Sabyasachi
-
ఫ్యాషన్ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు
లక్నోకు చెందిన నిరుపేద యువతులు అద్భుతాలు సృష్టించారు. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ల ప్రేరణతో అందమైన బ్రైడల్ డిజైనర్ దుస్తులను తయారు చేశారు. అదీ తమకు దానంగా వచ్చిన బట్టల నుంచి. అలా మనసు ఉండాలేగానీ, ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ అమ్మాయిలు నిరూపించారు. వీరు సృష్టించిన డిజైన్లు, మోడలింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ స్ఫూర్తితో లక్నోలోని నిరుపేద పిల్లల బృందం తమ సృజనాత్మకతను గ్లామరస్ బ్రైడల్ వేర్‌గా అబ్బురపోయే డిజైన్లు, ఆకర్షణీయ మైన దుస్తులతో ఇంటర్నెట్లో సంచలనంగా మారారు. లక్నోకు చెందిన ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నిరుపేద పిల్లలు. వీరి ప్రతిభకు నెటిజన్లు ఔరా అంటున్నారు. సబ్యసాచి ముఖర్జీ ప్రేరణతోనే వీరు ఈ డిజైన్లను తీర్చిదిద్దారు. వివిధ సంస్థలు, వ్యక్తులనుంచి తమకు విరాళంగా ఇచ్చిన బట్టలు , మిగిలిపోయిన బట్టలు ఉపయోగించి డిజైనర్ ఐకానిక్ డిజైన్లకు పునఃసృష్టి చేశారు. అంతేకాదు వారు రూపొందించిన దుస్తులతో మోడలింగ్ చేయడం మరింత విశేషంగా నిలిచింది. అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, ప్రతిభతో వారంతా స్వయంగా సబ్యసాచిని ప్రశంసలను కూడా దక్కించుకున్నారు. తన ఇన్‌స్టాలో కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు.Forget spending lakhs on bridal wear. These 15+ year old amateur designers from Lucknow who come from under privileged backgrounds & live in a very modest neighbourhood, just turned donated clothes into fashion masterpieces inspired by Sabyasachi Creations.Their inventive and… pic.twitter.com/RlEszP4eA1— Lucknow Development Index (@lucknow_updates) November 8, 2024 దీనికి సంబంధించిన వీడియోను ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “మేము లక్నోకు చెందిన NGO, 400+ మురికివాడల పిల్లలతో పని చేస్తున్నాము. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం ఈ డ్రెస్‌లను మా విద్యార్థులే డిజైన్ చేశారు. ఇందులో ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల ప్రాంతాలకు చెందిన వారే. ఈ పిల్లలు చాలా పేద మరియు నిస్సహాయ కుటుంబాల నుండి వచ్చారు. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించారు. వీరంతా స్థానికులు ,చుట్టుపక్కల వారినుంచి వచ్చిన దుస్తులతో వీటిని తీర్చిదిద్దారు. వీడియోలో కనిపిస్తున్న ఈ బాలికలు బస్తీలో నివసిస్తున్న 12 నుండి 17 ఏళ్ల వయస్సున్నబాలికలు’’ అని వివరించింది. ఈ వీడియోను 15 ఏళ్ల ఔత్సాహిక వీడియో గ్రాఫర్స్వ చిత్రీకరించారని కూడా వెల్లడించింది. View this post on Instagram A post shared by Sabyasachi (@sabyasachiofficial) కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో, సబ్యసాచి ఇటీవల తన 'హెరిటేజ్ బ్రైడల్' కలెక్షన్స్ మోడల్స్ వీడియోను పోస్ట్ చేశాడు: "ఎరుపు రంగు సీజనల్ కాదు.., ఐకానిక్." అని పోస్ట్ చేశారు. ఈ థీమ్‌తోనే అదే రంగులో లక్నో గాళ్స్ అదే డిజైన్స్‌ను పునఃసృష్టించారు. -
బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్!
ఒకప్పుడు కటిక దారిద్యంతో చాలా తిప్పలు పడ్డాడు. కాలేజీ పీజులు చెల్లించడానికి పుస్తకాలు అమ్మాడు. నేడు ప్రపంచమే ఆశ్చర్యపోయే రేంజ్లో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్ డిజైనర్‌గా ఎదిగాడు. అతడి బ్రాండే భారదేశంలోని అతిపెద్ద లగ్జరీ బ్రాండ్‌గా కితాబులందుకుంది. అంతేగాదు బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతడెవరంటే..ఫ్యాషన్ ప్రపంచానికి అలానాటి సంప్రదాయ దుస్తులతో కొంత హంగులు తీసుకొచ్చి ప్రపంచమే కళ్లప్పగించి భారత్ ఫ్యాషన్ వైపు చూసేలా చేశాడు. అతడే సబ్యసాచి ముఖర్జీ. అద్భుతమైన హస్తకళకు, అచంచలమైన నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఈ కాస్ట్యూమ్ డిజైనర్. సబ్యసాచి బ్రాండ్ ఓ డిజైన్ మాస్ట్రో పీస్‌గా ఫ్యాషన్ పరిశ్రమలో నీరాజనాలు అందుకుంటోంది. అయితే అతడి జీవితమేమి గోల్డెన్ స్పూన్ బేబీలా సాగలేదు.సబ్యసాచి ఫిబ్రవరి 23, 1974లో పశ్చిమబెంగాల్లోని మానిక్తలాలో జన్మించాడు. భారతీయ బ్రాండ్ 'సబ్యసాచి' వ్యవస్థాపకుడు. అంతేగాదు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో బోర్డు సభ్యుడైన అతిపిన్న వయస్కుడు. అయితే అతడి బాల్యంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. ఆయన తన ప్రాథమిక విద్యను అరబిందో విద్యామందిర్లోనూ, మాధ్యమిక విద్యను కోల్‌కతా సెయింట్ జేవియర్ కళాశాలలోనూ పూర్తి చేశాడు. అతడి ఎన్నుకున్న ఫ్యాషన్ కెరీర్‌ని కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించారు. ఓ పక్క ఇంట్లో కటిక దారిద్యం మరోవైపు ఊహకందని ప్యాషన్ ప్రపంచం..అయినా సరే తన లక్ష్యాన్ని, కోరికను వదిలిపెట్టలేదు. కాలేజీ ఫీజల కోసం పుస్తకాలు అమ్ముతూ నానాపాట్లు పడి చదువు పూర్తి చేశాడు. తాను ఫ్యాషన్ రంగంలో నిలదొక్కుకునేంత వరకు రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సని ఏదోలా పూర్తి చేసి, వెంటనే తన సొంత లేబుల్‌ని ప్రారంభించాడు. అందులో తన డిజైన్ చేసిన దుస్తులను విక్రయించే యత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో చాలా ఇబ్బందులు పడేవాడు. చివరికీ తన డిజైన్లు ఎవరైన కొంటారా? అనే అనుమానం ఎదురయ్యేంతకు చేరిపోయాడు. అలాంటి సమయంలో సరిగ్గా 2001లో లాక్మే ఫ్యాషన్ వీక్ అతడి పాలిట వరంలా వచ్చింది. అందులో తన కలెక్షన్స్‌ని ప్రదర్శించి చూశాడు. అది మొదలు ఇక వెను తిరిగి చూసే అవకాశం లేకుండా అచంచలంగా ఎదుగుతూ..ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బ్రాండ్ విశిష్టత..సబ్యసాచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్త్రాలు, సాంస్కృతిక సంప్రదాయాలు వంటి మూలాలను ఆధారం చేసుకుని డిజైనర్ వేర్లను రూపొందించడం ఈ బ్రాండ్ విశిష్టత. అతని డిజైన్లు నిగూఢమైన అర్థాన్ని, కాలనుగుణ ఫ్యాషన్‌కి సరిపోయేలా వివరణను ఇచ్చేలా ఉండేవి. అతడి క్రియేటివిటీకి "ఫెమినా బ్రిటిష్ కౌన్సిల్"కి "ది మోస్ట్ ఔట్‌స్టాండింగ్ అండ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డు వంటి ఎన్నో అవార్డులు ప్రశంసలు వచ్చాయి. పైగా అంతర్జాతీయ ఖ్యాతీని తెచ్చిపెట్టాయి. అంతేగాదు బాలీవుడ్ దిగ్గజ తార వివాహ డ్రెస్‌లను రూపొందించే డిజైనర్‌గా పేరుతెచ్చుకున్నారు. అతడి డిజైన్లు రెడ్ కార్పెట్పైనే గాక మ్యాగజైన్ కవర్లపై కూడా మెరిశాయి. ఇక సబ్యసాచి బ్రాండ్ నికర విలువ దాదాపు రూ. 114 కోట్లు ఉంటుందని అంచనా. ఇది భారతదేశపు అత్యంత అద్భుతమైన లగ్జరీ డిజైనర్ బ్రాండ్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ బ్రాండ్ కాలిఫోర్నియా, అట్లాంటా, లండన్,దుబాయ్ వంటి దేశాల్లో కూడా స్టోర్లను కలిగి ఉంది.(చదవండి: జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!) -
మిసెస్& మిస్టర్ అదు-సిద్ధు: డిజైనర్ దుస్తుల్లో సింపుల్‌గా ఎంత సక్కగున్నారో!
చిరకాల ప్రేమికులు అదితి రావ్ హైదరి, సిద్దార్థ్ సూర్యనారాయణ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మిసెస్ అండ్ మిస్టర్ అదు-సిద్ధు ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. నూతన దంపతులుగా, పెళ్లి దుస్తుల్లో బట్టల్లో చాలా అందంగా కనిపించారు. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తుల్లో స్పెషల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త పెళ్లికూతురి గెటప్‌లో అదితి రావ్ హైదరీ లేత గోధుమరంగు , గోల్డెన్ లెహంగాలో మెరిసిపోయింది. ఈ లెహంగా ఆమెకు రాయల్ లుక్ తెచ్చి పెట్టింది. లెహంగాకు బంగారు రంగు చారల బ్లౌజ్‌ను, అందమైన చున్నీని జత చేసింది. భారీ అలంకారాలు లేకుండా సింపుల్‌గా అదితి పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఒక చౌకర్, చెవిపోగులు, గాజులులతోపాటు భారీ మెహందీ హడావుడి లేకుండా, కాళ్లకు చేతులతో అర్థ చంద్రాకారంలో పారాణితో మెరిసింది. అటు సిద్ధార్థకూడా సింపుల్ స్టయిల్‌నే ఎంచుకున్నాడు. వైట్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తాలో,కొల్హాపురి చెప్పులతో దక్షిణాది పెళ్లికొడుకులా ఆకట్టుకున్నాడు. -
మెట్ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్! ఏకంగా 163 మంది..
మెట్ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో రెండోసారి బాలీవుడ్ భామ అలియా భట్ రెడ్‌కార్పెట్‌పై మెరిసింది. భారతీయ సంస్కృతిని చాటేలా ప్రత్యేకమైన సబ్యసాచీ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా కెమెరాల అటెన్షన్ ఆమె ధరించిన చీరవైపే దృష్టిసారించాయి. ఈ చీరను గ్లాస్ బీడింగ్, రత్నాలతో చేతి ఎంబ్రాయిడరీతో డిజైన చేశారు. పుదీనా ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ చీరలో అలియా అందర్నీ మిస్మరైజ్ చేసింది. ముఖ్యంగా పొడవాటి కొంగు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ఎవరు డిజైన్ చేశారంటే..అలియా భట్ కట్టుకున్న ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. ఈ ఏడాది మెట్ గాలా 2024 "గార్డెన్ ఆఫ్ టైమ్" అనే థీమ్‌కు సరిపోయేలా భారతీయ సంస్కృతిని చాటేలా అలియా చీరను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. పైగా చీర కంటే గొప్ప డిజైనర్‌వేర్ లేదని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. అంతేగాదు ఈ శారీకి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా ఉండటమే గాక, మొత్తం షోలో ప్రత్యేకంగా నిలిచింది.alia bhatt wearing a custom sabyasachi saree for the met gala 2024 — it is detailed with florals delicately hand embroidered! 💕 pic.twitter.com/zhvM2RdgKV— ☁️ (@softiealiaa) May 7, 2024ఈ చీరను ఏకంగా 163 మంది..అలియా భట్ కట్టుకున్న చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్‌ను కవర్ చేసిందంటే..ఈ చీర ఎంత పెద్దగా ఉందో చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో మిగిలిన వాళ్లంతా మోడర్న్ డ్రెస్‌లలో కనిపిస్తే.. అలియా మాత్రం ఇలా చీరలో కళ్లు చెదిరే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. అభిమానులు సైతం అద్భుతంగా ఉన్నావంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ చీర వెనుక ఏకంగా163 మంది చేతి కళాకారుల శ్రమ ఉంది. వాళ్లంతా దాదాపు గంటలు శ్రమించి ఆ చీరను ఇంత అందంగా ఆ వేడకలోని థీమ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. దీన్ని ఇటలీలో తయారు చేశారట. ఈ మెగా మెట్ గాలా ఈవెంట్లో ఆరుగజాల అందమైన చీరతో అక్కడున్నవారందరీ మనుసులను గెలుచుకుంది అలియా. you are KIDDING me ALIA BHATT!!!!! pic.twitter.com/UNGe9Wu4Gd— kp (@earthlykisssed) May 7, 2024(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి! -
వరల్డ్‌కప్ కోసం వచ్చి.. బాబర్ ఆజం పెళ్లి షాపింగ్! రూ.7 లక్షలు పెట్టిమరీ
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ ఏడాది చివరలో బాబర్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ కోసం భారత్‌లో ఉన్న బాబర్.. తన పెళ్లి కోసం తెగ షాపింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు తన పెళ్లి కోసం ఓ ఖరీదైన షేర్వాణీ కొన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన షేర్వాణీని బాబర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అతడు ఈ షేర్వాణీ కోసం ఏకంగా రూ.7 లక్షలు వెచ్చించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బాబర్ తన కోసం విలువైన జువెలరీని కూడా కొనుగోలు చేసినట్లు వినికిడి. అయితే వరల్డ్ కప్ సెమీస్ రేసు రసవత్తరంగా ఉన్న సమయంలో బాబర్ పెళ్లి షాపింగ్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ మీద కాదు ఆటమీద దృష్టి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే డూ ఆర్ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన పాకిస్తాన్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పాకిస్తాన్ ప్రస్తుతం 6 పాయింట్లతో పాయింట్ల పట్టిలో ఆరో స్ధానంలో ఉంది. సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ బాబర్ సేన విజయం సాధించాలి. ఈ క్రమంలో నవంబర్4న బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ అమీతుమీ తెల్చుకోనుంది. ఆ తర్వాత నవంబర్ 11న కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికాతో రసవత్తరపోరు.. కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్ -
ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023: అదరగొట్టిన నటి, బ్లాక్ చీర ధరపై చర్చ
IFFM Awards 2023 Rani Mukerji మెల్బోర్న్లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది. మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది ఈ ఈవెంట్లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్‌తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్‌తో మరింత స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్.. రణ్వీర్ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే..
దీపికా పదుకోణ్ పరిచయం అక్కర్లేని పేరు. ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ (ఫై)లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు. ఆ అందానికి చక్కటి అవుట్ ఫిట్స్‌ని డిజైన్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇది కూడా.. సబ్యసాచి... పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్‌కున్నంత పేరు.. డిమాండ్ సబ్యసాచి సొంతం. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సబ్యసాచి.. తన కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగారు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యారు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: సబ్యసాచి.. ధర: రూ. 1,95,000 బెల్టు ధర: రూ. 29,900 కమ్మలు ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నా బ్యాగులో సూది, దారం తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడైనా వేసుకున్న డ్రెస్ కంఫర్ట్‌గా లేకపోతే ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్ చేసేసుకుంటా. రణ్వీర్ డ్రెసెస్కూ ఆల్టరేషన్ చేస్తా.. – దీపిక పదుకోణ్. -దీపిక కొండి -
నటి ఆండ్రిలా శర్మ మరణం.. ప్రియుడు తీవ్ర భావోద్వేగం..!
24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా చివరికి మరణాన్ని జయించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడు ఆమె తోడుగా నిలిచిన బాయ్ ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి.. ఆండ్రిలా శర్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సబ్యసాచి చౌదరి. ఆండ్రిలా పార్థివదేహం వద్ద కాళ్లు పట్టుకుని మరీ ఏడ్చారు. ఆమె పాదాలను ముద్దాడి ప్రియురాలి చివరి వీడ్కోలు పలికారు. అంతే కాకుండా సబ్యాసాచి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశాడు. ఆండ్రిలా ఆస్పత్రిలో ఉండగా ఆమె ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులకు కోరిన సబ్యసాచికి అదే తన చివరిపోస్ట్గా నిలిచింది. -
Sabyasachi: ఏడుపుగొట్టు మొహాల్లా ఉన్నారు..వీళ్లు మోడల్సా?
Sabyasachi Trolled For Picking Unhappy Models In Jewellery Ad: ఫ్యాషన్ రంగంలో సబ్యసాబి డిజైన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లు సహా మరే ఇతర వేడుకలో అయినా సభ్యసాచి డిజైన్స్ ఉండాల్సిందే అనేంతగా ఈ డిజైన్స్ ప్రాచుర్యం పొందాయి. అయితే ఇటీవలి కాలంలో సబ్యసాచి కలెక్షన్స్ నెటిజన్ల ట్రోలింగ్కి గురవుతున్నాయి. మొన్నటికి మెన్న మంగళసూత్ర యాడ్‌లో సెమీ న్యూడ్‌గా తీయించిన ఫోటోషూట్ తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సబ్యసాచి డిజైన్స్ హెడ్ సబ్యసాచి ముఖర్జీ చేయించిన యాడ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా సబ్యసాచి డిజైన్స్ వింటర్ కలెక్షన్-2021 పేరిట కొత్త కలెక్షన్స్ రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా మోడల్స్..సభ్యసాచి డిజైన్స్ ధరించి ఫోటోషూట్ చేశారు. జ్యువెలరీ చూడటానికి చాలా బాగున్నాయి కానీ వాటిని ధరించిన మోడల్స్ మొహంలో ఏమాత్రం చిరునువ్వు లేదు. దీంతో ..ఎవరో చచ్చిపోయినట్లు ఆ మొహాలు ఏంటి? చావుకు వెళ్తున్నట్లు అలా ఉన్నారేంటి? అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. 'మోడల్స్ ముఖంలో చావు కళ స్పష్టంగా కనిపిస్తుందని, అసలు వీళ్లు మోడల్సేనా' అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మోడల్స్ అంటే ఎక్స్ప్రెషన్ కనిపించకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఏడుపుగొట్టు ముఖాలు ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. Sabyasachi Jewellery for dying, depressed ladies. https://t.co/omWN1geXvp — Sudeep 🇮🇳 (@Sudeep1211) November 27, 2021 Why waste money on something that makes you look like you are going to attend a funeral?! 🙇♀️#Sabyasachi pic.twitter.com/U70Lagd0Ba — Nidhi Sharma 🇮🇳 (@Little_tempest) November 28, 2021 -
బాలికలకు ప్రత్యేకం.. డిజైనర్ యూనిఫామ్
ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీకి ఇండియన్ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ డిజైనర్ స్కూల్లో చదువుకునే బాలికలకు యూనిఫామ్ రూపకల్పన చేసి మరింత ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడా చిత్రాలు సోషల్ మీడియా వేదిక మీద అందరి ప్రశంసలు పొందుతున్నాయి. రాజస్థాన్ సిటీ జైసల్మేర్‌లో రాజ్‌కుమారి రత్నావతి బాలికల పాఠశాల ఉంది. ఇందులో 400 మంది బాలికలు చదువుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం మూసిఉన్న ఈ పాఠశాల డిసెంబర్లో తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి బాలికల కోసం సబ్యసాచి ముఖర్జీ కళాత్మకమైన యూనిఫామ్‌లను రూపొందించారు. సబ్యసాచి దేశీయ చేనేతలను తన డిజైన్ల రూపకల్పనలో ఉపయోగిస్తాడని తెలిసిందే. అలాగే ఈ యూనిఫామ్‌లలో మేలిమి చేనేతలను ఉపయోగిస్తూ వాటిపైన సేంద్రీయ రంగులు, బ్లాక్ ప్రింట్‌తో కూడిన అజ్రఖ్ ఆర్ట్‌తో డిజైన్ చేశారు. ఈ కళాత్మకమైన యూనిఫామ్‌లు ధరించిన అమ్మాయిల ఛాయాచిత్రాలను సబ్యసాచి ముఖర్జీ తన ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. యూనిఫామ్ మీద స్థానిక కళ మోకాలి పొడవున ఏకరీతిగా ఉండే ఫ్రాక్. గుండ్రటి మెడ, త్రీ క్వార్టర్ స్లీవ్స్, మెరూన్ స్లగ్స్తో ఉన్న ఈ యూనిఫామ్‌కి ప్యాచ్ చేసిన రెండు పాకెట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రాక్స్పైన అజ్రఖ్ ప్రింట్ ఉంటుంది. అజ్రఖ్ అనేది రాజస్థాన్, గుజరాత్ల వారసత్వ కళ. ఇది హరప్పా కాలం నాటిదిగా చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఈ ప్రింట్‌ను ఖనిజ, కూరగాయల రంగుతో తయారు చేస్తారు. అజ్రఖ్ ప్రింట్ ఉన్న దుపట్టాలను ఆడ–మగ తేడా లేకుండా ధరిస్తుంటారు. ‘అజ్రఖ్ భారతీయుల శక్తివంతమైన శైలి. మన దేశంలో పిల్లలు కూడా ధరించడానికి అనువుగా దుస్తుల శైలి ఉండాలి. అజ్రఖ్ స్థానిక వారసత్వం. ఇక్కడి కళ ప్రాముఖ్యత ఈ విధంగా పిల్లలకు అర్ధమవుతుంది. స్థానిక కళకు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే అజ్రఖ్ ఆర్ట్‌ను యూనిఫామ్‌కు వాడుకున్నాను’ అని తెలిపారు సబ్యసాచి. అంతేకాదు ఈ యూనిఫామ్‌కు ‘అజ్రఖ్’ అనే పేరు పెట్టారు. ‘బాతిక్, ఇకత్తో పాటు అంతర్జాతీయంగా గౌరవనీయమైన వస్త్రాల పంధాలోకి అజ్రఖ్ ప్రవేశిస్తుంది. ఇండిగో, మాడర్ రూట్ రంగులతో ముద్రించడంతో కాటన్ క్లాత్ చాలా ఆకర్షణీయంగా మారింది’ అని అజ్రఖ్ కళ గురించి మరింతగా వివరించారు సబ్యసాచి. ఇటీవల సిట్టా అనే లాభాపేక్షలేని సంస్థతో కలిసి పనిచేశారు సబ్యసాచి. కళా నైపుణ్యాలపై శిక్షణ సిట్టా భారతదేశంలోని పేదల విద్య, ఆరోగ్యం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. బాలికల విద్య, స్థానిక మహిళలకు సంప్రదాయ కళా నైపుణ్యాలపై అధికారికంగా శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. వీరి సహకారంతో ఈ డిజైనర్ 400 మంది బాలికలకు యూనిఫామ్ రూపకల్పన చేసి ఇచ్చాడు. సంప్రదాయ హస్తకళలను తీసుకొని వాటిని సమకాలీన డ్రెస్సింగ్‌కు తగినట్లుగా యూనిఫామ్‌లను రూపకల్పన చేశారు డిజైనర్ సబ్యసాచి. స్థానిక సహకార కేంద్రం ఉత్పత్తి చేసే అజ్రఖ్ ప్రింట్‌ను ఉపయోగించి పాఠశాల బాలికల కోసం యూనిఫామ్‌లను రూపొందించారు. దీని వల్ల స్థానిక సహకార కేంద్రంలో పనిచేస్తున్నవారికి ఉపాధి పెరిగింది. -
చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు..
జూబ్లీహిల్స్: భారతీయ మహిళల చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు. వారి ఆత్మగౌరవం పెంచడంలో, చక్కటి స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు ఒక విలక్షణ ఉనికిని చాటుతాయని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అన్నారు. ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం “ద ఫ్యూచర్ ఆఫ్ లగ్జరీ అండ్ ద మేకిన్ ఇండియా’ పేరుతో నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన డిజైన్ ఎంతో సరళంగా ఉంటుందన్నారు. దుస్తులు మనిషి మేధకు పొడిగింపులాంటిదన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ మాజీ జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి, ఎఫ్ఎల్ఓ చాప్టర్ అధ్యక్షురాలు సుధారాణి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఓగ్ ఇండియా మేగజైన్ ఎడిటర్ ప్రియాతన్నా సంధానకర్తగా వ్యవహరించారు. ప్రముఖ డిజైనర్ సవ్యసాచితో వెబ్‌నార్ దృశ్యం.. -
మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా?
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిగా అలంకరించుకునే మహిళలు అంతరంగంలో ఎంతో వేదన అనుభవిస్తుంటారని ఓ పోస్ట్ చేశారు. దీని పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి 19వ శతాబ్దం నాటి పనికిమాలిన సూక్తులు చెప్పకండి.. అప్పటి వారికి మహిళలను అర్థం చేసుకునేంత బుర్ర లేదు.. ఇది 21వ శతాబ్దం. మీ కస్టమర్లలో ఎక్కువగా ఉంది మహిళలే ఆ విషయం గుర్తు పెట్టుకొండి అంటూ మండి పడుతున్నారు. ఇంతకు ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే.. ఏ మహిళైనా అతిగా అలంకరించుకుని ఉందంటే.. ఆమె గాయపడినట్లు. లోలోన ఆమె మౌనంగా చాలా బాధపడుతుంది. కానీ ప్రపంచం దృష్టిలో తన గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం కోసం ఇలాంటి మెరుపులను ధరిస్తుంది. కానీ ఆమె అంతరంగం ఎంతో చీకటిగా, బాధతో నిండి ఉంటుంది. అలాంటి వారిని గమనిస్తే.. మీ విలువైన సమయంలో కొంత ఆమె కోసం కేటాయించండి.. మీ ప్రేమతో వారిని ఓదార్చండి.. ఎందుకంటే కొన్నిసార్లు స్పర్శకు మించింది ఏమి లేదు’ అంటూ సబ్యసాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీన్ని సమర్థిస్తూ.. ఓ ప్రఖ్యాత రచయిత లైన్స్‌ను కూడా కోట్ చేశారు. View this post on Instagram #Sabyasachi #ParadiseLost #SabyasachiJewelry #TheWorldOfSabyasachi @sabyasachijewelry A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on Jul 5, 2019 at 8:10am PDT అయితే ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడంబరమైన దుస్తులు, నగలు డిజైన్ చేసే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. మీ దుస్తులు అమ్మకాల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్లే చేయకండి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
సో సాడ్.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?!
‘సో సాడ్.. పెళ్లిలో వధువుపైనే కదా అందరి దృష్టి ఉంటుంది. మీరు మాత్రం ప్రచారం కోసం ఆమెను తక్కువగా చేసి చూపారు. పెళ్లి అనే మధుర ఙ్ఞాపకం వ్యక్తుల జీవితంలో ఎంతో ప్రత్యేకమైంది. పక్కన ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా ఆ ఒక్కరోజు వధువు మాత్రమే సెలబ్రిటీ అవుతారు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన సినిమాటోగ్రాఫర్ శ్రీలా రావు పెళ్లి ఫొటోలను సవ్యసాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. మంగళవారం శ్రీలా రావు పెళ్లి ఫొటోలను షేర్ చేసిన సవ్యసాచి... ‘ రియల్ బ్రైడ్ శ్రీలా రావు శ్రీలంకలోని బెంటోటా విల్లాలో జరిగిన తన వివాహంలో సవ్యసాచి డిజైనర్ దుస్తులు ధరించారు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. అయితే ఈ ఫొటోల్లో శ్రీలా రావు కంటే కూడా ఆమె స్నేహితురాలు, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హైలెట్ చేయడంతో నెటిజన్లు సవ్యసాచి, ఫొటోగ్రాఫర్ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
పెళ్లి కళ వచ్చేసింది..
సాక్షి,ముంబై: మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీకి పెళ్లి కళ వచ్చేసింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సంప్రదాయ లెహంగ దుస్తులు, ఖరీదైన అన్‌కట్ సిండికేట్ డైమండ్స్, జాంబియన్ ఎమరాల్డ్స్ పొదిగిన నెక్లెస్, దానికి జతగా మ్యాచింగ్ చెవి రింగులతో పెళ్లి కళ వచ్చేసిందే బాలా అన్నట్టుగా తళుక్కున మెరిసింది. తాజాగా ఇషా అంబానీ ఈ అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు. సాంప్రదాయకంగా వధువు నిర్వహించే గృహ శాంతి పూజకోసం ఈ అందమైన లెహంగాను, నెక్లెస్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు తన కుమార్తె పెళ్లి వేడుక ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ ఇటీవల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని, కేరళలోని గురువాయూర్ దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాలను దర్శించుకొని విలువైన కానుకలను సమర్పించుకున్నారు బిలియనీర్ , రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. కాగా ఇషా అంబానీ, ఆనంద్ పిరామల్ వివాహం ముహూర్తం డిసెంబర్ 12వ తేదీగా నిర్ణయించారు. వీరి పెళ్లి వేడుకకు ముందు నిర్వహించే పూజా కార్యక్రమాలు, ఇతర వేడుకలు డిసెంబర్ 8నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. సంప్రదాయ రాజస్థానీ శైలిలో ఉదైపూర్ ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారని భావిస్తున్నారు. కాస్ట్లీ వెడ్డింగ్‌గా చెబుతున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల వివాహప్రక్రియలో ప్రతీ అంశమూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇటలీలోని లేక్ కామోలో ఒక విలాసవంతమైన విల్లాలో జంట నిశ్చితార్థ కార్యక్రమంతోపాటు, వీరి వివాహ ఆహ్వాన పత్రికలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram Isha Ambani @_iiishmagish for her Graha Shanti Pooja in a custom hand-painted, hand-embroidered tilla-work lehenga and antique bandhej dupatta. The outfit is a part of the India Revival Project by Sabyasachi. Her look is accessorised with a necklace and earring set featuring uncut Syndicate diamonds and Zambian emeralds. Jewellery Courtesy: Sabyasachi Heritage Jewelry @sabyasachijewelry Photo Courtesy: Tarun Vishwa #TarunVishwa Styled by: @stylebyami Makeup by: @subbu28 Hair by: @sangeetahairartist . #Sabyasachi #IshaAmbani #SabyasachiJewelry #TheWorldOfSabyasachi A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on Nov 27, 2018 at 6:38am PST -
సుప్రీం చరిత్రాత్మక తీర్పు : టీవీలో సంచలన షో
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందటే చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర టీవీ కూడా ఈ సంబురాల్లో పాలుపంచుకుంటోంది. బుల్లి తెరపై మొట్ట మొదటిసారి ‘గే స్వయంవరం’ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఈ షోకు హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ సవ్యసాచి సత్పతి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. సవ్యసాచి సత్పతి కోసం మంచి ‘గే వరుడు’ కావాలంటూ ఈ గే స్వయంవరం కార్యక్రమం ప్రసారం కానుంది. ‘అవును, రెండు ప్రొడక్షన్ హౌజ్‌లతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అనంతరం ఈ షో చేయాలనుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన టెలివిజన్ రియాల్టీ షోల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా ఈ గే రియాల్టీ స్వయంవరం షో చరిత్ర సృష్టిస్తుంది’ అని సవ్యసాచి అన్నారు. బిగ్ బాస్ 11 హౌజ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సవ్యసాచి, తనకున్న హాస్య భావనతో హౌజ్ మేట్లను ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండే వాడు. కానీ బాధకరంగా అతను షోలో ఉండేందుకు తగిన ఓట్లు సంపాదించుకోలేక, హౌజ్ నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్ బాస్ 11కు ముందు, అతను ఒడిశా టెలివిజన్ ఇండస్ట్రిలో ఉండేవాడు. పలు కుకింగ్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించేవాడు. ఫెమినా మిస్ ఇండియా 2017 ఆడిషన్స్‌కు కూడా హోస్ట్‌గా ఉన్నాడు. ఇంతకుముందు వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా ‘రాఖీకీ స్వయంవర్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో తనకు తానే స్వయంవరం ప్రకటించుకుని, వచ్చిన వారిలో ఓ వరుడిని ఎంచుకుని కొద్దికాలం అతనితో ట్రావెల్ చేసింది. అలాగే ‘రాహుల్ కా స్వయంవర్’ పేరుతో కూడా ఓ టీవీ కార్యక్రమం ప్రసారమైంది. అది తీవ్ర వివాదాస్పదమైంది. వీటితో పోలిస్తే ‘సవ్యసాచి స్వయంవరం’ పూర్తిగా విరుద్ధం. సవ్యసాచి సత్పతి కోసం మంచి హైటు, వెయిటూ ఉన్న గే వరుడు కావాలంటూ కార్యక్రమం రూపొందించబోతున్నారు. భారతదేశంలో గే కల్చర్‌ను చూపిస్తూ ఇంతవరకూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందలేదు. -
ప్రేమకు నీరాజనం!
అందమైన ప్రేమకథతో, యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘నీరాజనం’. మహేశ్, సబ్యసాచి, కారుణ్య ముఖ్యతారలుగా అవన్ ఆళ్ల దర్శకత్వంలో దాడి అప్పలనాయుడు నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఎవరికి ఎవరు నీరాజనం చెప్పారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని దర్శక,నిర్మాతలు తెలిపారు.