గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్‌లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్‌లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.
ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది.
ఆలియా చీర వెనుక కథ
మెట్ గాలా ఈవెంట్‌లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment