
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభాగంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన చివరి రోజు ఈవెంట్‌లో ప్రఖ్యాత ఇటాలియన్ టేనర్ ఆండ్రియా బోసెల్లి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటలీలో జరిగిన ఈ వేడుకలకు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సైతం హాజరయ్యారు. మొత్తం ఈ వేడుకలకు 1200 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమం కోసం అంబానీ ఏకంగా పోర్టోఫినో సముద్ర తీరం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు.
అంబానీ ఫ్యామిలీ ఇటలీ సెలబ్రేషన్‌లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అంబానీ ఫ్యామిలీతో పాటు.. షారుఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదలైన సెలబ్రిటీలు కూడా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment