మెట్‌ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్‌! ఏకంగా 163 మంది.. | Alia Bhatt Embraced 'The Garden Of Time' In Custom Sabyasachi Saree | Sakshi
Sakshi News home page

మెట్‌ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్‌! ఏకంగా 163 మంది..

Published Tue, May 7 2024 11:34 AM | Last Updated on Tue, May 7 2024 11:46 AM

Alia Bhatt Embraced 'The Garden Of Time' In Custom Sabyasachi Saree

మెట్‌ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌లో ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో రెండోసారి బాలీవుడ్‌ భామ అలియా భట్‌ రెడ్​కార్పెట్​పై మెరిసింది. భారతీయ సంస్కృతిని చాటేలా ప్రత్యేకమైన సబ్యసాచీ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా కెమెరాల అటెన్షన్‌ ఆమె ధరించిన చీరవైపే దృష్టిసారించాయి. ఈ చీరను గ్లాస్‌ బీడింగ్‌, రత్నాలతో చేతి ఎంబ్రాయిడరీతో డిజైన చేశారు. పుదీనా ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ చీరలో అలియా అందర్నీ మిస్మరైజ్‌ చేసింది. ముఖ్యంగా పొడవాటి కొంగు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఎవరు డిజైన్‌ చేశారంటే..
అలియా భట్ కట్టుకున్న ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. ఈ ఏడాది మెట్ గాలా 2024 "గార్డెన్ ఆఫ్ టైమ్" అనే థీమ్‌కు సరిపోయేలా భారతీయ సంస్కృతిని చాటేలా అలియా చీరను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. పైగా చీర కంటే గొప్ప డిజైనర్‌వేర్‌ లేదని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. అంతేగాదు ఈ శారీకి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా ఉండటమే గాక, మొత్తం షోలో ప్రత్యేకంగా నిలిచింది.

ఈ చీరను ఏకంగా 163 మంది..
అలియా భట్ కట్టుకున్న చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్‌ను కవర్ చేసిందంటే..ఈ చీర ఎంత పెద్దగా ఉందో చెప్పొచ్చు. ఈ ఈవెంట్‌లో మిగిలిన వాళ్లంతా మోడర్న్ డ్రెస్‌లలో కనిపిస్తే.. అలియా మాత్రం ఇలా చీరలో కళ్లు చెదిరే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి. అభిమానులు సైతం అద్భుతంగా ఉన్నావంటూ పోస్టులు పెట్టారు. 

అయితే ఈ చీర వెనుక ఏకంగా163 మంది చేతి కళాకారుల శ్రమ ఉంది. వాళ్లంతా దాదాపు  గంటలు శ్రమించి ఆ చీరను ఇంత అందంగా ఆ వేడకలోని థీమ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. దీన్ని ఇటలీలో తయారు చేశారట. ఈ మెగా మెట్‌ గాలా ఈవెంట్‌లో ఆరుగజాల అందమైన చీరతో అక్కడున్నవారందరీ మనుసులను గెలుచుకుంది అలియా. 

(చదవండి: సమ్మర్‌లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement