ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది.
ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్‌ఎస్‌ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు.
కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!
Comments
Please login to add a commentAdd a comment