ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా ఫోటోలు వైరల్ | Paris Olympics 2024 Nita Ambani Radiates MM Lotus Pink Hand-Embroidered Saree | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా ఫోటోలు వైరల్

Published Sun, Jul 28 2024 3:05 PM | Last Updated on Tue, Jul 30 2024 2:27 PM

Paris Olympics 2024 Nita Ambani Radiates MM Lotus Pink Hand-Embroidered Saree

రిలయన్స్‌ షౌండేషన్‌ చైర్మన్‌ నీతా అంబానీ తన ఫ్యాషన్‌ నైపుణ్యాన్ని  చాటుకోవడంలో ఎపుడు తన అభిమానుల అంచనాలను తప్పరు. ఇటీవల తన చిన్న కుమారుడు  అనంత్‌ అంబానీ వివాహ వేడుకల్లో అందర్నీ అబ్బుర పర్చిన నీతా అంబానీ ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో కూడా స్టైల్‌ ఐకాన్‌గా నిలిచారు.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌  చేసిన చీరలో నీతా అంబానీ హుందాగా కనిపించారు లోటస్‌ పింక్‌ హ్యాండ్‌-ఎంబ్రాయిడరీ చీరలో నీతా దేశీ శోభను  ప్రదర్శించారు.  ఫ్యాషన్‌ సీటీలో  జరుగుతున్న విశ్వ క్రీడావేదికపై చీర పట్ల తనకున్న  ప్రేమను చాటుకున్నారు. భారతీయ సంప్రదాయన్ని, హస్తకళ  గొప్ప కళాత్మకతను చాటడమే కాదు, అద్భుతమైన చీరలో ఫ్యాషన్‌ ప్రియులను నీతా  ఆకర్షించారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

సున్నితమైన సోజ్నీ కలంకారి చేతి ఎంబ్రాయిడరీతో కస్టమ్‌ మేడ్‌ చీర, చీరకు సరిపోయే హాఫ్‌-స్లీవ్‌ బ్లౌజ్‌లో అద్భుతమైన ఛాయతో మెరిసారు. అంతేనా లగ్జరీ బహుళ-లేయర్డ్‌ ముత్యాల నెక్లెస్‌, చెవిపోగులు, అద్భుతమైన డైమండ్‌ రింగ్‌ , మ్యాచింగ్‌ ముత్యాల గాజుల  సెట్‌ను  ధరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement