చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ | PV Sindhu Wear Traditional Saree Designed By Manish Malhotra | Sakshi
Sakshi News home page

PV Sindhu: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’

Published Tue, Aug 24 2021 3:38 PM | Last Updated on Tue, Aug 24 2021 4:49 PM

PV Sindhu Wear Traditional Saree Designed By Manish Malhotra - Sakshi

PV Sindhu In Saree: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మన తెలుగమ్మాయి పీవీ సింధు పూల రంగు చీర కట్టుకుని కుందనపు బొమ్మలా మెరిసింది. చీరకట్టులతో తెలుగమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చిరునవ్వు చిందిస్తూ చీరలో మెరిసిపోతున్న సింధును చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు. ఆ ఫొటోలకు ఏడు లక్షల మందికిపైగా లైక్స్‌ కొట్టారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా రూపొందించిన చీరలో సింధు కనిపించింది. ఎప్పుడూ క్రీడా దుస్తుల్లో కనిపించే సింధు ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో దేవకన్యలా ప్రత్యక్షమైంది. తెలుపు చీరలో గులాబీ, నీలం, పర్పుల్‌ పూలు త్రెడ్‌వర్క్‌ చేసి ఉంది. ఈ చీర విలువ దాదాపు కొన్ని వేలల్లో ఉంటుందని ఫ్యాషన్‌ప్రియులు చెబుతున్నారు.
చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్‌..

సింధుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా పీవీ సింధు ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించి సింధు సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సింధు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సింధు ఐస్‌క్రీమ్‌ తిన్న విషయం తెలిసిందే.

చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement