walks
-
PM Modi Lakshadweep Visit: ప్రకృతిలో పరవశించిన నమో (ఫొటోలు)
-
‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!
ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు! -
న్యూ బోర్న్ బేబీ అమేజింగ్ వీడియో
పుట్టీ పుట్టగానే ల్యాప్ ట్యాప్ ఆన్ చేసి హల్ చల్ చేసిన పసిపాప యాడ్ గుర్తుందా? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీకి సింబాలిక్ గా ఆ ప్రకటన రూపొందించడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. అయితే అంతే ఆసక్తికరంగా ఇపుడు ఒక వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అమేజింగ్ న్యూ బోర్న్ బేబీ వీడియో ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. శిశువు బుడిబుడి అడుగులు వేస్తున్న వీడియో ఫేస్బుక్లో వైరల్ గా మారింది. డాక్టర్ చేతిలో ఉండగానే ఈ శిశువు వడివడిగా అడుగులు వేస్తున్న ఈ అమేజింగ్ వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియో ఎపుడు ఎక్కడ తీసారనే వివరాలుమాత్రం అందుబాటులో లేవు. -
'ఫ్లోటింగ్ పియర్స్' తో నీటిపై నడవొచ్చు!
ఇటలీః బల్గేరియాకు చెందిన ఎనభై ఏళ్ళ క్రిస్టో వ్లాదిమిరోవ్ జావచెఫ్ తన ఆలోచనను అమల్లోకి తెచ్చాడు. రెండు ద్వీపాల మధ్య వంతెన నిర్మించాల్సిన అవసరం లేకుండా నీటిపై నడిచే విధానాన్ని కనుగొన్నాడు. తన ఆలోచనల రూపాన్ని ప్రజలకు, ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చి గంటలకొద్దీ ప్రయాణించాల్సిన పనిలేకుండా చేశాడు. ఇటలీలోని లాంబర్డేకు సమీపంలోని లేక్ ఐసోలో మోన్టేఐసోలో ద్వీపంలో సుమారు 2 వేల మంది జనాభా ఉంటారు. అక్కడినుంచీ లాంబర్డేకు వెళ్ళాలంటే పడవలను ఆశ్రయించాల్సిందే. పడవ ప్రయాణంతో కొద్దిపాటి దూరానికే నీటిలో గంటలదరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే ఈ సమయాన్ని తగ్గించాలంటే వంతెన ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమా? అది జరిగే అవకాశం ఉందా అంటూ తీవ్రంగా ఆలోచించిన క్రిస్టోకు మెరుపులాంటి ఐడియా తట్టింది. నీటిపై నడిచే విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉందేమోనన్న తన ఆలోచనకు పదును పెట్టిన క్రిస్టో రెండు ద్వీపాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు నీటిలోనే మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా గతేడాది ఫ్లోటింగ్ పియర్స్ పేరున తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడు. నీటిపై తేలే రహదారిని ఏర్పాటు చేసేందుకు లక్షలకొద్దీ పాలిథిన్ క్యూబ్స్ ను వినియోగించాడు. సుమారు 3 కిలోమీటర్ల మేర సముద్రంపై తేలియాడే రోడ్డును నిర్మించి విజయం సాధించాడు. ఈ రోడ్డు మార్గం నిర్మించేందుకు సుమారు వంద కోట్ల రూపాయలను క్రిస్టో ఖర్చు చేశాడు. ప్రస్తుతం క్రిస్టో రూపొందించిన మార్గం పరిశీలిస్తున్న అధికారులు... అన్నిరకాలుగా తట్టుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత ప్రజలు దీనిపై నడిచేందుకు అనుమతిస్తారు. వచ్చే నెల్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై నడిచేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. నీటిపై తేలియాడే మార్గంలో ప్రయాణించేందుకు అత్యధిక జనాభా వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక వాలంటీర్లను, లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు.