కారు ఢీ కొని 20 జీవాలు మృతి | 20 animals died by hitting car | Sakshi
Sakshi News home page

కారు ఢీ కొని 20 జీవాలు మృతి

Published Wed, Mar 22 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

చెన్నాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తు తెలియని కారు ఢీకొని 20 జీవాలు మృతి చెందాయి.

 
ఎమ్మిగనూరు రూరల్ :  చెన్నాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తు తెలియని కారు ఢీకొని 20 జీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఉరుకుందు తన గొర్రెలు, మేకలను మేత కోసం రోడ్డు దాటిస్తుండగా ఆదోని నుంచి కర్నూలు వైపు వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గొర్రెల యజమాని తేరుకునేలోపే కారు వేగంగా వెళ్లిపోయింది. బాధితుడు లబోదిబోమంటు కుప్పకూలడంతో వాహనదారులు ఓదార్చారు. ఒక్కొక్క దాని విలువ రూ.6 వేలు ఉంటుందని, ఈ లెక్కన రూ. 1.20 లక్షలు నష్టం జరిగినట్లు బాధితుడు చెపుతున్నాడు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement