Queen Elizabeth II
-
క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను.. వెరీ ఇంట్రెస్టింగ్!
బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. ఇది బ్రిటన్ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్మిన్స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అతని డిజైన్‌కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్ హాలు పెయింటింగ్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్‌కి అనుగుణంగా వెడ్డింగ్ డెకరేషన్‌ని ఏర్పాటు చేశారు. దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్ దేశం ఇచ్చిన రేషన్ కూపన్లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్ చేసింది. దీంతో రాజకుటుంబం ఆ రేషన్‌ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్ రాజ కుటుంబం. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్‌కీ ఫిదా..!
చాక్లెట్లంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమో మనందరికి తెలిసిందే. అలాంటి చాక్లెట్ల టేస్ట్‌కి బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్ కూడా ఫిదా అయ్యిపోయేవారట. ఆమె తన స్నాక్స్ టైంలో చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనట. రాజదర్పానికి తగ్గట్టుగా ఆమె అత్యంత ఖరీదైన చాక్లెట్లనే ఇష్టపడేవారట. అవి అంటే ఆమెకు మహాప్రీతి అని బకింగ్‌హామ్ ప్యాలెస్ చెఫ్ చెబుతున్నారు. అంతేగాదు ఆయన క్వీన్ ఇష్టపడే చాక్లెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.దివంగత క్వీన్ ఎలిజబెత్ II చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంభించేవారు. ఆమె మంచి ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధిగాంచిన రాణి కూడా. అయితే క్వీన్ ఎలిజబెత్‌కి సైతం చాక్లెట్లంటే ఇష్టమని ఆ రాజకుటుంబానికి సేవలందించిన చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ చెబుతున్నారు. ఆమె డార్క్ చాక్లెట్లు మాత్రమే ఇష్టంగా తినేవారని అన్నారు. పాలతో తయారు చేసిన చాక్లెట్లను ఇష్టపడేవారు కారట. డార్క్ చాక్లెట్‌తో మిక్స్ చేసి ఉండే పుదీనా బెండిక్స్ ఫాండెట్లను ఇష్టంగా తినేవారట. ఈ చాక్లెట్ బాక్స్ ఒక్కోటినే రూ. 544లు పలుకుతుందట. ఆమె రోజులో ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయం సమయంలో టీ.. ఆపై రాత్రి భోజనంగా జీవనశైలి ఉంటుందట. ఆమె గనుక రోజుని ఎర్ల్ గ్రే టీ విత్ బిస్కెట్స్‌తో ప్రారంభిస్తే..కచ్చితంగా రోజంతా డిఫరెంట్ చాక్లెట్లను ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు మెక్‌గ్రాడీ. అలాగే అత్యంత లగ్జరియస్ చాక్లేటియర్ చార్బొన్నెల్ చాక్లెట్‌ని అమితంగా ఇష్టపడేవారని అన్నారు. దీని ఖరీదు ఏకంగా రూ. 30 వేలు పైనే ఉంటుందట. ఇక్కడ రాణి గారు ఇష్టపడే బెండిక్స్, చార్బొన్నెల్ బ్రాండ్లు రెండు బ్రిటన్‌కి చెందిన ఫేమస్ బ్రాండ్లే కావడం విశేషం. ఇక డైట్ పరంగా క్వీన్ ఎలిజబెత్ సమతుల్య ఆహారాన్నే తీసుకునేవారని చెఫ్ మెక్‌గ్రాడి చెబుతున్నారు. ఆమె చాక్లెట్ పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టి పెట్టి తీసుకునేవారని అన్నారు. ఆరోగ్యం పట్ల ఉన్న ఈ నిబద్ధతే క్వీన్ ఎలిజబెత్ సుదీర్ఘకాల జీవన రహస్యం కాబోలు..!.(చదవండి: వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?) -
ఏఐ చాట్‌బాట్ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంత అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ రాణి 'క్వీన్ ఎలిజబెత్ II'ని చంపడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల 'జస్వంత్ సింగ్ చైల్' రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయితే రాణిని చంపడానికి ప్రేరేపించింది ఏఐ చాట్‌బాట్ అంటే వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే అని నిపుణులు చెబుతున్నారు. జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా అనే యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసేవాడు. దీనికి సరాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చేస్తున్న చాలా అద్భుతాల్లో ఇదొకటి చెప్పాలి. రిప్లికా యాప్ ద్వారా వినియోగదారుడు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఫ్రెండ్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి తమకు నచ్చిన రూపం (ఆడ & మగ) కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. సరాయ్ పేరుతో.. ఇక అసలు విషయానికి వస్తే.. జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి తరహా చాట్‌బాట్ ద్వారా ఏకంగా 5వేలు కంటే ఎక్కువ మెసేజులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ వత్తాసు పలికినట్లు సమాచారం. చైల్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కానీ నేరానికి పాల్పడటంతో అతనికి 9 జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికంటే ముందు చికిత్స కోసం బ్రాడ్‌మూర్ హై-సెక్యూరిటీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటన 2021లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2022లో ఎలిజబెత్ II అనారోగ్య కారణాలతో మరణించించారు ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!! రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘీక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి అది సహకరిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఎందుకంటే వినియోగదారుడు ఏం చెప్పినా దానికి ఏకిభవిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో వారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి బానిసైన జస్వంత్ సింగ్ చైల్.. సరాయ్ (ఏఐ చాట్‌బాట్) అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించినట్లు సమాచారం. -
క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్‌బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా?
హ్యాండ్‌బ్యాగ్... మహిళల జీవితంలో ఓ భాగం. ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 సైతం నిత్యం హ్యాండ్‌బ్యాగ్‌ను క్యారీ చేసేవారు. 1950 నుంచి 2022వరకు ఆమె ఫొటోలను గమనిస్తే.. అన్నింట్లో ఆమె బ్లాక్ లానర్ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించే కనిపిస్తారు. బ్లాక్ బ్యాగ్ మాత్రమే ఎందుకు వాడేవారు? ఫ్యాషన్ స్టేట్మెంట్గానా? అంటే కానేకాదు. అంతకుమించి. బ్యాగ్ ద్వారా తన సిబ్బందికి రహస్య సమాచారాన్ని చేరవేసేవారామె. బ్యాగ్ ప్రతి కదలిక, పొజిషన్‌ను బట్టి డిఫరెంట్ మెసేజ్‌ను పంపించేవారు. ఎలా అంటే... ►ఆమె ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎడమ చేతిపై బ్యాగ్‌ను కుడిచేతికి మార్చారంటే.. ఆ సంభాషణను ముగించాలి అనుకుంటున్నారని అర్థం. ► చేతిలోని బ్యాగ్‌ను కింద పెట్టారంటే... తాను అసౌకర్యంగా ఫీలవుతున్నానని, వెంటనే ఆ వ్యక్తిని బయటికి పంపించేయాలని సూచన. ► భోజనం చేసేటప్పుడు ఆ బ్యాగ్‌ను టేబుల్ మీద పెట్టారంటే.. ఐదు నిమిషాల్లో భోజనం ముగించేయాలి అనుకున్నారన్నట్టు. ►అలాంటి కీలకమైన పాత్రపోషించే బ్యాగ్ ఉంటేనే ఆమె కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవారు. ►ఆ చివరకు సెప్టెంబర్ 6న ప్రధానిగా లిజ్‌ట్రస్ బాధ్యతలు తీసుకునేరోజు సైతం బాల్మోరల్ క్యాజిల్‌లో జరిగిన కార్యక్రమంలో సైతం క్వీన్ బ్లాక్ హ్యాండ్‌బ్యాగ్ ధరించి ఉన్నారు. ►ఆఇంతకూ ఆ బ్యాగ్‌లో ఏముండేవో తెలుసా? సాధారణ మహిళల బ్యాగుల్లో ఉన్నట్టే... చిన్న అద్దం, లిప్‌స్టిక్, కొన్ని మింట్ బిల్లలు, ఒక జత రీడింగ్ గ్లాసెస్. -
‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై ఫైర్
లండన్: బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాణి అంత్యక్రియల ఈవెంట్‌ను కవరేజ్ చేసే టైంలో ఆస్ట్రేలియాకు చెందిన చానెల్-9.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌ను గుర్తు పట్టలేకపోయింది. టీవీ ప్రజెంటర్స్ ట్రేసీ గ్రిమ్షా, పీటర్ ఓవర్టన్‌లు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ సమయంలో.. తన భర్త హ్యూ ఓలీరేతో వెస్ట్మిన్స్టర్ అబేకు వచ్చారు లిజ్ ట్రస్. కారు నుంచి బయటకు వచ్చిన లిజ్ ట్రస్‌ను ఉద్దేశించి గ్రిమ్ షా..‘ఎవరామె?’ అంది. ‘గుర్తుపట్టడం కష్టంగా ఉంది. బహుశా మైనర్‌రాయల్స్(రాజకుటుంబంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న సభ్యులు) కావొచ్చు. నాకు తెలియడం లేదు అని ఓవర్టన్ అన్నారు. ‘స్థానిక వేషధారణలోనే వస్తున్నారు కదా. బహుశా అక్కడి ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లేమో. దురదృష్టవశాత్తూ.. ప్రతీ ఒక్కరినీ మనం గుర్తించడం కష్టం’ అంటూ గ్రిమ్షా బదులిచ్చారు. అయితే.. I present, for your viewing pleasure, footage of Liz Truss getting out of a car, and Australian media being like, “Who the fuck is that?” Perfect.pic.twitter.com/dxNhdolvtK — Fancy Brenda 🏳️🌈🏳️⚧️ (they/them) (@SpillerOfTea) September 19, 2022 వెంటనే వాళ్లు తమ తప్పిదాన్ని తెలుసుకున్నట్లున్నారు. ఓవర్టన్ స్పందిస్తూ.. ఆ మిస్టరీ గెస్ట్ ఎవరో కాదు యూకే ప్రధాని లిజ్ ట్రస్ అంటూ చెప్పారు. అయితే అప్పటికే ఆ తప్పిదాన్ని పట్టేసిన కొందరు స్పందన మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా టీవీ హోస్ట్‌లు యూకే ప్రధానిని ‘మైనర్‌రాయల్స్’గా సంభోదించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బ్రిటన్ ప్రజలు. ఆస్ట్రేలియా చానెల్‌కు ఆమాత్రం లిజ్ ట్రస్ తెలీదా అంటూ మండిపడుతున్నారు. బోరిస్ జాన్సన్ తదనంతరం.. బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్‌ను ఓడించి ఎన్నికయ్యారు లిజ్ ట్రస్. సెప్టెంబర్ 6వ తేదీన ఆమె బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టగా.. అనంతరం రెండు రోజులకే క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఇదీ చదవండి: యూకేలో ఆలయాలపై దాడులు... భారత్ ఖండన -
భారమైన హృదయాలతో... రాణికి వీడ్కోలు
లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర్పించారు. నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్‌మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్‌లోని చారిత్రక బిగ్‌బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్‌కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి. క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం -
ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?
ఎలిజెబెత్ రాణి మృతి, వారసుడిగా కింగ్ ఛార్లెస్ ప్రవేశం అనేవి మరోసారి గ్రేట్ బ్రిటన్ గురించి మనం తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా చేశాయి. యూరప్ తీర ప్రాంతంలోని ఒక చిన్న దీవి అయిన బ్రిటన్ రాజకీయాధికారం క్షీణిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంగిపోతూ ఉండ వచ్చుగాక... కానీ ఇప్పటికీ పెర్త్, ఫీనిక్స్, ముంబై, మాసే లేదా కేప్ టౌన్, కోపెన్హాగన్ వంటి సుదూర ప్రాంతాల్లోని ప్రజలను కూడా కట్టిపడేస్తూ ఈ రోజుకీ ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఏకకాలంలో ప్రహస నంగానూ, బ్రిటన్ ప్రభావానికి తిరుగులేని సూచికగానూ ఉంటోందని చెప్పవచ్చు. రాణి తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఆమె అర్థవంతమైన శక్తిగా లేరు. కానీ ఆమె ప్రపంచం దృష్టిని ఇప్పటికీ తనవైపు తిప్పుకోగలరు. కాబట్టి ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న ఈ రాజదండాన్ని కలిగిన ద్వీపం లక్షణాలు ఏమిటి? మొట్టమొదటి లక్షణం నిస్సందేహంగా దాని రాచరికమే అని చెప్పాలి. ఈజిప్ట్ రాజు ఫారూఖ్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు, ఓ సుప్రసిద్ధమైన మాట చెప్పారు: ఏదో ఒక రోజు ప్రపంచంలో అయిదుగురు చక్రవర్తులు మాత్రమే ఉంటారనీ, వారు స్పేడ్, క్లబ్, హార్ట్స్, డైమండ్స్తోపాటు ఇంగ్లండ్ చక్రవర్తి అనీ అన్నారు. తొలి నాలుగు పేకాటలో ముఖ్యమైన ముక్కలు అని తెలిసిందే. ఈ ప్రపంచం బ్రిటిష్ రాచరికాన్ని విశిష్టమైనదిగా పరిగణి స్తుందనే సత్యాన్ని ఈజిప్టు రాజు పేర్కొన్నారు. బ్రిటన్ రాచరికానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే నా వద్ద కచ్చితమైన సమాధానం లేదు. కానీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ‘ది క్రౌన్’ వెబ్ సిరీస్‌కి ఉన్న ప్రజాదరణే దానికి రుజువుగా నిలుస్తుంది. బహుశా బ్రిటన్ ప్రదర్శనా సామర్థ్యం, దాని పురాతన సంప్రదాయాలు, ఆచారాలను ఆ సిరీస్ చక్కగా చూపించింది కాబోలు. అవి మనం కోల్పోయిన, మర్చి పోయిన ప్రపంచాన్ని మనకు గుర్తు చేస్తాయి. లేదా బహుశా రాజులు, రాణులు ఆకర్షణీయంగా మనలో శృంగార భావనలను వెలిగించి ఉండవచ్చు. కానీ, డచ్, స్కాండినే వియన్ లేదా జపనీస్ రాచరికం మనల్ని ఉద్వేగపర్చని కాలంలో బ్రిటిష్ రాచరికం పట్ల మనం ఇంత ఆసక్తి ఎందుకు చూపుతున్నట్లు? వాస్తవం ఏమిటంటే బ్రిటిష్ రాచరికాన్నే కాదు... ఎలిజెబెత్ రాణిని ప్రజలు ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తుండటమే. బ్రిటిష్ రాణి చనిపోయినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బ్రిటిష్ ప్రజలను ఉద్దేశించి ప్రసం గించారు. ‘‘మీకు ఆమె ‘మీ రాణి’గా ఉండేవారు. మాకు మాత్రం ఆమె ‘రాణి’గా(‘ద క్వీన్’– రాణి అంటే ఆమె మాత్రమే గుర్తొస్తుంది అన్న అర్థంలో) ఉండేవారు అన్నారాయన. బ్రిటిష్ రాణి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇలా మాట్లాడటమే అద్భుతమైన విషయం. మెక్రాన్ చాలా నిజాయతీగా ఆ మాటలన్నారు. దానికి ఫ్రాన్స్‌లో ఎవరూ ఆయన్ని తప్పుపట్టలేదు. ఇక రెండో లక్షణం ఏమిటంటే, బ్రిటన్ తన భాష ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించింది. చాలామందికి ఇంగ్లిష్ అందరూ ఆకాంక్షించే ఒక భాష మాత్రమే కాదు, అది సెకండ్ లాంగ్వేజిగా అందరూ ప్రాధాన్యం ఇచ్చే భాషగా ఉంటోంది. అది బ్రిటిష్ సామ్రాజ్యం కారణంగానా? సరిగ్గా ఉచ్చరించకపోయినా అమెరికా ఆ భాషను పంచు కుంటున్నందునా? లేదా ఏ ఇతర భాషకూ లేని గుణాలు ఇంగ్లిష్‌కి ఉండటం మూలంగానా? ఇది కూడా నాకు తెలీదు. కానీ షేక్స్పియర్ని ప్రపంచమంతా సుప్రసిద్ధుడైన రచయితగా ఎందుకు గుర్తి స్తోంది అనే అంశాన్ని ఇంగ్లిష్ భాషలోని పటుత్వం, దాని సమ్మోహన శక్తి స్పష్టంగా చెబుతాయి. డాంటే, హోమర్, పుష్కిన్, కాళిదాసు వంటి మహా రచయితలు, కవుల గురించి మీరు ఆలోచించవచ్చు. కానీ ‘గాయక కవి’ అని మనం పిలుచుకునే షేక్స్పియర్ ముందు వీరంతా తేలిపోతారు. బ్రిటన్ ప్రభావం బీబీసీ అంత అతి విస్తృతమైన ప్రభావంతో ఎందుకుందో మూడో కారణం కూడా చెబుతాను. సీఎన్ఎన్ అంత వనరులు బీబీసీకి లేకపోవచ్చు. బ్రిటిష్ ప్రజలే దాన్ని విమర్శిస్తూ ఉండవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వాలే బీబీసీని మూసివేయాలని తరచుగా ప్రయత్నించాయి. కానీ బయటి ప్రపంచంలో సమగ్రత, నిర్దిష్టత రీత్యా బీబీసీకి ఎనలేని గుర్తింపు ఉంది. 1984లో తన మాతృమూర్తి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఆమె ప్రభుత్వమే రాజీవ్‌గాంధీకి తెలియ జేసినప్పటికీ, దాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆయన బీబీసీని చూశారు. (క్లిక్ చేయండి: మన నిశ్శబ్దం చేసిన గాయం) బ్రిటిష్ ఆకర్షణ శక్తిని వివరించడానికి నేను మరో కారణాన్ని జత చేస్తాను. అదేమిటంటే బ్రిటిష్ వారి హాస్య చతురత. అది కేవలం సున్నితమైంది మాత్రమే కాదు, దాన్ని తక్కువ చేసి చెప్పలేం. మరోలా చెప్పాలంటే బ్రిటిష్ హాస్యచతురత తనను చూసి తానే నవ్వుకుంటుంది. బ్రిటిష్ జోక్స్‌కి తరచుగా రాచకుటుంబమే బలవుతూ ఉంటుంది. ప్రత్యేకించి అందరికంటే ఎక్కువగా ప్రిన్స్ చార్లెస్ కూజా చెవులు, విపరీతమైన అభిరుచులు, చాదస్తపు పద్ధతులపై మరింత ఎక్కువగా జోకులు ఉండేవి. అదే భారతదేశంలో అయితే ప్రధానమంత్రిపై లేక రాష్ట్రపతిపై మీరు పేరడీలు కడితే మీ మీద రాజద్రోహ ఆరోపణలు తప్పవు. హాస్యం లోనే ప్రజాదరణ, దాంతోపాటు అభిమానం కూడా పుట్టుకొస్తాయని బ్రిటిష్ వారు గుర్తించారు మరి. ‘ఎస్, ప్రైమ్ మినిస్టర్’, ‘ది టూ రోనీస్’ వంటి కామెడీ షోలు, లేదా ఇంకా వెనక్కువెళ్లి ‘లారెల్ అండ్ హార్డీ’లను తల్చుకోండి. బ్రిటిష్ వారి హాస్య చతురత తక్కిన ప్రపం చాన్నే నవ్వించింది అంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండ లేరు. ఫ్రెంచ్ ప్రజలు, జర్మన్లు, ఆస్ట్రేలియన్లు లేదా అమెరికన్ల గురించి మీరు ఇలా చెప్పలేరు. (క్లిక్ చేయండి: ప్రజాస్వామ్యంలో రాజరికమా?) విక్టోరియా మహారాణిని మననం చేసుకోవడం ద్వారా నన్ను ఇక సెలవు తీసుకోనివ్వండి. పైకి గంభీరంగా కనిపించే విక్టోరియా రాణికి హాస్యపు నరం లోపించింది. ఎప్పుడూ ఆమె ఉల్లాస రహితంగా, వినోదం అంటే పట్టని వ్యక్తిగా ఉండేవారు. ‘మేం నవ్వడం లేదు’ అనే జాలిగొలిపే పదబంధాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాను అనే విషయం కూడా విక్టోరియా బహుశా గుర్తించకపోయి ఉండ వచ్చు. ఈ పదబంధం ఇవాళ వ్యంగ్య ప్రధాన చతురతకు మారుపేరుగా ఉంటోది మరి! - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
వెస్ట్మిన్స్టర్ హాల్లోనే రాణి శవపేటిక ఎందుకంటే..
వెస్ట్మిన్స్టర్ హాల్ తలుపులు మూసుకుపోయాయి. భారత కాలమానం ప్రకారం.. వేకువఝామున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్లను అనుమతించడం ఆపేశారు. అంటే.. సుదీర్ఘకాలం యునైటెడ్ కింగ్డమ్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంతిమయాత్రలో కీలక ఘట్టం ముగిసిందన్నమాట. ఇక మిగిలింది అంత్యక్రియలే.. బ్రిటన్ సార్వభౌమాధికారులకు, గత.. ప్రస్తుత రాణి కాన్సోర్ట్‌లకు ఇచ్చే గౌరవం ఇదంతా. వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. పార్లమెంటరీ ఎస్టేట్‌లో అత్యంత పురాతనమైన బిల్డింగ్ ఇది. ► అత్యంత సువిశాలమైన భవనం మాత్రమే కాదు.. మిరుమిట్లు గొలిపే డిజైన్లతో గోడలు, అద్దాలు, పైకప్పు.. ఆకర్షనీయంగా ఉంటుంది. ► గతంలో కోర్టులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఇందులో నిర్వహించేవాళ్లు. ► 1910లో కింగ్ ఎడ్వర్డ్-7 మరణాంతరం ఆయన భౌతికాయాన్ని వెస్ట్మిన్స్టర్ హాల్లో ప్రజాసందర్శనార్థం ఉంచారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ► ఇంతకు ముందు.. 2002, మార్చి 30వ తేదీన క్వీన్ ఎలిజబెత్(క్వీన్ ఎలిజబెత్-2 తల్లి) మరణించగా.. అంత్యక్రియలకు పదిరోజుల ముందు నుంచి వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉంచారు. ► ఇప్పుడు.. గత బుధవారం నుంచి క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచారు. ► థేమ్స్ నది ఒడ్డున్న కిలోమీటర్ల మేర బారులు తీరి నిల్చున్నారు ఆమె అభిమానులు. రాణి గౌరవార్థం ప్రముఖులు సైతం ఒపికగా క్యూలో వచ్చారు. ► రాణి అంత్యక్రియల కార్యక్రమాన్ని బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న 125 సినిమా థియేటర్లు ప్రసారం చేయనున్నాయి. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఆమెకు నివాళులర్పించారు. ► క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాంతో ఉన్న శవపేటికను వెస్ట్మిన్స్టర్ అబేను తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► అక్కడ 2000 మంది అతిథులు(అందులో 500 మంది ప్రపంచ నేతలు) ఉంటారు. ► అబే నుంచి సెయింట్ జార్జిస్ చాపెల్ వద్ద క్రతువు కోసం రాణి శవపేటికను తరలిస్తారు. అక్కడ 800 మంది అతిథులకు స్థానం ఉంటుంది. ► కింగ్ జార్జి- మెమోరియల్ చాపెల్ వద్ద.. రాణి శవపేటికను ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి చెంతకు బ్రిటన్ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యుల సమక్షంలో చేరుస్తారు. ► చివర్లో శవపేటిక వెంట రాజు, రాణి, రాజవంశీయులు మాత్రమే ఉంటారు. సాయంత్రం శవపేటికను.. రాయల్ వాల్ట్‌లోకి దించుతారు. అక్కడ విండ్సర్ డీన్ కీర్తన ఉంటుంది. కాంటెర్బరీ ఆర్చిబిషప్ దీవెనలు, జాతీయ గీతాలాపతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా(ప్రభుత్వ) ముగుస్తుంది. అయితే.. ఆపై విండ్సర్ డీన్ ఆధ్వర్యంలో రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియతో మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. రాజవంశంలో రాజు/రాణిలకు దాదాపుగా ఇదే తరహాలో అంత్యక్రియలు జరుగుతుంటాయి. -
మహారాణికి ప్రపంచ నేతల నివాళులు (ఫొటోలు)
-
క్వీన్ ఎలిజబెత్ మా అమ్మలాంటిది: బైడెన్ భావోద్వేగం
వాషింగ్టన్ డీసీ: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అంతా సిద్ధం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారమే బ్రిటన్‌కు చేరుకుని రాణి శవపేటిక వద్ద నివాళి అర్పించారు. రాజకుటుంబానికి నివాళులర్పించే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారాయన. క్వీన్ ఎలిజబెత్-2 తన తల్లితో సమానం అంటూ వ్యాఖ్యానించారాయన. అంతా బాగుందా? నేనేమైనా సాయం చేయగలానా? మీకేం కావాలి? అంటూ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారాయన. అంతేకాదు.. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అంటూ ఒక తల్లిలా వెన్నుతట్టి ముందుకు ప్రొత్సహించేవారని గుర్తుచేసుకున్నారాయన. బ్రిటన్ నూతన రాజు, క్వీన్ ఎలిజబెత్-2 తనయుడు కింగ్ ఛార్లెస్-3కి ధైర్యం చెప్పిన బైడెన్.. యావత్ బ్రిటన్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 70 ఏళ్ల ఆమె పాలనలో ప్రపంచం మొత్తం ఆమె ఔనత్యాన్ని కళ్లారా వీక్షించిందని, ఆమెతో గడిపిన సరదా క్షణాలు మరువలేనివని, ఆ సమయంలో ఆమెను చూస్తే తన తల్లి గుర్తుకు వచ్చారంటూ భావోద్వేగ ప్రకటనను వైట్‌హౌజ్ ద్వారా విడుదల చేయించారు బైడన్. రాణి అంత్యక్రియల షెడ్యూల్ ► సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే రాణికి సందర్శకుల నివాళి కొనసాగుతుంది. ► ఆపై.. తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది. ► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని.. వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. ► శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది. ► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్‌లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. ► వెస్ట్‌మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్‌లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్‌లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్‌కు వస్తారని ఒక అంచనా. -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అధికారిక అంత్యక్రియలు సోమవారం(19వ తేదీన) జరుగనున్నాయి. రాణి మృతదేహాన్ని లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్లో సోమవారం ఉదయం 6.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరరం.. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. ఇందులో భాగంగానే.. భారత ప్రభుత్వం తరఫున బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం లండన్ చేరుకున్నారు. President Droupadi Murmu arrives in London to attend the State Funeral of Her Majesty Queen Elizabeth II. pic.twitter.com/T6zWlJGkYB — President of India (@rashtrapatibhvn) September 17, 2022 ఇక, రాణి అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ దేశాల నేతలు మాత్రం హాజరు కావడం లేదు. వారికి రాజ కుటుంబం ఆహ్వానం పంపించలేదు. -
రాణి తుది వీడ్కోలు.. ఆహ్వానం లేనిది వీళ్లకే!
లండన్: రాణి ఎలిజబెత్-2 మృతదేహం లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(19న) ఉదయం 6.30 గంటల వరకు ఉంటుందని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. అయితే.. రాణి అంత్యక్రియలకు అధికారిక ఆహ్వానం అందనిది ఎవరికో తెలుసా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు. అవును.. ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో ఆయనపై యూకే కూడా ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ విధించింది. అందుకే ఆయనకు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆహ్వానం అందించలేదు. అయితే రష్యా నుంచి ఏ ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ నొచ్చుకుంది. ఈ చర్య అనైతికమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక సిరియా, వెనిజులా, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు అసలు ఆహ్వానం పంపలేదు. బెలారస్, మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్‌కు ఆహ్వానం పంపించలేదు యూకే. అలాగే కొన్ని చిన్నచిన్న దేశాలనూ కూడా మినహాయించింది. నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ పాలనలోని ఉత్తరకొరియా, నికారాగువా, ఇరాన్‌ల నుంచి దౌత్యవేత్త స్థాయి వాళ్లకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేసింది. భర్త సమాధి పక్కనే.. ఇక సోమవారం జరగబోయే అంత్యక్రియల కార్యక్రమం.. బ్రిటన్ వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించడంతో ముగుస్తుంది. అనంతరం రాణి పార్ధివ దేహం ఉంచిన శవపేటికను వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు వెస్ట్‌మినిస్టర్ అబే తలుపులు తెరుస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు 500 మంది హాజరవుతారు. రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి విండ్సర్ క్యాజిల్ సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్ వద్ద జరిగే కార్యక్రమం కోసం తరలిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు రాయల్ వాల్ట్‌లోకి శవపేటికను దించుతారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ జస్టిన్ ఆశీర్వచనాల మధ్య అక్కడ చేరిన వారంతా ‘గాడ్ సేవ్ ది కింగ్’గీతాన్ని ఆలపిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే కార్యక్రమంలో భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. ఇదీ చదవండి: చావు నుంచి మళ్లీ పుట్టుక వైపు! -
వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు రాణి పార్థీవదేహం (ఫొటోలు)
-
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరుకానున్న ద్రౌపది ముర్ము
సాక్షి,న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాణికి నివాళులు అర్పించనున్నారు. సెప్టెంబర్ 17-19 వరకు ముర్ము పర్యటన ఉంటుంది. ఎలిజబెత్ 2 అంత్యక్రియలు వెబ్‌మిన్‌స్టర్ అబ్బేలో సోమవారం(సెప్టెంబరు 19న) జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచదేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 96 ఏళ్ల బ్రిటన్ రాణి సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12 ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్లి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. రాణి మృతి పట్ల భారత్ సెప్టెంబర్ 11న సంతాప దినం నిర్వహించింది. చదవండి: పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్ -
ఐ హేట్ దిస్.. బ్రిటన్ రాజు చార్లెస్ చికాకు
డబ్లిన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ కోసం సంతాపాన్ని తెలియజేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో.. ఉత్తర ఐర్లాండ్‌ను సందర్శించిన చార్లెస్.. ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే.. బెల్ఫాస్ట్ సమీపంలోని హిల్స్‌బరో క్యాజిల్(కోట)కు చేరుకున్న ఆయన.. సందర్శకుల పుస్తకంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఛార్లెస్ తన చేతిలోని పెన్ను లీక్ కావడంతో నిరాశతో చెందారు. ‘‘ఓహ్ గాడ్ ఐ హేట్ దిస్ (పెన్)!’’ అంటూ చార్లెస్ లేచి నిలబడి చేతిని తుడుచుకుంటూ ఆ పెన్నును తన భార్య, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాకు అందజేశాడు. ఆపై ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడాయన. I LOVE this pic.twitter.com/cL1KpFA5gI — Rupert Myers (@RupertMyers) September 13, 2022 ఇదిలా ఉంటే.. చార్లెస్ రాజుగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛార్లెస్ చాలా సరదాగా ఉంటారు. కానీ, ఆయనకు షార్ట్‌టెంపర్. అదీ ఇదీ కావాలని అడుగుతుంటారు కూడా’’ అని వెల్లడించారు. నాలుగేళ్ల వయసులో ఛార్లెస్ ఇదిలా ఉంటే.. శనివారం లండన్‌లో పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు, టేబుల్‌పై ఉన్న పెన్ హోల్డర్ అడ్డుతగలడంతో విసుగు చెందిన చార్లెస్.. సహాయకులకు సహాయం చేయమని సైగ చేయడం, తన అసహనాన్ని ప్రదర్శించడం తెలిసే ఉంటుంది. స్వతహాగానే ఆయన ప్రవర్తన అలా ఉంటుందని కొందరు అంటుంటే.. 73 ఏళ్ల ఛార్లెస్ వయసురిత్యా అలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్ శవపేటిక బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకుంది. video courtesy: Daily Mail -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్‌కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్‌ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్‌లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం(సెప్టెంబర్ 8న) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అదే రోజు చనిపోతుందని ముందుగానే ఊహించాడు ఓ వ్యక్తి. ఈ ఏడాది జులైలోనే అతను ఈమేరకు ట్వీట్ చేశాడు. లోగన్ స్మిత్(@logan_smith526) అనే పేరుతో ఉన్న ఇతని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్‌కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. రాణి మరణించిన క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోగన్ స్మిత్ ట్వీట్‌ను వేలమంది రీట్వీట్ చేశారు. అయితే అతడు తన ట్వీట్లో రాణి మరణించే తేదీతో పాటు కొత్త రాజు ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని కూడా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అతడు అంచనావేయడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్‌ను ట్విట్టర్లో ఎక్కువమంది రీట్వీట్ చేస్తుండటంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో అతని పాత ట్వీట్లు సాధారణ యూజర్లకు కన్పించడంలేదు. అయితే పాత ట్వీట్ స్క్రీన్ షాట్లనే చాలా మంది యూజర్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. మరికొందరు లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ యూజర్ అయితే లోగన్ నువ్వు జాగ్రత్త.. బ్రిటిష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు. మరో యూజర్ స్పందిస్తూ ఇప్పటికే రాణి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాం, అలా చెప్పొద్దు అని రాసుకొచ్చాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. కింగ్ చార్లెస్ 2026లో చనిపోతారనే అంచనా కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో నిర్ణయించేది ఆ భగవంతుడే అని రాసుకొచ్చాడు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్ల మార్పు! విలువెంతంటే..
లండన్: బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేషన్స్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్స్, రాయల్ మింట్ నుంచి కాయిన్స్ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్‌లో బ్యాంక్ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్‌కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది. రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్ అమెరికన్ డాలర్లు(ఒక బిలియన్ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. రాజు బొమ్మతో ఎలాగంటే.. కింగ్ ఛార్లెస్-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్ ఛార్లెస్-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది. ఇదీ చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం
లండన్: బ్రిటన్ రాజు హోదాలో కింగ్ ఛార్లెస్–3 పార్లమెంట్లో తొలి ప్రసంగం చేశారు. సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్ పార్లమెంట్లో క్వీన్ ఎలిజబెత్ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు. అస్తమయం చెందిన రాణి ఎలిజబెత్–2కు ఎంపీలు సహా దాదాపు 900 మంది ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు, రాణి పార్థివదేహాన్ని మంగళవారం స్కాట్లాండ్ నుంచి లండన్‌కు వాయు మార్గంలో తీసుకురానున్నారు. ఇదీ చదవండి: చనిపోయే ముందు వాళ్లకు రాణి గ్రీటింగ్స్!! -
బ్రిటన్ రాణి చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. వీటిపై ఆమె స్వయంగా సంతకం చేశారు. ఈ అరుదైన కార్డు తమకు కూడా అందిందని ఓ వృద్ధ జంట వెల్లడించింది. రాణి సంతకం చేసిన గ్రీటింగ్ కార్డు అందుకున్న అతికొద్ది మందిలో తామూ ఉండటంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ భార్యాభర్తల పేర్లు ట్రికియా పోంట్, రాయ్. సెప్టెంబర్ 8న వీరి 60వ వివాహ వార్షికోత్సవం. రాణి ఎలిజబెత్ 2 కూడా అదే రోజు మరణించారు. అయితే అంతకుముందే ఆమె ఈ ఏడాది డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ(60వ పెళ్లిరోజు) జరుపుకుంటున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు. ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ 3 నుంచి కూడా వీరికి లేఖలు అందే అవకాశం ఉంది. సుర్రేకు చెందిన ఈ వృద్ధ దంపతులు రాణి నుంచి అందిన గ్రీటింగ్ కార్డు చూసి మురిసిపోయారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ లెటర్ ఓపెన్ చేసిన అనంతరం వేడుక చేసుకునేందుకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం బయటకు లంచ్‌కు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగివచ్చేసరికి రాణి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యారు. 80ఏళ్లు పైబడిన ఈ వృద్ధ జంట.. రాణి తమకు పంపిన లేఖను నిధిలా దాచుకుంటామన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మందికి మాత్రమే రాణి సంతకం చేసిన లేఖలు అందాయని, అందుకే ఇది తమకు ఎంతో విలువైనదని చెప్పారు. రాణికి తాము పెద్ద అభిమానులమని, దేశానికే ఆమె స్పూర్తిదాయకం అని కొనియాడారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
క్వీన్ ఎలిజబెత్-2 రహస్య లేఖ! తెరిచేది ఎప్పుడంటే..
సిడ్నీ: క్వీన్ ఎలిజబెత్-2 స్వదస్తూరితో రాసిన ఓ లేఖ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ లేఖను ఇంతవరకు ఎవరూ చదివింది లేదు. అలాగే.. భద్రంగా ఓ చోట ఉండిపోయింది. మరి రాణి చనిపోయింది కదా!. అది అలాగే రహస్యంగా ఉండిపోవాల్సిందేనా?.. 1986 నంబర్లో సిడ్నీ(ఆస్ట్రేలియా) ప్రజలను ఉద్దేశించి.. క్వీన్ ఎలిజబెత్-2 ఓ లేఖ రాశారు. దానిని సిడ్నీలోని ఓ చారిత్రక భవనం వ్యాలెట్‌లో భద్రంగా దాచారు. అయితే.. అందులో ఏముందనే విషయం అది రాసిన రాణివారికి తప్పా ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆమె మరణించడంతో ఆ లెటర్‌ను బయటకు తీయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే ఆ లెటర్‌ను తెరుస్తారట. అది ఇంకా 63 ఏళ్ల తర్వాత. అంటే.. 2085లో. సిడ్నీ లార్డ్ మేయర్‌ను ఉద్దేశిస్తూ.. ఎలిజబెత్ రాణి 2 ఆ లేఖను ‘‘2085వ సంవత్సరంలో ఓ మంచి ముహూర్తాన ఆ లేఖను తెరవండి అంటూ ఎలిజబెత్ రాణి సంతకం చేశారు. దీంతో ఆమె కోరిక మేరకు అప్పటివరకు గ్లాస్ బాక్స్‌లో ఉన్న ఆ లేఖను అలాగే ఉంచాలని సిడ్నీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో క్వీన్ ఎలిజబెత్-2కు ప్రత్యేక అనుబంధం ఉంది. పదహారుసార్లు ఆమె ఆ దేశాన్ని సందర్శించారు. 1901లో ఆస్ట్రేలియా స్వాతంత్రం ప్రకటించుకుంది. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగారు. 1999లో ఆమెను ఆ దేశ అధినేతగా తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ, అది వీగిపోయింది. ఇదీ చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువెంతంటే.. -
ఎడింబర్గ్‌కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌కు తరలిస్తారు. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా?
లండన్: రాజవంశస్థులు అంటేనే కోట్ల ఆస్తులకు వారసులు. అత్యంత సంపన్నులు. మరి బ్రిటన్ రాజకుటుంబం అంటే ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ, రాజకుటుంబం నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు మొత్తం ఈ ఫొటోలో చూడండి. నూతన రాజముద్రిక రాజకిరీటం, దానికింద సీఆర్ అంటూ పొడి అక్షరాలతో కింగ్ చార్లెస్–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది. సీ అంటే చార్లెస్, ఆర్ అంటే రెక్స్ (లాటిన్లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్ పాలన సాగినంత కాలం బ్రిటన్‌తో పాటు ఇతర కామన్వెల్త్ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్‌పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్ హయాంలో రాజముద్రికపై ఈఆర్ (ఎలిజబెత్ రెజీనా) అని ఉండేది. సవరణ బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల గ్రాఫ్‌లో కార్న్‌వాల్ ఎస్టేట్ విలువ 1,300 కోట్ల డాలర్లు, బకింగ్‌హాం ప్యాలెస్ విలువ 4,900 కోట్ల డాలర్లు అని పొరపాటుగా వచ్చింది. వాటిని 130 కోట్ల డాలర్లు, 490 కోట్ల డాలర్లుగా చదువుకోగలరు. చదవండి: బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా? -
Amarnath Vasireddy: దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి సాయపడింది వారే! ఇక..
ఏ రాజ్యంలో , ఏ దేశంలో రాజులు ప్రజలకు మేలుచేసిండ్రు ... ? ఒక ప్రఖ్యాతి పొందిన పాట ! నిజమే ! ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం ? నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం ... శ్రీ శ్రీ .. రాజులకు , బ్రిటిష్ వలస పాలనకు ఒక మౌలిక తేడా ఉంది. ఒక రాజు ఎంత క్రూరుడైనా, అధిక పన్నులు వేసి ప్రజల రక్తాన్ని జుర్రినా , ఆ డబ్బు తన విలాసాలకు తగలెట్టినా ఆ డబ్బు ఇక్కడే వుండేది. ఆ రాజు గారి విలాసాల వల్ల కనీసం కొంతమందికి ఉపాధి వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే సర్కులేట్ అయ్యేది. బ్రిటిష్ పాలనలో మన సంపద వారి దేశానికి తరలి వెళ్ళిపోయింది. మహానుభావుడు గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆన్ ఇండియా గా పేరొందిన దాదాభాయ్ నౌరోజి తన "పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే గ్రంధం లో "డ్రైన్ అఫ్ వెల్త్ "అంటే సంపద జుర్రుడు లేదా సంపద వలస సిద్ధాంతం లో దీన్ని వివరించాడు . అందరు స్వతంత్ర సమర యోధులకు ఈ గ్రంధం మార్గదర్శి అయ్యింది. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వారు తమ దేశానికి తరలించిన సంపద విలువ సుమారుగా రెండు వేల అయిదువందల లక్షల కోట్లు (ఇరవై అయిదు ట్రిలియన్ పౌండ్లు) బ్రిటిష్ వారి కారణంగా కృత్రిమ అంటే మానవ ప్రేరేపిత కరువులు వచ్చాయి. బ్రిటిష్ పాలనకు ముందు ఆకలితో కరువుతో పెద్దగా చనిపోయిన దాఖలాలు లేవు. బ్రిటిష్ వారి కాలం లో కరువుతో ఆకలితో చనిపోయిన వారు సంఖ్య మూడు కోట్లు. పెద్దామె చనిపోతే అయ్యో పాపం అనడం తప్పుకాదు. ఇంగ్లాండ్ వెళ్లి ఉద్యోగం చెయ్యడం తప్పుకాదు. బతుకు తెరువు కోసం, మెరుగైన జీవనం కోసం వలసలు సహజం. అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు కక్ష తీర్చుకోండి అని చెప్పడం లేదు. చరిత్రనే మరచి లేదా పిల్లి మొగ్గల పుస్తకాలూ చదివి బ్రిటిష్ వారివల్లే మనం డెవలప్ అయ్యాము. మనకు ఉపాధి వచ్చినది అంటే.. మీ అవగాహన, మీ ఇష్టం . తెలియక పొతే అడగండి. ఎన్ని గంటలైనా చెబుతాను. కానీ నాకు తెలిసిందే సర్వం అని మన సమర యోధుల త్యాగఫలాలను అవహేళన చేసేలా మాట్లాడం అన్యాయం. ఇలాంటి బ్యాచ్ బ్రిటిష్ కాలంలో కూడా ఉండేది. దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి వారే సాయపడింది. అది కాకుండా ఇంకో బ్యాచ్ ఉండేది.. మనదైతే కంపు కొడుతుంది. తెల్లటి బ్రిటిష్ దొరల మలం సువాసనలు వెదజల్లుతుంది అని నమ్మే వారు. ఇది జోక్ కాదు. నిజం. ఇలాంటి కంపు బ్యాచ్‌తో మాట్లాడే ఓపికే నాకు లేదు. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు చదవండి: Amarnath Vasireddy: కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ