Manish Malhotra
-
ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ..! ఏకంగా 22 ఏళ్ల నాటి..
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన విందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్(Reliance Foundation chairperson) నీతా అంబానీ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార ప్రముఖులు, ట్రంప్ మంత్రివర్గంలోని నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ డిన్నర్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నలుపురంగు కాంచీపురం(Kanchipuram) చీరకట్టులో కనిపించారు. ఈ ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నీతా తన ఆహార్యంతో అందంగా ప్రతిబింబించారు. నీతా ధరించిన ఈ చీరకు, మెడలోని హారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ నలుపు రంగు కాంచీపురం చీరను డిజైన్ చేశారు. భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యానికి నివాళిగా నిలిచే ఈ అందమైన చీరను నేసింది జాతీయ అవార్డు గ్రహీత బి. కృష్ణమూర్తి. ఆయన సహకారంతోనే మనీష్ మల్హోత్రా అందంగా డిజైన్ చేశారు. ఈ చీర కాంచీపురం దేవలయాల వివరాలు, వాటి కథను ప్రతిబింబిస్తుంది.భారతదేశ ఆధ్యాత్మికతకు, సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ చీర. ఇక ఈ చీరకు సరిపోయేలా పూర్తినెక్ని కవర్ చేసేలా ఫుల్ హ్యండ్స్ ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌ని ఎంచుకంది. ఇది నీతాకి అక్కడ చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తుంది. అతిరథ మహరథులు విచ్చేసే ఈ వేదికను నీతా ఆధునికతతో కూడిన సంప్రదాయన్ని మిళితం చేసి ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం ఇచ్చారు. హైలెట్‌గా 200 ఏళ్ల నాటి లాకెట్టు..ఈ అందమైన సంప్రదాయ చీరకు తగ్గట్టుగా చిలుక ఆకారంలో ఉండే అరుదైన 200 ఏళ్ల నాటి పురాతన లాకెట్టు(Pendant)ని ధరించింది. ఈ పురాతన కుందన టెక్కిక్తో తీర్చిదిద్దిన హారం రాయల్టీని హైలెట్ చేసింది. ఈ నెక్లెస్‌ని పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలతో రూపొందించారు.(చదవండి: ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్లో స్టైలిష్‌గా ఉషా వాన్స్ దంపతులు..!) -
జియో వరల్డ్‌లో మనీష్ మల్హోత్రా: బాలీవుడ్ తారలు, నీతా వెరీ స్పెషల్
-
డబుల్ దుపట్టా డిజైనర్ లెహంగాలో మెరిసిన పెళ్లి కూతురు, దీని స్పెషాల్టీ ఇదే!
సాధారణంగా పెళ్లి పెళ్లి తంతు, విందుభోజనాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. అలాగే వధూవరులు అందం చందాల్నిచూసి అందమైన జంట,క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగిడేస్తాం. వీటితోపాటు ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ వేడుకల సందడి కూడా బాగాపెరిగింది. దీంతోపాటు వధూవరుల డిజైనర్ దుస్తులు, ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బ్రైడల్ లుక్ అదే.. పెళ్లి కూతురు ముస్తాబు, డిజైనర్ లెహెంగాలు చాలా ఆసక్తికరంగా మారాయి. తాజాగా గాయకుడు అర్మాన్ మాలిక్ తనచిరకాల ప్రియురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లాడాడు. వధువు ఆరెంజ్ కలర్ డిజైనర్ లెహెంగాలో మెరిసిపోతూ అందరి దృష్టినీ ఆకర్షించింది. అద్భుత సెట్టింగుల మధ్య వారి పెళ్లి దుస్తులు ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఆర్మాన్, ఆష్నా దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.ప్రత్యేకత ఏంటి అంటేరెగ్యులర్ కలర్స్ కంటే భిన్నంగా ఆరెంజ్ కలర్ మనీష్ మల్హోత్రా లెహంగాలో ఆష్నా బ్యూటిఫుల్‌గా ముస్తాబైంది. బంగారు జర్దోజీ వర్క్ తో, స్క్వేర్ నెక్ క్రాప్డ్ బ్లౌజ్, ఫ్లేర్డ్ స్కర్ట్ అద్భుతంగా అమిరింది. దీనికి డబుల దుపట్టాలతో తన బ్రైడల్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసేలా జాగ్రత్తపడింది. ఆరెంజ్ కలర్లో ఒకటి, తలపై మేలిముసుగుకోసం పాస్టెల్ పీచ్ కలర్లో ఒకటి జతగా ధరించింది. అలాగే డ్రెస్‌కు మ్యాచింగ్‌గా పాస్టెల్ పీచ్ బ్యాంగిల్స్ వేసుకుంది. ఇంకా పోల్కీ డైమండ్, చోకర్ నెక్లెస్, ముత్యాల ఆభరణాలతో మేళవించి న్యూ గ్లామ్ లుక్‌తో కాబోయే పెళ్లి కూతుళ్లకు కొత్త ట్రెండ్ అందించింది. ఇక వరుడు అర్మాన్ మాలిక్ ఈ విషయంలో ఆష్నాను ఫాలో అయిపోయాడు. ఆమెకు మ్యాచింగ్‌గా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ జర్దోజీ వర్క్ ఫుల్ స్లీవ్స్ పీచ్ షేర్వానీలో కనిపించాడు.మ్యాచింగ్ కుర్తా, ప్యాంటు,,తలపాగా సిల్క్ మెటీరియల్‌తో పాటు, బ్రూచ్‌లో రాయల్, క్లాసీ లుక్‌లో అదిరిపోయాడు. అలాగే కొత్త ఏడాదిలో తమ సరికొత్త జీవన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న వేళ అర్మాన్ కొత్త ఈపీ( EP extended play)ని విడుదల చేశాడు. కాగా ఆష్నా ష్రాఫ్ పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లగ్జరీ ఫ్యాషన్, బ్యూటీ , లైఫ్‌స్టైల్‌కి పెట్టింది పేరైన ఆమెకు 10 లక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లుఉన్నారు. -
పీవీ సింధు పెళ్లి సందడి: పాపులర్ డిజైనర్లు, స్పెషల్ మేలిముసుగు
బాడ్మింటర్ స్టార్ పీసీ సింధు తన కలల రాకుమారుడితో ఏడడుగులు వేసింది. ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో దత్త సాయితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్బంగా పీవీ సింధు వెడ్డింగ్ ఔట్ ఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంతేకాదు, మొత్తం పెళ్లి వేడుకల్లో ప్రఖ్యాత డిజైనర్లకు సంబంధించిన అందమైన దుస్తులను ఎంపిక చేసుకోవడం విశేషం. సబ్యసాచి ముఖర్జీ నుంచిమనీష్ మల్హోత్రా వరకు, తన ప్రతీ బ్రైడల్ లుక్‌లోనూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది .డిజైనర్ మనీష్ మల్హోత్రా పీవీ సిందు ఐవరీ-టోన్డ్ బ్రైడల్ చీర వివరాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.పెళ్లి ముహూర్తానికిబంగారు, వెండి జరీతో చేతితో నేసిన చీరను ముహూర్తానికి కట్టుకుంది. ఈ చారలో బద్లా జర్దోజీ ఎంబ్రాయిడరీ దీనికి స్పెషల్ ఎట్రాక్షన్. ఆమెధరించిన మేలి ముసుగులో పీవీ సింధు, వెంకటదత్తసాయి పేర్లు రాసి ఉండడం మరో ఎట్రాక్షన్.సింధుతో తన వివాహానికి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ కలర్ బ్రోకేడ్ షేర్వానీలో అందంగా కనిపించాడు వెంకట దత్త సాయి. దీనికి సింధుతో కలిసి మ్యాచింగ్ అన్‌కట్ డైమండ్ ఆభరణాలను ఎంచుకున్నాడు. బంగారు, వెండితో తయారుచేసిన స్టోల్,షాఫా జతచేసి తన వెడ్డింగ్ లుక్‌కి సరైన న్యాయం చేశాడు.వరమాల వేడుకకు సబ్యసాచి ముఖర్జీవరమాల వేడుక కోసం సింధు , వెంకట దత్త సాయి ఇద్దరూ సబ్యసాచి ముఖర్జీ దుస్తులను ఎంచుకున్నారు. గోల్డెన్ అండ్ రోజ్ కలర్ ఎంబ్రాయిడరీ రెడ్ లెహంగా ,ఫుల్ స్లీవ్ చోలీతో, షీర్ దుపట్టా ధరించింది. వరుడు వెంకట సాయి గోల్డెన్ వర్క్, లేత గోధుమరంగు రంగు షేర్వానీలో అందంగా కనిపించాడు. ఈ ఔట్‌ఫిట్‌కి పగిడి(తలపాగా), ముత్యాల హారం మరింత లుక్ తెచ్చిపెట్టాయి. రిసెప్షన్ లుక్ ఈ జంట ఫల్గుణి షేన్ పీకాక్ స్టైలిష్ ఔట్ఫిట్ లెహెంగాలో పెళ్లి కళ ఉట్టి పడుతూ కనిపించింది సింధు. స్వరోవ్స్కీ, సీక్విన్ క్రిస్టల్ వర్క్‌ను కలిగి ఉన్న ఐవరీ టల్లే లెహెంగా ఆమె రూపానికి మరింత గ్లామర్ అందించింది. డైమండ్-లేయర్డ్ నెక్లెస్, పచ్చల పెండెంట్, మ్యాచింగ్ చెవిపోగులతో పాటు, ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్‌ను కూడా ధరించింది.మరోవైపు, వెంకట దత్త సాయి టోనల్ సిల్క్ ఎంబ్రాయిడరీ , సీక్విన్ డిటైలింగ్‌తో సొగసైన భారీ ఎంబ్రాయిడరీ బ్లేజర్, బ్లాక్ వెల్వెట్ బంద్ గాలా ధరించారు. సంగీత్, హల్దీకిఇక సంగీత్, హల్దీ వేడుకల్లో అబు జానీ సందీప్ కోశ్లా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు సింధు, సాయి దంపతులు. -
ఆటలోనే కాదు..ఫ్యాషన్‌లోనూ ట్రెండ్ సెట్ చేసిన పీవీ సింధు
పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ,రెండుసార్లు ఒలింపియన్ పీవీ సింధు వివాహ వేడుక అంగరంగ వైభంగా ముగిసింది. పెళ్లి కూతురులుక్లో ముగ్ధమనోహరంగా అందర్నీ మెస్మరైజ్ చేసింది.హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆదివారం, (డిసెంబర్ 22,2024న) ఉదయపూర్‌లో వివాహం చేసుకుంది పీవీ సిందు. ఈ సందర్భంగా సింధు డిజైనర్ సారీ, పెళ్లి కూతురి ముసుగు, వరుడు బ్రోకేడ్ షేర్వాని ఇలా ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఒక్కో వేడుకకు, ఒక్కో డిజైనర్ రూపొందించిన ఫ్యాషన్ ఔట్‌ఫిట్స్‌తో తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్త పడింది పీవీ సింధు. ముఖ్యంగా వధూవరుల మ్యాచింగ్ ఆభరణాలు కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టాయి. ఫ్యాషన్ అభిమానులు, ముఖ్యంగా కాబోయే వధువుల మనసు దోచేశాయి. ఆటలోనూ కాదు, ఫ్యాషన్‌లోనూ ట్రెండ్ చేసిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Manish Malhotra High Jewellery (@manishmalhotrajewellery)పీవీ సింధు, సాయి మ్యాచింగ్ ఆభరణాలుప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా జ్యువెలరీ కలెక్షన్లోని పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ధరించగా, వరుడు దత్త సాయి ఆభరణాలు అందరి దృష్టినీ కట్టిపడేశాయి. సింధు జాంబియన్ పచ్చలు పొదిగిన మల్టీ-లేయర్డ్ నెక్లెస్,పట్టీ, మ్యాచింగ్ చెవిపోగులు ధరిస్తే, వరుడు డబుల్ లేయర్ నెక్లోస్ ధరించాడు. ఇంకా వజ్రాలు పొదిగిన కడియాలు, బంగారు గొలుసు సింధు బ్రైడల్ లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. కాబోయే వధూవరులకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు, -
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
Wedding Outfits: లవ్‌బర్డ్స్ కోసం డ్రీమీ ఔట్ ఫిట్స్ (ఫోటోలు)
-
లవ్ అండ్ ఎమోషన్స్ : మగువల మనసు దోచే రత్నాభరణాలు (ఫొటోలు)
-
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: చేనెత చీరలో శోభితా స్టన్నింగ్ లుక్..!
టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శోభితా ధూళిపాళ, నాగచైతన్య నిశ్చితార్థం దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఇక్కడ ఆమె చీరను తన నేపథ్యం, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేలా చేనెత పట్టు చీరును ఎంచుకోవడమే గాక తలలో ధరించిన కనకాంభరం పూలు ఆరణాలా తెలుగింటి ఆడపడచంటే ఏంటో తనదైన ఫ్యాషన్ స్టైల్లో చెప్పకనే చెప్పింది. మనీష్ శోభితాకు పీచ్ కలర్ ఉప్పాడ సిల్క్ చీరను ఎంపిక చేశారు. దీనికి జల్వర్క్ చేసిన బ్లౌజ్‌ని మ్యాచ్ చేశారు. అలాగే కొత్త పెళ్లికూతురు లుక్ కనిపించేలా జుట్టుని వదులుగా ఉండేలా అల్లి, కనకాంభరాలను బన్ స్టైల్లో పెట్టారు.ఇక్కడ శోభిత ఉప్పాడ సిల్క్ చీరను సెలక్ట్ చేసుకున్నారు. ఇక నాగ చైతన్య ఆంధ్రప్రదేశ్ అబ్బాయిలు ఎక్కువగా ధరించే పట్టుపంచ, లాల్చీ, కండువాన్ని ధరించడం విశేషం. వీరిద్దరూ తాము వచ్చిన మూలాలను, సంస్కృతిని మర్చిపోలేదు అనే చెప్పేలా వారి ఆహార్యం ఉంది. ఈ మేరకు డిజైనర్ ఇన్స్టాగ్రాం వేదికగా ఈ జంటను అభినందించారు. వారి సాంస్కృతిక నేపథ్యం, మూలాలను సూచించేలా దుస్తులు ధరించడం ఎంత ముఖ్యమో నొక్కిచెప్పారు. సంప్రదాయ వస్త్రాలతో వివాహ బంధంలోకి అడుపెట్టనున్న ఆ జంట భావోద్వేగాన్ని తెలిపేలా వారి దస్తులను డిజైన్ చేయడంలో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చారు మనీష్ మల్హోత్రా. (చదవండి: వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?) -
Manish Malhotra: పల్లకీలో పెళ్లికూతుళ్లకు మనీష్ మల్హోత్రా సరికొత్త సొబగులు (ఫోటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్ : ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా ఫోటోలు వైరల్
రిలయన్స్ షౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని చాటుకోవడంలో ఎపుడు తన అభిమానుల అంచనాలను తప్పరు. ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో అందర్నీ అబ్బుర పర్చిన నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా స్టైల్ ఐకాన్‌గా నిలిచారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో నీతా అంబానీ హుందాగా కనిపించారు లోటస్ పింక్ హ్యాండ్-ఎంబ్రాయిడరీ చీరలో నీతా దేశీ శోభను ప్రదర్శించారు. ఫ్యాషన్ సీటీలో జరుగుతున్న విశ్వ క్రీడావేదికపై చీర పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారతీయ సంప్రదాయన్ని, హస్తకళ గొప్ప కళాత్మకతను చాటడమే కాదు, అద్భుతమైన చీరలో ఫ్యాషన్ ప్రియులను నీతా ఆకర్షించారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.సున్నితమైన సోజ్నీ కలంకారి చేతి ఎంబ్రాయిడరీతో కస్టమ్ మేడ్ చీర, చీరకు సరిపోయే హాఫ్-స్లీవ్ బ్లౌజ్లో అద్భుతమైన ఛాయతో మెరిసారు. అంతేనా లగ్జరీ బహుళ-లేయర్డ్ ముత్యాల నెక్లెస్, చెవిపోగులు, అద్భుతమైన డైమండ్ రింగ్ , మ్యాచింగ్ ముత్యాల గాజుల సెట్‌ను ధరించారు. -
మనీష్ మల్హోత్రా : కళ్లు చెదిరే అల్టిమేట్ జ్యుయల్లరీ! (ఫొటోలు)
-
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
-
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్‌ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్‌లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్‌తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్‌పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
Meena Kumari biopic: విషాద నటి బయోపిక్ నిజమే
హిందీ చిత్రసీమలో విషాద పాత్రల్లో మెప్పించిన అలనాటి నటి ఎవరు అంటే? ‘మీనా కుమారి’ పేరు చెబుతారు. తన అందం, అభినయంతో నాటి తరం ప్రేక్షకులను అలరించారు మీనా కుమారి. ప్రస్తుతం ఆమె బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ బయోపిక్ గురించి మనీషా మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ఏ చిత్రానికైనా కథే కీలకం. బయోపిక్‌లకి మరీను. మీనా కుమారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా కథ తయారు చేస్తున్నా’’ అన్నారు. ఇటీవల రిలీజైన∙‘ఆది పురుష్’లో సీత పాత్ర చేసిన కృతీ సనన్ ‘మీనా కుమారి’ బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మీనా కుమారి బయోపిక్ తీయడానికి ఆమె కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని భోగట్టా. -
తారల మెరుపులతో మనీష్ మల్హోత్రా ఈవెంట్ (ఫొటోలు)
-
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్‌ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Fashion: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఫలానా పాత్ర కోసం ఆమె’ అనే అవకాశాన్ని అందుకునే స్థాయి దాటిపోయి.. ‘ఆమె కోసం ఈ పాత్ర’ అని రచయితలు రాసే.. దర్శకులు ఆలోచించే హోదాకు చేరుకున్న నటి రమ్యకృష్ణ! ఆమెకు సంబంధించిన ఈ ప్రత్యేకత ష్యాషన్ రంగంలోనూ అమలవుతోంది. ఇక్కడ చెబుతున్నది చిన్న ఉదాహరణ మాత్రమే! మనీష్ మల్హోత్రా డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ప్రూవ్ చేసుకున్నాడు. ఫిల్మ్‌ఫేర్‌తో పాటు మరెన్నో అవార్డులనూ అందుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ను సామాన్యుడు అందుకోవాలంటే కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం. జైపూర్ జెమ్స్.. 1974, ముంబైలో శ్రీపాదం సచేతి ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘జైపూర్ జెమ్స్’. అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. ఇలా వారికంటూ ఒక ప్రత్యేకత ఉండటంతో నలభై ఎనిమిదేళ్లుగా వారి వ్యాపారం జోరుగానే సాగుతోంది. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్లలోనూ జైపూర్ జెమ్స్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మనీష్ మల్హోత్రా ధర: రూ. 2,75,000 జ్యూయెలరీ బ్రాండ్: జైపూర్ జెమ్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నాకు డ్రీమ్‌రోల్స్ అంటూ ఏవీ లేవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్న పాత్రలే. కాబట్టి వాటినే నా డ్రీమ్‌రోల్స్ అనుకోవచ్చు! – రమ్యకృష్ణ ∙దీపిక కొండి View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) -
ఖరీదైన ఇల్లు కొన్న ప్రముఖ డిజైనర్, ధర ఎంతంటే..
Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయినర్స్ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్ చేస్తుంటారాయన. బీటౌన్‌లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హొత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ కాస్ట్యూమ్ డిజైనర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ముంబైలో భారీ మొత్తానికి మనీష్ మల్హొత్ర ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్‌లోని భోజ్వనీ ఎన్‌క్లేవ్‌లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్లీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. -
ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్‌కు 40% వాటాలు
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) 40 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇరు సంస్థ లు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపాయి. ‘ఎంఎం స్టయిల్స్‌లో 40 శాతం మైనారిటీ వాటా కోసం బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ మనీష్ మల్హోత్రాతో ఆర్బీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది’ అని పేర్కొన్నాయి. అయితే, డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటిదాకా మనీష్ మల్హోత్రా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న ఈ బ్రాండ్‌లో బైటి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. భారతీయ కళలు, సంస్కృతిపై అపార గౌరవమే మల్హోత్రాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమని పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో రిలయన్స్‌తో భాగస్వా మ్యం గణనీయంగా తోడ్పడగలదని మల్హోత్రా తెలిపారు. 2005లో ప్రారంభమైన ఎంఎం స్టయిల్స్ బ్రాండ్‌కు హైదరాబాద్ సహా ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో 4 పెద్ద స్టోర్స్ ఉన్నాయి. -
మనీశ్ మల్హోత్రాతో రిలయన్స్ భారీ డీల్
Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్‌తో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్ లేబుల్ ‘మనీశ్ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది. పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్ మల్హోత్రా బ్రాండ్‌లో రిలయన్స్ మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ మేరకు మనీశ్‌తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్లను నడిపిస్తున్న మనీశ్ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్ స్టోర్ తెరిచిన ఫీట్ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్ ప్రత్యేకత. రియలన్స్తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్ మల్హోత్రా(54) తెలిపారు. చదవండి: 14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ -
చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’
PV Sindhu In Saree: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మన తెలుగమ్మాయి పీవీ సింధు పూల రంగు చీర కట్టుకుని కుందనపు బొమ్మలా మెరిసింది. చీరకట్టులతో తెలుగమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చిరునవ్వు చిందిస్తూ చీరలో మెరిసిపోతున్న సింధును చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు. ఆ ఫొటోలకు ఏడు లక్షల మందికిపైగా లైక్స్ కొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన చీరలో సింధు కనిపించింది. ఎప్పుడూ క్రీడా దుస్తుల్లో కనిపించే సింధు ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో దేవకన్యలా ప్రత్యక్షమైంది. తెలుపు చీరలో గులాబీ, నీలం, పర్పుల్ పూలు త్రెడ్‌వర్క్ చేసి ఉంది. ఈ చీర విలువ దాదాపు కొన్ని వేలల్లో ఉంటుందని ఫ్యాషన్‌ప్రియులు చెబుతున్నారు. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. సింధుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా పీవీ సింధు ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించి సింధు సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సింధు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సింధు ఐస్‌క్రీమ్ తిన్న విషయం తెలిసిందే. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
హల్చల్ : రకుల్ చీటింగ్..పూజా కిస్సింగ్..హ్యాపీ అంటున్న సదా
♦ చీటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ తల్లితో బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మునిగిన సుప్రీత ♦ ముద్దులొలుకుతున్న పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ♦ మహేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన నమ్రత ♦ పుస్తకాల ఇంపార్టెన్స్ చెబుతున్న సోనాలీ బింద్రె ♦ వీకెండ్ కోసం ఎదురుచూస్తున్న మనీష్ మల్హొత్ర ♦ బ్లాక్ సల్వార్‌లో కృష్ణ ముఖర్జి క్యూట్ లుక్స్ ♦ ఎవరో గెస్ చేయమంటున్న దీపిక పిల్లి ♦ వర్కవుట్కు రెడీ అయిన కత్రినా కైఫ్ ♦ బీ హ్యాపీ అంటున్న సదా ♦ మీరు కూడా ఇంతేనా అని ప్రశ్నిస్తున్న అభిజీత్ View this post on Instagram A post shared by ANSHUKA | Yoga & Wellness (@anshukayoga) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) \ \ View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
Virtual Fashion Week: వర్చువల్ ఎంపిక
కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగినప్పటికీ నిశితంగా పరిశీలిస్తే మొత్తం లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాలు 8 నుండి 10 శాతం మాత్రమే ఉందని నిపుణుల అంచనా. ఫలితంగా ప్రఖ్యాత డిజైనర్లు సైతం వర్చువల్‌కి మారారు. ర్యాంప్వాక్లతో ధగధగలాడే ఫ్యాషన్ షోలు సైతం వర్చువల్ దారిలోకి వచ్చేశాయి. అటు నుంచి టైలరింగ్, డిజైనింగ్‌లో శిక్షణ కూడా డిజిటల్లో వెలుగుతోంది. ఇప్పటికే ప్రఖ్యాత డిజైనర్లు మనీష్ మల్హోత్రా, రితుకుమార్, రీనా ఢాకా, బినా రమణి, సమంతా చౌహాన్,.. వంటి వారెందరో వర్చవల్ వేదికకు రంగం సిద్ధం చేసుకున్నారు. విదేశాలలో ఊపందుకున్న వర్చువల్ రియాలిటీ ఇప్పుడు దేశీయంగానూ ఫ్యాషన్ రంగంపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఫ్యాషన్ షోలు ఫ్యాషన్ షో అనగానే జిగేల్మనే లైట్లు, మోడళ్ల మెరుపులు, ర్యాంప్‌వాక్‌లు, ఆహుతుల చప్పట్ల హోరు గ్రాండ్‌గా కళ్ల ముందు నిలుస్తుంది. మహమ్మారి కారణంగా ర్యాంప్ వేదికలు వర్చువల్‌గా మారాయి. ర్యాంప్‌లను గ్రీన్ స్క్రీన్లతో రియల్ టైమ్ కంపోజిషన్స్ భర్తీ చేశారు. ఇప్పుడు ఎవ్వరైనా తమ గదిలో కూర్చునే డిజిటల్లో ఈ ర్యాంప్ షోలను వీక్షించవచ్చు. ఇండియా కొచర్ వీక్, బ్లెండర్స్ ఫ్యాషన్ ప్రైడ్, ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ షో కూడా వర్చువల్‌లోనే నడిచింది. ఇవన్నీ దేశ విదేశాల నుండి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవే. వర్చువల్‌లో లో దుస్తులు, ఇతర సౌందర్య సాధనాలు, మేకప్ లుక్స్ కూడా ప్రదర్శించడం, వాటిని కోట్లాదిమంది వీక్షించడం ప్రస్తుత ట్రెండ్‌కు నిదర్శనంగా ఉంది. షాపింగ్ లగ్జరీ డిజైన్స్ సృష్టించే డిజైనర్లు్ల కేవలం ఆన్లైన్ అమ్మకాల ద్వారా ప్రయోజనం పొందలేమని గుర్తించారు. కస్టమర్లు నేరుగా షాప్‌ను సందర్శించి, డిజైన్లు చూసే అనుభూతిని పొందుతారని, అప్పుడే వారు ఆర్డర్లు ఇవ్వడానికి, కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని గ్రహించారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం వినియోగదారుడిని నేరుగా షాప్‌కి రప్పించలేని పరిస్థితి. ఫలితంగానే భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ కొనుగోలు విధానంలో వర్చువల్ మార్పు బాణంలా దూసుకొచ్చింది. ఇండియాలో మొదటిసారి పూర్తి వర్చువల్ స్టోర్‌ను మనీష్ మల్హోత్రా ప్రారంభించాడు. ఆ తర్వాత అదే దారిలో ప్రఖ్యాత డిజైనర్లు ప్రయాణిస్తున్నారు. గ్రాండ్‌గా డిజైన్ చేసే బ్రైడల్ దుస్తుల డిజైనర్లు ఇదే కోవలో పయనిస్తున్నారు. యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్‌బాటలో నడుస్తోందన్నది డిజైనర్ల అభిప్రాయం. డిజైనింగ్ క్లాసులు టైలరింగ్‌కు వర్చువల్ క్లాసులు తలుపులు తెరిచాయి. సాధారణ స్థానిక టైలరింగ్ నుంచి ప్రసిద్ధ డిజైనర్ల వరకు ఆన్లైన్ వేదికగా క్లాసులు తీసుకుంటున్నారు. ఫ్యాషన్ అకాడమీలు కూడా ఇదే బాట పట్టాయి. విద్యార్థులకు ఇచ్చే క్లాసులన్నీ ఆన్లైన్ వేదిక అయినట్టుగానే ఫ్యాషన్ క్లాసులూ డిజిటల్ అయ్యాయి. డ్రెస్ డిజైన్స్, ఇలస్ట్రేషన్లు, ఎంబ్రాయిడరీ, కటింగ్ పద్ధతులు.. వంటివి వర్చువల్ క్లాసులు జరుగుతున్నాయి. వీటికి డిజైనర్‌ను బట్టి కొంత మొత్తం చెల్లించి, అటెండ్ అవ్వచ్చు. ఒక రోజు నుంచి మొదలయ్యే ఆన్లైన్ వర్క్‌షాప్స్‌కి అటెండ్ అయ్యి డిజిటల్లోనే నేర్చుకోవచ్చు. ఆసక్తిగా డిజైనింగ్ ప్రస్తుత కాలం ఫ్యాషన్ షోలు, షాపింగ్ కొంతవరకు సరైనదే. అయితే, సాధారణంగా మనం ఫ్యాబ్రిక్‌ని టచ్ చేస్తే ఉండే ఫీల్ డిజిటల్లో చూస్తే రాదు. డిజిటల్లో ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తెలుసుకోవడమూ కష్టమే. కాకపోతే డిజిటల్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు అవతలి వ్యక్తి అటెన్షన్ ఏ విధంగా ఉందనే విషయం అంతగా తెలియడం లేదు. అవతలి వ్యక్తి మనం చెప్పే విషయం పట్ల ఎంతసేపు అటెన్షన్ పెట్టగలుగుతున్నారనేది ముఖ్యం. క్లాస్ చెబుతున్నప్పటికీ వర్చువల్‌గా కమ్యూనికేషన్ అంతగా జరగడం లేదు. అందుకే, డిజిటల్లో క్లాస్ తీసుకునేప్పుడు సదరు వ్యక్తి తక్కువ టైమ్ కేటాయించి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. క్లాస్ బోర్ ఉండకూడదు. నేర్చుకునేవాళ్లు కూడా వాళ్లకు వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండాలి. రొటీన్‌గా చెబుతూ పోతే ఇటు మాస్టర్‌కి, అటు విద్యార్థికీ ఆసక్తి ఉండదు. – అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్ -
హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ
ముంబై : బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్లస్ సింబల్‌ను షేర్ చేస్తూ..తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, త్వరగా కోలుకునేలా ప్రార్థించాలని కోరారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ..మీరు తప్పకుండా కోలుకుంటారు, భయపడకండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆదివారం జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ కియారా అద్వానీ, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇటీవలె కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో ఇప్పడు వీరిందరికి కరోనా భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా తనను కంటాక్ట్ అయిన వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్ తెలిపారు. చివరగా ఆయన ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు. గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి : బిగ్‌బాస్ భామకు కరోనా పాజిటివ్ ప్రముఖ కమెడియన్ తేపట్టి గణేశన్ మృతి -
ఒక్క క్లిక్‌తో పెళ్లి కుమార్తెలా మెరవవచ్చు..
ఇంటి నుంచే ఆన్లైన్ షాపింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంట్లో ఉండే నేరుగా షాపును సందర్శించవచ్చు. అందులో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆ డ్రెస్‌లో తాము ఎలా ఉంటామో చూసుకోవచ్చు. అదే వర్చువల్ రియాలిటీ. మన దేశీయ ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా భారతదేశంలో మొదటి వర్చువల్ డిజైనర్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించాడు. కరోనా తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో అతి ముఖ్యమైనదిగా వర్చువల్ రియాలిటీని చెప్పుకోవచ్చు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లి డ్రెస్సులను ధరించాలని, బాలీవుడ్ తరహా పెళ్లి నృత్యాలు చేయాలని చాలామంది అనుకుంటారు. అలా ఆలోచిస్తే.. ఈ దుకాణాన్ని మీరు ఒక్క క్లిక్‌తో తెరవచ్చు. ఆకట్టుకునే పంజాబీ పాట ‘మహే డి తప్పే’ కి దాని (వర్చువల్) తలుపులు తెరుస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక గది నుండి మరొక గదికి వెళ్ళినప్పుడు సంగీతం మారుతుంటుంది. ఈ వర్చువల్ స్టోర్‌లో పర్యటించి మీరు ఆ స్టోర్‌లో పెళ్లి కూతురులా మెరిసిపోవచ్చు. షేర్వానీల వరసలు.. కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తూ వెళుతుంటే .. మిమ్మల్ని లేలేత రంగుల డిజైనర్ లెహెంగాలు, షెర్వానీల వరుసల నుండి పోల్కీ ఆభరణాలతో మెరిసే ప్రదర్శనకు తీసుకెళుతుంది. మీ కంప్యూటర్ తెరపై కనిపించే ప్రతి డ్రెస్‌పై క్లిక్ చేయవచ్చు, ఫాబ్రిక్, ఎంబ్రాయిడరీ, ధరల గురించి చాలా వివరంగా తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని మల్హోత్రా డిజైన్ స్టోర్‌కి ఇది వర్చువల్ అవతార్. దిగ్గజ కుతుబ్ మినార్‌కు ఎదురుగా ఉంది. ‘ఇది భారతదేశంలో నా మొదటి వర్చువల్ స్టోర్. 2019 లో ఈ స్టోర్‌ను రీ డిజైనింగ్ చేశాం. దీని విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. దేశంలో డిజైనర్ విభాగంలో అతిపెద్ద స్టోర్ ఇది‘ అని మల్హోత్రా చెప్పారు. లాక్డౌన్ నేర్పిన వేగం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఈ వర్చువల్ ప్రక్రియను వేగవంతం చేసింది అంటాడు మల్హోత్ర. ‘ఈ వర్చువల్ స్టోర్ అంతటా ఉన్నట్టే. ఎప్పుడైనా, ఎక్కడైనా అన్ని రోజులు, అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మేం ఈ ప్రదేశంలో లేకపోయినా మా డిజైన్లు కస్టమర్లను చేరుకుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా మేం వినియోగదారుల నుంచి మంచి బలమైన నమ్మకాన్ని పొందగలం‘ అని తన వర్చువల్ విధానం గురించి తెలియజేస్తారు మల్హోత్రా. లాక్డౌన్ సమయంలో వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్న మల్హోత్రా తనను నేరుగా కలవడానికి, వారి దుస్తులను చూడాలనుకునే వధువులకు ఉపయోగంగా ఉండే మాధ్యమాన్ని వెతికారు. అప్పుడే ఈ డిజిటల్ వైపు మొగ్గుచూపారు. వర్చువల్ ఉపయోగాలను వివరిస్తూ ‘నేను ఆర్డర్ల కోసం, నా కొత్త డిజైన్స్ పరిచయం చేయడానికి వేరే వేరే ప్రాంతాలు తిరగనక్కరలేదు. ఇది వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనుభవాన్ని అందిస్తుంది. దీని నుంచి మిడిల్ ఈస్ట్, కెనడా, అమెరికా వంటి దేశాలలో మా ఉనికిని బలోపేతం చేయాలని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మొత్తంమీద కరోనా వైరస్ కొత్త కొత్త వాటిని పరిచయం చేసింది. అందరి దృష్టి డిజిటల్ వైపు మరింత సారించేలా చేసింది. ఇప్పటికే ఫ్యాషన్ షోలు వర్చువల్ వైపుగా మళ్లాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్టోర్స్ కూడా చేరాయి. -
నన్ను నా భర్తను లక్ష్యంగా చేసుకుని..
ముంబై: తనను, తన భర్తను ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారని నటి ఊర్మిళ మటోండ్కర్ పేర్కొన్నారు. ఇటీవల ఊర్మిళ శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసన్ అక్తర్, ఇతర కుటుంబ సభ్యలపై ట్రోలర్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు. తన భర్త మొహిసిన్‌ను పాకిస్తానీ అని ఆయన ఓ టెర్రరిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని, అవి మితిమీరితే సహించేది లేదని ట్రోలర్స్‌పై మండిపడ్డారు. అయితే తన భర్త పాకిస్తాన్ ముస్లిమని, ఆయన ముస్లిం కావడమే ట్రోల్స్‌కు ప్రధాన కారణమన్నారు. అదే విధంగా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారని చెప్పారు. అప్పటి నుంచి తనను, తన భర్త మొహిసిన్ లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక గతంలో కూడా తన వికీపీడియా వివరాలను తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. ఇందులో తన తండ్రి పేరును శివీందర్ సింగ్ అని, తల్లి పేరును రుక్సానా అహ్మద్‌గా మార్చారని తెలిపారు. కానీ తన తల్లిదండ్రుల పేర్లు సునీతా, శ్రీకాంత్ మటోండ్కర్ అని ఊర్మిళ స్పష్టం చేశారు. కాగా ఊర్మిళ-మొహిసిన్‌లు 2016లో సీక్రెట్‌గా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి డిజైనర్ మనీష్ మల్హోత్రా మాత్రమే ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. -
మనీష్ మల్హోత్రాకు బీఎంసీ నోటీసులు
ముంబై: బాద్రాలోన కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిన్న బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ) అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రాకు బీఎంసీ సివిక్ బాడీ నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణం, ఇతర నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీఎంసీ గురువారం నోటిసులు జారీ చేసింది. కంగనా పాలి హిల్స్ కార్యాలయం పక్కనే మనీష్ భవనం కూడా ఉంది. సెక్షన్ 351 కింది బీఎంసీ ఈ నోటిసులు జారీ చేసింది. ఇందులో ముంబై మున్పిపల్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా మనీష్ భవన నిర్మాణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక దీని కట్టడంలో నాలుగు ఉల్లంఘనలు ఉన్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది. (చదవండి: ‘క్వీన్’ ఆఫీస్‌లో కూల్చివేతల) మొదటి అంతస్తును ఇటుక రాతితో రెండు గోడలు అక్రమంగా నిర్మించి క్యాబిన్లుగా పార్టిషన్స్ చేశారని, రెండవ అంతస్తులో గోడలను ఆనధికారికంగా నిర్మించడమే కాకుండా, అదే అంతస్తులో టెర్స్ మీద సిమెంట్ షీట్ పైకప్పు, సెడ్‌లను నిర్మాణాం, అలాగే టేర్స్‌పై ఉక్కు రాడ్లు, సిమెంట్ షీట్‌ను పైకప్పు నిర్మించినట్లు నోటీసులలో వివరించారు. అయితే కంగనా కార్యాలయాన్ని ముంబై హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చిట్లు బీఎంసీ ఇవాళ స్పష్టం చేసింది. అంతేగాక కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉన్నతాధికారులను ఇవాళ ఉదయం ప్రశ్నించారు. కాగా గత కొద్ది రోజులుగా శివసేనకు, కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో కంగనా ముంబైని పీఓకేతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) -
‘ఈ రోజు తన ఆలోచనతోనే లేచాను’
ముంబై: ‘మీది మనోహరమైన నవ్వు.. స్నేహ పూర్వక మనస్తత్వం.. గొప్ప నటుడివి’ అంటూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చెప్పిన మాటాలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గుర్తుచేసుకున్నారు. 2016లో తన ఫ్యాషన్ ప్రదర్శనలో షో టాపర్‌గా ర్యాంప్ చేసిన నాటి సంఘటనను ఆయన సోషల్ మీడియాలో సోమవారం పంచుకున్నాడు. సుశాంత్ ఫ్యాషన్ షోకు సంబందించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడే సుశాంత్‌ను మొదటిసారి కలిసాను. అతడిని చూడగానే నా కొత్త కలెక్షన్స్‌కు సరిగ్గా సరిపోతాడని భావించి ఫ్యాషన్ షోలో ర్యాంప్ చేయాలని కోరాను. దానికి సుశాంత్ అంగీకరించి వెంటనే డ్రస్ ఫిట్టింగ్ కోసం ఇంటికి వచ్చాడు. ఆ దుస్తుల్లో సుశాంత్ చాలా అందంగా ఉన్నాడు’’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. (సుశాంత్ ఇంట మరో విషాదం) అయితే ‘‘ర్యాంప్ వాక్ కోసం ప్రాక్టిస్ చేస్తుండగా సుశాంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు నేను నువ్వు గొప్ప నుటుడివి, ప్రతిభావంతుడి.. నీ నవ్వు మనోహరంగా ఉంటుంది. షోలో నీ నవ్వును ప్రదర్శించు చాలు అని చెప్పాను. అలాగే చేశాడు. షో టాపర్‌గా సుశాంత్ అద్భుతంగా కనిపించాడు. ఆ రోజు ఎప్పటికీ ప్రతిష్టాత్మక జ్ఞాపకం. ఈ రోజు అతడి ఆలోచనతోనే లేచాను. అతడి మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్న’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా సుశాంత్ ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ టీవీ, సినీ నటులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు) View this post on Instagram I had met him only once before and then asked him to walk for the show as I felt he suited this collection. He immediately agreed and came home for fittings .. when he came for rehearsals he said he was nervous as he had not walked before and I remember telling him you are such a good actor you will be fine and just smile as your smile is endearing and charming .. He was wonderful in this show as he and @shraddhakapoor walked and made a lovely pair together and today this is a wonderful cherished memory forever .. I woke up this morning thinking about him & still can’t beileve it. It’s really sad and how I wish this had not happened. You will be dearly missed. #sushantsinghrajput #memories A post shared by Manish Malhotra (@manishmalhotra05) on Jun 15, 2020 at 1:59am PDT -
ఆయన మొదటి జీతం ఎంతో తెలుసా!
సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ తారలు శ్రీదేవి నుంచి ఇప్పటీ యువ తారల సినిమాలకు ఎన్నో రకాల డిజైనర్ డ్రెస్‌లను అందింస్తూ తేరపై వారి అందాన్ని మరో లెవల్‌కు చేరుస్తారు. అంతేగాక అంతర్జాతీయంగా ఫ్యాషన్ షోలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మనీష్ మల్హోత్రా. ఇక ఎప్పుడు బిజీగా ఉండే ఆయన తాజాగా హ్యూమన్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఫ్యాషన్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి చేరడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, పంజాబీ కుటుంబంలో జన్మించిన తనకు ఫ్యాషన్ పట్ల, బాలీవుడ్ సినిమాలపై చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదన్నారు. అంతేగాక డిజైనర్‌గా ఎదగాడానికి ఆయన తల్లి సహాకారం కూడా ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. డిజైనర్‌గా అగ్రస్థానంలో ఉన్న మనీష్ సినీ పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్‌గా 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ‘చిన్నప్పటీ నుంచే నాకు ఫ్యాషన్‌తో పాటు బాలీవుడ్ సినిమాలంటే పిచ్చి. నిజం చెప్పాలంటే ఆ పిచ్చే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఇక ఫ్యాషన్‌పై ఇష్టంతో చదువుపై పెద్దగా శ్రద్ద చూపలేదు. ఇక నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ పెయింటింగ్ క్లాస్‌కు వెళ్లాను. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ క్లాస్ బాగా నచ్చింది. దానిని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇక సినిమాలలోని హీరో, హీరోయిన్లు ధరించిన దుస్తులను చూసి మా అమ్మ చీరలు, డ్రెస్‌లతో ప్రయోగాలు చేసేవాడిని’ అని మనీష్ చెప్పారు. ‘అలా నాకు ఫ్యాషన్ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఎంతగా అంటే.. తరచూ మా అమ్మకు నేను ఫ్యాషన్ గురించి సలహాలు ఇస్తూ ఉండేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. కాలేజీలో చేరినప్పుడు బొటిక్‌లో పనిచేస్తూ.. మోడలింగ్ చేయడం ప్రారంభించాను. అలా ఏడాదిన్నారపాటు ఆ బొటిక్‌లో పని చేశా. అప్పుడు నాకు నెలకు రూ.500 జీతం వచ్చేది. దాన్ని నేను చాలా విలువైనదిగా భావించేవాడిని. ఫ్యాషన్ డిజైనింగ్‌లో అధ్యయనం చేయడం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ ఆర్థిక కారణాల వల్ల విదేశాలకు వెళ్లలేకపోయాను. ఇక నా సొంతంగా ఓ స్కూల్ పెట్టి క్లాస్‌లు చెబుతూ.. గంటల తరబడి స్కెచ్ డిజైన్స్ గీస్తూ ఉండేవాడిని’ అంటూ వివరించారు. ఈ క్రమంలో తన 25వ ఏటా జూహీ చావ్లా సినిమాకు డిజైనర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత 1995లో వచ్చిన అమీర్‌ఖాన్, ఊర్మీళ, జాకీర్ ష్రాఫ్‌ల ‘రంగీలా’ డిజైనర్‌గా పని చేసినందుకు మొదటి ఫీలింఫేర్ ఆవార్డు అందుకున్నట్లు ఆయన చెప్పారు. ‘అలా ఎన్నో సినిమాలకు పని చేస్తూ.. ఫ్యాషన్ షోలో భాగంగా ప్రపంచమంత తిరిగేవాడిని. ఈ నేపథ్యంలో 2005లో నా సొంతంగా ఫ్యాషన్ లాబెల్ను ప్రారంభించాను. అలా ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాను’ అంటూ ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టాన్ని తెలిపారు. ఈ స్థాయికి చేరడంమంటే సాధారణ విషయం కాదని, ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కోని సమస్యలను అదిగమిస్తేనే మనం అనుకున్న స్థాయికి చేరగలమన్నారు. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నాలుగో తరం నటి, నటులతో పనిచేస్తున్న మనీష్ .. ఈ ఏడాదితో పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్‌గా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఫ్యాషన్ షో ఇచ్చేముందు భయపడతానని తెలిపారు. నేన ఈ స్థాయికి ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను.. అనే విషయాలను నేను మర్చిపోలేనని చెబుతూ తన నిరాంబరతను చాటుకున్నాడు మనీష్ మల్హోత్రా. -
‘ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’
ముంబై: అతిలోక సుందరి శ్రీదేవి మరణించడం తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాల్లో ఒకటని బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా అన్నాడు. శ్రీదేవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశాడు. మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగిన మనీష్ మల్హోత్రా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించి ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీతో పంచుకున్నాడు. తాను సంప్రదాయ పంజాబీ కుటుంబంలో జన్మించానని, బాలీవుడ్ మీద ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నాడు. ‘‘సాధారణ కుటుంబంలో పుట్టిన నాకు... విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివేంత స్థోమత లేదు. అందుకే సొంతంగానే డిజైనింగ్ నేర్చుకున్నా. గంటల తరబడి స్కెచెస్ గీసేవాణ్ణి. మొదట్లో ఓ బొటిక్‌లో మోడల్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నా నెల జీతం రూ. 500. బాలీవుడ్ సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడిని. ఇలా జీవితం సాగిపోతుండగా... 25 ఏళ్ల వయస్సులో నా కెరీర్ ప్రారంభమైంది. జూహీ చావ్లా సినిమాలో పనిచేసే అవకాశం లభించింది. ఆ తర్వాత 1995లో విడుదలైన ‘రంగీలా’ సినిమాతో నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకు బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. ఇలా 30 ఏళ్ల కెరీర్లో ఎన్నెన్నో విజయాలు లభించాయి. ఇక నా జీవితంలో అత్యంత బాధపడిన, చెత్త విషయం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’’ అని మనీష్ చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ అగ్ర తారలందరికీ అభిమాన క్యాస్టూమ్ డిజైనర్‌గా ఉన్న మనీష్ మల్హోత్రా.. శ్రీదేవికి కూడా వ్యక్తిగత డిజైనర్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు కూడా దుస్తులు డిజైన్ చేస్తున్నారు. -
‘విజయ్ దేవరకొండ, ప్రభాస్ అంటే ఇష్టం’
సాక్షి, హైదరాబాద్: భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో టాప్‌లో ఉన్న బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నగరానికి వచ్చారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో శనివారం రాత్రి నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... నా అభిమాన డ్రెస్ శారీ. కాటన్ శారీ, టెంపుల్ శారీ, షిఫాన్ శారీ, పోచంపల్లి... ఇలా ఏదైనా సరే చీర కట్టుడు నాకు నచ్చే వస్త్రధారణ. ఇప్పటి ఫ్యాషన్‌లో బాగా ఇండివిడ్యువాలిటీ వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఏదీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉండాల్సిన అవసరం లేదు. తమదైన స్టైల్‌ని కోరుకుంటున్నారు. సినిమాలు చూడాలని అమ్మ ప్రోత్సహించేది... చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. సహజంగా ఆ సమయంలో పిల్లలు సినిమాలు చూస్తుంటే పెద్దలు అడ్డుపడతారు. కాని మా అమ్మ నన్ను చూడమని ప్రోత్సహించేది. అంతేకాదు చిన్న వయసులోనే నా రూమ్‌లో పెట్టుకున్న వస్తువులు చూసి మా అబ్బాయి టైలర్ అంటూ సంతోషంగా చెప్పుకునేది. చాలా చిన్న వయసులోనే మోడలింగ్‌కు రావడానికి ఆమె ప్రోత్సాహం నాకు ఉపకరించింది. శ్రీదేవిఅభిమాన నటి... చాలా మంది నటీ నటులతో పనిచేసినా... శ్రీదేవి అభిమాన తార. నేను కొత్తగా వచ్చేటప్పటికి ఆమె బిగ్ స్టార్. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్‌తో సినీరంగంలోకి వచ్చాను. అప్పుడు నాకు 23 ఏళ్లు చాలా నెర్వస్‌గా ఉండేవాడ్ని. అలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ప్రవర్తనతో పాటు లైనింగ్ లేని స్లీవ్స్, స్కర్ట్ కట్స్... వంటి ఆమె దుస్తులు కూడా నాకు డిజైనింగ్‌లో ఉపకరించాయి. ఖుదాగవా సినిమాలో తన కోసం స్వెట్టర్ రూపొందించి అందించడం, ఆమె అది పెయింటెడ్ కావాలనడం... ఇలా ఆమెతో పనిచేసినప్పుడు ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. రోజుకు 18గంటలు... ఏదైనా సరే కఠినమైన డిజైనింగ్ వర్క్ అంటే అది నాకే ఇవ్వాలని అనుకుంటారు. అది నాకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఈ మధ్యే మొఘలుల చరిత్ర నేపథ్యతో రూపొందుతున్న సినిమాలో భాగమయ్యా. ఎంతో స్టడీ చేయాల్సి వస్తోంది. ఇప్పటికీ రోజుకు 12, 18గంటలు కూడా పనిచేస్తున్నా. ఏదేమైనా.. మరే డిజైనర్కీ సాధ్య పడని విధంగా ఇండియన్ ఫ్యాషన్ బిజినెస్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది. దోశ, చికెన్.. సిటీ గ్రీన్ ఈ సిటీ బాగుంటుంది. ఇటీవలే జూబ్లీహిల్స్ లో నా లేబుల్‌తో ఒక పెద్ద ఫ్యాషన్ స్టోర్ కూడా ఏర్పాటు చేశాను. ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ నాకు ఇష్టం. చికెన్ విత్ దోశ టేస్ట్ చేయకుండా వెళ్లను. ఇక్కడ గ్రీనరీ కూడా బాగా ఎక్కువే.. సిటీ ఇంత మోడ్రన్‌గా ఉన్నా కల్చర్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ మెచ్చకోవాలి. ముఖ్యంగా పెళ్లి టైమ్‌లో సంప్రదాయ దుస్తులు, సంగీత్ వంటి ఈవెంట్లు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. టాలీవుడ్లో నాకు సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్, ఎన్టీయార్, మహేష్, పూజాహెగ్డే... నాకు నచ్చే తారల లిస్ట్ ఎండ్లెస్. నిత్యవిద్యార్థులమే... నా అసలు వయసు 53 అయినా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వయసు 30 ఏళ్లు. నా లేబుల్ వయసైతే కేవలం 15 ఏళ్లు. అలాగే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కూడా 15ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సో.. ఈ సందర్భం ఇద్దరికీ చాలా ముఖ్యమైనది. అందుకే ఈ షో చాలా స్పెషల్. తరాలకు అతీతంగా నటీనటులతో పనిచేస్తున్నా. -
డబుల్ గ్లామర్
రెండు భిన్నమైన రంగుల లెహంగా ఒకటి.. ఒకే రంగులో రెండు పొరల లెహంగా మరొకటి. ఒకేరకం ఫ్యాబ్రిక్ లెహంగా ఒకటి.. రాసిల్క్– నెటెడ్ రెండు రకాల మెటీరియల్తోడిజైన్ చేసిన లెహంగా మరొకటి.ఇలా దేనికది భిన్నంగా, మది దోచేలా ఆకట్టుకుంటున్నాయి ఈ టు లేయర్డ్ లెహంగాలు. ట్విన్ లేయర్డ్ లెహంగాలుగానూ పేరున్న ఇవి వేడుకల్లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్యాజువల్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తున్నాయి. డబుల్ గ్లామర్ అని ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యేడాది వెడ్డింగ్ సీజన్లో భాగంగా డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ‘వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవడానికి గ్రాండ్ ఎంబ్రాయిడరీతో పాటు ట్విన్ లేయర్డ్ కూడా ప్రధాన కారణం’ అంటారు మనీష్ మల్హోత్రా. కుచ్చుల లెహంగా గురించి మనకు తెలిసిందే. లెహంగా ఎన్ని కుచ్చులతో ఉంటే అంచు భాగం అంత ఫ్లెయర్తో ఆకట్టుకుంటుంది. ►ఉత్తర భారతదేశంలో దాండియా వేడుకల్లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ రెండు పొరల లెహంగా. దీనికి డిజైనర్ టచ్ ఇచ్చి సౌతిండియా సైతం సరికొత్తగా ముస్తాబు చేసింది. వేడుకల్లో ప్రత్యేకంగా నిలిపింది. ►ఒక లెహంగా పార్ట్‌ని తక్కువ కొలత తీసుకొని, దాని అంచు వద్ద మరొక పొరగా కుచ్చుల భాగాన్ని జత చేస్తే ఈ అందమైన లెహంగా డిజైన్ వచ్చేస్తుంది. ►పై భాగం ప్లెయిన్ పట్టు మెటీరియల్ తీసుకుంటే, కుచ్చుల భాగం నెటెడ్తో జత చేస్తే ఇలా కొత్తగా కనువిందుచేస్తుంది. ►ఈ లెహంగాకి వెస్ట్రన్ స్టైల్ క్రాప్‌టాప్ ధరిస్తే ఇండో–వెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకుంటారు. ►లాంగ్ జాకెట్ ధరిస్తే ఒకలా, ఎంబ్రాయిడరీ ఛోలీ ధరిస్తే మరోలా భిన్నమైన లుక్‌లో కనిపిస్తారు. ►కాటన్, సిల్క్, నెటెడ్.. ఇలా ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా ఈ డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు. -
జాన్వీ పార్టీ డ్రెస్ ఖరీదు ఎంతంటే..
సాక్షి, ముంబై : అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ మూవీతో బాలీవుడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. జాన్వీకి సంబంధించి ప్రతి వార్తనూ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల ముంబైలో ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ తన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పార్టీకి జాన్వీ ఎరుపు రంగు సిల్క్ క్రీప్ బటన్ అప్ షర్ట్, అదే కలర్ ట్రౌజర్స్‌తో హాజరై మెస్మరైజ్ చేశారు. రెడ్ డ్రెస్‌తో పాటు నలుపు రంగు బ్యాగ్, యాక్సెసరీస్‌తో స్టన్నింగ్ లుక్‌లో మెరిశారు. జాన్వీ డ్రెస్ ఖరీదు భారతీయ కరెన్సీలో రూ లక్షా1725 కావడం గమనార్హం. -
ఫ్యాషన్ షోలో మెరిసిన సల్మాన్ ,కత్రినా
-
కరీనాకేమయ్యింది...
న్యూ ఢిల్లీ : కరీనా కపూర్‌కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది...మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా...అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే కరీనా కపూర్ అప్పుడప్పుడు ర్యాంప్ వాక్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్ వాక్‌చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్లో తైమూర్ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్ వాక్ చేశారు. తన అభిమాన డిజైనర్ మనిష్ మల్హోత్రా కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరాతో కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అమృత అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని అమృత అరోరానే అందంగా ఉందని కామెంట్ చేశారు. తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా శశాంక్ ఘోష్ ‘వీర్ ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్ లు కీలక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు -
గోల్డ్ అండ్ గ్లామరస్ మనీష్ మల్హోత్రా @ 50
మనీష్ మల్హోత్రా అనేవాడు ఇప్పటికిప్పుడు రిటైర్ అయితే బాలీవుడ్లో సగం మంది ఇళ్ల నుంచి బయటకు రారు. సగం మంది సినిమాలు ఒప్పుకోరు. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్న దాని కంటే అంద విహీనంగా కనిపించి, అసలు రంగు బయటపెట్టేసుకుంటారు. అవును. మనీష్ మల్హోత్రా రెండు విధాలుగా బాలీవుడ్‌ను ప్రభావితం చేస్తున్నాడు. ఒకటి: ఫ్యాషన్ డిజైనర్‌గా, రెండు: కాస్ట్యూమ్ డిజైనర్‌గా. హిందీ సినిమాలను ‘రంగీలా’కు ముందు ‘రంగీలా’కు తర్వాత అని విభజిస్తారు కాస్ట్యూమ్ రంగంలో. ఎందుకంటే ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళా మాతోండ్కర్ కాస్ట్యూమ్స్‌ను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ బాలీవుడ్‌ని చాలా ఆకర్షించాయి. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు మనీష్ కాస్ట్యూమ్స్‌తో కొత్త అందాలను సంతరించుకున్నారు. ‘దిల్ తో పాగల్ హై’లో మాధురీ దీక్షిత్, ‘కుఛ్ కుఛ్ హోతాహై’లో కాజోల్, ‘కహో నా ప్యార్ హై’లో అమీషా పటేల్ వీళ్లంతా హిట్స్ సాధించారు. అయితే కరణ్ జోహార్ భారీ కాస్ట్యూమ్ డ్రామా ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాతో మనీష్ పేరు మార్మోగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొన్నటి ‘బజ్రంగీ భాయ్‌జాన్’ వరకూ మనీష్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకే కాస్ట్యూమ్స్ సిద్ధం చేసే మనీష్ ‘మొహబ్బతే’ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు. ‘చిన్నప్పటి నుంచి నాకు రంగుల మంచి చెడ్డలు తెలుసు. మా అమ్మ ఏదైనా నప్పని చీర కట్టుకుంటే ‘అమ్మా... ఈ చీర కాకుండా వేరే చీర కట్టుకోవచ్చుగా’ అని ప్రాణం తీసేసేవాణ్ణి’ అంటాడు మనీష్. ‘చెట్టు, పుట్ట, ఆకులు, మనుషులు, ప్రకృతి - అన్నీ నన్ను బట్టల రూపకల్పనలో ప్రభావితం చేస్తాయి. ఎవరైనా కష్టపడాల్సిందే. నేనే ఇవాళ ఎంత కష్టపడి ఎంత మంచి డిజైన్‌ను తయారు చేశానా అనేదే చూస్తూ ఉంటాను’ అంటాడతను. ఫ్యాషన్ డిజైనర్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌కు పని తీరులో మార్పు ఏముంటుంది? అని అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్‌గా నా ఊహకు హద్దులు ఉండవు. ఆ స్త్రీ ఏ బట్టల్లో ఎంత అందంగా గొప్పగా ఉంటుందో ఆలోచిస్తాను. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌కు పరిధి ఉంటుంది. ఫలానా సినిమాలో ఫలానా పాత్రకు తగినట్టుగా ఆ హీరోయిన్ని అందంగా చూపించాలి. ‘చమేలీ’ సినిమాలో కరీనా కపూర్ వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రకు తగినట్టుగా, అంటే ఒక వేశ్యకు తగినట్టుగా ఆమె దుస్తులను సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఫలించి మంచి పేరు వచ్చింది’ అంటాడు మనీష్. ఈ తపన ఉండటం వల్లే మనీష్‌ను బాలీవుడ్లో అందరూ ఇష్టపడతారు. డిసెంబర్ 6న జరిగిన బర్త్‌డే పార్టీకి మహామహులు అందుకే తరలి వచ్చారు. షారుఖ్ ఖాన్, సయీఫ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ... ఇలా రానివాళ్లంటూ లేరు. ఆ రాత్రి ముంబాయి రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతూ మురిసిపోతూ ఉండిపోయింది. -
మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీ
-
మాల్దీవుల్లో మస్తీ.. మజా
‘‘ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. ఎవరి ఇష్టాలు వారివి. కొందరికి సినిమాలంటే ఇష్టం. మరికొందరు క్రీడలు ఇష్టపడతారు. ఇంకొందరు వివిధ దేశాలు చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వీలు దొరికినప్పుడు కుటుంబంతో కలసి గడుపుతుంటారు మరికొందరు. నాకు మాత్రం బీచ్ అంటే ఇష్టం.. బీచ్ కెళ్లి మత్స్య కన్యలా ఈతకొట్టడమంటే ఇంకా ఇంకా ఇష్టం’’ అంటున్నారు కత్రినా కైఫ్. ‘మల్లీశ్వరి’, ‘అల్లరిపిడుగు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అక్కడ స్టార్స్ సరసన క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఓ ఫొటోషూట్ కోసం మాల్దీవులు వెళ్లారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా మాల్దీవుల్లో ఉన్నారు. డిసెంబరు 5న మనీష్ యాభయ్యో పుట్టినరోజు. ముందుగానే మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మనీష్ ఒళ్లో కూర్చుని కత్రినా ఫొటోలు దిగడం వీళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఓ ఉదాహరణ. ఈ ఫొటోలు చూసినవాళ్లు ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ నడుస్తోందని కథలు అల్లేశారు. ఆ సంగతలా ఉంచితే.. సాగర తీరంలో బికినీలో కత్రినా చేసిన అందాల విందు అక్కడివారికి కనువిందు అట. బికినీలో తన ఫొటోలను ట్విట్టర్లో కూడా పెట్టి, ప్రపంచంలో అందరికీ ఐ-ఫీస్ట్ చేశారు కత్రినా. -
ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది?
కత్రినా కైఫ్ సినిమాలు హిట్ అయి చాలా కాలమైంది. ఆమె ఇంతకుముందు నటించిన మూడు సినిమాలు ఫాంటమ్, ఫితూర్, బార్ బార్ దేఖో.. మూడూ బాక్సాఫీసు వద్ద ఫట్టయ్యాయి. తర్వాత ప్రస్తుతం తన మాజీ బోయ్‌ఫ్రెండు రణబీర్ కపూర్‌తో కలిసి జగ్గా జాసూస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి లెక్కప్రకారం అయితే ఏప్రిల్ 7వ తేదీన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈలోపు ఖాళీగా ఉండం ఎందుకని రకరకాల ఫొటోషూట్లు చేస్తోంది క్యాట్. అందులో భాగంగా సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల బ్రైడల్ ఎడిషన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంటోంది. అక్కడ వీళ్లిద్దరూ కలిసి దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతున్నాయి. మరి కత్రినా ఫొటో షూట్ అంటే మామూలుగా ఉండదు కదా మరి.. నల్లటి బికినీ వేసుకుని, దానిపైన పసుపు రంగు కేప్ ధరించిన కత్రినా.. చక్కగా మనీష్ ఒళ్లో కూర్చుని మరీ ఓ ఫొటో తీయించుకుంది. ఆ ఫొటోను మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, దానికి 'పోజర్స్ ఇన్ మాల్దీవ్స్' అనే క్యాప్షన్ పెట్టాడు. అంతేకాదు.. కత్రినా, మిగిలిన టీం అంతా ఉంది కదా అని తన బర్త్‌డే కూడా అక్కడే చేసేసుకున్నాడు. ఇక కత్రినా కూడా మరో్ తెల్లటి దుస్తులతో కూడిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తెగ ట్రెండవుతున్నారు. -
మల్హోత్రా మెస్మరైజ్ డిజైన్స్
-
మనీష్ మాసం
పెళ్లి వేడుక... మనీష్ అంటారు. అట్టహాసమైన పార్టీ... మనీష్ అంటారు. ఏదో ఒక భారీ ఫ్యాషన్ షో... ఇంకెవరు మనీషే. మనీష్.. మనీష్.. మనీష్... ఎవరితను? మనీష్ మల్హోత్రా.... దేశంలో నం.1 ఫ్యాషన్ డిజైనర్. అందగత్తెల అందాన్ని తన దుస్తుల సోయగంతో పెంచే మేజిక్ టైలర్. కుఛ్ కుఛ్ హోతాహై... కహోనా ప్యార్ హై.. వంటి సినిమాలకు ఇతడే వలువల రూపశిల్పి. మాఘమాసం వచ్చింది. ఇక అందరూ పెళ్లి బట్టలకు క్యూ కడతారు. తన డిజైన్లతో మాఘమాసాన్ని మనీష్ మాసం చేసేస్తారు. శాంపిల్‌గా కొన్ని... అమ్మాయిల కలలకు అద్భుత రూపమిచ్చే సృజన మనీష్ సొంతం. ఈ ఏడాది బెస్ట్ బ్రైడల్ కలెక్షన్లో భాగంగా రూపొందించిన డ్రెస్ ఇది.నిన్నటి తరానికి పరిమితం అనదగ్గ చీరలను కూడా ఆధునికం గా మెరిపించడంలో మనీష్ తన ప్రత్యేకతను చాటుతుంటారు. కిందటి నెలలో జరిగిన పోలీస్ ఉమంగ్ షోలో మనీష్ డిజైన్ చేసిన శారీ విత్ బ్లౌజ్లో మెరిసిపోతున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, లాంగ్ స్లీవ్‌లెస్ గౌన్‌లో చెల్లెలు షమిత.రెండు రంగుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన డిజైనరీ శారీ ఇది, దానిపై స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరిస్తే వేడుకలో ఆధునికపు హంగులతో వెలిగిపోతుంది. బాలీవుడ్ ప్రముఖ తారలందరికీ అమితంగా నచ్చే ఫ్యాషన్ డిజైనర్ ఎవరంటే అంతే ప్రముఖంగా వినిపించే పేరు మనీష్ మల్హోత్రా. శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్యా బచ్చన్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ వంటి వారంతా ఆ జాబితాలో ఉన్నవారే. దిల్ తో పాగల్ హై, దిల్ సే, రాజా హిందూస్థానీ, కుఛ్ కుఛ్ హోతా హై.. కహోనా ప్యార్ హై.. ఇలా వందల బాలీవుడ్ సినిమాలకు డ్రెస్ డిజైనర్‌గా ఉన్నారు మల్హోత్రా. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌తో పాటు మరెన్నో అవార్డులను తన ఖాతాలో జమచేసుకున్నారు. వెడ్డింగ్ లెహంగాలు, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయడంలో మనీష్ తనదైన ప్రత్యేకతను చాటుతుంటారు. మనీష్ మల్హోత్రా -
ఓ పాట కోసం కరీనా సాహసం
ముంబయి: అసలే షూటింగ్.. ఎన్నో టేక్‌లు తీస్తేగానీ ఓ సీన్ అద్భుతంగా రాదు. ఇక పాట చిత్రీకరణ అయితే ఎన్నిసార్లు కట్.. యాక్షన్, కట్ యాక్షన్ అనాలో.. నిజంగానే అంత అద్భుతంగా రావడానికి ఓ దర్శకుడికి ఎంత ఓపిక ఉండాలో ఆ నటుడు, నటికి కూడా అంతే ఓపిక ఉండాలి. ఈ ఓపిక బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కాస్త ఎక్కువననే ఈ విషయం వింటే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె నటిస్తున్న చిత్రం 'కి అండ్ కా' లోని ఓ పాట కోసం ఏకంగా 32 కేజీల బరువైన వస్త్రాలను(లెహంగా) ధరించిందట. ఈ వస్త్రాలను ఆమెకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ఈ వస్త్రాలను ధరించి ప్రతికూల వాతావరణంలో రెండు రోజులు షూటింగ్లో పాల్గొంది. కరీనా కపూర్ ఏ చిత్రంలో నటించినా తప్పకుండా ఓసారి మాత్రం ఆ సినిమాలో లెహంగా ధరిస్తుంటుంది. ఇందుకోసం ఆమె స్వయంగా డిజైన్ చేయించుకుంటుంది. ఆ వస్త్రాల్లో మెరిసిపోయి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడం తనకు చాలా ఇష్టమని కూడా పలుమార్లు తెలిపింది. -
మోడ్రన్ టచ్... ట్రెడిషనల్ లుక్
బాలీవుడ్ ఫ్యాషన్ బాద్షా మనీష్ మల్హోత్రా సిటీలో మహిళలకు లేటెస్ట్ ట్రెండ్స్‌పై మెళకువలు నేర్పాడు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సోమాజిగూడ హోటల్ పార్క్ హయత్‌లో ‘ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ సిటీ ఆన్ చేంజింగ్ ఫాకేడ్ ఆఫ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా’ అంశంపై ప్రసంగించాడు. ‘ఎంతో మంది బాలీవుడ్ తారల డ్రెస్‌లు రూపొందించా. మైకేల్ జాక్సన్ భారత్ వచ్చినప్పుడు కూడా అతని డ్రెస్ డిజైన్ చేశా. ప్రతి ఒక్కరూ అందమైన వారే. మనల్ని మనం ఇంకాస్త అందంగా తీర్చిదిద్దుకోవడంలోనే ఆనందం ఉంటుంది. 25 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. దాదాపు 1,000 సినిమాలకు కాస్టూమ్స్ డిజైన్ చేశా. ఇకపై సినిమాలకు తగ్గించి, సామాన్యుల కోసం డిజైన్ చేస్తా. మోడ్రన్ టచ్‌తో ట్రెడిషనల్ లుక్ మిస్సవ్వకుండా డిజైన్ చేస్తే ఏ డ్రెస్ అయినా అద్భుతంగా ఉంటుంది. నగరంలోని ఆడవారు ఫ్యాషన్‌పై మక్కువ చూపుతున్నారు. ఇది శుభపరిణామం’ అంటూ ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నాడు మనీష్. - సిరి -
క్యాట్‌వాక్ కొంచెం కష్టమే
న్యూఢిల్లీ/ముంబై : రాజ్‌మహల్ జ్యూయెలర్స్ ఇండియా కోషర్ వీక్ లో శనివారం రాత్రి డిజైనర్ మనీశ్ మల్హోత్రా కోసం ఆలియా భట్ ర్యాంప్‌పై తళుక్ముంది. వధువుల కోసం డిజైన్ చేసిన ఎరుపురంగు గౌనులో జిగేల్మంది. అయితే క్యాట్‌వాక్ చేసేందుకు ఈ బ్యూటీ బాగా కష్టపడాల్సి వచ్చిందట. మనీశ్ రూపొందించిన గౌన్ ఏకంగా 25 కేజీల బరువు ఉంది. దీనిని వేసుకొని హైహీల్స్ చెప్పులతో ర్యాంప్‌పై నడిచేటప్పుడు చాలా చిరాకుగా అనిపించిందని ఈ కుర్ర హీరోయిన్ చెప్పిం ది. ‘ర్యాంప్‌పై నడవడం నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే నాకు ఊరికే చిరాకు వస్తుంటుంది. 25 కేజీల బరువున్న గౌనుకుతోడు హైహీల్స్ చెప్పులు వేసుకొని నవ్వు తూ నడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్లు చప్పట్లు కొడుతుంటారు. ఈ సమయంలో కాస్త చిరాకేసినా, అద్భుతంగా అనిపిస్తుంది’ అని వివరించింది. ఆలియా క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఆదిత్యరాయ్ కపూర్ వెంట నడవగా, ఊర్మిళా మతోంద్కర్, హ్యుమాఖురేషీ ప్రేక్షకుల వరుసలో కూర్చున్నారు. బాలీవుడ్ ఎందరో ప్రముఖ హీరోయిన్లకు దుస్తులు డిజైన్ చేసే మనీశ్ కోసం క్యాట్‌వాక్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ బ్యూటీ చెప్పింది. ఒకప్పుడు మనీశ్ డిజైన్లను చూసేం దుకు ఫ్యాషన్ షోలకు వెళ్లిన రోజులను కూడా ఈమె ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకుంది. -
కొంచెం కష్టమే..!
రాజ్‌మహల్ జ్యూయెలర్స్ ఇండియా కోషర్ వీక్‌లో శనివారం రాత్రి డిజైనర్ మనీశ్ మల్హోత్రా కోసం ఆలియా భట్ ర్యాంప్‌పై తళుక్ముంది. వధువు కోసం డిజైన్ చేసిన ఎరుపురంగు గౌనులో జిగేల్మంది. అయితే క్యాట్‌వాక్ చేసేందుకు బాగా కష్టపడాల్సి వచ్చిందట. మనీశ్ రూపొందించిన గౌన్ ఏకంగా 25 కేజీల బరువు ఉంది. దీనిని వేసుకొని హైహీల్స్ చెప్పులతో ర్యాంప్‌పై నడిచేటప్పుడు చాలా చిరాకుగా అనిపించిందని ఈ కుర్ర హీరోయిన్ చెప్పింది. ‘ర్యాంప్‌పై నడవడం నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే నాకు ఊరికే చిరాకు వస్తుంటుంది. 25 కేజీల బరువున్న గౌనుకుతోడు హైహీల్స్ చెప్పులు వేసుకొని నవ్వుతూ నడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్లు చప్పట్లు కొడుతుంటారు. ఈ సమయంలో కాస్త చిరాకేసినా, అద్భుతంగా అనిపిస్తుంది’ అని వివరించింది. ఆలియా క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఆదిత్యరాయ్ కపూర్ వెంట నడవగా, ఊర్మిళా మతోంద్కర్, హ్యుమాఖురేషీ ప్రేక్షకుల వరుసలో కూర్చున్నారు. బాలీవుడ్ ఎందరో ప్రముఖ హీరోయిన్లకు దుస్తులు డిజైన్ చేసే మనీశ్ కోసం క్యాట్‌వాక్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ బ్యూటీ చెప్పింది. ఒకప్పుడు మనీశ్ డిజైన్లను చూసేందుకు ఫ్యాషన్ షోలకు వెళ్లిన రోజులను కూడా ఈమె ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకుంది. -
మూవీ బుజ్
పాప్‌సింగర్ బీబర్‌పై ఫిర్యాదు పాప్ స్టార్ 20 ఏళ్ల జస్టిన్ బీబర్‌పై పొరిగింటి వాళ్లు లాస్ఏంజెలిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకనుకుంటున్నారు? ఈయన గారి వల్ల చెవులు బద్దలయ్యే శబ్ద కాలుష్యంతో పాటు, ఇంటి చుట్టుపక్కలంతా గంజారుు వాసన ఘువూరుుస్తుండటంతో భరించలేకపోతున్నామని పక్కింటి వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఇండస్ట్రీని ఊపేస్తుందట బాలీవుడ్ నటి అదితి రావ్ బడాయిలకు పోతోంది. గేమ్స్ ప్లే చే సి చాన్సులు కొట్టేయడం తనకు తెలియదని వగలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో తనకెలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పుకొచ్చింది. అలాగని తన జర్నీలో కష్టాలు లేవనుకుంటే పొరపాటేనని తెలిపింది. తనకొచ్చిన నటనతోనే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తానని గొప్పలు చెబుతోంది. మనీష్‌కు లక్కీ చాన్స్ బాలీవుడ్ హాట్ అండ్ వెటరన్ బ్యూటీ రేఖ కొత్త లుక్కులో అదిరిపోనుంది. రేఖ అప్‌కమింగ్ మూవీ ‘ఫితుర్’లో ఈ భామ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే చాన్స్ మనీష్ మల్హోత్రా కొట్టేశాడు. తానెంతగానో ఆరాధించే నటికి చీరలు డిజైన్ చేసే చాన్స్ రావడం సంతోషంగా ఉందంటున్నాడు మల్హోత్రా. -
మనీష్ మల్హోత్రా ర్యాంప్ షోలో షారుక్, దీపికా