ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే? | Tollywood Director Nag Ashwin Clarity On Working With Alia Bhatt | Sakshi
Sakshi News home page

Nag Ashwin: ఆలియా భట్‌తో లేడీ ఓరియంటెడ్ మూవీ.. నాగ్ అశ్విన్ సమాధానం ఇదే!

Published Mon, Nov 11 2024 2:54 PM | Last Updated on Mon, Nov 11 2024 3:08 PM

Tollywood Director Nag Ashwin Clarity On Working With Alia Bhatt

ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్‌ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్‌, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. 
అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ప్రస్తుతం కల్కి-2 మూవీతోనే బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరక్కిక్కిస్తున్నారనే వార్తలకు తెరపడింది.

కాగా.. నాగ్ అశ్విన్ గతంలో కీర్తి సురేశ్ లీడ్ రోల్‌లో మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవితం అధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement