animals
-
ఔరా ఇదేమి చిత్రం.. హైదరాబాద్ రోడ్లపై అబ్బురపరిచేలా జంతువులు (ఫొటోలు)
-
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి 'వైల్డ్' ఫోటోగ్రఫీ.. (ఫొటోలు)
-
మొసలి అస్వస్థత
వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో! ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది. ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్‌లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్‌లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
బయోడైవర్సిటీ లాస్!
పక్షులు, జంతువుల సహజ ఆవాసాల తగ్గుదల... క్షీణిస్తున్న అడవులు, తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం... ఇంకా లోతుగా విశ్లేíÙస్తే ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో వన్యప్రాణులు, పక్షి, జంతు, వృక్ష... ఇలా విభిన్న రకాల జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో వివిధరూపాల్లో పర్యావరణంపై, ఇతర రూపాల్లో ప్రభావం చూపేలా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అవసరానికి మించి సహజ వనరుల వినియోగం, గాలి, నీరు కాలుష్య బారినపడడం వంటి వాటి వల్ల జీవవైవిధ్యంపై ప్రభావం చూపడంతో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్– 2024’నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగటు సైజ్ అనేది 73 శాతం మేర తగ్గిపోయింది. జూలాజిక్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్) రూపొందించిన ‘ద లివింగ్ ప్లానెట్ ఇండక్స్’ నివేదికను గమనిస్తే...1970–2020 మధ్యలో వివిధ జంతు, పక్షు జాతుల్లో 85 శాతం ఫ్రెష్ వాటర్ పాపులేషన్, టెర్రస్టియల్ పాపులేషన్ 69 శాతం, మెరైన్ పాపులేషన్ 56 శాతం తగ్గినట్టుగా తేలింది. జీవవైవిధ్యమనేది భూమి, విభిన్న రకాల మొక్కలు, వృక్షజాతులు, జంతు, పక్షి జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు (మైక్రో ఆర్గనిజమ్స్) తదితరాలతో కూడుకుని ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్తెలంగాణలో చూస్తే..వివిధ రూపాల్లో వెల్లడైన వివరాలు, సమాచారం మేరకు చూస్తే తెలంగాణలో జీవవైవిధ్యా నికి వాటిల్లిన నష్టానికి ప్రధానంగా అడవులకు వాటిల్లుతున్న నష్టం, తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం, అంతర్ గ్రహ మొక్కలు (ఇన్వెసివ్ ఎలియన్ స్పీషీస్) విపరీతంగా పెరుగుదల, మత్స్య రంగ అతి వినియోగం, కాలుష్య స్థాయిల పెరుగుదల, వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి కారణమవుతున్నాయి. ⇒ 2023 జూన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2 వేల మొక్కలు, వృక్షాల రకాలు, 5,757 జంతురకాలు ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా జెనిటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీల ద్వారా జీవవైవిధ్యాన్ని పరిశీలిస్తారు. ⇒ 2023లో తెలంగాణలో 646 హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ పంగోలిన్, మౌస్డీర్స్, మలబార్ పైడ్ హార్న్‌బిల్, బ్లాక్నెక్డ్ స్టోర్క్, రుడ్డి మంగ్యూస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సంద్కోల్ కార్ప్ వంటి జంతు, పక్షి రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్లోత్బేర్, ఇండియన్ బైసన్, ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీవవైవిధ్యం ఏ స్థాయిలో ఉంది, ఎదురవుతున్న సమస్యలు, అందుకు కారణాలు ఏమిటి? తదితర అంశాలపై పర్యావరణ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదుజీవవైవిధ్యం అంటే ఏమిటనేది అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు అని గుర్తించాలి. విధాన నిర్ణేతలు, ప్రజాప్రతినిధులు కూడా గడ్డిభూములు, బీడుభూములు వంటివి కూడా పర్యావరణవ్యవస్థల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి. చెట్లు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మనమంతా గుర్తించాలి. భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పెద్దసంఖ్యలో చెట్ల తొలగింపు, గ్రీన్‌కవర్ తగ్గినప్పుడు జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది.నగరాల్లోనూ రోడ్ల విస్తరణ, నిర్మాణపరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు వెంటనే ట్రీకవర్ తగ్గిపోయిన ప్రభావం తప్పకుండా జీవవైవిధ్యంపై పడుతుంది. పచ్చదనం పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల సందర్భంగా గడ్డి మైదానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ విషయంపై తెలంగాణలో పెద్దగా దృష్టి సారిస్తున్న పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తగినంత స్థాయిలో గడ్డిమైదాన ప్రాంతాలున్నాయి.వాటిని యుద్ధప్రాతిపదికన సంరక్షించాలి. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో మంచిస్థాయిలో జీవవైవిధ్యమనేది అలరారుతోంది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని జాతీయపార్కులు, శాంక్చురీలలోనూ జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో దాదాపు పది, పన్నెండేళ్ల క్రితం నిర్వహించిన కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్యం కొంతమేర మెరుగైంది. రాష్ట్రంలో ఎంత మేర జీవవైవిధ్యాన్ని నష్టం జరిగింది, ఏ ఏ పక్షి, చెట్లు, జంతువుల రకాలు తగ్గిపోయాయనే దానిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ పరిశీలన, అధ్యయనమేదీ జరగలేదు. అందువల్ల ఎంతమేర నష్టం జరిగింది, ఏఏ జాతులు కనుమరుగు అవుతున్నాయనే దానిపై సాధికారికంగా వ్యాఖ్యానించేందుకు అవకాశం లేదు. –ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్–ఇండియా రాష్ట్రంలో దిగజారుతున్న జీవ వైవిధ్యం కొంతకాలంగా రాష్ట్రంలో జీవవైవిధ్యం అనేది దిగజారుతోంది. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. కొన్ని చెట్లు, మొక్కల రకాలు కూడా అంతరిస్తున్నాయి. ఊర పిచ్చుకలు, బోరుగ పిచ్చుకలు దాదాపుగా కనబడకుండాపోగా, కాకులు, ఇతర పక్షుల సంఖ్య కూడా క్షీణిస్తోంది. కప్పలు, కొన్నిరకాల చేపలు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల తగ్గుదల ప్రభావం, చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల జంతువులు, పక్షుల ఆవాసాలు, నివసించే ప్రదేశాలు కుచించుకుపోతున్నాయి. వాటికి సరైన ఆహారం దొరకడం లేదు. పక్షులు, ఇతర జంతువులు తాగేనీరే తక్కువ కాగా, అది అంతగా లభించడం లేదు. నగరం, పట్టణాల చుట్టుపక్కల పైపులైన్లతోనే ఇళ్లకు నీటి సరఫరా, ఉపరితలంపై ఉన్న నీరు కలుషితం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు, జంతువులు వంటి వాటికి నీరు, ఆహారం దొరక్క ఆవాస ప్రాంతాలు, గుడ్లు, సంతానం పెంపొందించుకునే అవకాశం లేకపోవడంతో పక్షి, జంతుజాతులు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ప్రాజెక్టులు, ఇతర రూపాల్లో నిర్మాణాలు పెరిగిపోవడం, అవసరానికి మించి సహజవనరుల అతి వినియోగం, గణనీయంగా పెరిగిన రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలు పెరగడం, ఆన్‌రోడ్డు వెహికిల్సే కాకుండా ఇసుక, మైనింగ్, ఇతర అవసరాల కోసం నీరు, ఇతర ప్రదేశాల్లోకి వాహనాల ప్రవేశం నష్టం చేస్తోంది.2012లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చారు. పిచ్చుకలు, ఇతర తగ్గిపోతున్న పక్షి, జంతుజాతులను ఎలా సంరక్షించాలనే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణరంగ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ -
జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 45లో బెంగాల్ టైగర్ చూసారా..? (ఫొటోలు)
-
అదుపులోకి కర్ణాటకకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు
-
Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్‌ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు. అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది. పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్‌లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్‌లోకి ప్రభుత్వం చేర్చింది.అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం. ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా? ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా? పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు. 35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్‌ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్‌ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్‌లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.కోళ్ల వ్యాధులకు కూడా..?కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం. (నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
మహాప్రాణులకు మళ్లీ జీవం!
డైనోసార్లు, మామత్‌లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ, టీవీ సిరీస్‌లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.పన్యాల జగన్నాథదాసుఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్‌లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్‌ఫిక్షన్ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్‌కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్) అభివర్ణిస్తున్నారు.మరో నాలుగేళ్లలోనే మామత్ పునరుత్థానంఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్‌కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.‘కలోసల్ బయోసైన్సెస్’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్‌టింక్షన్ కంపెనీ. మామత్ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ వెల్లడించింది. ‘తొలి మామత్‌కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్‌కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్ బయోసైన్సెస్ సీఈవో బెన్ లామ్ తెలిపారు.‘జురాసిక్ పార్క్’ మాదిరిగా కాదు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ పార్క్’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్ క్రైటన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్ జాతికి చెందిన డైనోసార్ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్ బయోసైన్సెస్ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్ పార్క్‌లో మాదిరిగా మేము మామత్ డీఎన్ఏను తీసుకుని, దాంతో ఆసియన్ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్ లామ్ వివరించారు.దశాబ్ద కాలంగా సంఘటిత కృషి అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌కు (ఐయూసీఎన్) చెందిన స్పీసీస్ సర్వైవల్ కమిషన్ 2014లో డీ ఎక్స్‌టింక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.క్వాగాఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఎలిఫంట్ బర్డ్ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్ బర్డ్ ఒకటి. మడగాస్కర్‌లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్‌లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్ బర్డ్ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్ బర్డ్ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్ బర్డ్ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్ బర్డ్‌కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.స్టెల్లర్స్ సీ కౌఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్ సముద్రంలో కమాండర్ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ విల్హెల్మ్ స్టెల్లర్ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్ దీవి తీరంలో స్టెల్లర్స్ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.ఐరిష్ ఎల్క్జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్ నుంచి సైబీరియాలోని బైకాల్ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్ ఎల్క్ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్ ఎల్క్ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్‌లో ఐరిష్ ఎల్క్ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్ ద్వారా ఐరిష్ ఎల్క్కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ఆరోక్స్ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్ డీఎన్ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్ డీఎన్ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.టాస్మానియన్ టైగర్పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్ టైగర్’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్ వూల్ఫ్’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్ టైగర్ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏను ఇథనాల్‌లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్ టైగర్‌కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టరేషన్ రీసెర్చ్ లాబ్ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ది గ్రేట్ ఆక్ఇది చూడటానికి పెంగ్విన్‌లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్ ఆక్ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్ ఆక్ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్ ఆక్ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. -
సలాం రామయ్య అంకుల్..! కంట తడి పెట్టించే వీడియో!
సోషల్ మీడియాలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. పెద్ద మనసుతో చేసే మంచి పని ఏదైనా నెటిజన్లును ఆకట్టుకుంటుంది. బెంగళూరులో రామయ్య మామయ్య స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెప్పులు కుట్టుకొని పొట్టపోసుకునే రామయ్య చేసిన పని లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. తన చిన్న ప్రపంచంలో మూగజీవులకు చోటిచ్చిన అపురూప మనిషిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by 𝕃𝔼𝕀𝔸 ♡ The Golden Indie (@leia_the_golden_indie) బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని డెకాథ్లాన్ షాప్ బైట ఒక చెప్పులు కుట్టుకునే వృత్తిలోఉన్నాడురామయ్య. ఆయన పనిచేసే చిన్న బడ్డీకొట్టులోనే తనతోపాటు మరికొన్నిమూగ జీవాలను ఆశ్రయం ఇచ్చి వాటికి పెద్ద దిక్కయ్యాడు. ఒకటీ రెండూ, కాదు దాదాపు 15 జంతువులు ఆయన చేరదీశాడు. వీటిల్లో రెండు వీధి కుక్కలు, పిల్లి కూన అతని పక్కనే ఆడుకుంటూ ఉంటాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు, దెబ్బలు తగిలితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేంత దయాయుడు. ఈ రామయ్య. అందుకే అతణ్ని అందరూ రామయ్య మామయ్య అని పిలుచుకుంటారట. లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2023, డిసెంబరులో అతనికి బంధించిన స్టోరీ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే, ఒక్క క్షణం ఆగండి, నిజమైన ప్రేమ, దయ , దాతృత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూడండి.. పాత బూట్లను రిపేర్ చేయడానికి పని చేసే ఆ చిన్న స్థలంలోనే, కనీసం 3 కుక్కలు వెచ్చగా నిద్రపోతూ ఉంటుంది. ఒక బుజ్జి పిల్లి కూన ఆడుకుంటూ ఉంటుంది’’ అని తెలిపారు. అతని కోసం విరాళాలు సేకరణ కూడా చేపట్టారు.దీంతో రామయ్యంకుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచి మనసుతో రామయ్య చేస్తున్న పనికి ముగ్దులై అతని సాయం చేయడానికి ముందుకొచ్చారు.రామయ్య అంకుల్ ఫండ్ రైజర్ పేజీ ప్రకారం దేశం నలుమూలలనుండి విరాళాలొచ్చాయి. ‘నీకేమైనా కావాలా అంటే... నాకేమీ అవసరం లేదు..వాటికి అన్నం పెడితే చాలు’ అని చెప్పేవాడట ప్రేమతో. మొత్తం వసూలు చేసిన తర్వాత, చందాదారులందరి పేర్లతో ఒక కార్డు తయారు చేసి గత వారం రామయ్య అంకుల్‌కి అందించారు. ఇందులో సగం వీధిజంతువుల సంక్షేమం కోసం మిగతాసగం ఆయన ఖాతాలోను జమచేశారు. దీంతో సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. దాతలందరికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు నెలల క్రితమే తన భార్య చనిపోయిందని, తన కూతురిని పెంచే బాధ్యత తనపైనే ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దాతలు ఇచ్చిన కార్డును తన దుకాణంలో వేలాడ దీసుకున్నాడు సగర్వంగా. “ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే అంటే ఏమిటో మాకు చూపించినందుకు రామయ్య రామయ్యకు ధన్యవాదాలు. తమ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్నదాంట్లోంచి ఏదో కొద్దిగా ఇవ్వడం గొప్ప కాదు, తనకున్న చిన్నమొత్తంలోంచే ఘనంగా ఇవ్వడంలోనే ఉంది అసలు మానవత్వం అంటూ లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. -
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది. -
జంతు ప్రేమికా.. జాగ్రత్త సుమా!
రాజమహేంద్రవరం రూరల్ /రాయవరం/ కాకినాడ సిటీ: మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం అవి మానవ జీవితంతో ముడిపడ్డాయి.. నిన్న మొన్నటి వరకూ సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా మారింది. అలాగే గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శనివారం ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం రండి.ఆ పేరు ఎలా వచ్చిందంటే..పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్ దినోత్సవం జరుపుకొంటున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..తూర్పుగోదావరి జిల్లాలో వీధికుక్కలు 1,15,771, పెంపుడు కుక్కలు 26,562, ఆవులు 74,778, గేదెలు 1,93,847, గొర్రెలు 1,71,263, మేకలు 69,265, పందులు 2,080 ఉన్నాయి. కోనసీమ జిల్లాలో మొత్తం పెంపుడు జంతువులు 63,953 ఉన్నాయి. ఇందులో కుక్కలు 22,570 ఉండగా, పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు 41,383 ఉన్నాయి. కాకినాడ జిల్లాలో పశువైద్య శాలలు, ప్రాంతీయ, వెటర్నటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో జూనోటిక్ వ్యాధుల నివారణకు శనివారం ఉచితంగా టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లాకు 32 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం చేశారు. ఏ వ్యాధులు వస్తాయంటే..పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియోసిస్, రింగ్వార్మ్ వ్యాధులు వస్తాయి. గొర్రెలు, మేకల నుంచి ఆంత్రాక్స్, బ్రూసిల్లోసిస్, లిస్టిరియా, హైడాటిడోసిస్, సార్కోసిస్టిస్, సోల్మోనెల్లోసిస్, క్యూ–ఫీవర్, మేంజ్ వ్యాధులు సంక్రమిస్తాయి. కుక్కల నుంచి రేబిస్, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్ వార్మ్, హైడాటిడోసిస్, మీసిల్స్, మంప్స్, మేంజ్ వ్యాధులు వస్తాయి. అలాగే పందులు, పిల్లులు, గుర్రాలు, కోళ్లు రామచిలుకలు, కుందేళ్ల నుంచీ వివిధ వ్యాధులు సోకుతాయి. వైద్యుల సలహాలు తప్పనిసరిజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. జునోసిస్ డే సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లకు, జంతువధ శాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి, తూర్పుగోదావరిసకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలి. –డాక్టర్ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ, అమలాపురం వ్యాధులుసంక్రమించకుండా టీకాలుజంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజస్ అంటారు. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఏటా జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకోవడం ఆనవాయితీ. పశువుల వ్యాధుల పట్ల మరిన్ని సలహాల కోసం ప్రభుత్వం 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రేబిస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులైన కుక్కలకు టీకాలు వేయించాలి.–ఎస్.సూర్యప్రకాశరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు, కాకినాడశుభ్రత.. భద్రతముఖ్యంగా పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకోవడం బాగా పెరిగింది. పెంపుడు జంతువులతో ఆటలాడిన తర్వాత శుభ్రత పాటించకుంటే వ్యాధులకు గురవుతుంటారు. జంతువులను పెంచుకునే వారు తగిన జాగ్రత్తలు పాటించకుంటే వాటి నుంచి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో రేబిస్, ఆంత్రాక్స్ వంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులపై దాడి చేయకుండా యజమానులూ జాగ్రత్త పడాలి.వ్యాక్సిన్ తప్పనిసరిపెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. కుక్కులకు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లులు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. -
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. తండ్రి నుంచి టాటా నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇప్పటికి కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని స్పష్టం చేశారు. కంపెనీల విషయంలో లేదా వ్యాపారాల విషయంలో తన తండ్రి ముఖేష్ అంబానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారని. ప్రతి రోజూ వారి దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉన్నానని అన్నారు. బిజినెస్ మాత్రమే కాకుండా తమ కుటుంబమంతా వన్య ప్రాణుల పట్ల ధరతో ఉంటామని వెల్లడిస్తూ.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ కంపెనీ ఒక 'జూ' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూ అభివృద్ధిలో కూడా తన తల్లినద్రులే స్ఫూర్తి అని చెప్పారు. ఏనుగుల కోసం ఓ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, అందులో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని చెప్పారు. ఏనుగులు మాత్రమే కాకుండా జూలో మొత్తం 100 జాతుల కంటే ఎక్కువ జీవులు ఉన్నాయని, అరుదైన లేదా అంతరించిపోతున్న జంతువులను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జంతువులోనూ దేవుణ్ణి చూస్తున్నట్లు అనంత్ అంబానీ వివరించారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? జూలో సంరక్షులు సుమారు 3000 నుంచి 400 మంది ఉన్నారని, వారందరూ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు.. జూలో సౌరశక్తిని మాత్రం ఉపయోగిస్తున్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారు. మొత్తం మీద అంబానీ ఫ్యామిలీ జీవులను రక్షించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Reliance Foundation announces Vantara - a comprehensive Animal Rescue, Care, Conservation and Rehabilitation programme, the first of its kind in India. Anant Ambani says "We started the wildlife rescue center building in the peak of COVID...We've created a jungle of 600… pic.twitter.com/OoWh9HWsU8 — ANI (@ANI) February 26, 2024 -
ఈ విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
అత్యంత ఖరీదైన పెట్ డాగ్స్ (ఫోటోలు)
-
World Best Photos Of 2023: ప్రపంచ వ్యాప్తంగా 2023లో తీసిన బెస్ట్ ఫోటోలు ఇవే.. ఓ లుక్కేయండి
-
కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?
మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అక్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా? అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్ డిసీజ్'ని వైద్య పరిభాషలో (క్రానిక్ వేస్టింగ్ డిసీజ్(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన 'మ్యాడ్ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. It starts. You watch: be walking down the street one day, happy about how things are finally going right, and CHOMP!! zombie deer bites ya in the ass. pic.twitter.com/HOgQuQ5lEp — Ryan (@Ryno_Charger) December 24, 2023 ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్ కోరి ఆండర్సన్ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి. Scientists confirm this is the best approach to combating the zombie deer disease pic.twitter.com/HmQKCF8STO — Hot White Hennessy (@Phillystunna221) December 25, 2023 ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. Damn, Rudolph caught the zombie deer disease 💀 pic.twitter.com/vdEZr9aHyh — Creepy.org (@CreepyOrg) December 25, 2023 (చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!) -
మీకు తెలుసా..?
-
ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
మీకు తెలియని నిజాలు తెలుగులో (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువులను, పక్షులను ఫోటోలను తీయడం అంత ఈజీ కాదు (ఫోటోలు)
-
ఈ సంగతులు మీకు తెలుసా?
-
ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
-
ఇది మీకు తెలుసా? (ఫోటోలు)
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు
-
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?
మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్‌లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు. నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
'ఇప్పటికైనా తినడం ఆపేయండి'.. వైరలవుతున్న బాలయ్య హీరోయిన్ పోస్ట్!
విజయదశమి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ముంబయి భామ వేదిక. ఆ తర్వాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన-3, రూలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చేసింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. 2019లో ది బాడీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకార్, జంగిల్ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటోంది. అయితే మూగజీవాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతోంది వేదిక. మాంసాహారం కోసం మూగజీవాలను ఎంతలా హింస పెడుతున్నారంటూ పోరాటం చేస్తోంది. జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాటం చేస్తోంది. ఇటీవల జీ-20 సమ్మిట్ కోసం వీధి కుక్కులను అత్యంగా క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక.. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. వేదిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' కోళ్లు, ఆవులు, మేకలు, పందులు మాంసం వెనక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ ఫారమ్‌ల వెనుక ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంలో కూడా) మాంసం, డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా?? జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపివేయండి. వెగాన్గా(వెజిటేరియన్) మారిపోండి. ఇప్పుడే జంతువులను తినడం మానేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యానిమల్స్' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మరికొందరేమో మీరు వేజిటెరియన్గా మారితే.. అందరూ అలాగే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల హింస పట్ల ఆమె చేస్తున్న ప్రయత్నం కొద్ది మందిలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూద్దాం. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?
భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది. ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్‌లు,హోమో సేపియన్లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది. ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు. ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది? -
‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!
ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు! -
వనం నుంచి జనం మధ్యకు వస్తున్న మృగాలు
-
చిన్నవే కానీ..ప్రాణాలు తీసేస్తాయ్!
-
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలస్‌లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
ఏళ్లపాటు గర్భాన్ని మోసే జంతువులివే..
తన మనుగడను కొనసాగించేందుకు ప్రతీ జీవి సంతానోత్పత్తి చేస్తుంది. మనిషి జన్మించక మునుపు 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. అయితే కొన్ని జంతువులు ఏళ్ల తరబడి గర్భాన్ని మోసి పిల్లలకు జన్మనిస్తాయి. అటువంటి జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాడిదను చాకిరీకి గుర్తుగా చెబుతారు. పూర్వం రోజుల్లో గాడిదను రవాణాకు, బరువులు మోసేందుకు విరివిగా వినియోగించేవారు. ఇది 12 నెలల పాటు గర్భాన్ని మోసి, పిల్లకు జన్మనిస్తుంది. ఎడారి ఓడగా పేరుగాంచిన ఒంటె చాలాకాలం పాటు నీటిని తాగకపోయినా బతుకుతుంది. ఇది 13 నుంచి 15 నెలల పాటు గర్భం మోస్తుంది. సుమారు 410 రోజుల తరువాత పిల్లకు జన్మనిస్తుంది. పొడవైన మెడ కలిగిన జిరాఫీ చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఇది 13 నుంచి 16 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. అనంతరం పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పుడు దాని పిల్ల కూడా పొడవుగా ఉండటం విశేషం. ఖడ్గమృగం చూడటానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది 15 నుంచి 16 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. తెల్ల ఖడ్గమృగాలు 16 నుంచి 18 నెలల పాటు గర్భాన్ని మోస్తాయి. ఏనుగు దీర్ఘకాలం పాటు గర్భధారణ కలిగివుంటుంది. ఇది గర్భాన్ని ధరించిన 680 రోజులకు పిల్లకు జన్మనిస్తుంది. దీర్ఘకాలం పాటు గర్భధారణ కలిగివుండే జంతువులలో ఏనుగు ముందు వరుసలో నిలుస్తుంది. ఇది కూడా చదవండి: పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని.. -
ప్రపంచంలో టాప్10 విచిత్రమైన డైనోసార్స్
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
వరుసగా మృతి చెందుతున్న పులులు... విషయం తెలిసిన గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే...
మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌లోగల కూనో నేషనల్ పార్క్‌లో గడచిన రెండు నెలలలో మూడు చిరుతలు, వాటి పిల్లలు మూడు మృతిచెందాయి. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. దీనికితోడు ఇదే ఈ జూర్కులో ఉన్న 17 చిరుతలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఒక చిరుత కూన కూడా వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుపడాలని కోరుతూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కర్హల్ తహసీల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో పులల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా కూడా చేస్తున్నారు. గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా 2022 సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌కు నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుతలను అప్పగించారు. వాటిలో ఐదు మగ చిరుతలు, 3 ఆడ చిరుతలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాటి సంరక్షణకు చీతా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇదేవిధంగా 2023 ఫిబ్రవరి 18 ఇక్కడకు ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వీటిలో 7 ఆడ చిరుతలు, 5 మగ చిరుతలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 26న నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. అలాగే ఏప్రిల్ 23న సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఒక చిరుత మృతి చెందింది. మే 9న మరో చిరుత మరణించింది. మే 23న ఒక చిరుత కూన మృతి చెందింది. తరువాత కొన్ని చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. -
ప్రపంచంలోని టాప్ 10 జూలాజికల్ పార్కులు ఇవే!
-
ప్రపంచంలోని టాప్ 10 నెమ్మదైన జంతువులు
-
జల్లికట్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది. ఇది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జట్టికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు మహారాష్ట్ర & కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాలను అత్యన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. కాగా జల్లికట్టు వంటి క్రీడలను సుప్రీంకోర్టు 2014లో నిషేధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఈ రాష్ట్రాలు ఇటువంటి క్రీడలకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా చట్టాలను సవరించాయి. ఇవి వారసత్వ క్రీడలని పేర్కొన్నాయి. 2017లో జల్లికట్టును అనుమతిస్తూ కొన్ని సవరణలు చేసి తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది. ఈ సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేస్తూ జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. చదవండి: ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
వేసవి నేపథ్యంలో నెహ్రు జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
-
ప్రపంచంలో నీరు లేకుండా జీవించే టాప్ 10 జంతువులు (ఫోటోలు)
-
పర్యావరణంలో మీ పాత్ర?
పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం మీరు ఏమి చేస్తున్నారో మీకు మీరుగా ప్రశ్నలు వేసుకోండి. ఒకవేళ మీకు సరైన సమాధానం రాకపోతే ఈ కింద చెప్పుకున్న పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి. ♦ ఈ పర్యావరణంలో జంతువులు, పక్షులు కూడా భాగమే కాబట్టి వాటికోసం ఆవాసాలు, చెట్ల మీద గూళ్లు ఏర్పాటు చేయడం. ♦ జల, మృత్తికా కాలుష్యాలను అరికట్టేందుకు ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గించాలని ప్రచారం చేయడం. ♦ పాతవస్తువుల పునర్వినియోగం గురించి పిల్లలకు తెలియజేయటం. ♦ వీధులు,పార్కులు, ఇతర ప్రదేశాల్లో వ్యర్థాలను తీసిపారేయటం. ♦ వీలైతే పర్యావరణ భద్రత గురించిపాటలు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వీలైనన్ని మొక్కలను నాటటం, నాటించటం. ♦ భూమిని, సహజవనరులను కాపాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి ప్రతిరోజూ పర్యావరణ దినోత్సవంగానే భావించడం, అలా భావించాల్సిందిగా మన చుట్టుపక్కల వారికి కూడా చెప్పడం. ♦ మన భూమి భవిష్యత్తు రేపటి పౌరులైన పిల్లల చేతిలో ఉంది కాబట్టి పర్యావరణాన్ని, సహజవనరులను కాపాడాల్సిన బాధ్యతను గురించి వారికి తెలియజేసేందుకుపాఠశాలలో వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ♦ స్వచ్ఛత, కాలుష్యనివారణ, పర్యావరణం తదితర అంశాలకు సంబం ధించి కృషి చేస్తున్నవారిని, వాటికోసం ఎంతగానోపాటుపడుతున్నవారిని సత్కరించడం వల్ల ఇతరులు సైతం స్ఫూర్తిపొందే అవకాశముంది. ♦ పర్యావరణ హితం కోసం మన చుట్టుపక్కల చేపడుతున్న, జరుగుతున్న కార్యక్రమాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. వీటి గురించి మీ మీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునేందుకు మీరే సమాచార సారథిగా మారడం. ఇతరులకు ప్రేరణ అందించడం. -
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్‌లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
వైరల్ వీడియో: ఖెర్సన్ జూలో జంతువులను ఎత్తుకుపోతున్న రష్యా సేనలు
-
ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు
ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. బహుశా ఎలాగో పోతున్నాం కదా అని దొంగతనం చేస్తున్నారు కాబోలు. ఈ క్రమంలో ఖెర్సన్ జూలోని ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంటి జాతులను, లామా అనే ఒంటె, నెమళ్లు, రెండు ఆడ తోడేళ్లు, గాడిద వంటి జంతువులను బలవంతంగా పట్టుకుని వాహనంలో ఎక్కించారు. కేవలం జంతువులే కాదు అక్కడ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ కళాఖండాలు, వైద్య పరికరాలు వంటివి పట్టుకుపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జంతు ప్రదర్శనశాల నుంచి రష్యా బలగాలు జంతువులను పట్టుకుపోవడాన్ని తప్పపట్టారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగ్‌లు,మ్యూజియంల నుంచి పురాత వస్తువులు తదితరాలన్నింటిని దొంగలించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రష్యా బలగాలు ఉక్రెయిన్‌ని ఏమీ చేయలేక ఈ దొంగతనానికి ఒడిగట్టారంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ) -
జంతువులు అడవికే పరిమితం!
సాక్షి, అమరావతి: ఏనుగులు, పులులు వంటి జంతువులు జనావాసాలు, పొలాల వద్దకు వచ్చి బీభత్సం సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జంతువులను అడవికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఒడిశా, తమిళనాడు అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన అటవీ శాఖాధికారుల సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఎనిమిదేళ్లలో 38 మంది మృత్యువాత ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల రెండు పులులు దారి తప్పి తూర్పుగోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి, పొలాల్లోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు మధ్య సంఘర్షణలో 2014 నుంచి ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలపై 15,198 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలు, పంట, ఇతర నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా పరిహారం చెల్లించింది. పటిష్ట భద్రత ఏర్పాట్లు.. అవగాహన కార్యక్రమాలు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులు ఎక్కువగా ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఏనుగులు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వడం (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్‌లు), ఆర్సీసీ పిల్లర్లతో స్ట్రీమ్ బారికేడ్లు, రోడ్లపైకి వచ్చే మార్గాల్లో గేట్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో 24గంటలు తిరుగుతూ వాటిని గ్రామాల్లోకి రాకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, ఎలిఫెంట్ ట్రాకర్లను నియమించనున్నారు. అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మిరపకాయ పొగ వేయడం, ఆముదం స్ప్రే చేయడం, తేనెటీగల సౌండ్ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవి వైపు మళ్లించే అంశాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏనుగులు బయటకు రాకుండా అడవుల్లోనే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో సమన్వయం పెంచుకుని ఏనుగుల కదలికలపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. పులులను ట్రాప్ చేసేలా... తమ ఆవాసాల్లోకి వేరే పులులు రావడంతో అక్కడక్కడా పులులు దారి తప్పి అడవి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా బయటకొచ్చిన పులులు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి ఆవులు, మేకలు వంటి జంతువులను చంపుతున్నాయి. ఇలాంటి ఘటనల నివారణ కోసం వాటిని ట్రాప్ చేసే కేజ్‌లు సమకూర్చుకోవడంతోపాటు కెమెరాల ట్రాప్లను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. అవి అడవి దాటి రాకుండా చర్యలు చేపడుతున్నారు. -
మూగ జీవుల కోసం ‘వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్’.. సత్వర చికిత్స
సాక్షి, అమరావతి: మూగజీవాలు.. సన్నజీవాలు.. పెంపుడు జంతువుల్లో బయటకు కనిపించే గాయాలను బట్టి వైద్యం చేయించడం పెద్ద సమస్య కాదు. కానీ.. కడుపు నొప్పి, చెవిపోటు, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటే పసిగట్టడం కష్టమే. గుర్తించిన తర్వాత వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి వైద్యుల సలహా మేరకు మందులను వాడేవారు. వాటినుంచి నమూనాలు సేకరించి చిన్నచితకా పరీక్షలను ఆస్పత్రుల్లోనూ.. పెద్దపెద్ద పరీక్షలను జిల్లా స్థాయి ల్యాబ్‌లకు పంపి పరీక్షించేవారు. సిబ్బంది కొరత, సామర్థ్యం లోపాల వల్ల పరీక్షలు చేయాలంటే.. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, మరికొన్ని సందర్భాల్లో నెలల తరబడి సమయం పట్టేది. ఈలోగా వ్యాధి తీవ్రత పెరిగి పశువులు మరణించడం వల్ల పోషకుల ఆర్థిక పరిస్థితి తల్లకిందులయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా క్షణాల్లో వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు సత్వర పశువైద్యసేవలు అందిస్తున్నారు. గతంలో జిల్లాకు ఒకటే ల్యాబ్ రాష్ట్రంలో 2019 లెక్కల ప్రకారం.. 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 కోట్ల కోళ్లు ఉండేవి. వీటి పోషకుల్లో నూటికి 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయడంతో పశుపోషణ రైతులకు లాభదాయకంగా మారింది. ఆర్బీకేల్లో 4,652 మంది పశు సంవర్ధక సహాయకులు సేవలందిస్తుండగా, మరో 5,160 సహాయకుల నియామకానికి కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు పశువుల్లో వచ్చే రోగాలను గుర్తించేందుకు గతంలో జిల్లాకు ఒకటి చొప్పున మాత్రమే వెటర్నరీ ల్యాబ్స్ ఉండేవి. పశువులకు నాణ్యమైన వైద్యసేవలు, సర్టిఫైడ్ ఇన్పుట్స్ అందించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 154 వైఎస్సార్ పశుసంవర్ధక ల్యాబ్స్‌ను తీసుకొచ్చారు. వీటితోపాటు జిల్లా స్థాయిలో 10, ప్రాంతీయంగా 4, రాష్ట్ర స్థాయిలో స్టేట్ రిఫరల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్థాయి ల్యాబ్‌లతో పాటు నియోజకవర్గ స్థాయిలో 60 ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి రాగా.. 52 ల్యాబ్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 42 ల్యాబ్స్ ఈ నెలాఖరుకి అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏటా 15 వేల నుంచి 20 వేల శాంపిల్స్‌ను మించి పరీక్షించే సామర్థ్యం ఉండేది కాదు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చాక.. ఈ ఏడాది 20 రకాల వ్యాధులకు సంబంధించి 1.86 లక్షలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించి.. వ్యాధి సోకిన పశువులకు సకాలంలో తగిన చికిత్స అందించగలిగారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా.. సీఎం వైఎస్ జగన్ ఆలోచన విప్లవాత్మకం. మూగజీవాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. వీటితో నాణ్యమైన వైద్య సేవలందించడమే కాదు.. సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌ను సైతం సరఫరా చేయగలుగుతున్నాం. –ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ 24 గంటల్లో ఫలితం ఇచ్చారు నాకు 10 మేకలు, గొర్రెలు ఉన్నాయి. మేకలు ఐదు రోజులుగా పారుడు వ్యాధితో బాధపడుతూ మేత తినడం మానేశాయి. ఆర్బీకే సిబ్బంది సూచన మేరకు పరీక్ష కోసం మంగళగిరి ల్యాబ్‌కి నమూనా తీసుకెళ్లా. 24 గంటల్లోనే పరీక్షించి అంతర పరాన్న జీవులున్నాయని చెప్పగా, వైద్యుని సలహాతో తగిన వైద్యం చేయించాను. జీవాలన్నీ కోలుకున్నాయి. – టి.నాగరాజు, యర్రబాలెం, గుంటూరు జిల్లా వెంటనే రిపోర్ట్ ఇచ్చారు నేను 10 గేదెలు, 10 దూడల్ని మేపుతునా. రెండు గేదెలు 10 రోజులుగా పారుడు సమస్యతో తిండితినక కదల్లేని స్థితిలోకి చేరుకున్నాయి. పేడ నమూనాను జగ్గయ్యపేట ల్యాబ్‌కు తీసుకెళ్లా. పరీక్షిస్తే ‘బాలంటిడియం కోలి’ అనే జీవులు కడుపులో ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాను. ఇప్పుడు పశువులన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పరీక్షలకు పైసా కూడా తీసుకోలేదు. – డి.నాగరాజు, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా -
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్‌ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్ఎస్టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్ఎస్టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్‌లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది. ప్రతి స్వచ్ఛ సేవక్కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్‌రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్‌ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్‌కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్‌ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి. – వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం -
అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి!
మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి దోమలు కారణం! ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి వీధి కుక్కల వెంట్రుకల్లో ఉండే పేనుతో మనకు ప్రమాదం లేదా? పాడి పశువులకు వచ్చే రోగాలు మనకు అంటవా? పోనీ మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా, వైరస్‌లతో జంతువులకు జబ్బులు రావా? అంతెందుకు నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మూలాలు జంతువులే! ఒక్కమాటలో చెప్పాలంటే మనకొచ్చే వ్యాధుల వ్యాప్తికి సగం కారణం జంతువులే! ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యమైతే జరిగిందిగానీ.. పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వన్ హెల్త్’ కార్యక్రమం మాత్రం వేగంగా అడుగులేస్తోంది (కంచర్ల యాదగిరిరెడ్డి) ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనుషులకు కొత్త కొత్త రోగాలు, ఆరోగ్య సమస్యలు పరిచయమవుతున్నాయి. దశాబ్దం క్రితం మనకు చికెన్ గున్యా అంటే ఏమిటో తెలియదు. డెంగీ మాట కూడా చాలా మంది విని ఉండరు. హెచ్1ఎన్1, హెచ్1ఎన్5 వంటివి కనీవినీ ఎరుగం. కానీ ఇప్పుడివన్నీ ఏటా పలకరించే చుట్టాల్లా మారిపోయాయి. ఎందుకిలా అంటే కారణాలు బోలెడు. ముఖ్యమైనది మాత్రం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. అందుకే ఐదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘వన్ హెల్త్’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. ‘సర్వే సంతు నిరామయ’ వేదాల్లోని శాంతి మంత్రంలో ఓ చిన్న భాగమిది. భూమ్మీద ఉన్న వారెవరికీ వ్యాధుల బాధ లేకుండా ఉండు గాక అని అర్థం. అంటే మనుషులతోపాటు జీవజాలం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం. యూఎన్ ‘వన్ హెల్త్’ లక్ష్యం కూడా ఇదే. మానవుల ఆరోగ్యం బాగుండేందుకు.. కరోనా, ఎబోలా, వెస్ట్ నైల్ వంటి భయంకర వ్యాధులు ప్రబలకుండా, కొత్త కొత్త వ్యాధులు అంటకుండా చూసుకునేందుకు.. మన చుట్టూ ఉన్న జంతువులు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెబుతుంది ‘వన్ హెల్త్’. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే ఇటీవలికాలంలో పెచ్చుమీరుతున్న జంతు వ్యాధుల నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. విస్తరిస్తూ పోతున్న కొద్దీ.. భూమ్మీద జనాభా పెరుగుతోంది. మనిషి కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలో మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. ఇలా ఆ జంతువులకు దగ్గరవుతున్న కొద్దీ వాటిలో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, పర్యావరణం దెబ్బతినడం దానికి ఊతమిస్తోంది. వ్యాపార, వాణిజాల్లో వృద్ధి కారణంగా వ్యాధులు ఒకచోటి నుంచి ఇంకో చోటకు ప్రయాణించడం సులువైపోయింది. అందుకే ఇటీవలికాలంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎక్కువైందన్నమాట. కుక్కల నుంచి వచ్చే రేబిస్ మొదలుకొని సాల్మోనెల్లా, వెస్ట్‌నైల్ ఇన్ఫెక్షన్లు, క్యూ ఫీవర్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, లైమ్, రింగ్‌వర్మ్, ఎబోలా వంటివి మనం ఎదుర్కొంటున్న జునోటిక్ (జంతువుల నుంచి సోకేవి) వ్యాధుల్లో కొన్ని మాత్రమే. మారిన పరిస్థితులు జంతువులకూ మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తూండటం ఆసక్తికరమైన అంశం. ఏయే అంశాలపై ‘వన్ హెల్త్’ దృష్టి ‘వన్ హెల్త్’ కార్యక్రమం కేవలం జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధులపై మాత్రమే దృష్టిపెట్టడం లేదు. ఈ వ్యాధులకు కారణమైన ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. యాంటీ బయాటిక్‌లకు లొంగని సూక్ష్మజీవులు వీటిలో ఒకటి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఆస్పత్రులు, ఆహారం, మట్టి, నీరు వంటి పలు మార్గాల ద్వారా మందులకు లొంగని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకెళ్లే క్రిమికీటకాలు (దోమలు, పశువులు, జంతువులపై ఆధారపడి బతికే పేన్లు, ఇతర కీటకాలు)లను నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారంగా ఉపయోగించుకునే జంతువుల (కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల్లాంటివి) సంరక్షణ, ఆరోగ్యం కూడా ‘వన్‌హెల్త్’ కార్యక్రమంలో భాగమే. వన్ హెల్త్ కింద ఏం చేస్తున్నారు? వన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మానవ, జంతు వ్యాధుల నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసికట్టుగా రకరకాల వ్యాధుల వ్యాప్తి ఎలా జరుగుతోందో తెలుసుకుంటున్నారు. పశువులతోపాటు మనుషుల్లోనూ యాంటీ బయాటిక్‌ల విచ్చలవిడి వాడకానికి చెక్ పెట్టేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతుల్లోనూ వన్‌హెల్త్ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు, జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు చేపడుతున్నారు. కంబోడియాలో రేబిస్, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాల నివారణ కోసం వ్యవసాయ, మత్స్య, అటవీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అమెరికాలోని అట్లాంటా అక్వేరియంలోని జలచరాలు కొన్నింటికి కరోనా సోకింది. వాటికెలా సోకిందో తెలుసుకునేందుకు వన్‌హెల్త్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఇది ఇతర జంతువులకు మనుషులకు మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవంబర్ మూడు.. వన్‌హెల్త్ డే! 1964లో కాల్విన్ ష్వాబ్ అనే పశువైద్యుడు తొలిసారి ‘వన్ మెడిసిన్’ పేరుతో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధుల్లోని సారూప్యతలను ప్రస్తావించారు. పశు, మానవ వైద్యులు కలిసికట్టుగా పనిచేస్తే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ష్వాబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ అంశంపై కృషి చేయడం మొదలుపెట్టింది. 2004లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ, రాక్ఫెల్లర్ యూనివర్సిటీలు ‘వన్ వరల్డ్.. వన్‌హెల్త్’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని సూచించాయి. సాంక్రమిక వ్యాధులను అరికట్టేందుకు జంతువులు, పర్యావరణం రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ 2007లో మానవ, జంతు వైద్య పరిశోధన సంస్థల మధ్య సహకారానికి తీర్మానం చేయగా.. తర్వాతి కాలంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు ‘వన్ హెల్త్’ కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను రూపొందించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, విధానాల రూపకల్పనతో 2016లో ‘వన్ హెల్త్ కమిషన్, వన్ హెల్త్ ప్లాట్‌ఫామ్, వన్ హెల్త్ ఇనిషియేటివ్’ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. నవంబరు మూడో తేదీని ‘వన్ హెల్త్ డే’గా ప్రకటించాయి. నైజీరియాలో సీసంతో.. 2010లో నైజీరియాలో అకస్మాత్తుగా డజన్ల కొద్దీ బాతులు చచ్చిపోయాయి. కారణాలేవీ తెలియలేదు. బాతులే కదా అని ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అదే ప్రాంతంలో వందలాది మంది పిల్లలు జబ్బు పడటం మొదలైంది. సమస్య ఎక్కడుందో వెతికేందుకు జరిగిన ప్రయత్నంలో.. ఆ ప్రాంతంలోని వారు ఎక్కువమంది ముతక పద్ధతుల్లో బంగారాన్ని అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో విడుదలైన సీసం నీళ్లలో చేరి పిల్లల అనారోగ్యానికి కారణమైందని తేలింది. నమీబియా చీతాలతో లాభం నమీబియా చీతాలు ఇటీవలే ఇండియాకు వచ్చాయి. దశాబ్దాలపాటు భారత్‌లో కనుమరుగైపోయిన చీతాలు మళ్లీ కనిపించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు కూడా. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనమూ ఉంది. వేటాడి బతికే చీతాలు క్షీణించిపోతున్న గడ్డి మైదానాలను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వేటాడే జంతువులు లేకపోవడం వల్ల గడ్డి తిని బతికే జంతువులు ఎక్కువై మైదానాలు లేకుండా చేస్తున్నాయని, చీతాల ప్రవేశంతో సమతౌల్యత ఏర్పడి గడ్డి మైదానాలు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు. కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ 2007లో కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ చోటు చేసుకుంది. మోంటెరీబే ప్రాంతంలో సీఒట్టర్స్ (సీల్ల తరహాలో ఉంటాయి) అని పిలిచే జలచరాలు కొన్ని జబ్బుపడ్డాయి. మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి. వాటి చిగుళ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోయాయి. కాలేయం ఉబ్బి ఉంది. మామూలు జబ్బులేవీ ఈ లక్షణాలకు కారణం కాదు. వన్‌హెల్త్ కార్యక్రమం కింద సముద్ర, మత్స్య శాఖల అధికారులు పరిశోధన మొదలుపెడితే.. పజారో నది నుంచి పింటో సరస్సుకు అక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తున్న నీళ్లలో కొట్టుకొస్తున్న నాచులోని ఓ రసాయనం సీఒట్టర్స్‌ల మరణానికి కారణమని తెలిసింది. పింటో సరస్సులో విపరీతంగా పెరిగిన నాచులోని నత్తగుల్లలు తినడం సీఒట్టర్స్ ప్రాణాలమీదకు తెచ్చిందని స్పష్టమైంది. -
చావు నుంచి మళ్లీ పుట్టుకకు..
భూమ్మీద మనుషుల విస్తృతి పెరుగుతున్న కొద్దీ అడవులు తరిగిపోతున్నాయి. దీనికి ఇతర కారణాలూ తోడై పలు రకాల జీవరాశులు అంతరిస్తున్నాయి. ఒకప్పుడు తమకే ప్రత్యేకమంటూ గొప్పగా చెప్పుకున్న జీవజాతులూ కనిపించకుండా పోతున్నాయి. అలా విలుప్తమైన జీవులను తిరిగి సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలోనూ అంతరించిపోయిన చీతాలను మళ్లీ పుట్టించేందుకు ప్రయత్నిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జాతులకు చెందిన ఒక్క జీవి కూడా బతికిలేకున్నా తిరిగి పుట్టించడం ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా, ఏం చేస్తారనే వివరాలు తెలుసుకుందామా.. సాక్షి సెంట్రల్ డెస్క్ పులి కాని పులి.. ►ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఇటీవలే కోట్ల రూపాయలతో టాస్మానియన్ టైగర్లను తిరిగి పుట్టించే ఓ ప్రాజెక్టు చేపట్టారు. ఆస్ట్రేలియాకే ప్రత్యేకమైన వీటిని థైలసిన్లుగా కూడా పిలుస్తారు. కొంచెం శునకంలా, మరికొంచెం పులిలా చారలతో ఉండే టాస్మానియన్ టైగర్లు.. వేట, అడవుల విధ్వంసం కారణంగా 1930లోనే అంతరించిపోయాయి. అతి భారీ ఏనుగు ►వేల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన అతి భారీ ఏనుగుల (వూలీ మమ్మోత్)ను తిరిగి పుట్టించేందుకు అమెరికాకు చెందిన కలోస్సల్ బయో సైన్సెస్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వూలీ మమ్మోత్‌లు నాలుగు వేల ఏళ్ల కిందే అంతరించిపోయాయి. 3 విధానాల్లో పునరుత్థానం ఎప్పుడో అంతరించిపోయిన, ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న జీవజాతులను తిరిగి పునరుత్థానం చెందించేందుకు మూడు రకాల పద్ధతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లోనింగ్, బ్యాక్ బ్రీడింగ్, జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఆయా జీవులను పుట్టించవచ్చని అంటున్నారు. ► క్లోనింగ్ ద్వారా జీవులను పుట్టించడం చాలా మందికి తెలిసినదే. ఏదైనా జీవి కణాలను సేకరించి, వాటి నుంచి పిండాన్ని రూపొందించడం ద్వారా.. అచ్చం అదే జీవిని పుట్టించగలుగుతారు. అయితే ఈ విధానంలో ఆ జాతికి చెందిన జీవులు కొన్ని అయినా ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా అంతరించిపోయిన వాటి విషయంలో ఈ విధానం పనికిరాదు. ► అంతరించిపోయిన జీవులకు అత్యంత దగ్గరి జాతి జీవులేవైనా ఉంటే.. వాటి ఆధారంగా పూర్వపు జాతిని పుట్టించడమే ‘బ్యాక్ బ్రీడింగ్’. ఉదాహరణకు.. జీబ్రాలకు బాగా దగ్గరి జాతి అయిన ‘క్వాగ్గాస్’ రకం జంతువులు 1883లోనే అంతరించిపోయాయి. దీనితో శాస్త్రవేత్తలు జీబ్రాల డీఎన్ఏ, బ్యాక్ బ్రీడింగ్ పద్ధతి సాయంతో దాదాపు ‘క్వాగ్గా’తో సరిపోలిన జంతువును పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ► ఎప్పుడో అంతరించిపోయిన జాతితో సరిపోలిన ఇప్పటి జంతువుల డీఎన్ఏను సేకరించి.. దాన్ని మార్చి నాటి జాతిని సృష్టించడం మూడో పద్ధతి. ప్రస్తుతం సేకరించిన డీఎన్ఏలో విలుప్తమైన జాతి లక్షణాలకు సంబంధించిన జన్యువులను చేర్చడం, అవసరం లేని వాటిని తొలగించడం, రీప్లేస్ చేయడం వంటివి చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతమున్న ఏనుగుల డీఎన్ఏలో మార్పులు చేసి ఒకనాటి ‘మమ్మోత్’లను తిరిగి పుట్టించేందుకు హార్వార్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ జార్జ్ చర్చ్ ప్రయత్నిస్తున్నారు. మరి డైనోసార్లనూ పుట్టించొచ్చా? అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించాలంటే వాటికి సంబంధించి కనీస స్థాయిలో డీఎన్ఏ లభించడం తప్పనిసరి. సాధారణంగా ఎంత అనుకూల పరిస్థితులున్నా కూడా డీఎన్ఏ 521 సంవత్సరాల్లో పూర్తిగా దెబ్బతింటుంది. మరి డైనోసార్లు ఎప్పుడో ఆరున్నర కోట్ల ఏళ్ల కిందే విలుప్తమైపోయాయి. వాటికి అతి సమీప జీవులేవీ కూడా ప్రస్తుతం మనుగడలో లేవు. కాబట్టి వాటిని తిరిగి పుట్టించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటివరకు అంతరించిపోయిన ఒక్కజీవిని కూడా తిరిగి పుట్టించలేదు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆ దిశగా ముందడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. -
జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?
ఆరిలోవ(విశాఖపట్నం): జంతువులు అన్ని రంగులను ఆసక్తిగా చూస్తుంటాయి. వాటి చూపును బట్టి ఆయా రంగులను గుర్తిస్తున్నాయని మనం భావిస్తాం. జీబ్రాలు మాత్రం పచ్చని రంగును గుర్తించలేవట. కానీ ఒకేసారి వాటి కంటితో రెండు దృశ్యాలను చూడగలవట. ఈ విషయం వన్యప్రాణుల సంరక్షణ చేసేవారికి మాత్రమే తెలుస్తుంటుంది. ఇంకా వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తిగల విషయాలు ఉన్నాయండోయ్.. చదవండి: నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా.. జీబ్రాలు అడవుల్లో సుమారు 1,000 వరకు గంపులుగా తిరుగుతాయి. అవి గంటకు 40 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరుగెడుతాయట. అందుకే వేటగాళ్లకు ఇవి దొరకవట. ఒకవేళ వేటగాళ్లుగానీ, హైనా, సింహం తదితర క్రూర మృగాలుగానీ వాటిని వేటాడినప్పుడు వెనుక కాళ్లతో తన్ని వాటిని అవే రక్షించుకుంటాయి. పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకు పరుగెడుతుందట. వీటిలో మరో విశేషమేమంటే ఇవి నిలబడే నిద్రపోతాయి. ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు. ఇవి వాటిపై దాడిచేసే క్రూర మృగాలను తికమకపెడతాయట. -
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్‌లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్‌ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్‌లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్‌కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్‌లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్‌పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్‌పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్‌కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్‌పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!
ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్‌లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం. ఎందుకీ ప్రయోగం? ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది. ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ఆ షాట్‌ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా..
Jr NTR Truck Scene In RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. అలాగే అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీలను పొగిడేలా చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఓటీటీలో కూడా రచ్చ చేస్తున్న ఈ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీ మాములుగా ఉండదు. థియేటర్లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు నోరు వెళ్లబెట్టేలా చేసింది ఈ సీన్. ఇప్పుడు ఈ ఎంట్రీ సీన్ నెట్టింట్లో సందడి చేస్తుంది. ఓ విదేశీ యూజర్ ఈ సీన్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అతి తక్కువ సమయంలోనే 12 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సీన్‌ను షేర్ చేస్తూ ఆ యూజర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడేలా ఉన్నాయి. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. I’ve watched 29 MCU movies. I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7 — Nate Offord (@NateOfford) July 17, 2022 'నేను ఇప్పటివరకు 29 ఎమ్‌సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్‌ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు' అని ఆ యూజర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీంతో ఇటు తారక్ ఫ్యాన్స్, అటు సినీ లవర్స్ తెలుగు సినిమా గొప్పతనం గురించి ఎంతో సంతోషిస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య NTR is the clear winner in RRR multi-starrer with domestic as well as Global accolades. First Indian movie video with 10 Million+ Views!#NTRGoesGlobal @tarak9999 https://t.co/FZgkZG4BvW — BingedHelp (@BingedHelps) July 19, 2022 First Ever Indian Video to Cross 10M Views on Twitter & still going strong (nearing 12M now) 🔥@tarak9999 #NTRGoesGlobal #NTR #RRRMovie https://t.co/SV08izQCIK — Kaushik LM (@LMKMovieManiac) July 19, 2022 -
వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి!
డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. జంతువులేంటి.. వాటికి సంపదేంటి అనుకుంటున్నారా! అవేమీ కంపెనీలు పెట్టి ధనం కూడబెట్టలేదండీ! వాటి యజమానులు ప్రేమతో ఇచ్చిన సంపదతో ఈ పెంపుడు జంతువులకు డబ్బు చేసింది. అయితే వీటిలో కొన్ని స్వయంకృషి జంతువులు కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లో, టీవీల్లో నటించడం ద్వారా ఇవి బోలెడు సంపద ఆర్జించాయన్నమాట! ఇలా ఈ జాబితాలో చేరిన జంతువుల ఆస్తుల వివరాల్లో కొన్ని అతిశయోక్తులున్నాయని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ► జిగో అనే కోడి పెట్టను టెక్ట్స్ బుక్ రచయిత మైల్స్ బ్లాక్వెల్ పెంచుకున్నారు. తన తదనంతరం సదరు పెట్టగారికి బ్లాక్వెల్ 1.5 కోట్ల డాలర్లు రాసిచ్చారు. ► ఇటలీకి చెందిన రియల్టీ వ్యాపారి మారియా అసుంటా బజార్లో ఒక పిల్లిని చూసి జాలిపడి తెచ్చుకొని టొమసో అని పేరు పెట్టి పెంచుకున్నారు. 94ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె విల్లు ప్రకారం టొమసోకు 1.3 కోట్ల డాలర్ల ఆస్తి దక్కింది. ► 2018 వరకు బ్లాకీ అనే పిల్లి 1.25 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్న పిల్లిగా పేరుగాంచింది. ► గైల్ పోస్నర్ అనే ఆమె తన పెంపుడు కుక్క కొంచిటాకు 30 లక్షల డాలర్ల ధనంతో పాటు దా దాపు 80 లక్షల విలువైన భవంతిని ఇచ్చేసింది. ► లియోనా హెల్మ్స్లే అనే ఆమె తన మనవళ్లపై కోపంతో తనకున్న 1.2 కోట్ల డాలర్లను ట్రబుల్ అనే కుక్కకు రాసింది. అయితే తర్వాత కోర్టులో జడ్జిగారు కుక్కకు 20 లక్షలు చాలని తీర్పిచ్చారు. ► అగ్ని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తమను రక్షించిందన్న కృతజ్ఞతతో ఫ్లాసీ అనే పెంపుడు కుక్కకు డ్రీ బారీమోర్ దంపతులు 13లక్షల డాలర్ల ఇంటిని ముద్దుగా ఇచ్చేసింది. ► టింకర్ అనే పిల్లికి దాని యజమాని ద్వారా దాదాపు 8లక్షల డాలర్ల ఇల్లు, 2.26 లక్షల డాలర్ల సంపద ముట్టాయి. ► ఫాషన్ మేనేజర్ కార్ల్ పెంచుకునే చుపెట్టే అనే పిల్లికి 20 కోట్ల డాలర్ల ఆస్తి దక్కినట్లు వార్తలు వచ్చాయి, కానీ నిర్ధారణ జరగలేదు. ► ఇక పిల్లుల్లో మహారాజా పిల్లి అంటే గ్రుంపీ క్యాట్నే చెప్పుకోవాలి. అనేక షోలు, సినిమాల్లో నటించి ఈ పిల్లి దాదాపు 10 కోట్ల డాలర్లు సంపాదించింది. ► ఒలివియా బెన్సన్ అనే పిల్లి సుమారు 9.7 కోట్ల డాలర్లను వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదించింది. ► గుంతర్6 అనే కుక్కకు కోట్ల డాలర్ల ఆస్తి దక్కిందని అనేక వార్తలు వచ్చినా అదంతా ప్రాంక్ అని తర్వాత తెలిసింది. డబ్బున్నవారు ఏక్షణం ఏం చేస్తారో తెలియదు కాబట్టి, ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. చట్టబద్దత ఉందా? జంతువులు న్యాయ పరిభాషలో లీగల్ పర్సన్స్ కావు కనుక వీటి పేరుమీద సొంత ఆస్తులు, ధనం ఉండదు. పెంపుడు జంతువంటేనే ఒక ఆస్తి, అందువల్ల మరో ఆస్తిని ఈ ఆస్తికి కట్టబెట్టేందుకు చట్టాలు అంగీకరించవు. అందుకే ఆయా జంతువుల యజమానులు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఈ జంతువుల ఆస్తుల నిర్వహణ చేస్తుంటాయి. ఈ సొమ్మును కేవలం సదరు జీవి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిఉంటుంది. సదరు జంతువు మరణిస్తే ట్రస్టు నిబంధనల ప్రకారం మిగిలిన సొత్తును వినియోగిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఔను.. అక్కడ సంచరిస్తోంది పెద్ద పులే!
ప్రత్తిపాడు రూరల్, పిఠాపురం: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం, కొడవలి గ్రామాల శివారు ప్రాంతాల్లో గేదెలను పెద్ద పులి చంపి తింటున్నట్లు అధికారులు నిర్థారించారు. పోతులూరు, కొడవలి గ్రామాల సరిహద్దుల్లో పోలవరం పంప్‌హౌస్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన యానిమల్ ట్రాకింగ్ కెమెరాల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సమీప గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఐదు గ్రామాల సరిహద్దుల్లోను 120 మందితో గస్తీ ఏర్పాటు చేశారు. అడవి దున్నలను పోలి ఉన్న గేదెలపై పులి దాడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పశువులను ఇళ్ల వద్దే కట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు. రాత్రి సమయాల్లో పొలాల్లోకి ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్‌వో ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్‌వో సెల్వం, ఐఎఫ్‌వో ట్రైనీ భరణి, సౌజన్య తదితరులు ఘటనాస్థలాన్ని శనివారం పరిశీలించారు. ప్రస్తుతం ప్రత్తిపాడు శివారు జువ్వల వారి మెట్ట ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. బోన్లు ఏర్పాటు చేస్తే ఇతర జంతువులు పడే అవకాశం ఉండటంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. -
హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ఆ చిన్నారి అబ్బుర పరిచింది.. వచ్చీ రాని మాటలతో సరిగా పదాలే పలకలేని చిన్నారి ఏకంగా ప్రీహిస్టారికల్ అనిమల్స్ పేర్లను చకా చకా చెబుతూ ఆశ్యర్య చకితులను చేస్తోంది.. నిజాంపేట్ సిరిబాలాజీ టవర్స్‌లో నివాసముండే మధు కుమార్తె నాలుగేళ్ల గొట్టుముక్కుల నితీషా కేవలం 30 సెండ్ల వ్యవధిలోనే అత్యధిక ప్రీహిస్టారిక్ యానిమల్స్‌ను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. చిన్నారి జ్ఞాపక శక్తిని గమనించిన తల్లి మధు ఆమెకు ప్రీహిస్టారిక్ యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలను చూపించారు. వీడియో చూసే క్రమంలో ఠక్కున సదరు జంతువుల పేర్లను చెప్పడం ప్రారంభించింది. దీంతో చిన్నారి తల్లి మధు ప్రీహిస్టారికల్ యానిమల్స్ పేర్లు చెబుతున్న క్రమంలో వీడియోలు తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు. చిన్నారి ఘనతను గుర్తిస్తూ ఈ నెల 23న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి, 21న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి కన్షర్మేషన్ లెటర్లు అందాయని చిన్నారి తల్లి మధు ‘సాక్షి’ కి తెలిపారు. -
ప్లీజ్... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది
సాక్షి,ఆత్మకూరు(నెల్లూరు): జిల్లాలోని సీతారామపురం నుంచి రాపూరు వరకు విస్తరించిన నల్లమల, వెలగొండ, పెంచలనరసింహ అభయారణ్యాలు ఉన్నాయి. 28 శాతానికిపైగా అడవులు, దక్షిణ, పడమర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా సరిహద్దులుగా పెంచల నరసింహ అభయారణ్యం విస్తరించి ఉంది. మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల ప్రాంతాలు ఈ అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. ఈ అటవీ ప్రాంతాల్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ప్రాణులు వేటగాళ్లకు బలవుతుంటే.. మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. అరుదైన వన్యప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడనుంది. జిల్లాలో ఈ అటవీ ప్రాంతాల మధ్య ఉండే నెల్లూరు– ముంబయి, నకిరేకల్– ఏర్పేడు జాతీయ రహదారితో పాటు ఇతర ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆయా రోడ్లపై రాత్రి పూట కూడా వాహనాలు తిరుగుతున్నాయి. కొన్ని వన్యప్రాణులు దారి తప్పి.. మరికొన్ని దాహార్తిని తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, ఏఎస్‌పేట తదితర మండలాల పరిధిలో జింకలు, దుప్పిలు రోడ్డుపైకి వచ్చి వాహనాల ప్రమాదంలో గాయపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల రెండు జింకలు తీవ్రంగా గాయపడడంతో ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది సంరక్షించేందుకు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. గతేడాది గుర్తుతెలియని వాహనం ఢీకొని బూదవాడ వద్ద మృతి చెందిన చిరుత (ఫైల్) కొరవడిన భద్రత ఆత్మకూరులోని ఇంజినీరింగ్ కళాశాల, చేజర్ల మండలం చిత్తలూరు వద్ద ఏడాది వ్యవధిలో రెండు చిరుతలతో పాటు ఓ అడవి పంది, జింక, దుప్పులు కలిపి 9 మృతి చెందాయి. గతేడాది ప్రారంభంలో బూదవాడ సమీపంలో కృష్ణాపురం మార్గంలో ఓ చిరుత పులి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. అది జరిగిన మరో రెండు నెలలకే ఓ చిరుతపులి పులి పిల్ల వాహనం ఢీకొనడంతో మత్యువాత పడింది. సంగం మండలంలోని ఓ గ్రామంలో జింక దాహార్తి తీర్చుకొనేందుకు ఓ ఇంట్లోకి రావడంతో స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నందవరం, చుంచులూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి దాటుతూ గుర్తుతెలియని వాహనాలు ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి. 15 రోజుల క్రితం సోమశిల జలాశయం వద్దకు నీరు తాగేందుకు వచ్చి ఓ జింక నీటిలో పడి మృతి చెందింది. ఇలా పలు వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ చర్యలు చేపడితే... జాతీయ రహదారులు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సరైన చర్యలు చేపడితే వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అడవి నుంచి రహదారిపైకి వచ్చే మార్గాలను గుర్తించి వాటిని వెంటనే రహదారిపైకి రాకుండా ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేదా కంప వేసి వాటిని అడవులకే పరిమితం చేయొచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో తిరిగే సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు జంతువులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ తాగునీరు లభ్యమయ్యేలా గట్టి చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ప్రాంతం నుంచి రహదారులపైకి వచ్చే చిన్నపాటి దారులను మూసివేసేలా మొక్కలు పెంచాలి. దీనికి తోడు వేటగాళ్ల బారిన పడకుండా అటవీశాఖ వాచర్లు తరచూ ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే అనుమానాస్పద వ్యక్తులను వారు ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించి తొలగించేలా చూడాలి. తద్వారా వన్యప్రాణాలను కాపాడుకోవచ్చు. సిబ్బందికి గట్టి సూచనలు ఇటీవల కొన్ని వన్యప్రాణులు గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన విషయం వాస్తవమే. ఒకటి, రెండు జింకలను గాయపడిన సమయంలో గుర్తించి చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాం. అయితే కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బందికి గట్టి సూచనలు ఇచ్చి అటవీ ప్రాంతంలో పలు చోట్ల తాగునీరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వర్షాలు కురవడం కొంత మేలైంది. దీంతో వన్యప్రాణులు రహదారులపై రావడం తగ్గుతుంది. – హరిబాబు, రేంజర్, ఆత్మకూరు అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు దారి తప్పో.. దాహార్తి తీర్చుకునేందుకు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. రాత్రి పూట రహదారులపైకి రావడంతో వాహనాలు ఢీకొని మృత్యువు పాలవుతున్నాయి. జిల్లా అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే చిరుతలు సైతం ఇటీవల ప్రాణాలు కోల్పోయాయి. దుప్పిలు, జింకలు, అడవి పందులు అయితే లెక్కలేనన్ని మృత్యువాత పడుతున్నాయి. చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. -
‘కవ్వాల్’లో పెరిగిన జంతువైవిధ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని పరిధిలోని చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తూ కనువిందు చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవవైవిధ్యం, అన్నివిధాలా అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో కవ్వాల్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. కవ్వాల్‌లో వివిధ జంతువులు సందడి చేస్తున్న దృశ్యాలను గురువారం తెలంగాణ అటవీ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పులుల కోసం ఎదురుచూపులే... పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, అనుకూల పరిస్థితులు ఉన్నా అవి ఇంకా కవ్వాల్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం అటవీ శాఖకు, అధికారులకు సవాల్‌గా మారింది. అయినా ఇక్కడ పెద్దపులుల సంఖ్యే అధికం. ‘కోర్ టైగర్ ఏరియా’లోని 40 గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించకపోవడం కూడా పులులు స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడానికి ఒక కారణమని అధికారులు అంటున్నారు. ఈ అడవి పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు, వారి పెంపుడు జంతువుల కదలికలు ఉండటంతో పులులు ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) నిబంధనలు, నియమావళిని బట్టి పులుల అభయారణ్యం నుంచి మొత్తం గ్రామాలను బయటి ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వే కారిడార్, ఇతర ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతున్నందున త్వరలోనే అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితాలు ఇస్తున్న నియంత్రణ చర్యలు మూడేళ్లుగా చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. విరివిగా గడ్డిభూముల పెంపకం, మా డివిజన్లో 200కుపైగా పర్క్యులేషన్ ట్యాంక్‌ల ఏర్పాటు, వాటర్‌షెడ్ పద్ధతుల ప్రకారం శాశ్వత నీటివనరుల కల్పన వంటివి ఎంతో దోహదపడ్డాయి. బయటి నుంచి మనుషులు, పశువులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా గట్టి నియంత్రణ చేపట్టాం. అడవిలో గందరగోళం, కలకలం వంటివి ఉంటే జంతువుల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పశువులు తిరిగితే గడ్డి ఉండదు. సహజసిద్ధమైన పరిస్థితులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. –మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం -
జీవాలకు సంజీవని.. పశువుల చెంతకే వైద్యం
108.. ఆపదలో ఉన్న వారికి సంజీవని.. ఒక్క ఫోన్ కాల్‌తో రెక్కలు కట్టుకుని నిమిషాల్లో వచ్చి వాలిపోతుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుంది. రోజూ ఎంతోమంది ప్రాణాలు నిలుపుతోంది. ఇదే తరహాలో ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి ప్రత్యేక వాహనం అందుబాటులోకి రానుంది. మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు) పేరిట పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో: పశువుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలందించడానికి మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు)లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొబైల్ వాహనాన్ని కేటాయించింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 వాహనాలను మంజూరు చేసింది. జిల్లాల పునర్విభజనతో కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో విలీనం కావడంతో 14 వాహనాలు సమకూరాయి. వివిధ రోగాలు, ప్రమాదాల్లో గాయాల పాలైన ఈ మూగజీవాలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సంచార శాలల్లో పశువైద్యులు, వైద్య పరీక్షల కోసం ల్యాబ్ ఉంటుంది. ఒక్కో వాహనంలో ఒక పశు వైద్యుడు, పారా వెట్ సిబ్బంది ఒకరు, డ్రైవరు ఉంటారు. సేవలు పొందడం ఇలా.. సంచార పశువైద్య సేవలు పొందడానికి 1962 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ పశువుకు వైద్య చేయించాలనుకున్న వారు ఈ నంబరుకు ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న సంచార పశువైద్య వాహన సిబ్బందికి సమాచారం ఇస్తారు. సత్వరమే ఆ వాహనంలో ఉన్న పశువైద్యుడు, సిబ్బంది పశువున్న చోటకు (గరిష్టంగా 90 నిమిషాల లోపు) వెళ్లి వైద్యం అందిస్తారు. ఈ మొబైల్ వాహనంలోనే ల్యాబ్ కూడా ఉంటుంది. అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. మరింత మెరుగైన వైద్యం అవసరమైతే టెలి మెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి చికిత్స చేస్తారు. పశువును మరో ఆస్పత్రికి తరలించడానికి వీలుగా హైడ్రాలిక్ క్రేన్ (2 వేల కిలోల బరువును ఎత్తే సామర్థ్యం) కూడా వ్యాన్‌లో ఉంటుంది. మూడు రోజుల పాటు ఆ ఆస్పత్రిలో పశువుకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తారు. పశువులకు వైద్యంతో పాటు మందులనూ ప్రభుత్వం ఉచితంగానే సమకూరుస్తుంది. కాగా మొబైల్ అంబులేటరీలో వైద్య సేవలందించడానికి జీవీకే సంస్థ పశువైద్యులను నియమించింది. ఇప్పటికే మొదలైన కాల్స్.. ప్రభుత్వం సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని పశువైద్యాధికారులు వివిధ గ్రామాల్లో తెలియజేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల రైతులు అప్పుడే పశు వైద్యం కోసం ఫోన్ల ద్వారా వాకబు చేస్తున్నారు. త్వరలోనే వీటి సేవలు ప్రారంభమవుతాయని వారికి సమాధానం చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. ఇన్నాళ్లూ పశు వైద్యం కోసం ఇతర గ్రామాలకు పశువులను తీసుకెళ్లడానికి రైతులకు కష్టతరమవుతోంది. అన్ని పనులు మానుకుని వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటోంది. ఇకపై ఆ ఇబ్బందులుండవు. 1962 టోల్‌ఫ్రీకి ఫోన్ చేస్తే సంచార వాహనంలో వైద్యులే అక్కడకు వెళ్లి ఉచిత వైద్యమందిస్తారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న సంచార పశువైద్య సేవల గురించి కొన్నాళ్లుగా గ్రామాల్లో రైతులకు వివరిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – కె.విద్యాసాగర్, జేడీ, పశుసంవర్ధకశాఖ -
ఈ వేడి ఏమార్చేస్తోంది..!
కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ‘వేడి’ మంటెక్కిస్తోంది. మనుషులపై మాత్రమేకాదు.. జంతువులు, చెట్లు, ఇతర జీవజాలం మొత్తంపై ప్రభావం చూపుతోంది. చల్లగా యాపిల్స్ పండేచోట మండే ఎండల్లో వచ్చే మామిడి పళ్లు కాస్తున్నాయి.. జంతువులే కాదు చెట్లూ తమ ప్రాంతాలు వదిలి ‘వలస’పోతున్నాయి.. ఇదేదో కొద్దిరోజులకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. భూమిపై జీవం మొత్తం అసాధారణ మార్పులకు లోనవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, జీవజాలంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామా? సాక్షి సెంట్రల్ డెస్క్ జంతుజాలం ‘వలస మారె!’ మారుతున్న వాతావరణంలో జంతువులు ఇమడలేకపోతున్నాయి. ఆయా జంతువులకు తగిన ఆహారం దొరకడం లేదు. దీనితో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొత్త కొత్త అలవాట్లు సంతరించుకుంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ♦అమెజాన్ అడవుల్లో పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా వాటి పరిమాణం తగ్గిపోతోందని తేల్చారు. పక్షులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఓ వైపు శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని గుర్తించారు. మరోవైపు శరీరాన్ని చల్లబర్చుకోవడం, బయటి ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం కోసం ముక్కు, రెక్కలు, ఈకలు, తోకల పరిమాణాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించారు. ♦ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో మాంసం, పాల కోసం పెంచుతున్న పశువుల నుంచి ఉత్పత్తి తగ్గిపోతోందని ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ♦మంచు ప్రాంతాల్లో బతికే ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, ఇతర జీవజాతుల సంతతి తగ్గిపోతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦ఏటా శీతాకాలం, ఎండాకాలంలో పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమకు అనువైన ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో.. ఈ వలసలు మారిపోతున్నాయి. మన దేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోయింది. అందులోనూ కొద్దిరోజులకే అవి తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం. ♦సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కొన్నిరకాల చేపలు, ఇతర జలచరాలు అంతరించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్టూచేమ.. వరుస మారె.. ప్రతి చెట్టు, మొక్క కూడా ఆయా ప్రాంతాల్లోని చల్లదనం, వేడి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే, మనగలిగే లక్షణాలను అలవర్చుకుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో చల్లటి ప్రాంతాల్లోని పలు రకాల చెట్లు, మొక్కలు బతకలేకపోతున్నాయి. మరోవైపు అదేచోట ఉష్ణమండల చెట్లు (వేడి వాతావరణంలో మాత్రమే పెరిగే చెట్లు/ మొక్కలు) కొత్తగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ♦ఉదాహరణకు కాఫీ, తేయాకు, యాపిల్స్ వంటివి చల్లగా ఉండే హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ కనుమలు వంటి ప్రాంతాల్లో పండుతాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. అవి దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వేడిని తట్టుకునే పంటలు/ చెట్లు/మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయి. ♦ఇక వేడిగా ఉండేచోట్ల మరింత వేడి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి. ♦వేడి వాతావరణంలో చెట్లు బలహీనపడుతుండటంతో.. ఫంగస్‌లు విజృంభించి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇటీవలే మన దేశంలో మూడు రకాల ఫంగస్‌లు వ్యాపించి పెద్ద సంఖ్యలో వేప చెట్లు దెబ్బతినడం దీనికి ఉదాహరణ అని నిపుణులు చెప్తున్నారు. అడవి రూపు మారె... వాతావరణ మార్పులతో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, వర్షాభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలోనూ భారీగా అడవులు ఎండిపోతున్నాయి. బ్రిటన్‌కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ ఇటీవలే భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరు, వాటివల్ల అడవుల క్షీణతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని వృక్షాలు, జీవజాతుల్లో పదిశాతం మేర అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపింది. ♦ 2001 – 2018 మధ్య దేశంలో 20,472 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోయినట్టు పేర్కొంది. ఇది దేశంలోని మొత్తం అడవుల్లో 7.34 శాతం కావడం గమనార్హం. ♦ఇక ఒక్క 2017లోనే 2,503 చ. కిలోమీటర్ల అడవి అంతరించిపోయినట్టు పరిశోధన వెల్లడించింది. ♦‘‘ఇండియాలో కొన్నేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి ఎక్కువ వేడి, వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య పెరిగింది. ఈ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇండియాలో మరింత ఎక్కువగా అడవులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది అటవీ సంపద, వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతుంది’’అని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త అలైస్ హఫన్ పేర్కొన్నారు. రోగాల తీరు మారె.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు జరగడంతో.. కొత్త కొత్త బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరిగి అంటు రోగాలు విజృంభిస్తున్నాయని.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు, రోగాలు ఇతర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయని గతేడాది స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ♦అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఊపిరితిత్తులు, గుండె నాళాల సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇటీవలే హెచ్చరించింది. ♦వేల ఏళ్ల కిందట మంచు అడుగున కూరుకుపోయిన నాటి సూక్ష్మజీవులు బయటికి వచ్చి కొత్త వ్యాధులు కమ్ముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. కాలం అదను మారె.. ♦ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో వానాకాలం, చలికాలం తగ్గిపోతున్నాయి. ఎండాకాలం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ఆరు నెలలు ఎండాకాలమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ♦అధిక ఉష్ణోగ్రతలు వల్ల ఆరుబయట పనిచేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ది లాన్సెట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇలా ఒక్క 2019 ఏడాదిలోనే 30వేల కోట్ల పని గంటలకు నష్టం జరిగింది. ♦వాతావరణ మార్పుల వల్ల రుతువుల సమయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మార్చి నెల మధ్యలో వసంతకాలం మొదలవుతుంది. కానీ కొన్నేళ్లుగా ఫిబ్రవరి నెల మొదట్లోనే ఇది మొదలవుతోంది. ♦ హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ♦మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అనుకూలం. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ శీతల ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే దీనికి కారణం. -
తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి
రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నెలవు.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల, లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి. అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 8 శేషాచలంలో సహజ వనరులు శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్‌డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. నిరంతర పర్యవేక్షణ రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్‌లు ఉన్నాయి. బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు అడవిలోని వివిధ ప్రాంతాల్లో 12 మొబైల్ సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక రక్షణ చర్యలు శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్పిట్లు, 12 మొబైల్ సాసర్పిట్లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్ తీసుకుంటాయ్!
జీవులేవైనా నీరు, ఆహారం వంటివి లేకుండా కొద్దిరోజులు కూడా బతకలేవు. గాలి లేకుంటే కొద్ది నిమిషాలైనా ప్రాణంతో ఉండలేవు. కానీ కంటికి సరిగా కనిపించని ఓ రకం జీవులు మాత్రం.. నీళ్లు, ఆహారం లేకున్నా ఏళ్లకేళ్లు బతికేస్తాయి. అవే టార్డిగ్రేడ్లు. చూడటానికి ఎలుగుబంట్లలా ఉంటాయి కాబట్టి ‘వాటర్ బేర్’ అని కూడా పిలుస్తుంటారు. మరి ఏమిటీ జీవులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అటు తాబేళ్లు.. ఇటు ఎలుగుబంట్లు భూమ్మీది జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగేవి ‘వాటర్ బేర్’లు. నీటిలో ఉండే వీటిని 1777లో జర్మన్ శాస్త్రవేత్త జోహాన్ ఎఫ్రేమ్ గోజ్ గుర్తించారు. తాబేళ్ల (టార్టాయిస్)లా నిదానంగా కదులుతాయి కాబట్టి ‘టార్డిగ్రేడ్స్’ అని పేరుపెట్టారు. ఇక శరీరం ఎలుగుబంటిని పోలి ఉండటంతో ‘వాటర్ బేర్స్’ అని పిలుస్తారు. వీటికి జంతువుల్లా ఎటంటే అటు కదలగలిగే తల, దానిపై గుండ్రని నోరు, ఎనిమిది కాళ్లు ఉంటాయి. సైజు సగటున ఒక మిల్లీమీటర్ మాత్రమే. కానీ 40వేలకుపైగా కణాలు ఉంటాయట. భూమిపై సుమారు 1,300 జాతుల వాటర్ బేర్లు ఉన్నాయని అంచనా. నీళ్లు లేకుండా 30 ఏళ్లు.. సాధారణంగా నీళ్లు లేకుండా.. మనుషులు మూడు రోజుల పాటు మాత్రమే బతకగలరు. ఒంటెలు 15 రోజుల దాకా జీవిస్తాయి. కానీ ‘వాటర్ బేర్’లు ఏకంగా 30 ఏళ్లపాటు నీళ్లు లేకుండా బతుకుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦నీళ్లు లేకపోవడం, అత్యంత వేడి పరిస్థితుల్లో టార్డిగ్రేడ్లు ‘యాన్హైడ్రోబయోసిస్’ స్థితిలోకి మారిపోతాయి. అంటే వాటి శరీరాన్ని గుండ్రంగా చుట్టేసుకుని ఒక బంతి రూపంలోకి వస్తాయి. పైన గట్టి కవచం ఏర్పడుతుంది. ఇదే సమయంలో లోపల కణాల్లోని నీటి స్థానంలో గాజు వంటి ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ (గ్లాన్ మ్యాట్రిక్స్) చేరుతుంది. కణాల్లోని భాగాలు, డీఎన్ఏ, ఇతర ప్రొటీన్లు, మెంబ్రేన్ వంటివేవీ ఏమాత్రం దెబ్బతినకుండా గ్లాస్ మ్యాట్రిక్స్ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియను ‘టన్ స్టేట్’గా పిలుస్తారు. పరిస్థితి అనుకూలంగా మారగానే.. టార్డిగ్రేడ్లు తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఆ కేటగిరీయే.. సెపరేటు! భూమ్మీది జీవజాలంలో అత్యంత ప్రత్యేకమైన ‘ఎక్స్‌ట్రీమోఫైల్స్’ కేటగిరీలో టార్డిగ్రేడ్స్‌ను చేర్చారు. అంటే.. ఎప్పటికీ మంచుతో నిండి ఉండే శీతల పరిస్థితులు, అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన రేడియేషన్, అధిక పీడనం, అంతరిక్షంలోని శూన్యం.. వంటి అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని జీవించగలవని అర్థం. బుల్లెట్నూ తట్టుకుంటాయి టార్డిగ్రేడ్లను గన్‌తో కాల్చినా బతకగలవని కెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు టార్డిగ్రేడ్లను అతి చల్లదనానికి గురిచేసి, అవి ‘టన్’ పరిస్థితికి చేరాక.. బుల్లెట్ల ముందుభాగాన అంటించి వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను కాల్చారు. అందులో కొన్ని బుల్లెట్లపై టార్డిగ్రేడ్లు బతికి ఉండటంతో.. ఎంత ఒత్తిడిని తట్టుకోగలిగాయన్నది తేల్చారు. గంటకు 3వేల కిలోమీటర్ల వేగంతో దూ సుకొచ్చేవాటిని టార్డిగ్రేడ్లు తట్టుకోగలిగినట్టు గుర్తించారు. ప్రళయం వచ్చినా.. ♦టార్డిగ్రేడ్లు భూమ్మీద సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి నుంచే ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. అంటే అప్పటికి డైనోసార్లు కూడా పుట్టలేదు. ♦టార్డిగ్రేడ్లు 150 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలనూ తట్టుకోగలవు. 100 సెంటీగ్రేడ్ల వేడికే నీళ్లు మరుగుతాయి. అంటే మరిగే నీటిలోనూ ఇవి బతికగలవు. ♦మనం కాస్త చలికే వణికిపోతాం. అదే టార్డిగ్రేడ్లు మైనస్ 200 డిగ్రీల శీతల పరిస్థితినీ తట్టుకుని.. 30 ఏళ్లకుపైగా జీవంతో ఉండగలవు. ♦ఆక్సిజన్ లేకుండా ‘టన్ స్టేట్’లో ఏళ్లపాటు బతక గలవు. అంతరిక్షంలో శూన్యాన్ని, తీవ్రస్థాయి రేడియేషన్‌ను తట్టుకోగలవు.అందుకే వీటిని ఇటీ వలే అంతరిక్షంలోకి పంపి ప్రయోగం చేశారు. ♦ఇంత ‘గట్టి’ జీవి కావడంతోనే.. ఒకవేళ భూమిపై ప్రళయం వచ్చినా అవి బతికేయగలవని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఓ వీక్నెస్సూ ఉంది! చిత్రమేమిటంటే ఎన్నో కఠిన పరిస్థితులను తట్టుకునే టార్డిగ్రేడ్లు.. నత్తలు విడుదల చేసే జిగురువంటి పదార్థం (స్లైమ్)లో మాత్రం బతకలేవట. ఇటీవల దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. స్లైమ్లో ముంచిన టార్డిగ్రేడ్లలో 34 శాతమే బతికినట్టు గుర్తించారు. -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్.. అవేమిటంటే..?
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గురువారం మరికొన్ని వన్యప్రాణులు వచ్చాయి. జంతు మార్పిడి పద్ధతిపై ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు కొత్త వన్య ప్రాణులను అధికారులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని వేంకటేశ్వర జూ పార్కు నుంచి గురువారం మూడు గ్రే జంగిల్ ఫౌల్(మగ–1, ఆడ–2), జత వైల్డ్ డాగ్స్, అడవి దున్న, జత చౌసింగా తీసుకొచ్చారు. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు వీటికి బదులుగా విశాఖ జూ నుంచి జత హైనాలు, మగ అడవి దున్న, రెండు ఆడ నక్కలు పంపించినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ నెల 13న చండీగఢ్‌లోని ఛత్బీర్ జూ పార్కు నుంచి మొసలి జాతికి చెందిన ఘరియల్స్(2 మగవి), రెడ్ జంగిల్ ఫౌల్స్(మగవి–2, ఆడవి–4), లెసర్ విజ్లింగ్ టీల్స్(మగది–1, ఆడవి–2), బార్న్ ఔల్స్(మగ–1, ఆడవి–2), హైనా( మగది–1) ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
World Wildlife Day Special: ‘‘మా బతుకు మేం బతుకుతున్నాం. మా సరిహద్దుల్లోకి వచ్చేది మీరు. అనవసరంగా మమ్మల్ని బలిగొనేదీ మీరే. మా కుటుంబం ప్రకోపాన్ని చూపిస్తే తట్టుకోగలరా మీరు?. కానీ, అలా చేయం. ఎందుకంటే.. మాకంటూ అడవి ధర్మం ఉంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అంతరించిపోతున్న మా జాతుల్ని వీలైతే పరిరక్షించి పుణ్యం మూటగట్టుకోండి’’ మూగ జీవాలకు మాటొస్తే.. కచ్చితంగా మనుషులతో ఇలాగే మొరపెట్టుకుంటాయేమో. భూమ్మీద వృక్షజాలం, జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే ఒక రోజు ఉంది. ఇవాళ(మార్చి 3వ తేదీ) వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే. వైల్డ్‌లైఫ్ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్పించే రోజు. అంతేకాదు అందమైన వాటి ప్రపంచం గురించి ప్రస్తావించుకునే రోజు కూడా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వనజీవుల సంరక్షణ కోసం చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తగా అర్టిషిషియల్ టెక్నాలజీ (AI) ద్వారా అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువుల్ని గుర్తించడం, తద్వారా వాటి పరిరక్షణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. 1973లో సైట్స్ (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆ తేదీని World Wildlife Dayగా పరిగణించాలని డిసెంబర్ 20, 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానించింది. వైల్డ్‌లైఫ్ డే సందర్భంలో మన గడ్డ మీద ఉండి.. అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరు జాతుల గురించి చర్చించుకుందాం. ఏషియాటిక్ లయన్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండో జాతి ఇది. రాజసం ఉట్టిపడే సింహాలకు.. గుజరాత్ ‘గిర్’ శాంక్చురీ దీనికి అడ్డా. కానీ, చాలా ఏళ్ల కిందట భారత్‌లోని ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా ఉం డేది. అంతరించిపోతున్న క్రమంలో వీటి పరిరక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీలగిరి మార్టెన్ దక్షిణ భారత దేశంలో.. అందునా నీలగిరి కొండల్లో కనిపించే అరుదైన మార్టెన్ జాతి ఇది. తమిళనాడు, అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనూ వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్య వెయ్యి లోపే ఉంది. అందుకే ఐయూసీఎన్ (International Union for Conservation of Nature) ఈ జాతిని రెడ్ లిస్ట్‌లో చేర్చింది. మంచు చిరుత ఔన్స్ అని ముద్దుగా పిల్చుకునే ఈ జాతి.. అరుదైన జీవుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ నేషనల్ పార్క్‌లో, ఉత్తరాఖండ్ నందా దేవి నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. శరవేగంగా వీటి జనాభా క్షీణించి పోగా.. ప్రస్తుతం మొత్తంగా పది వేల లోపే మంచు చిరుతలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు. సంగై అనిమిలీయా కుటుంబంలోని దుప్పి జాతి సంగై (Brow-antlered Deer). మణిపూర్ లోక్టక్ సరస్సును ఆనుకుని ఉన్న కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడో ప్రత్యేకత ఏంటంటే.. సంగై ఆ రాష్ట్ర జంతువు. డ్యాన్సింగ్ డీర్ పేరుతో వీటి మీద జానపద కథలు సైతం ప్రచారంలో ఉన్నాయి. సింహపు తోక మకాక్ వాండెరూ.. సింహపు తోక మకాక్(కోతులు). ప్రపంచంలోనే అతి పురాతనమైన, అరుదైన జాతిగా వీటిని చెప్తుంటారు రీసెర్చర్లు. కేరళ షెండూర్నీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో ఇవి కనిపిస్తాయి. ఒంటికొమ్ము రైనో వేట, కొమ్ముల అక్రమ రవాణాతో క్షీణించే దశకు చేరుకున్న జాతి ఇది. కజిరంగ నేషనల్ పార్క్ (అస్సాం), దుద్వా టైగర్ రిజర్వ్(యూపీ), పోబిటోరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ(అస్సాం)లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను రక్షించడం అనే థీమ్‌తో ఈ ఏడాది వరల్డ్ వైల్డ్‌లైఫ్ డేని నిర్వహిస్తున్నారు. There are over 22,000 endangered & critically endangered species on the IUCN Red List. Continued species loss is a threat to people and planet. For #WWD2022, let us all support conservation of vulnerable plants and animals. Learn more: https://t.co/hW7VtdeXHK #RecoverKeySpecies pic.twitter.com/AtjMmtVCio — World Wildlife Day (@WildlifeDay) February 22, 2022 పరుగు, పుట్రా, మొక్కలే కాదు.. పరిమాణంలో పెద్ద జంతువులు సైతం మనిషి నిర్లక్ష్యానికి బలై అంతరించే దశకు చేరుకోగా.. ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా. -సాక్షి, వెబ్ స్పెషల్ -
అక్కడి వైద్యం..ఓ ధైర్యం
సాక్షి హైదరాబాద్(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు. మేకలు, పిల్లులకు ఉచితమే... వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు. అధునాతన పరికరాలు ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు. ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్‌రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. – అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌సింగ్ 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. – మహ్మద్ ఇబ్రహీం, మొఘల్‌పురా త్వరలో నూతన భవనం ప్రారంభం ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది. – రవీందర్‌రెడ్డి, వైస్ ఛాన్సలర్ -
తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?
వాగులు, వంకలు దాటేందుకు ఇప్పుడంటే పడవలు, బోట్లు ఉన్నాయి. సముద్రాలను కూడా అలవోకగా దాటేస్తున్నాం. ఇవన్నీ ఎందుకనుకుంటే పెద్ద పెద్ద వంతెనలే కట్టుకుంటున్నాం. మరి ఇలాంటి సౌకర్యాలేవీ లేని పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాగులు, నదులను ఎలా దాటే వాళ్లో తెలుసా? చనిపోయిన జంతువుల కళేబరాలను ఒలిచి, వాటిలో గాలిని ఊది బెలూన్లలా చేసుకొని వాడేవారు. వినడానికి విచిత్రంగా ఉన్నా అప్పట్లో ఇలాగే చేసేవారు. అసలు రంధ్రాలు పడకుండా జంతువుల కళేబరాలను పక్కాగా ఎలా ఒలిచేవాళ్లు, వాటి నుంచి గాలి పోకుండా ఏం చేసేవాళ్లు, కదిలే నీటిలో వాటితో ఎలా ప్రయాణించే వాళ్లు, ఇలాంటి పద్ధతులు ఏ ప్రాంతాల్లో వాడేవారో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఏ కాలం నుంచి మొదలు? ఆదిమ కాలం నాటి ఈ నదులు దాటే పద్ధతి మెసపటోమియా కాలం నుంచి కనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 880ల కాలంలో నిర్ముడ్ ప్రాంతంలోని (ప్రస్తుతం ఇరాక్‌లో ఉంది) ఓ శిల్పంలో ఈ విధానం గురించి చెక్కారు. అప్పటి ఆ ప్రాంతపు అస్సీరియన్ సైనికులు గాలి నింపిన మేక ఆకారంలోని జంతు చర్మాల సాయంతో వాగును దాటుతున్నట్టు ఆ శిల్పంలో ఉంది. అప్పట్లో గ్రీకు రాజు సైరస్ కూడా ఇలాంటి జంతు చర్మాల సాయంతో బాబిలోనియన్ నదిని దాటాడని నాటి తత్వవేత్త జెనోఫోన్ చెప్పాడు. పర్షియా రాజు డేరియస్, మంగోలియన్ సైనికులు, రోమన్లు, అరబ్బులు కూడా ఈ పద్ధతి వాడారు. చర్మాలను ఎలా ఒలిచేవాళ్లు? ఓ ప్రత్యేక పద్ధతిలో జంతువుల చర్మాలను ఒలిచేవారు. ఆ తర్వాత చర్మాన్ని కొన్నిరోజులు పాతి పెట్టేవారు. తర్వాత దానిని తీసి పదును లేని కత్తితో రాసి వెంట్రుకలను తొలిగించేవారు. ఆ తర్వాత చర్మాన్ని తిప్పి లోపలి భాగంవైపు ముక్కు, మూతి, కళ్లు, చెవులు లాంటి ఇతర రంధ్రాలుండే ప్రాంతాలను కుట్టేసేవారు.4 కాళ్లలో మూడింటిని కట్టేసేవారు. నాలుగో కాలును గాలి ఊదేందుకు, తీసేందుకు వాడేవారు. చర్మంలోపల తారు లాంటి పదార్థాన్ని పోసి పూర్తిగా అంటుకునేవరకు ఊపేవారు. వాడనప్పుడు తోలును ఎండబెట్టి ఉంచేవారు. వాడాలనుకున్నప్పుడు తోలుకు సున్నితత్వాన్ని పెంచడానికి నీళ్లలో నానబెట్టేవారు. నదులను ఎలా దాటేవాళ్లు? చర్మం బెలూన్‌లో గాలి ఊదాక తమకు తాముగా ఆ బెలూన్‌తో పాటు నదిలో దూకేవారు. ఒకవైపు కాలుతో, మరోవైపు చిన్న తెడ్డుతో నీటిని వెనక్కి తోస్తూ ముందుకెళ్లేవారు. జంతు చర్మం బెలూన్ మాములూగానే గుండ్రంగా ఉంటుంది. దూకగానే పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఆ చర్మం బెలూన్ సాయంతో ఈదడం నేర్చుకునేవారు. వీటిపైన ఇతర ప్రయాణికులను, చిన్న చిన్న వస్తువులు, సరుకును కూడా రవాణా చేసేవారు. ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు రెండు, మూడు చర్మం బెలూన్లను ఒక చిన్న సైజు తెప్పలా చేసి వాడేవారు. మనదేశంలో వాడేవాళ్లా? మనదేశంలోనూ పంజాబ్, కశ్మీర్, సిమ్లాల్లో ఇలాంటి వాటిని వాడేవారు. 1900వ సంవత్సరం తొలినాళ్లలో అమెరికా స్కూల్ టీచర్ జేమ్స్ రికాల్టన్ మన దేశాన్ని చూసేందుకు వచ్చినప్పుడు పంజాబ్‌లోని కొండ ప్రాంత గ్రామాల్లో జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని గ్రామస్తులు దాటడం గమనించాడు. ఆ దృశ్యాలను తన స్టీరియోస్కోపిక్ కెమెరాలో బంధించాడు. సరుకులనూ నది దాటించేవాళ్లా? సరుకు రవాణాకూ ఈ జంతు చర్మాల బెలూన్లను వాడేవారు. ఇంగ్లిష్ అన్వేషకుడు విలియం మూర్‌క్రాఫ్ట్ మన దేశానికి వచ్చినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు 300 మంది, 16 గుర్రాలు, కంచర గాడిదలు, దాదాపు 7,400 కిలోల వివిధ రకాల బ్యాగులను 31 మంది తమ జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని దాటించారని చెప్పాడు. ఈ పనినంతా వాళ్లు కేవలం గంటన్నరలోనే పూర్తి చేశారన్నాడు. చైనా వాళ్లు కూడా ఇలాంటి జంతు చర్మాలతో చేసిన తెప్పలపై రకరకాల సరుకులను రవాణా చేసేవారు. -
వారంతా ఉద్యోగులు, విద్యార్థులు.. ఓపిక, సహనంతో పోరాటం.. ఇంతకీ ఏం చేస్తారో తెలుసా?
సాక్షి, రాయదుర్గం: వారంతా ఉద్యోగులు..విద్యార్థులు. ఓపిక, సహనం, ఓర్పుతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన జంతువులు, పక్షులను రక్షించాలనే తపనతోనే “యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’(ఏడబ్ల్యూసీఎస్)ని స్థాపించారు. ఏడాదిలో 365 రోజులు ఎలాంటి సెలవు, పండగ అనే విరామమే లేకుండా పశుపక్ష్యాదుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐటీ కారిడార్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని గోపన్‌పల్లి, కొండాపూర్, హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో ఆపదలో ఉన్న పక్షులను రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బావి, చెరువు, సంపులో పడిపోయిన జంతువులు, పక్షులను రక్షించడం, కాళ్లు, రెక్కలకు పతంగుల మాంజా చిక్కి చెట్లకు వేలాడం, టెర్రస్‌లోకి పెంపుడు జంతువులు వెళ్లి అక్కడి నుంచి రాలేకపోవడం వంటి వాటిని రక్షించి, వాటికి సపర్యలు చేసి ఎగిరి వెళ్లగలిగే స్థితికి తెచ్చి పంపించి వేసే విధంగా ఈ బృందం పనిచేస్తోంది. బావిలో పడ్డ కుక్కను రక్షించేందుకు యత్నిస్తున్న ఏడబ్ల్యూసీఎస్ బృంద సభ్యుడు 2019లో ఏడబ్ల్యూసీఎస్ ఏర్పాటు ► సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రదీప్‌నాయర్, అమర్, సంజీవ్‌వర్మ, సంతోషి కలిసి ఈ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీని 2019 జనవరిలో ఎన్జీఓగా ఏర్పాటు చేశారు. ► మొదట్లో 12 మంది సభ్యులుండగా, ప్రస్తుతం మనీష్, అనిరుద్, రాఘవ, గణేష్, ప్రభు, రాహుల్, శశిధర్‌తో పాటు 18 మంది సభ్యులుగా చేరారు. ► వీరంతా పక్షి, జంతువు ఆపదలో ఉందని ఫోన్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లడం, ఆ తర్వాత దాన్ని రక్షించడంపైనే దృష్టి సారిస్తారు. ► ఇప్పటి వరకు 330 పక్షులు, 44 ఉడుతలు, 50 పాములు, 306 కుక్కలు, 139 పిల్లులు, 19 పశువులు, 14 కోళ్లు, ఇతరత్రా వాటిని ఈ ఏడాది రక్షించారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1200 కిలోల ప్లాస్టిక్ నెట్లు, ఇతరత్రా సామగ్రి, 455 కేజీల ప్లాస్టిక్ సీసాలు సేకరించారు. ఐటీ కారిడార్‌లో ఏటా మాంజాతోనే 250–300 పక్షులకు ఆపద ► ఐటీకారిడార్‌లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత మాంజాతో ఏటా వందలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ► 250 నుంచి 300 వరకు పక్షులను డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు రక్షించిన దాఖలాలు ఉన్నాయి. ► ప్రధానంగా గాలిపటాలు ఎగురవేసిన తర్వాత అవి కాస్తా దారంతో వెళ్లి చెరువు, ఇతరత్రా ఖాళీ స్థలాలలోని చెట్లపై పడిపోతాయి. ► ఈ మధ్యలో రకరకాల పక్షులు చెరువులో నీరే తాగేందుకు వచ్చి చెట్టుపై సేద తీరే సమయంలో రెక్కలు, కాళ్లకు పతంగి మాంజా చుట్టుకొని గాయాల పాలు కావడం జరుగుతోంది. ఇది ఎవరైనా చూస్తే సమాచారం ఇస్తారు. ► చెట్లకు వేలాడుతూ అలాగే కొన్ని రోజులపాటు గాయాల బారిన పడి అక్కడే మృత్యువాత పడిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. హెచ్‌సీయూతో పనిచేసిన ఏడబ్ల్యూసీఏ బృందం.. ► హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో కూడా ఏడబ్ల్యూసీఏ బృందం కలిసి పనిచేసింది. ► గత ఏడాది లాక్డౌన్ సమయంలో హెచ్‌సీయూ క్యాంపస్ పరిధిలోని పశు,పక్ష్యాదుల కోసం విద్యార్థులు, అధికార యంత్రాంగంతో కలిసి వాటికి ఆహారం, ఇతరత్రా సేవలందించడంలో తమవంతు పాత్ర పోషించారు. ► హెచ్‌సీయూలో పర్యావరణ పరిరక్షణకు పశు,పక్ష్యాదుల రక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ బృందం యత్నిస్తోంది. సంస్థ కోరే సాయం ► సంస్థ నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయించాలి. ► పశు,పక్ష్యాదులకు తీవ్ర గాయాలైతే రక్షించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అందించాలి. గోపన్‌పల్లిలో వరుసగా మూడోసారి ► ఈ ఏడాది గోపన్‌పల్లిలో ఇటీవలే వరుసగా మూడోసారి చెరువు మధ్యలో ఉన్న కంపచెట్టుకు ఉన్న మాంజా కొంగ కాళ్లకు చుట్టుకొవడంతో వేలాడుతూ ప్రాణాపాయస్థితికి చేరింది. ► ఇలాంటి ఘటనలు ఈ నెలరోజుల్లో 3సార్లు చోటు చేసుకోగా ఈ బృందం భారీ తాడు, కర్రల సహాయంతో పక్షి దగ్గరకు ఛాతీ వరకున్న చెరువునీటిలో సాయంత్రం వేళల్లో వెళ్లి కొంగను రక్షించారు. అగ్నిమాపక శాఖ సాయంతో పావురాన్ని రక్షించిన ఏడబ్ల్యూసీఎస్ బృందం ఐటీ కారిడార్‌లో ఏటా మాంజాతోనే పక్షులకు ప్రమాదం సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంజాతో పక్షులకు ప్రమాదం చోటు చేసుకుంటోంది. ఐటీ కారిడార్ హైటెక్‌సిటీ, కొండాపూర్, గోపన్‌పల్లి పరిసరాల్లో చెరువులు, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో చెట్లకు మాంజా తగులుకోవడంతో ఇది పక్షుల కాళ్లు, రెక్కలకు చుట్టుకోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నాయి. చూసిన వాళ్లు సమాచారం ఇస్తే వాటిని రక్షిస్తున్నాం. లేకపోతే అవి మృతి చెందుతున్నాయి. – మనీష్, జాయింట్ సెక్రటరీ, ఏడబ్ల్యూసీఎస్ ఉచితంగానే సేవలు ఆపదలో ఉన్న పశు,పక్ష్యాదులను ఉచితంగానే రక్షిస్తాం. సమాచారం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండానే వాటిని రక్షిస్తున్నాం. ఒక్కో రెస్క్యూకు వాహనాల వ్యయం రూ.2,500 నుంచి మూడువేల వరకు అవుతుంది. అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్ బృందాల సహకారం కూడా తీసుకుంటాం. ప్రభుత్వ సహాయం అందిస్తే మేలు చేకూరుతుంది. ప్రదీప్ నాయర్, ఇతర సభ్యులు, అమర్ వంటి వారితో అవగాహన, శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వడం చేస్తున్నాం. పశు,పక్ష్యాదులు ఆపదలో ఉంటే 9697887888కు ఫోన్ చేయండి. – సంజీవ్‌వర్మ,ప్రధాన కార్యదర్శి, ఏడబ్ల్యూసీఎస్