![Met Gala 2024 Isha Ambani steals audiance audience hand embroidered gown](/styles/webp/s3/article_images/2024/05/7/Isha-Ambani_Met-Gala-2024.jpg.webp?itok=lzhVvXzH)
మెట్‌గాలా ఈవెంట్ 2024 ఈ ఏడాదిలో నాలుగోసారి
ఫ్యాషన్ స్టయిల్‌తో అదరగొట్టిన ఇషా అంబానీ
మెట్‌గాలా 2024 ఈవెంట్‌లో అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్‌తో గ్లామర్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకుంది.
పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్‌లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్‌తో వనదేవతలా కనిపించింది.
ఫ్యాషన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ మెట్ గాలా వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో ప్రత్యేకంగా కనిపించింది.
ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్‌కు అనుగుణంగా, తన డ్రెస్‌లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్ లోటస్ బ్రేస్‌లెట్, ప్యారెట్ ఇయర్ రింగ్స్, ఫ్లవర్ చోకర్‌లతో పాటు, నకాషి మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్‌ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్ డిజైన్ క్లచ్ బ్యాగ్ చూడాల్సిందే. ఈ పెయింటింగ్‌ను జైపూర్‌కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు.
డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన 3డీ గౌను పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట. ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.
2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్‌ని డిజైన్ చేసిన బ్లాక్ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment