బాడ్మింటర్ స్టార్ పీసీ సింధు తన కలల రాకుమారుడితో ఏడడుగులు వేసింది. ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో దత్త సాయితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్బంగా పీవీ సింధు వెడ్డింగ్ ఔట్ ఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంతేకాదు, మొత్తం పెళ్లి వేడుకల్లో ప్రఖ్యాత డిజైనర్లకు సంబంధించిన అందమైన దుస్తులను ఎంపిక చేసుకోవడం విశేషం. సబ్యసాచి ముఖర్జీ నుంచిమనీష్ మల్హోత్రా వరకు, తన ప్రతీ బ్రైడల్ లుక్‌లోనూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది .డిజైనర్ మనీష్ మల్హోత్రా పీవీ సిందు ఐవరీ-టోన్డ్ బ్రైడల్ చీర వివరాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.
పెళ్లి ముహూర్తానికి
బంగారు, వెండి జరీతో చేతితో నేసిన చీరను ముహూర్తానికి కట్టుకుంది. ఈ చారలో బద్లా జర్దోజీ ఎంబ్రాయిడరీ దీనికి స్పెషల్ ఎట్రాక్షన్. ఆమెధరించిన మేలి ముసుగులో పీవీ సింధు, వెంకటదత్తసాయి పేర్లు రాసి ఉండడం మరో ఎట్రాక్షన్.
సింధుతో తన వివాహానికి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ కలర్ బ్రోకేడ్ షేర్వానీలో అందంగా కనిపించాడు వెంకట దత్త సాయి. దీనికి సింధుతో కలిసి మ్యాచింగ్ అన్‌కట్ డైమండ్ ఆభరణాలను ఎంచుకున్నాడు. బంగారు, వెండితో తయారుచేసిన స్టోల్,షాఫా జతచేసి తన వెడ్డింగ్ లుక్‌కి సరైన న్యాయం చేశాడు.
వరమాల వేడుకకు సబ్యసాచి ముఖర్జీ
వరమాల వేడుక కోసం సింధు , వెంకట దత్త సాయి ఇద్దరూ సబ్యసాచి ముఖర్జీ దుస్తులను ఎంచుకున్నారు. గోల్డెన్ అండ్ రోజ్ కలర్ ఎంబ్రాయిడరీ రెడ్ లెహంగా ,ఫుల్ స్లీవ్ చోలీతో, షీర్ దుపట్టా ధరించింది. వరుడు వెంకట సాయి గోల్డెన్ వర్క్, లేత గోధుమరంగు రంగు షేర్వానీలో అందంగా కనిపించాడు. ఈ ఔట్‌ఫిట్‌కి పగిడి(తలపాగా), ముత్యాల హారం మరింత లుక్ తెచ్చిపెట్టాయి.
రిసెప్షన్ లుక్
ఈ జంట ఫల్గుణి షేన్ పీకాక్ స్టైలిష్ ఔట్‌ఫిట్ లెహెంగాలో పెళ్లి కళ ఉట్టి పడుతూ కనిపించింది సింధు. స్వరోవ్స్కీ, సీక్విన్ క్రిస్టల్ వర్క్‌ను కలిగి ఉన్న ఐవరీ టల్లే లెహెంగా ఆమె రూపానికి మరింత గ్లామర్ అందించింది. డైమండ్-లేయర్డ్ నెక్లెస్, పచ్చల పెండెంట్, మ్యాచింగ్ చెవిపోగులతో పాటు, ఎంగేజ్‌మెంట్ డైమండ్ రింగ్‌ను కూడా ధరించింది.
మరోవైపు, వెంకట దత్త సాయి టోనల్ సిల్క్ ఎంబ్రాయిడరీ , సీక్విన్ డిటైలింగ్‌తో సొగసైన భారీ ఎంబ్రాయిడరీ బ్లేజర్, బ్లాక్ వెల్వెట్ బంద్ గాలా ధరించారు.
సంగీత్, హల్దీకి
ఇక సంగీత్, హల్దీ వేడుకల్లో అబు జానీ సందీప్ కోశ్లా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు సింధు, సాయి దంపతులు.
Comments
Please login to add a commentAdd a comment