Gown
-
ధగధగ మెరిసే మెరుపుల రాణిలా రాధికా మర్చంట్ (ఫోటోలు)
-
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
అనంత్ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్ ఫొటోలు
-
హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ జంట 2020లో రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుంటున్నట్లు ప్రకటించి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా కార్యక్రమాల్లో కెమెరా కంట చిక్కుతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారి ఏకంగా రాజ కుటుంబానికి రాయల్టీ లుక్‌ని ఇచ్చే గౌనుని ధరించడం హాట్‌టాపిక్‌గా మారింది. రీజన్ ఏంటంటే..డచెస్ ఆఫ్ సస్సెక్స్‌గా పేరుగాంచిన మేఘన్ ఈ లేత గోధుమ రంగు గౌనుని డిజైనర్ హెడీ మెరిక్ చేత డిజైన్ చేయించుకుంది. డిజైనర్ ప్రకారం ఈ గౌను పేరు విండ్సర్ గౌన్ బ్లష్. విండర్స్ అనేది రాజ కుటుంబం చివరి పేరు. మేఘన్ మార్క్లే ప్రిన్స్ హ్యారీ శుక్రవారం నైజీరియా చేరుకున్నారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆహ్వానం నేపథ్యంలో అక్కడ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని తమ మొదటి పర్యటన నిమిత్తం ఇలా మేఘన్ మార్క్లే ఈ గౌనులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రాజరికం హోదాను వదులుకున్నప్పుడూ మళ్లీ రాజరకిపు దుస్తులు ధరించడం ఏంటని సర్వత చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ జంట 2018లో హ్యారీ అమ్మమ్మ దివంగత క్వీన్ ఎలిజబెత్II వివాహ కానుకగా ఇచ్చిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని విండ్సర్ ఎస్టేట్‌లో నివశించేవారు. గతేడాది జూన్‌లోనే ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే కింగ్ చార్లెస్ మేఘన్‌కి అత్యున్నత గౌరవం ఇద్దా అనుకుంటున్న కొద్ది క్షణాల ముందే ఈ దంపతులు రాజకుటుంబ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.(చదవండి: 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!) -
Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
మెట్‌గాలా 2024 ఈవెంట్లో అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్‌తో గ్లామర్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకుంది. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్‌లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్‌తో వనదేవతలా కనిపించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania)ఫ్యాషన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ మెట్ గాలా వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో ప్రత్యేకంగా కనిపించింది.ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్‌కు అనుగుణంగా, తన డ్రెస్‌లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్ లోటస్ బ్రేస్లెట్, ప్యారెట్ ఇయర్ రింగ్స్, ఫ్లవర్ చోకర్లతో పాటు, నకాషి మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్‌ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్ డిజైన్ క్లచ్ బ్యాగ్ చూడాల్సిందే. ఈ పెయింటింగ్‌ను జైపూర్‌కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు. డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన 3డీ గౌను పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట. ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్ని డిజైన్ చేసిన బ్లాక్ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే. -
పింక్ డ్రస్‌లో మిల్కీ బ్యూటీ..ధర వింటే షాకవ్వుతారు!
మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకి ఇప్పటికీ టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. కానీ బాహుబలి తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. ఒకప్పుడూ ఆమె టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఆ టైంలో ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హిరోలతో కూడా నటించేది ఈ భామ. అయితే ఆమె కెరీర్లో హిట్ల కంటే ప్లాప్లే ఎక్కువ ఉన్నాయి. అయితేనేం ఆమె అందం, పర్సనల్ ఇమేజ్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి వివిధ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించి బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. ఈమధ్య ప్రతి రోజూ ఓ డిఫరెంట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తోంది తమన్నా భాటియా. ముఖ్యంగా బాలీవుడ్, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిన తర్వాత తమన్నా తన గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది. తాజాగా పింక్ డ్రెస్‌లో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. తమన్నా ధరించిన ఈ డ్రెస్ లగ్జరీ వర్సెచె బ్రాండ్‌కి చెందింది. డ్రస్ ధర ఏకంగా రూ. 4.2 లక్షలు. ఈ పింక్ కలర్ లగ్జరియస్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబంధించని ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. వీటికి ఓన్లీ ఫ్లవర్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింద. ఈ పింక్ డ్రస్‌లో తమన్నా ఫోటోలకు ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?) -
మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!
ముంబైలో శనివారం రాత్రి(మార్చి 9న) జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 పోటీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ అందాల పోటీల్లో పూజా హెగ్డే పింక్ స్వీక్విన్ గౌనులో మరో అందమైన గులాబీలా కనిపించింది. అలా వైకుంఠపురంతో ప్రేక్షకులకు చేరువైన బుట్టబొమ్మ పూజా హెగ్డే లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పొడవాటి స్లీవ్స్ తో కూడిన ఫుల్ లెంగ్త్ గ్లిట్టర్ పింక్ సీక్విన్ గౌన్‌లో క్యూట్‌లుక్‌తో సందడి చేసింది. రెడ్ కార్పెట్‌పై ఆ డ్రస్‌తో అందమైన గులాబీలా లుక్ అదిరిపోయింది. ఎలాంటి నగలు ధరించకపోయినా డీప్ నెక్‌తో కూడిన ఆ పింక్ డ్రస్‌లో అందానికే రాణిలా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ కార్యక్రమంలో కృతి సనన్ ఆకుపచ్చ గౌను, సోనాక్షి సిన్హా ఎరుపు రంగు గౌను, మన్నారా చోప్రా సిల్వర్ డ్రస్‌తో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. కాగా, ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో 12 మంది సభ్యుల ప్యానెల్ లో పూజా హెగ్డే న్యాయ నిర్ణేతగా ఉన్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఎవ్లిన్ మోర్లే సీబీఈ, అమృత ఫడ్నవీస్, సాజిద్ నడియాడ్వాలా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రజత్ శర్మ, జమీల్ సయీద్, వినీత్ జైల్ ఈ ఎడిషన్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Vishal Mohan Jaiswal (@mj.vishal) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్‌అవార్డు!) -
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి (ఫోటోలు)
-
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్‌బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్‌బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్‌లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్‌బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్‌ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు జుకర్‌బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్‌లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఏంటి.. ఫొటో తిరగేశారనుకుంటున్నారా?.. అబ్బే కాదండోయ్!
ఫొటో తిరగబడలేదు.. డ్రెస్సే తిరగేసి వేసుకున్నారు.. ఫ్యాషన్‌కు రాజధానిగా పిలిచే ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో దీన్ని చూసిన అందరికీ పిచ్చిలేచిందట. వీటిని అక్కడ లైవ్‌లో చూసినోళ్ల పరిస్థితి అలా ఉంటే.. ఒరిజినల్ ఐడియాలు కరువయ్యే.. చివరికి ఈ సంస్థ ఇలాంటి పిచ్చి టైపు క్రియేషన్‌కు తెరలేపిందని ఇటు ఇంటర్నెట్లో కామెంట్లు వెల్లువెత్తాయి. ఇంతకీ దీన్ని ఎవరూ తయారు చేశారో చెప్పలేదు కదూ.. విక్టర్ అండ్ రోల్ప్ ఫ్యాషన్ హౌస్ దీని సృష్టికర్త. ఈ డ్రేస్సే కాదు.. ఇలాంటివే మరికొన్ని డిఫరెంట్ కాస్ట్యూమ్‌లను కూడా రూపొందించింది సదరు ఫ్యాషన్ హౌజ్ సంస్థ. ఆ కళాఖండాలను చూసేయండి మరి. చదవండి: దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో.. -
నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...
ఆయన దేశాన్ని పాలించే మహారాజు. ఆయన భార్య మహారాణి. లెక్క ప్రకారం వారికి దేనికీ కొదవే ఉండదు. వాళ్లు వేసుకునే పాదరక్షల నుంచి హెయిర్ క్లిప్‌ల వరకు అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. మహారాణిగారు ఏ కార్యక్రమానికైనా వచ్చారంటే ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. దీనికి తగ్గట్టుగానే వారు రెడీ అవుతుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు స్పెయిన్ మహారాణి లెట్జియా ఓరి్టజ్ రోకసోలానో. కార్యక్రమానికో డ్రెస్ కొనకుండా, తన దగ్గర ఉన్న పాత డ్రెస్సులను సరికొత్తగా తీర్చిదిద్ది వివిధ కార్యక్రమాలకు వాటినే వాడుతూ ఫ్యాషన్ ఐకాన్లకే సవాళ్లు విసురుతున్నారు. ఎప్పుడూ స్టైలి‹Ùగా కనిపించే లెట్జియా రెండు రోజులక్రితం రాయల్ ప్యాలెస్‌లో చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు ఆహా్వనం పలికే క్రమంలో నలభై ఏళ్లనాటి డ్రెస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించారు. ఈ గౌనుకు పెద్ద చరిత్రే ఉంది. లెట్జియా అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును ఇప్పటి మహారాణి ధరించడం విశేషం. పొట్టి చేతులు, పింక్ పేస్టల్ కలర్లో ఫ్రాక్. పువ్వులతో మోకాళ్ల కింద వరకు స్కర్ట్‌ను ధరించారు. మహారాజు జువాన్ కార్లోస్–1తో కలిసి, క్వీన్ సోఫియా 1981లో రోమ్ను సందర్శించారు. ఆ సమయంలో సోఫియా ఈ డ్రెస్‌ను ధరించారు. ఆనాటి డ్రెస్‌ను వార్డ్రోబ్ లో నుంచి తీసి దానిని వెండి, రత్నాలతో మరింత అందంగా డెకొరేట్ చేసి, సిల్వర్ బెల్ట్‌తో ధరించి చూపరులను ఆకట్టుకుంది లెట్జియా. అంతేగాక ఈ వారం లో జరిగిన రెటీనా ఈసీవో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న లెట్జియా ఒక నలుపు రంగు గౌనును వేసుకున్నారు. ఈ గౌనును సేంద్రియ వెదురుతో తయారు చేయడం విశేషం. ఇద్దరమ్మాయిలకు తల్లి అయిన లెట్జియా, ఒకపక్క తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో తరచూ పొల్గొంటూ ఉంటారు. ఆమె ధరించే డ్రెస్‌లు ఎంతో సింపుల్‌గా స్టైలిష్‌గా ఉండడమేగాక, దాదాపు రీసైక్లింగ్ చేసినవి కావడంతో అంతా లెట్జియా డ్రెస్‌లను ఆసక్తిగా గమనిస్తుంటారు. -
కరోనా హీరో: ‘నూరు’ పిపిఇ గౌన్లు
కరోనా పోరాటంలో నేను సైతం అంటూ ఎంతో మంది కదిలారు. అందులో పిల్లలు కూడా తమ వంతు సాయం అందిస్తూ తమ సత్తా చాటుతున్నారు. వారిలో ముందు వరసలో ఉంటుంది తొమ్మిదేళ్ల నూరు అఫియా కిస్టినా. మలేషియాకు చెందిన నూరు ఆడుతు పాడుతూ తల్లి వద్ద ఐదేళ్ల వయసు నుంచే మిషన్ కుట్టడం నేర్చుకుంది. తల్లి టైలరింగ్ చేస్తుండటంతో కూతురు కూడా ఆ పనిలో మెల్ల మెల్లగా నిమగ్నమయ్యేది. ఇంటికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలోని వైద్యులకు, నర్సుల బృందానికి పిపిఇ గౌన్లు అవసరమని అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంది. తల్లిదండ్రుల సాయంతో కావల్సిన మెటీరియల్ తీసుకొని మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 130 పిపిఇ గౌన్లు తయారుచేసింది. వాటిని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందజేసింది. పిపిఇ కిట్స్ కుడుతున్న నూరు ఒకే రోజులో 4 గౌన్లు ‘ఇవి చెడు రోజులు. ప్రజలు ఎంతగా కష్టపడుతున్నారో వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది అని తెలుసుకున్నాను. దీనికి అడ్డుకట్ట వేసే వారికి సహాయం చేయాలని ఉందని మా అమ్మకు చెప్పాను. లాక్డౌన్ కారణంగా మాకు స్కూల్ కూడా లేదు. ఆన్లైన్లో చదువుకుంటున్నాను. ఖాళీ సమయంలో పిపిఇ గౌన్లు తయారు చేస్తున్నాను. రోజుకు నాలుగు గౌన్లు తయారు చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ కూడా సాయం చేస్తుంటుంది. ఇప్పుడు మరో 60 గౌన్లను తయారు చేయడానికి అన్ని పనులు పూర్తి చేసుకున్నాను’ అంటుంది నూర్. పొరుగువారి దుస్తులు మరమ్మతు మిషన్ పైన కుట్టడం అనే నైపుణ్యాన్ని తల్లి నుండి నేర్చుకుంది నూర్. ఇరుగుపొరుగు వారి దుస్తులను బాగు చేయగా వచ్చే డబ్బును తన పాకెట్ మనీగా వాడుకునేది. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని పిపిఇ గౌన్లు తయారు చేయడానికి ఉపయోగపడింది. ఇలా కరోనా వారియర్స్‌కి నా వంతు సాయపడుతున్నాను అని సంతోషంగా చెబుతుంది నూర్. వయసు చిన్నదే. కానీ, మనసు పెద్దది అనిపించక మానదు నూర్ చేస్తున్న పని చూస్తుంటే. -
డ్యూయెట్!
పొడవు కుర్తీ, పొట్టి గౌన్ అది మన సంప్రదాయ డిజైన్ అయినా, పాశ్చాత్య స్టైల్ అయినా ఒకటే డ్రెస్‌కు రెండు ప్యాటర్న్ రంగులు. డిజైన్లలో హంగులు ఉంటే ఇలా మనసు దోచేస్తాయి. చిన్న మార్పుతో డ్రెస్‌కి ఆకట్టుకునే లుక్ తీసుకురావచ్చు. ముదురు, లేత రంగుల కాంబినేషన్‌తోనూ డ్రెస్ లుక్‌ను పూర్తిగా మార్చేయవచ్చు. మరే హంగులూ లేకున్నా ఇలాంటి డ్రెస్ ధరిస్తే ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ ప్రత్యేకతే ఇప్పడు ట్రెండ్ అయ్యింది. వచ్చేది వానకాలం. మబ్బులు పట్టి కాస్త డల్‌గా ఉన్న వాతావరణాన్ని కొంత చమక్కుమనిపించే స్టైల్‌తో మేల్కొలిపితే మనసు కూడా హుషారైపోతుంది. ఫ్యాషన్ పోయెట్ రాసిన డ్యూయెట్ ఇది. బారున రెండు రంగులు కుట్టేస్తే అరుణాన్ని పున్నమితో కలిపినట్టు లేదూ! నేలను ముద్దాడే సముద్రంలా లేదూ! ఇవి రెండు వర్ణాలు కావు వర్ణించలేనంత అందమైన ద్వివర్ణాలు (నిలువు, అడ్డ చారల డిజైన్‌లో కుర్తీ ,జీన్స్‌పైన టు ప్యాటర్న్ స్టైల్ స్లిట్ టాప్ , కుడివైపు ఫ్లోరల్, ఎడమ వైపు ప్లెయిన్.. లాంగ్టాప్ ,ఓ వైపు ప్రింట్లు, మరో వైపు నీలం రంగు లాంగ్ గౌన్ ) ( పువ్వుల ప్రింట్లలోనూ రంగుల వైవిధ్యం ,ద్వివర్ణాల లాంగ్ కుర్తా! ) -
రుమాలు రూపం మార్చితే...!!
న్యూలుక్ చిట్టితల్లి గౌన్‌ను చూడముచ్చటగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా.. అయితే చక్కని ప్రింట్లు ఉన్న కర్చీఫ్ తీసుకోండి. కర్చీఫ్, హ్యాంకీ... పేరేదైనా వీటిలో అరచేతిలో ఇమిడిపోయేంతటి, పెద్దవి హ్యాంకీలు రకరకాల ప్రింట్లు, డిజైన్లలో ముచ్చటగొలిపేలా ఉంటాయి. పిల్లలకోసం కొన్నవైనా, ఎవరైనా కానుకగా ఇచ్చినవైనా కొత్త కొత్త కాటన్, సిల్క్ హ్యాంకీస్ ఉంటే వాటిని ఇలా పిల్లల దుస్తులకు అలంకారాలుగా వాడచ్చు. ప్లెయిన్ గౌన్ మీద హ్యాంకీని అడ్డంగా జత చేసి కుట్టినా, కాలర్ నెక్ డిజైన్‌కు వాడినా చూడముచ్చటగా ఉంటుంది.లేసులు ఉన్న హ్యాంకీలు, పెయింట్ చేసిన హ్యాంకీలనూ ఇందుకోసం ఎంచుకోవచ్చు.అంచుగానూ, ఛాతీ భాగంలోనూ హ్యాంకీని కుడితే డిజైనర్ గౌన్ రెడీ.గౌన్‌కు రెండువైపులా హ్యాంకీతో కుచ్చుల పాకెట్‌ను అమర్చితే ఎంతఅందంగా ఉంటుందో మీరే డిజైన్ చేసి చూడండి. పెద్ద ప్రింట్లున్న రెండు, మూడు కర్చీఫ్లతో స్కర్ట్ భాగంలో కుడితే అందమైన గౌన్ సిద్ధం. కొన్ని కర్చీఫ్‌లను కలిపి గౌన్‌గా కుట్టేయవచ్చు. కర్చీఫ్‌ల మీద ఉన్న చూడముచ్చటైన ప్రింట్ వరకే తీసుకొని, అంత భాగాన్ని పిల్లల డ్రెస్‌ల మీద ప్యాచ్‌వర్క్ చేయవచ్చు. ట్రై చేస్తే హ్యాండ్ కర్చీఫ్లతో అబ్బురపరిచే డిజైన్లను ఎన్నో రూపొందించవచ్చు. చేసి చూడండి. -
రితూ బెరి బెరి గుడ్
- రితూ గౌన్‌లో క్వీన్‌లా... లెహంగా కడితే విహంగంలా... హాఫ్ శారీలో డిలైట్‘ఫుల్’గా... చోళీలో చార్మింగ్‌గా ఉంటుందా డ్రస్ డిజైనింగ్. అందుకే రితూ బెర్రీని ప్రీతీజింటా నుంచి ప్రిన్స్ చార్లెస్ వరకూ అందరూ బెర్రీ బెర్రీ గుడ్ అంటారు. గ్లామరస్‌గా కనిపించాలంటే రితుబెరి కలెక్షన్‌ను చూడకూడదు. వందల్లో ఒకరిగా కనపడాలన్నా, ప్రత్యేకతను నిలుపుకోవాలన్నా మాత్రం రితూబెరి డిజైనర్ కలెక్షన్ వైపు తప్పక దృష్టి సారించాలి. ఆమె రూపొందించిన డిజైనర్ దుస్తులు అంత అసాధారణంగా ఉంటాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం రితుబెరి డ్రెస్ డిజైన్ స్టైల్స్‌ని ‘మైండ్ బ్లోయింగ్ వర్క్’ అని ఆమెను ప్రశంసించింది. ప్రిన్స్ చార్లెస్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, నికొలె కిడ్‌మ్యాన్, పర్షియన్ సామాజికవేత్తలు, ఇండియన్ బాలీవుడ్ తారలు రాణీ ముఖర్జీ, ప్రీతీ జింతా, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు రితుబెరి డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిశారు. ఈమె స్టోర్స్ ఢిల్లీ, ఫ్రాన్స్, జెర్మనీలలో ఉన్నాయి. -
ఊపిరి సలపనివ్వని ఇష్టం
‘‘వదల బొమ్మాళీ... వదులు కానివ్వ బొమ్మాళీ’’ అంటూ అందరూ విస్తుపోయేలా చేస్తోంది మోడల్ అలైరా. వెనిజులాలోని కార్కాస్కు చెందిన ఈ మోడల్... అత్యంత బిగుతైన కార్సెట్ (శరీరాన్ని లోపలికి నొక్కిపట్టి ఉంచే డ్రెస్) తరహా గౌన్‌ను ధరించడంలో తనతో ఎవరూ పోటీపడలేరంటోంది. అలైరా... అతి బిగుతైన ఈ డ్రెస్‌ను కొంతకాలంగా దాదాపు రోజంతా వినియోగిస్తూ వార్తల్లోకి ఎక్కింది. తద్వారా తన నడుమును 20 అంగుళాలకు తగ్గించుకోగలిగింది. అయితే నడుము దగ్గర కాసింత బిగుతుగానైనా బెల్ట్ పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని, అలాంటిది ఇలా అతి బిగుతైన తొడుగును ధరించి ఎక్కువ సేపు ఉండడం ప్రమాదకరమని ఓ పక్క డాక్టర్లు హెచ్చరిస్తున్నా... అలైరా మాత్రం అదేమీ పట్టించుకోనంటోంది. ‘‘నేను వీడని తొడుగులవి... నన్ను కట్టిపడేసే గొడుగులవి’’ అంటూ బెల్ట్, కార్సెట్ల పట్ల తన మక్కువను వెల్లడిస్తోంది. నిద్రపోయే టైమ్‌తో సహా రోజంతా తాను వాటితోనే ఉంటానని, స్నాన పానాదుల సమయంలో మాత్రం ఓ గంట వాటి విరహాన్ని అతి కష్టమ్మీద భరిస్తానని అంటోంది అలైరా.