
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు.
ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్‌లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది.
అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment