ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. తండ్రి నుంచి టాటా నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇప్పటికి కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని స్పష్టం చేశారు.
కంపెనీల విషయంలో లేదా వ్యాపారాల విషయంలో తన తండ్రి ముఖేష్ అంబానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారని. ప్రతి రోజూ వారి దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉన్నానని అన్నారు.
బిజినెస్ మాత్రమే కాకుండా తమ కుటుంబమంతా వన్య ప్రాణుల పట్ల ధరతో ఉంటామని వెల్లడిస్తూ.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ కంపెనీ ఒక 'జూ' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూ అభివృద్ధిలో కూడా తన తల్లినద్రులే స్ఫూర్తి అని చెప్పారు.
ఏనుగుల కోసం ఓ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, అందులో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని చెప్పారు. ఏనుగులు మాత్రమే కాకుండా జూలో మొత్తం 100 జాతుల కంటే ఎక్కువ జీవులు ఉన్నాయని, అరుదైన లేదా అంతరించిపోతున్న జంతువులను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జంతువులోనూ దేవుణ్ణి చూస్తున్నట్లు అనంత్ అంబానీ వివరించారు.
ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే?
జూలో సంరక్షులు సుమారు 3000 నుంచి 400 మంది ఉన్నారని, వారందరూ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు.. జూలో సౌరశక్తిని మాత్రం ఉపయోగిస్తున్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారు. మొత్తం మీద అంబానీ ఫ్యామిలీ జీవులను రక్షించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Reliance Foundation announces Vantara - a comprehensive Animal Rescue, Care, Conservation and Rehabilitation programme, the first of its kind in India.
— ANI (@ANI) February 26, 2024
Anant Ambani says "We started the wildlife rescue center building in the peak of COVID...We've created a jungle of 600… pic.twitter.com/OoWh9HWsU8
Comments
Please login to add a commentAdd a comment