లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు.
కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్‌ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్‌ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
ఛాన్స్ ఎప్పటికీ రాదని..
కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు.
తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్‌ది కూడా గ్రీసే అని సిప్రస్‌కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్‌తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు.
జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది.
చదవండి: బకింగ్‌హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు
Comments
Please login to add a commentAdd a comment