‘మామేరు’ వేడుకలో మెరిసిన రాధిక : అమ్మనగలతో అందంగా, అద్భుతంగా! | Mameru Ceremony: Radhika Merchant Picks Out Gold Jewellery From Mum's Wedding Collection | Sakshi
Sakshi News home page

‘మామేరు’ వేడుకలో మెరిసిన రాధిక : అమ్మనగలతో అందంగా, అద్భుతంగా!

Published Thu, Jul 4 2024 10:56 AM | Last Updated on Thu, Jul 4 2024 11:44 AM

Mameru Ceremony: Radhika Merchant Picks Out Gold Jewellery From Mum's Wedding Collection

అపర కుబేరుడు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ తన  చిరకాల ప్రేయసితో  వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తోంది. దీంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి.

ప్రధానంగా గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే  ఆచారాలను ఇరు  కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కాబోయే వధువు రాధిక తన స్టయిలిష్‌ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది.

అమ్మ నగలతో అందంగా
రాధికా మర్చంట్ ఆరెంజ్  అండ్‌  పింక్ షేడ్స్‌లో  మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్ , మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్   ఇం‍కా స్పెషల్‌ హెయిర్‌  స్టయిల్‌తో  ఆమె ఫ్యాషన్‌ లుక్‌  అదిరిపోయింది.  ముఖ్యంగా ఇదే వేడుకలో తన తల్లి ధరించిన  ఆభరణాలను ఎంచుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్, ప్రియుడు శిఖర్ పహారియాతో స్టైలిష్‌గా కనిపించింది. 

ఇంకా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, ఓరీ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్‌కు మరింత గ్లామర్ జోడించారు.

 గుజరాతీ వివాహాలలో కుటుంబ ప్రాముఖ్యతను, వరుడు తల్లి పుట్టింటివారి ప్రేమలను చాటేలా 'మోసలు' లేదా 'మామెరు' వేడుకులను నిర్వహిస్తారు. ఈ 'మామేరు' వేడుకలో వధూవరులు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు.  అమ్మతరపు వారు అందించే బహుమతులను స్వీకరిస్తారు.

కాగా  జూలై 12నుంచి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ వివాహ వేడుకలు జరగ బోతున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ (వివాహ రిసెప్షన్)దాకా ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement