Met Gala 2024
-
మెట్ గాలా–2024లో ఇండియన్ బ్యూటీ ఫోటోలు వైరల్
-
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
ప్రతిష్టాత్మక మెట్ గాలా 2024లో భారతీయ బిలియనీర్ సుధారెడ్డి అత్యంత విలువైన ‘అమోర్ ఎటర్నో’డైమండ్ నెక్లెస్ ధరించి తళుక్కు మన్నారు. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమి టెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి మెట్ గాలా 2024లో రెడ్‌కార్పెట్‌ను అలంకరించారు. ఈ వేదికగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతమైన దుస్తులతోపాటు 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌తో పాల్గొని అందరి చూపులను తన వైపు తిప్పుకున్నారు. ఈ నెక్లెస్, ఇతర అందమైన ఆభరణాల తయారీకి 100 గంటలు పట్టిందట. ముఖ్యంగా ఇందులో కృష్ణ, సుధ ప్రేమకు గుర్తుగా ప్రధాన భాగంలో నాలుగు పెద్ద, గుండె ఆకారంలో వజరాలను పొదిగారు. సింబాలిక్‌గా కుటుంబ వృక్షం కూడా ఉంది. అతిపెద్ద వజ్రం, 25 క్యారెట్ల కింగ్ ఆఫ్ హార్ట్స్, భర్త కృష్ణనుకు ప్రతీకగా, క్వీన్ ఆఫ్ హార్ట్స్, 20 క్యారెట్ల హార్ట్షేప్డ్ వజ్రంతో, సుధా రెడ్డిని సూచిస్తూ, ఇంకా ప్రిన్స్ ఆఫ్ నాలెడ్జ్ , ప్రిన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని పిలువబడే రెండు 20-క్యారెట్ డైమండ్స్ కుమారులు ప్రణవ్,మానస్‌లను ప్రతిబింబిస్తూ దీన్ని తయారు చేశారు. ఇంకా 23 క్యారెట్ల యెల్లో డైమండ్ రింగ్, రెడ్డీస్ స్వరోవ్స్కీ, పూల చేతులు, బ్యాగ్ ఇలా అన్ని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఈసందర్బంగా సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. -
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్‌లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
మెట్‌గాలా 2024 ఈవెంట్లో అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్‌తో గ్లామర్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకుంది. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్‌లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్‌తో వనదేవతలా కనిపించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania)ఫ్యాషన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ మెట్ గాలా వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో ప్రత్యేకంగా కనిపించింది.ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్‌కు అనుగుణంగా, తన డ్రెస్‌లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్ లోటస్ బ్రేస్లెట్, ప్యారెట్ ఇయర్ రింగ్స్, ఫ్లవర్ చోకర్లతో పాటు, నకాషి మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్‌ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్ డిజైన్ క్లచ్ బ్యాగ్ చూడాల్సిందే. ఈ పెయింటింగ్‌ను జైపూర్‌కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు. డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన 3డీ గౌను పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట. ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్ని డిజైన్ చేసిన బ్లాక్ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే. -
మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)