బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది.
ఇది బ్రిటన్ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.
దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు.
అతని డిజైన్‌కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్ హాలు పెయింటింగ్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్‌ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్‌కి అనుగుణంగా వెడ్డింగ్ డెకరేషన్‌ని ఏర్పాటు చేశారు.
దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్ దేశం ఇచ్చిన రేషన్ కూపన్‌లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్ చేసింది.
దీంతో రాజకుటుంబం ఆ రేషన్‌ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్ రాజ కుటుంబం.
(చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?)
Comments
Please login to add a commentAdd a comment