెళ్ళిపోతారు. స్థావరము అంటే కదలలేకుండా ఉంటాడు. మేక వచ్చేస్తుంది, తనను తినేయబోతోందని తెలిసినా కదలలేడు. దానిని స్థావరము అంటారు. జంగమములంటే కుక్క, పిల్లి, మేక, గొర్రె అలాంటివి. అంటే స్థావర, తిర్యక్, జంగమములన్నింటిలో కర్మచేసే అధికారంలేని ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రం, గురువు.. ఈ రెండింటితో సంబంధం ఉండదిక. ఈ రెండూ లేక ఇంకేం ఉంటాయి? షడూర్ములు అని ఆరు ఉంటాయి. వాటిని అనుభవిస్తుంటాడు. షడూర్ములు అంటే-జననం, మరణం, ఆకలి, దప్పిక, సుఖం, దుఃఖం. మనుష్య ప్రాణి అలా కాదు. కొంత పుణ్యం చేసి మళ్ళీ మనుష్యుడిగా పునర్జన్మ పొందాడనుకోండి. అప్పుడు కూడా గతజన్మ తాలూకు వాసనాబలాన్ని వెంట తీసుకెడతాడు. దీనిని ఎలా గుర్తిస్తారంటే... అన్నప్రాశన చేసేటప్పుడు.. ‘వీడికి అన్నం పెడుతున్నాం. అది తిని బలం పుంజుకున్న శరీరంతో వీడేం చేయబోతున్నాడు, వీడి వాసనాబలం ఏమిటి?’ అన్నది గమనించడానికి... భగవద్గీత, డబ్బులు, బంగారం వంటివి పెడతారు. వాడు పాకుతూ వెడుతుంటే... వీడేం ముట్టుకుంటాడోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. వాడు వెళ్ళి వెళ్ళి బంగారం ముట్టుకున్నాడనుకోండి. గతజన్మలోని వాసనాబలంతో ఆకర్షింపబడ్డాడు. వాడు బంగారం కోసం ముందుముందు ఏదయినా చెయ్యవచ్చు. అందుకని వాడికి చిన్నప్పటినుంచి రామాయణం చెప్పాలి. మడ్డినీళ్ళకు చిల్లగింజ విరుగుడయినట్లే వీడికి రామాయణం విరుగుడు. హమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడని వాడిని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలేయకూడదు. వాడు వృద్ధిలోకి రావడానికి వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, రోజూ ఇంట్లో భగవద్గీతను వినిపించడం చేయాలి. బీజం బద్దలై చెట్టు కావాలి. ఆ అవకాశమివ్వాలి. అందుకే ఇప్పటికీ... చాలా చిన్న వయసులో మా వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయంటూంటారు. అదెక్కడిదంటే.. కిందటి జన్మలోని సంగీతం పట్ల తాదాత్మ్యత. ఒక్కొక్కడికి భాగవత పద్యాలు ఒక్కసారి వింటే వచ్చేస్తాయి. అది వాసనాబలం... అక్కడినుంచి తెచ్చాడు వాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ‘అబ్బ, ఏం రామాయణంరా, ఏమి రామచంద్రప్రభువురా, ఏమి సీతమ్మ తల్లిరా..’ అని ఆలోచిస్తూ పోయాడనుకోండి. వాడు సాధనను ఇంకా కొనసాగించడానికి ఒక మహావిద్వాంసుడి కొడుకుగా పుట్టిస్తాడు. పుట్టుకతోనే ఒక మంచి గురువు దొరికినందువల్ల వాడికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మప్రవర్తనతో, లోకంలో ధర్మపాలనకు ఉపకరిస్తాడు. -
‘కొత్త’ దిశగా..
- సిద్ధమవుతున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు - ఖమ్మం నుంచి తరలివచ్చిన కంప్యూటర్లు - దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు - కలెక్టరేట్ పనుల్లో నిమగ్నమైన రెవెన్యూ సిబ్బంది కొత్తగూడెం: కొత్త జిల్లాల పాలనకు విజయదశమే ముహూర్తం కావడంతో నూతన కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం సింగరేణి శాప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల కోసం గదులను ముస్తాబు చేస్తున్నారు. సింగరేణి కార్పొరేట్ డిస్పెన్సరీ నుంచి ఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పనులన్నీ చకచకా సాగుతున్నాయి. విజయ దశమి రోజున కొత్తజిల్లాల కార్యకలాపాలు ప్రారంభించాలని, జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి. సింగరేణి అప్పగించిన భవనాలను కలెక్టర్ పాలన కార్యాలయం, ఎస్పీ పాలన కార్యాలయాలుగా తీర్చిదిద్దే పనుల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు కేటాయించింది. జిల్లా కలెక్టరేట్ కోసం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి శాఫ్ కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో సింగరేణి కంప్యూటర్లు, ఆన్లైన్ కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం నుంచే జరిగేవి. కలెక్టరేట్లోని వివిధ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు భవనంలోని గదులను తీర్చిదిద్దుతున్నారు. కలెక్టర్ గదితోపాటు సిబ్బంది ఉండేందుకు వీలుగా రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో మొత్తం 21 గదులు, ఒక హాల్ ఉంది. జిల్లా ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్ భవనంలో జిల్లా ట్రెజరీ, వెనుకబడిన తరగతుల గృహనిర్మాణ సెల్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ ఏర్పాటు చేసే భవనంలోని గదులను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధికారులు ఇప్పుడు వాటికి రంగులు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. కంప్యూటర్లు సిద్ధం దసరా నాటికి జిల్లా కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పనులను ప్రారంభించేందుకు ఖమ్మం కలెక్టరేట్ నుంచి 24 కంప్యూటర్లు, ఐదు ప్రింటర్లను పంపించారు. వీటిని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సిద్ధం చేశారు. జిల్లా ప్రారంభం నుంచే పాలన కొనసాగాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త మండలాల పనులను ప్రారంభించారు. మండలాలకు సంబంధించిన ఫైళ్లను వేరు చేసే పనుల్లో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్ వచ్చిన తర్వాత కొత్త మండలాలకు పూర్తి పనులు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లా పేరుతో ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని ఆదేశాలు రావడంతో మండలాల వారీగా మీ సేవలో వేరు చేస్తున్నారు. దసరా తర్వాత ధ్రువీకరణ పత్రాలు కొత్త జిల్లాల పేరుతో రానున్నాయి. చురుగ్గా ఎస్పీ కార్యాలయం పనులు ఎస్పీ కార్యాలయం కోసం సింగరేణి సంస్థ కార్పొరేట్ డిస్పెన్సరీని కేటాయించింది. గత ఐదేళ్ల నుంచి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో చుట్టూ పొదలు, చెట్లతో నిండిపోయింది. ప్రస్తుతం పోలీస్ శాఖ అధికారులు చుట్టూ చెట్లను తొలగింపజేశారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సరిపోయే విధంగా గదులను తయారు చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్‌లు చేస్తున్నారు. భవనం చుట్టూ గుంతలు ఉండటంతో మట్టిని తొలగించి వాటిని చదును చేయిస్తున్నారు. దసరా వచ్చేస్తుండటంతో పనులను త్వరితగతిన చేపట్టేందుకు కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయి. -
మళ్లీ స్పీడ్ అందుకున్న ఓటుకు కోట్లు కేసు
-
నయీమ్ కేసులో సిట్ దర్యాప్తు వేగ వంతం
-
డాలర్ ఇండెక్స్ స్పీడ్
ప్రపంచ మార్కెట్లను మళ్లీ డాలరు వణికించడం మొదలుపెట్టింది. శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో డాలరు ఇండెక్స్ దాదాపు రెండు నెలల గరిష్టస్థాయికి చేరింది. దాంతో యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు, బంగారం, క్రూడ్ క్షీణించాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 20,21 తేదీల్లో జరిపే పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతుందా..లేదా అనే అంచనాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజాగా అమెరికాలో ద్రవ్యోల్బణం స్థాయి 2 శాతం దాటినట్లు గణాంకాలు వెలువడటంతో ఫెడ్ రేట్లు పెంచేదిశగా కదలవచ్చన్న అంచనాలు తిరిగి నెలకొన్నాయి. ఒక్కరోజులో అంతా తారుమారు.. క్రితం రోజు రాత్రి ఆ దేశంలో రిటైల్ అమ్మకాలు క్షీణించినట్లు డేటా రావడంతో గురువారం డోజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ సూచీలు జోరుగా పెరిగాయి. దాంతో శుక్రవారం ఉదయం భారత్‌తో సహా ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, సింగపూర్, ఆసియా మార్కెట్లు ర్యాలీ జరిపాయి. కానీ అమెరికా ద్రవ్యోల్బణం డేటాతో మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటివరకూ ఆ దేశంలో ద్రవ్యోల్బణం 2 శాతం లోపుగానే వుంటోంది. వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడ్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ద్రవ్యోల్బణం 2 శాతానికి చేరడం కూడా ఒక లక్ష్యం. ఇది పరిపూర్తి అయినందున, ఈ సెప్టెంబర్‌లో పెంచకపోయినా, డిసెంబర్లో రేట్లు పెరగవచ్చన్న అంచనాలు తాజాగా ఊపందుకోవడంతో డాలరు ఇండెక్స్ ఒక్కసారిగా ర్యాలీ జరిపింది. ప్రపంచంలో పది దేశాల ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువకు అనుగుణంగా ట్రేడయ్యే ఈ ఇండెక్స్ శుక్రవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి 1 శాతం పెరిగి 96 స్థాయిని దాటిపోయింది. జులై తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రధమం. వారం రోజుల క్రితం అమెరికా జాబ్స్ డేటా బలహీన ంగా వుండటంతో ఇప్పట్లో ఫెడ్ రేట్లు పెరగవన్న అంచనాలు ఏర్పడి డాలరు ఇండెక్స్ 94 స్థాయి దిగువకు పడిపోయింది. డాలరుకు అభిముఖంగానే అన్నీ... అమెరికా రేట్లు పెంచితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధిబాట పట్టిందనే విశ్వాసంతో కరెన్సీ విలువ పెరుగుతుందన్న అంచనాలు ఏర్పడతాయి. దాంతో ఇతర దేశాల్లోనూ, పుత్తడి తదితర ఆస్తుల్లోనూ ఇప్పటివరకూ పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి నిధుల్ని వెనక్కు తెస్తారన్న ఆశాభావంతో డాలరు పెరుగుతోంది. డాలరు విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీ విలువలు, బంగారం సహజంగానే తగ్గుతాయి. డాలరు ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన యూరో, జపాన్ యెన్లు తాజాగా క్షీణించాయి. భారత్ రూపాయి విలువ సైతం ఆఫ్‌షోర్ మార్కెట్లో 67.10 స్థాయికి తగ్గిపోయింది. ఇక బంగారం ఔన్సు ధర 1,310 డాలర్ల స్థాయికి తగ్గింది. బ్యారల్ క్రూడ్ విలువ 43 దిగువకు పడిపోయింది. యూరప్ సూచీలు అన్నీ క్షీణతతో ముగిసాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా స్టాక్ మార్కెట్ 0.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. -
అతివేగానికి ఇద్దరి బలి
ఎమ్మిగనూరు: కర్నూలు – ఆదోని రహదారిలో బోడబండ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్‌తో పాటు డ్రై వర్ మృతి చెందారు. విధి నిర్వహణ నిమిత్తం పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేస్తున్న ఇంజనీరు మార్కండేయ శర్మ, అసిస్టెంట్ సుబ్బరాయుడు, డ్రై వర్ మహదేవుడులు కర్నూలు నుంచి ఆదోనికి కారులో బయలుదేరారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు మండలంలో బోడబండ సమీపంలో అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజినీరు మార్కండేయ శర్మ (50) అక్కడికక్కడే మతి చెందాడు. తీవ్ర గాయలకు గురైన డ్రై వర్ మహదేవుడు (30) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. తీవ్రగాయాలకు గురైన సుబ్బరాయుడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను108లో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. మతులు మార్కండేయ శర్మకు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, మహదేవుడికి కర్నూలు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి వివరాలు తెలుసుకున్నారు. ఇంజినీరు మార్కండేయ మరణవార్త తెలుసుకొన్న ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈలు మల్లయ్య, హుసేన్‌పీరా, యమునప్ప, వెంకటేశులు, జయన్న, భాస్కర్‌రెడ్డి, తదితరులు ఆసుపత్రికి చేరుకొని సంతాపం ప్రకటించారు. -
యువకుడిని బలిగొన్న అతివేగం
బైక్ అదుపు తప్పి కిందపడటంతో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు అశ్వారావుపల్లి(రఘునాథపల్లి) : మండలంలోని అశ్వారావుపల్లి రిజర్వాయర్ వద్ద స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అశ్వారావుపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన ఎండీ మహ్మద్ దస్తగిరి, బదర్బీ దంపతులకు కుమారుడు ఎండీ.ఆసిఫ్(22), నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు ఆసిఫ్ హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. శనివారం తన ఐదుగురు స్నేహితులు రాజయ్య, జ్ఞానారెడ్డి, బడితె సాయి, హరీష్, షాబాజ్‌లతో కలిసి మూడు ద్విచక్రవాహనాలపై అశ్వారావుపల్లి రిజర్వాయర్ డ్యామ్ వద్ద సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో ఆసిఫ్ తన బైక్‌పై స్నేహితుడు షాబాజ్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు. బైక్‌ను అతి వేగంగా నడుపుతుండగా అశ్వారావుపల్లి దాటిన తర్వాత లోలెవల్ కాజ్ వే వద్ద వాహనం అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆసిఫ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, షాబాజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే ఆటోలో షాబాజ్‌ను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు ఆసిఫ్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వే వేగవంతం చేయాలి
జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రజాసాధికార సర్వే వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భూమి శిస్తు కమిషనర్ జిల్లాకు వచ్చారని, ఆదివారం ఏవేని రెండు మండలాల్లో తనిఖీ చేస్తారన్నారు. పేద ఎస్సీలకు భూ పంపిణీకి సంబంధించిన భూమి కోనుగోలు పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తహశీల్దారులను ఆదేశించారు. ఎన్యుమరేటర్లు ఉదయమే సర్వే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వే నిర్లక్ష్యం చేసినా, నిర్వహించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే 49 శాతం పూర్తయ్యిందని, నెలాఖరుకి 100 శాతం సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ ప్రభాకర్‌రావు, పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీనివాసులు, సర్వే విభాగం డీటీ భాస్కర నారాయణ పాల్గొన్నారు. ప్రజాసాధికార సర్వే, జాయింట్ కలెక్టర్, వేగవంతం, Prajasadhikara survey, Joint Collector, speed, -
పనులు వేగవంతం చేయాలి
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ ప్రభాకరరావు, ఎస్పీ రాజశేఖరబాబు, పీటీసీ ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, జేసీ లక్ష్మికాంతంతో కలిసి ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్బంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సూచికగా హీలియం స్కైబెలూన్లను ఎగురవేశారు. వేడుకలకు చూసేందుకు పది వేలకు పైగా జనం వచ్చే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ–2 సయ్యద్‌ఖాజా మొహిద్దీన్, డ్వామా పీడీ నాగభూషణం, డీఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనే బృందాలు కఠోర సాధనలు (రిహార్సల్స్) చేస్తున్నాయి. -
చురుగ్గా పుష్కర ఏర్పాట్లు
బెళుగుప్ప : మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం అధికారులు ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ వెంకటా చలపతి రిజర్వాయర్‌లో లోతు తక్కువ ఉన్న ప్రాంతాలను పరిశీలించి పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కర ఏర్పాట్లను వేగవంతంగా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు దుస్తులు మార్చుకునే గదులను తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తామని, పురోహితులను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. స్నానం తరువాత పూజలు నిర్వహించేందుకు కృష్ణమ్మ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పనులను ప్రారంభించామని తెలిపారు. రాత్రి వేళల్లో వెలుగు కోసం ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ లైన్లను వేస్తున్నారని, రిజర్వాయర్‌లో బ్యారికేడ్లను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. తహశీల్దార్‌తో పాటు ఆర్ఐలు జగన్నాథం, భాగ్యమ్మ, ఏఓ పృథ్వీసాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ విజయ భాస్కర్, వెటర్నరీ అధికారి మహేశ్ తదితరులు రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
పల్స్ సర్వే వేగవంతం
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కొత్తపేట, చెముడులంక గ్రామాల్లో సర్వే పరిశీలన కొత్తపేట : సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రజాసాధికారిక సర్వే (పల్స్ సర్వే)ను వేగవంతం చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. కొత్తపేట, ఆలమూరు మండలం చెముడులంక గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాసాధికారిక సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. కొత్తపేటలోని ఒక ఇంటి వద్ద వివరాల నమోదును స్వయంగా తిలకించారు. సర్వే జరుగుతున్న తీరు, ఇంతవరకూ నమోదైన కుటుంబాల వివరాల గురించి ఈ సందర్భంగా సర్వే సిబ్బందిని ఆయన ఆరా తీశారు. పలు చోట్ల ఒక కుటుంబంలో తొలిపేరు నమోదు వేగంగా జరిగినా, తరువాత పేర్లు నమోదుకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సర్వే సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ మొదట తలెత్తిన సాంకేతిక సమస్యలతో పోలిస్తే ప్రస్తుతం చాలా వరకూ పరిస్థితి మెరుగుపడిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,037 మంది సిబ్బంది ఈ సర్వే నిర్వహిస్తున్నారని, ఇంతవరకూ 44.52 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. ఆయన వెంట అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్, కొత్తపేట తహసీల్దార్ ఎన్ శ్రీధర్ తదితరులు ఉన్నారు. వేగవంతం చేయండి ఆలమూరు : ప్రజాసాధికారిక సర్వేను వేగవంతం చేయాలని జేసీ ఎస్.సత్యనారాయణ, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. మండలంలోని చెముడులంక గ్రామంలో జరుగుతున్న పల్స్ సర్వేను బుధవారం వారు పరిశీలించారు. మండలంలో ఇప్పటి వరకూ నమోదైన పల్స్ సర్వే వివరాలు, సర్వేలో ముందున్న గ్రామాలు, వెనుకబడిన గ్రామాలు, అందుకు గల కారణాలను తహసీల్దారు టీఆర్ రాజేశ్వరరావు ఉన్నతాధికారులకు వివరించారు. -
మార్కెట్లోకి 'ట్రాయ్' కొత్త యాప్!
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొనే మరో కొత్త సాధనం మార్కెట్లోకి వస్తోంది. మై స్పీడ్ పేరిట టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సౌకర్యార్థం కొత్త యాప్ ను ప్రవేశ పెడుతోంది. యూజర్లు తమకు లభిస్తున్న మొబైట్ ఇంటర్నెట్ స్పీడ్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కొత్త యాప్ సహాయపడుతుందని ట్రాయ్ తెలిపింది. మార్కెట్లోకి మరో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకునేందుకు వీలుగా 'మై స్పీడ్' పేరిట ఈ కొత్త యాప్ ను జూలై 5వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ నూతన యాప్ ను మొబైల్ సేవా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉనట్లు వెల్లడించింది. కవరేజ్, డేటా, స్పీడ్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, హ్యాండ్ సెట్ వివరాలను కూడ ఈ కొత్త యాప్ వివరిస్తుందని ట్రాయ్... ప్రకటనలో వివరించింది. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాయ్.. వినియోగదారులకు అందుబాటులో మై స్పీడ్ ను తెచ్చే ప్రణాళికలు చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా యూజర్లు తమ మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొని, ట్రాయ్ ఎనలిటిక్స్ పోర్టల్ కు పంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్ని నగరాల్లో ఆపరేటర్లు తమ 3G కస్టమర్లకు కూడ ఎక్కువశాతం 2G స్పీడ్ ను అందిస్తున్నట్లు తమ డ్రైవ్ టెస్ట్ లో తెలుసుకున్న అధికారులు.. కస్టమర్లకు సహకరించే విధంగా మై స్పీడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. -
జోరుగా సాగు
♦ వరుణుడి కరుణతో రైతుల్లో ఆనందం ♦ ఖరీఫ్ సాధారణ సాగు : 2,17,303 హెక్టార్లు ♦ ఇప్పటివరకు సాగులోకి వచ్చిన విస్తీర్ణం : 80,350 ♦ జూన్‌లో సాధారణ వర్షపాతం : 10.39 సెంటీమీటర్లు ♦ నమోదైన వర్షపాతం : 13.65 సెంటీమీటర్లు ఖరీఫ్ సీజన్ వడివడిగా సాగుతోంది. గత నెల మొదటివారంలో వరుణుడు కాస్త ముఖం చాటేయడంతో సాగుపనులు సన్నగిల్లగా.. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరుసగా అనావృష్టి ధాటికి కుదేలైన రైతుకు తాజా వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతుండడంతో సాగు విస్తీర్ణం సైతం వేగంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 2,17,303 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈక్రమంలో ఇప్పటివరకు 80,350 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా : పది రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండడంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జూన్ నెలలో జిల్లాలో 10.39 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంతో జిల్లా సగటును అధిగమించి ఎక్కువ శాతం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో నెలాఖరు నాటికి 13.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అధికంగా కంది, మొక్కజొన్న సాగు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో కంది, మొక్కజొన్న పంటల విస్తీర్ణం జోరందుకుంది. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఈ రెండు పంటల విత్తనాలు వేసేందుకు మొగ్గుచూపారు. మరోవైపు పత్తి పంటకు గిట్టుబాటు కాదని వ్యవసాయ శాఖ స్పష్టం చేయడంతో ఆ పంటవైపు రైతులు పెద్దగా దృష్టి సారించలేదు. జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా మొక్కజొన్న 27,550 హెక్టార్లలో సాగవ్వగా.. కంది పంట 23,491 హెక్టార్లలో సాగైంది. ఆ తర్వాత పత్తి 11,552 హెక్టార్లు, పెసలు, మినుమ పంటలు సాగవుతున్నాయి. ఇప్పుడిప్పుడు వర్షాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. సీజన్ మొత్తంగా ఇదే తరహాలో వానలు కురిస్తే అదనంగా 20వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని, పంటలు సైతం సమృద్ధిగా పండుతాయని వ్యవసాయ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.