palace
-
ఎవరీ అనన్య రాజే సింధియా..? 400 గదులు, 560 కిలోల బంగారంతో..
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్‌లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్‌కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.ఆ రాకుమార్తె ఎవరంటే ..జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్‌బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్‌చాట్(Snapchat)లో ఇంటర్న్‌గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి. వాళ్లుండే ప్యాలెస్..సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లో నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్‌పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!) -
సైఫ్అలీఖాన్కు కత్తిపోట్లు: కరీనా, సైఫ్ లగ్జరీ బంగ్లా ఇదే (ఫోటోలు)
-
Saif Ali Khan: రాజవంశం.. రూ.100 కోట్ల ఇల్లు.. రూ.800 కోట్ల ప్యాలెస్
-
కళాత్మక రాజసం జైపూర్ ఆర్ట్ సెంటర్
‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్‌సిటీ జైపూర్‌లోని గంగోరి బజార్లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.సర్వతో రుచులుఈ ప్యాలెస్‌ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి. అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్‌కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్‌ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్‌లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్లో సిటీ ప్యాలెస్ విజిట్‌ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. -
నేటి ఆధునిక గృహాలలో నాటి ప్యాలెస్ కళ
మహారాజా ప్యాలెస్‌ల నుండి ఇకత్ డిజైన్ల వరకు ఆధునిక ఇళ్లలో భారతీయ కళల ప్రభావం అంతర్లీనంగా ఉంటోంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, మనదైన వారసత్వం ఇంటీరియర్ డిజైన్‌లో కొంగొత్త నిర్వచనాన్ని చూపుతుంది.భారతీయ కళలు మ్యూజియంలు, గ్యాలరీలకు మించి విస్తరిస్తున్నాయి. ఇవి మనం నివాసం ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేస్తున్నాయి. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, భారతీయ వారసత్వంలోని ఈ అంశాలు ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌ను సరికొత్తగా చూపుతున్నాయి. భారతీయ కళ, సంప్రదాయాన్ని గౌరవించే సేకరణలు సమకాలీన గృహాలలోకి ప్రవేశించి, కలకాలం నిలిచేలా రిఫ్రెష్‌గా భావించే ఇంటీరియర్లను సృష్టిస్తున్నాయి. వారసత్వ ప్రేరేపిత డిజైన్లు సంప్రదాయంతో ఎంతో గొప్పగా ఉంటాయని రుజువు చేస్తున్నాయి. మహారాజ ప్యాలెస్–ప్రేరేపిత ఇంటీరియర్స్భారతీయ చరిత్ర మొత్తం వైభవంతో కూడిన కథలతో నిండి ఉంటుంది. హస్తకళతో పాటు ఎన్నో అంశాలకు ఉదాహరణలుగా నిలిచే రాజభవనాలు ఉన్నాయి. ఈ రీగల్–ప్రేరేపిత డిజైన్లు గ్రాండ్ మహారాజా ప్యాలెస్‌ల ఆర్చ్‌లు, మోటిఫ్‌లు, విలాసవంతమైన అలంకారాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఇవి నేటి కాలపు అందానికి ప్రతీకగానూ ఉంటాయి. చికన్కరి సొగసుఇంటీరియర్ నిపుణుడు, మెరినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ లోహియా మరింత వివరిస్తూ, ‘రీగల్ శ్రేణిలో గజముద్ర, వసంత, సంస్కృతి వంటి డిజైన్ లు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశమూ రాజ వైభవంతో అలరారుతుంటుంది. ఆ తర్వాత భారతదేశ విభిన్న కళారూ΄ాలలో చికన్కరీ ఎంబ్రాయిడరీ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ డిజైన్లు అల్లికలతో ఉంటాయి. చేతితో తయారైన ఈ అల్లికలు సాగసుగానూ, అందుబాటులో ఉంటాయి. అలంకృత్ ఒక అలంకారమైన ఆభరణాన్ని పోలి ఉంటుంది. కర్ణిక భారతీయ చెవి΄ోగుల నుండి స్ఫూర్తిని పొందింది. సాంప్రదాయ హవేలీలలో కనిపించే ఈ తోరణాల కళ నేటి ఆధునిక ఇళ్లలోనూ కనిపిస్తుంది. వాస్తుశిల్పం కూడా ఆధునిక అమరికలో చక్కగా ఇమిడిపోయి గొప్ప వారసత్వ కళతో ఆకట్టుకుంటున్నాయి’ అని ఆయన వివరించారు.ఇకత్ వీవింగ్ డిజైన్స్ఇకత్ అనేది దాని అద్భుతమైన నమూనాలు, సజీవ రంగులకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కళారూపం. కొత్త మెటీరియల్‌లలో ఈ నమూనాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా, ఆధునిక డిజైన్ సేకరణలు అదే శక్తి, చైతన్యంతో నింపుతున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ శ్రీ మనోజ్ మాట్లాడుతూ– ‘ఇకత్ హస్తకళకు కేంద్రంగా ఉండే ఒక థ్రెడ్‌వర్క్. సముద్రపు అలల నమూనాలను తలపిస్తోంది. ప్రశాంతతను కలిగిస్తుంది. తరంగ్ పుష్పం సున్నితమైన అందాన్ని మిళితం చేస్తుంది. ఈ డిజైన్లు ఒక గదికి శిల్పకళాపరమైన అందాన్ని తీసుకువస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సౌందర్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపారు. (చదవండి: తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం) -
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్‌లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్‌కి లేదా సంక్రాంతి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోండి. -
సిగ్గేస్తున్నది బాబూ!
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్‌మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు. ‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్‌ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్‌ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్లకూ, కమోడ్లకూ, ఫ్యాన్లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!
మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్ టూర్. వడయార్ రాజకుటుంబీకులు మైసూర్ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్‌ను ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. ప్యాలెస్ లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. దర్బార్ హాల్లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్ కోసం కూడా కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్ సిల్క్ చీరలను కొనడంతో ట్రిప్ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేయాలి.ఉదయాన్నే చూడాలి..!మైసూర్ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. ప్యాలెస్ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙ ప్యాలెస్ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్ వేయడం మంచిది పెద్దవాళ్లు ప్యాలెస్ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్ చైర్లను వాడుకోవచ్చు. గైడ్ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్ చేయవచ్చు ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. దానికి చార్జ్ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్ గురించిన వివరాలను వింటూ తిలకించాలి రాత్రి లైట్ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే అవకాశం ఉంటుంది. (చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
రాణాల ప్రతాపానికి ప్రతీక
రాజ్ మహల్... తాజ్ మహల్ కాదు, రాజ్ మహలే. రాజస్థాన్‌లో చల్లటి నగరం ఉదయ్‌పూర్‌లో ఉందీ రాజ్‌మహల్. రాజస్థాన్ అనగానే విస్తారమైన ఎడారి, ఇసుక తిన్నెలు, ఎండకు మిలమిల మెరుస్తున్న ఇసుకలో సుదూర ప్రయాణం చేస్తున్న ఒంటె అడుగు జాడలు గుర్తొస్తాయి. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఉదయ్‌పూర్. నగరంలో ఎటు వెళ్లినా ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది. కనుచూపు మేరలో ఆరావళి పర్వతాలు పచ్చగా ఉంటాయి. ఆ పచ్చదనానికి దీటుగా నగరంలో కోటలోపల ప్యాలెస్‌ల మీద కూడా చెట్లు ఉంటాయి. వాటిని చెట్లు అనకూడదు, మహావృక్షాలవి. కొండ శిఖరం, వాలును ఆసరాగా చేసుకుని నిర్మించిన ప్యాలెస్‌లో చెట్ల మొదళ్లు మూడో అంతస్థులో ఉంటాయి. రాజ్‌మహల్ పేరుతో నిర్మించినప్పటికీ సిటీప్యాలెస్గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్యాలెస్ గురించి చెప్పుకునే ముందు పద్మావత్ సినిమాలో చూసిన చిత్తోరగఢ్ను గుర్తు చేసుకోవాలి. మహారాణా ఉదయ్ సింగ్ (రాణాప్రతాప్ తండ్రి) పుట్టిన కోట అది. అది అన్యాక్రాంతమైన తర్వాత ఉదయ్‌సింగ్ ఈ నగరాన్ని నిర్మించి ఇక్కడి నుంచే పాలన కొనసాగించాడు. నగరం శత్రుదుర్భేద్యంగా ఉండాలి, అదే సమయంలో నీటికి ఇబ్బంది లేకుండానూ ఉండాలనే ఉద్దేశంతో కొండలు, సరస్సుల మధ్య నిర్మించాడు. అందుకే దీనిని లేక్ సిటీ, కశ్మీర్ ఆఫ్ రాజస్థాన్ అంటారు.వంట పాత్రలు... ఇనుప కవచాలుసిటీ ప్యాలెస్... పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. సిటీ ప్యాలెస్ ఎక్స్టీరియర్ వ్యూ అది కూడా ఒక వైపు కవర్ చేయాలంటే పిచోలా లేక్‌లో బోట్ షికారు చేయాలి. రాణి వంట గది ప్యాలెస్ లోపల ఉంటుంది. సిసోడియా రాజ వంశీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. రోజూ సూర్యుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. ప్యాలెస్లోపల అనేక చోట్ల సూర్యుడి లోహపు రూ΄ాలుంటాయి. శీతాకాలంలో మబ్బు పట్టి సూర్యుడు కనిపించని రోజుల్లో లేత కిరణాలు ఆ లోహపు సూర్యుడి ప్రతిమ మీద ప్రతిబింబిస్తాయి. ఆ ప్రతిబింబానికి నమస్కారం చేసి వంటకాలు నివేదన చేస్తారు. సూర్యుడికి నివేదించే వంటలను ప్యాలెస్ లోపలి వంటగదిలో రాణి స్వయంగా చేయడం ఆనవాయితీ. ప్యాలెస్ ద్వారాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయా అనిపిస్తాయి. తల పైకెత్తి చూడాలి. కొన్ని గదుల్లోకి మాత్రం నడుము వరకు వంగి వెళ్లాలి. శత్రువులు దాడి చేసినప్పుడు రక్షణ కోసం ఆ ఏర్పాటు. కొన్ని గదుల్లో యుద్ధ సామగ్రి ఉంటుంది. మహారాణా ప్రతాప్ భుజాల నుంచి మోకాళ్ల వరకు ధరించిన ఇనుప కవచం మన ఎత్తు ఉంటుంది. దానిని చూస్తూ ఆశ్చర్యపోయే లోపు గైడ్ పక్కనే ఉన్న గుర్రాన్ని చూపిస్తాడు. అది చేతక్ నమూనా. మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. తెల్లగా ఉంటుంది. ఆ గుర్రం నమూనా తయారు చేసి చేతక్ ధరించిన కవచాన్ని ధరింపచేశారు. రాజు ఒక్క ఉదుటున ఆ గుర్రం మీదకు ఎక్కాలంటే రాజు ఎత్తు ఎంత ఉంటుంది! అనే సందేహాన్ని ఎదురుగా ఉన్న కవచం నివృత్తి చేస్తుంది. ప్యాలెస్‌లో రాణి గది ఎదురుగా ΄ాలరాతి బెంచ్ ఉంటుంది. రాజు మందిరానికి వచ్చినప్పటికి రాణి అలంకరణ పూర్తి కాకపోతే, అలంకరణ పూర్తయ్యే వరకు రాజు ఆ ఆసనం మీద కూర్చుని ఎదురు చేసేవాడని గైడ్ చెప్పినప్పుడు పర్యాటకుల పెదవుల మీద ఓ చిరునవ్వు విరుస్తుంది. ప్యాలెస్ లోపల కొంత భాగంలో రాజకుటుంబం నివసిస్తోంది. కొంత భాగంలోనే పర్యాటకులను అనుమతిస్తారు. -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్!
విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఆక్రమణలో ఉన్న మిగులు భూమిని 0.3530 చదరపు మీటర్లుగా తేలుస్తూ 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జాయింట్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలతో 22ఏ జాబితాను విడుదల చేశారు. మిగులు భూమిగా తేల్చిన మొత్తాన్ని 22 ఏ 1(డీ) జాబితాలో టీడీపీ ప్రభుత్వమే చేర్చింది. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేలో భాగంగా మళ్లీ పక్కాగా సర్వే చేసి గాదిరాజు ప్యాలెస్‌లో వాస్తవ మిగులు భూమి కేవలం 0.1141 చదరపు మీటర్లుగా తేల్చింది. అంతేకాకుండా దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని గత మే నెలలోనే జాయింట్ కలెక్టర్.. స్థానిక తహసీల్దార్ ద్వారా నోటీసులు జారీ చేశారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పక్కాగా యాజమాన్య హక్కులను పొందేందుకు గాదిరాజు రామకృష్ణరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉండగా... దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అయ్యన్నపాత్రుడు అసత్య ఆరోపణలు చేశారు. వీటిపై స్పష్టత తీసుకునేందుకు శుక్రవారమంతా మీడియా ప్రయత్నించినా ఆయన ముఖం చాటేశారు. దీన్ని బట్టి కావాలనే ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/విశాఖ సిటీ ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గాదిరాజు ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో యూఎల్సీ భూమి ఉన్నట్టు తేల్చిన విస్తీర్ణం కేవలం 0.1141 చదరపు మీటర్లు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా తేల్చిన సర్వే ప్రకారం మిగులు భూమి సుమారు 6 సెంట్ల మేర తగ్గింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం పక్కాగా సర్వే చేసి వాస్తవ లెక్కలను తేల్చింది. దీన్నిబట్టి గత టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ లెక్కలను చూపి గాదిరాజు యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని అర్థమవుతోంది. అయితే, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం కుటుంబంపై దుష్ప్రచారమే చేయడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలకు దిగారు. గాదిరాజు ప్యాలెస్ కావాలని దాని యజమానిని ముఖ్యమంత్రి సతీమణి కోరారని అభూత కల్పనలను సృష్టించేశారు. ఇందుకు గాదిరాజు ప్యాలెస్ యజమాని రామకృష్ణరాజు ఒప్పుకోకపోవడంతో ఆ ప్యాలెస్‌ను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటూ అసత్య ఆరోపణలు చేశారు. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి ఎంపీ టికెట్, తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే చంద్రబాబు మెప్పు పొందొచ్చని దిగజారుడు రాజకీయానికి దిగారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రక్షణ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్సిటీ మొదలుకుని అనేక మంది టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేశారు. అందినకాడికి బినామీ పేర్లతో కబ్జా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరుల నుంచి రక్షించింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్లో బోర్డులను పాతడంతో పాటు చుట్టూ అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్యాలెస్ అడిగారనేది పూర్తిగా అవాస్తవం.. గాదిరాజు ప్యాలెస్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తన అనుచరులను పంపించి అడిగించారన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌పై కూడా అభాండాలు వేయడం బాధ కలిగించింది. ప్యాలెస్ ఇవ్వడానికి నేను ఒప్పుకోకపోవడంతో ప్యాలెస్ స్థలాన్ని 22ఏలో పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు ఇప్పించారని ఒక పత్రికలో వార్త రాయడం అన్యాయం. ఇంత దారుణమైన, అసలు సంబంధంలేని వార్తను నేనెప్పుడూ చూడలేదు. నేను అయ్యన్నపాత్రుడిని కలిసినట్లు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటివరకు కనీసం నేరుగా కూడా ఆయనను చూడలేదు. వాస్తవానికి ఇదేం పెద్ద ప్యాలెస్ కాదు.. వేరే ప్రాంతంలో ఉన్న మోడల్‌ను చూసి నచ్చి ఇక్కడ నిర్మించుకున్నాను. పెద్దవారికి ఇది చాలా చిన్న విషయం.. ఇటువంటి బిల్డింగ్‌ను ఎవరైనా కట్టొచ్చు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నా.. ఇప్పటికీ కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరూ, ఎక్కడా కలవలేదు. రాజకీయాలతో ఏ సంబంధంలేని నన్ను, జిల్లా కలెక్టర్‌ను ఇందులో ఎందుకు లాగారో అర్థం కావడం లేదు. గాదిరాజు ప్యాలెస్ స్థలాన్ని 1997లో కొనుగోలు చేశా.. అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టా. ఈ భూమిలో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని.. ఏడాదిన్నర క్రితమే నోటీసు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందిలో కొందరికి పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని చూపించారు. వాస్తవానికి గతంలోనే నిబంధనల ప్రకారం అన్నీ చెల్లించి ప్రతి గజాన్ని రిజిస్టర్ చేయించుకున్నా. అది యూఎల్సీ స్థలమని ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా. –గాదిరాజు రామకృష్ణరాజు, గాదిరాజు ప్యాలెస్ యజమాని వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తే చర్యలు.. ప్యాలెస్‌కు సంబంధించిన భూమి చినవాల్తేరు గ్రామంలో సర్వే నెంబర్ 10/4ఏ2ఏ, 10/4ఏ2బీ/2ఏ, 10/5ఏ2లో 0.2937 చదరపు మీటర్ల విస్తీర్ణం మిగులు భూమిగా ఉన్నందున 2018లోనే ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏ (1)(డీ) రిజిస్టర్లో నమోదైంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 84 ప్రకారం.. సదరు మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవాలని గాదిరాజు ప్యాలెస్ యజమానిని కోరుతూ ఈ ఏడాది మే 23న సీతమ్మధార తహసీల్దార్ నోటీసు జారీ చేశారు. ఒక పత్రికలో పేర్కొన్న విధంగా ప్యాలెస్ యజమాని ఎప్పుడూ కలెక్టర్‌ను ఈ విషయంపై సంప్రదించలేదు. ఈ విషయంలో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ అధికారి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తే పరువునష్టం దావా వేసి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం బాబు మెప్పు కోసమే అయ్యన్న అసత్యప్రచారం డెప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆగ్రహం తిరుపతి కల్చరల్: కేవలం చంద్రబాబు మెప్పు కోసమే వైఎస్ కుటుంబంపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని డెప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడంతోపాటు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్ చేసే ప్రయత్నాలు గిట్టని టీడీపీ నేతలు నిత్యం అడ్డగోలు అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగానే 2018లో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించిన 3వేల చదరపు గజాల భూమిని 22ఏ 1డీ సీలింగ్‌లో పెట్టిందని చెప్పారు. ఆ భూమిని రెగ్యులరైజ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఐదు నెలల కిందట ప్యాలెస్ యజమానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు, తన కుమారుడికి టికెట్ల కోసమే వైఎస్ జగన్ కుటుంబంపై అయ్యన్నపాత్రుడు బురదజల్లుతూ మతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. అధికార దాహంతో అయ్యన్న చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్‌హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది. 19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్‌లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్రూమ్లు, సిబ్బందికి 188 బెడ్రూమ్లు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. -
రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?
దసరా రోజున రావణ దహనం చేస్తారు. ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం రావణ దహనం గురించి కాకుండా రావణుని వైభోగం గురించి తెలుసుకోబోతున్నాం. రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో? అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం. నేడు శ్రీలంకలో కనిపించే ‘సిగిరియా’ ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. రావణునికి ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఒక రాజభవనం ఉందని, అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని, అక్కడ నుండే రావణుని పుష్పక విమానం ఎగురేదని చెబుతారు. ఆనాటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజభవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది. రావణుని రాజభవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని, నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతారు. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియా రాతిపై పురాతన ప్యాలెస్ అవశేషాలు కనిపించాయి. ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంచినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..
ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్‌లోనిది. పీయెయిర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆర్కిటెక్ట్ యాంటీ లోవాగ్ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పీయెయిర్ కార్డిన్ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఓడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. (చదవండి: 16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..) -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్‌లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్‌లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ బాష్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
Allu Arjun In Nalgonda Latest Photos: నాగార్జునసాగర్‌లో ఐకాన్ స్టార్ సందడి (ఫొటోలు)
-
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
ప్రపంచంలో ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు - అడుగడుగునా రాజసం (ఫోటోలు)
-
12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్!
World's Largest Private Palace in India: ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది ప్యారిస్లోనో లేదా వేరే ఇతర దేశాల్లోనో ఉంటుందనుకుంటారు. కానీ ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రైవేట్ ప్యాలెస్ భారతదేశంలోనే ఉంది. అదే 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' (Laxmi Vilas Palace). ఈ ప్యాలెస్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ వేలకోట్లలో ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను గుర్తు చేస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకుటుంబానికి హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈయన రాధికారాజే గైక్వాడ్‌ను వివాహం చేసుకున్నారు. హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) 170 గదులతో కూడిన ఈ ప్యాలెస్ లోపల గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దర్బార్ హాల్ వెనీషియన్ మొజాయిక్ ఫ్లోర్, వెలుపల నీటి ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది. అంతే కాకుండా ఇందులో పాత ఆయుధాలు, శిల్పాలతో మ్యూజియం ఉంది. ఇందులో ప్రేమ్ రోగ్, దిల్ హి తో హై, సర్దార్ గబ్బర్ సింగ్, గ్రాండ్ మస్తీ వంటి అనేక సినిమా షూటింగులు జరిగాయి. -
రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు
విలాసవంతమైన టవర్స్; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్‌లో రియల్ ఎస్టేట్కున్న డిమాండ్ మామూలుది కాదు. వెర్సైల్స్‌ను తలపించే మార్బుల్ ప్యాలెస్ ధర వింటే షాక్‌వుతారు. మార్కెట్లో దీని ధర రూ. 1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్‌ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం. మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్" గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్రూమ్లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించిఅన్నమాట. (ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు) ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్రూమ్లు, ఇండోర్ అలాగే అవుట్డోర్ పూల్స్, రెండు రూఫ్‌లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు. -
ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్‌లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్‌లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్‌ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది. నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్‌ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఐతే దాని ప్లేస్‌లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్‌లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. (చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి) -
కియారా -సిద్ధార్థ్ పెళ్లి.. మూడు రోజుల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
కొత్త ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన బాలీవుడ్ ప్రేమజంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అతిథులతో పాటు దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అతిథులకు రాజస్థానీ వంటకాలను సిద్ధం చేయనున్నారు. సూర్యగఢ్ ప్యాలెస్ కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్‌కు నిలయం. అతిథులకు విలాసవంతమైన హోటల్ గదులు, బెడ్రూమ్లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో వెడ్డింగ్‌కు ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలల్లో మద్యం లేకుండా ఒక్కరోజు ఖరీదు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అక్టోబరు నుంచి మార్చి వరకైతే రోజుకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు. రూ.8 నుంచి 10 కోట్ల ఖర్చు సిద్ధార్థ్- కియారాల వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుక ఖర్చు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనుంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలుపితే పెళ్లి ఖర్చు దాదాపు రూ.8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. వీరి పెళ్లి బాలీవుడ్లో అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
వజ్ర సింహాసన వైభవం
మైసూరు: స్వచ్ఛమైన బంగారం, అపురూపమైన వజ్రాలు, రత్నాలు పొదిగిన సింహాసనాన్ని చూడాలంటే మైసూరు ప్యాలెస్‌కు వెళ్లాల్సిందే. దసరా మహోత్సవాలకు నగరం హంగులు అద్దుకుంటుండగా, ప్యాలెస్‌లోనూ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్యాలెస్‌లో ఉన్న దర్బార్ హాల్లో ఉన్న బంగారు సింహాసనాన్ని జోడించారు. వృశ్చిక లగ్నంలో పూజలు చేసి మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో పూజలు చేసి జోడింపు ప్రారంభించారు. మొదట వేద పండితుల సమక్షంలో గణపతి హోమం, చాముండి పూజ, శాంతి హోమం చేశారు. రాజవంశీకుడు యదువీర్ పాల్గొన్నారు. ప్యాలెస్‌లో కింది గదిలో ఉన్న స్ట్రాంగ్ రూంలో విడివిడిగా ఉన్న బంగారు, వజ్రఖచిత భాగాలను పోలీసు బందోబస్తు మధ్య దర్బార్ హాల్లోకి తీసుకొచ్చారు. పురాతన కాలం నుంచి సింహా సనం ఉంచే స్థలంలో జోడించారు. ఈ కార్యక్రమంలో గెజ్జగెహళ్లి గ్రామస్తులు, రాజమాత ప్రమోదాదేవి పాల్గొన్నారు. జోడింపు పూర్తయ్యాక మళ్లీ పూజలు చేసి తెల్లని వస్త్రంతో కప్పిఉంచారు. సెప్టంబర్ 26వ తేదీన దసరా నవరాత్రి ఉత్సవాల రోజున యదువీర్ ఈ సింహాసనాన్ని అధిష్టిస్తారు. (చదవండి: వధువు స్పెషల్ ఫోటో షూట్... ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు) -
తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టిన మహిళ
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు. కింగ్ చార్లెస్‌కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్‌ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్‌ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాన్స్ ఎప్పటికీ రాదని.. కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు. తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్‌ది కూడా గ్రీసే అని సిప్రస్‌కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్‌తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు. జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది. చదవండి: బకింగ్హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు -
గోటబయ నివాసాన్ని చూసేశా.. ఫోటోలు షేర్ చేసేశా!
కొలంబో: శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయ రాజపక్స అని ఆరోపణలు చేస్తూ... పెద్ద ఎత్తున ఆందోళన కారులు కొలంబో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిరసకారులు గోటబయ అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో గోటబయ లంకని విడిచిపెట్టి పారిపోక తప్పలేదు. ఐతే ఆందోళనకారులు.. గోటబయ నివాసంలో ఎంజాయ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని చల్లార్చుకుంటున్నారు. ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల, జిమ్, పడకగది వంటి వాటన్నింటిని ఆక్రమించుకుని వారి ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మధుహాన్సి హసింతర అనే యువతి కొలంబోలోని రాష్ట్రపతి నివాసాన్ని చూడాలనుకుంది. అనుకున్నదే తడువుగా గోటబయ అధికార నివాసానికి పయనమయ్యింది కూడా. ఆ భవనంలోని విలాస వస్తువులన్నింటిని తన కెమెరాతో క్లిక్‌మనిపించింది. పైగా ఆ భవనాన్ని సందర్శించినట్లుగా ఆ నివాసం వద్ద నుంచున్న ఫోటోలను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఏప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అధ్యక్షుడి నివాసం పర్యాటక ప్రదేశం మారిపోయిందని ఒకరు, మీరే అధ్యక్షురాలిగా మారాలి అని మరొకరు.. కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. గోటబయ నివాసం దగ్గర ఫోటోలు దిగాలని ఉబలాటపడిందేమో పాపం.. అంతే వేగంగా ఫోటోలను కూడా షేర్ చేసింది అంటూ మరొకకరు కామెంట్ చేశారు. (చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,) -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్‌లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్‌ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
అసమాన యోగయజ్ఞం
మైసూరు: ప్రపంచానికి యోగా శాంతిని బోధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఉదయం ప్రఖ్యాత మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. వేలాది మంది యోగ సాధకులతో కలిసి మోదీ పలు యోగాసనాలను ఆచరించారు. బాలలు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో వేడుక కళకళలాడింది. సుమారు నలభై నిమిషాల పాటు వేలాది మంది ఎంతో దీక్షగా ఆసనాలను వేశారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ రావడంతో జనం ఉత్సాహంగా స్పందించారు. ప్యాలెస్‌లో మోదీకి అల్పాహార విందు యోగా కార్యక్రమం తరువాత ప్యాలెస్‌లో రాజ కుటుంబీకులు యదువీర్ ఒడెయర్– త్రిషిక దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్‌లను మోదీ కలిశారు. మసాలా దోసె, మసాలా వడ, సాంబార్, మైసూరు పాక్ లతో కూడిన అల్పాహార విందును ప్రధాని ఆరగించారు. ప్రమోదాదేవి మాట్లాడుతూ తమ ప్యాలెస్‌లో అల్పాహారాన్ని స్వీకరించాలని ప్రధాని మోదీకి ముందే లేఖ రాయగా, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఏ వంటకాలు ఇష్టమైనప్పటికీ, తాము దక్షిణాది వంటకాలనే వడ్డించామని ఆమె చెప్పారు. యోగా ఎగ్జిబిషన్ ప్యాలెస్ ఆవరణలోని ఉన్న దసరా వస్తు ప్రదర్శనశాలలో యోగాకు సంబంధించిన ఆయుష్ డిజిటల్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ప్రధాని వీక్షించారు. సుమారు 15 నిమిషాల పాటు వివిధ స్టాళ్లలోని ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ముగిసిన పర్యటన మోదీ రెండురోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్యాలెస్‌లో అల్పాహారం స్వీకరించిన అనంతరం ఆయన మండకళ్లి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గవర్నర్ గెహ్లాట్, సీఎం బసవరాజ బొమ్మై తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు (చదవండి: కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా? నేరమా?) -
'ఆర్ఆర్ఆర్'లో ఆ సాంగ్ ఉంటుందట.. ఇక ఫ్యాన్స్‌కు పండుగే
రాజమౌళి ‘మగధీర’ సినిమా చివర్లో వచ్చే ‘ధీర ధీర’ పాట కనువిందుగా ఉంటుంది. సినిమాలో ఉన్న కీలక తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ పాటకు కాలు కదిపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్)లోనూ అలాంటి పాటను చూపించాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో ఓ ప్రమోషనల్ సాంగ్‌ని చిత్రీకరించాలనుకుంటున్నారట. ఉక్రెయిన్‌లో ఓ ప్యాలెస్‌లో షూట్ చేయనున్నారని టాక్. హీరోలు తారక్, రామ్‌చరణ్, హీరోయిన్లు ఆలియా భట్, ఒలీవియా మోరిస్ తదితరులు ఈ పాటలో కనిపిస్తారట. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం రిలీజ్. -
షాకింగ్: జ్యోతిరాదిత్య సింధియా ప్యాలెస్‌లో చోరీ
భోపాల్: బీజేపీ ఎంపీ, గ్వాలియర్ రాచ వంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలెస్‌లో దొంగలు చోరీకి యత్నించినట్లు తెలిసింది. వివరాలు.. సింధియాకు చెందిన మధ్యప్రదేశ్ జై విలాస్ ప్యాలెస్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సోమవారం లేదా మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు వెంటిలేటర్ బద్దలు కొట్టి జై విలాస్ ప్యాలెస్‌లోని రాణి మహల్లోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు గుర్తించాం’’ అన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎంతమంది ఈ దొంగతనానికి ప్రయత్నించారు.. ఏమేం చోరీ చేశారు అనే దాని గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. గ్వాలియార్ సిటీ ఎస్పీ రత్నేష్ తోమర్ మాట్లాడుతూ.. ‘‘దొంగలు ప్యాలెస్‌లోని రాణి మహల్‌లోని ఓ గది వెంటిలేటర్‌ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ప్యాలెస్‌లో గతంలో బ్యాంక్ విధుల కోసం వినియోగించిన గదిలోని వస్తువులను ధ్వంసం చేశారు’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు. స్నిఫర్ డాగ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు జై విలాస్ ప్యాలెస్‌ని 19వ శతాబ్దంలో జయరావ్ సింధియా నిర్మించారు. 1874 ప్రాంతంలో ఆయన గ్వాలియర్ మహారాజుగా ఉన్నపుడు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఇది జ్యోతిరాదిత్య సింధియాకు సొంతం అయ్యింది. చదవండి: ‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
‘పరదాగేట్ ప్యాలెస్’ విక్రయంలో మరో వివాదం
సాక్షి, సిటీబ్యూరో: నిజాం వైభవానికి ప్రతీక అయిన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ముంబై కేంద్రంగా ఓ కేసు నమోదు కాగా.. తాజాగా పరదాగేట్ ప్యాలెస్‌ను తమకు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారని, ఆపై మోసం చేస్తూ మరో సంస్థకు అమ్మేశారని ఆరోపిస్తూ ఎస్ఆర్ఈఐ సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఇ.వేణుగోపాల్ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. దీంతో నగరానికి చెందిన ఆషి రియాల్టర్స్, ముంబై సంస్థ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నిందితుల జాబితాలో సుఖేష్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేష్‌కుమార్ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివాదం వెనక అసలు కథ.. ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రెసిడెన్షియన్, కమర్షియల్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న సంస్థ. ఇది కొన్నాళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్‌కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్‌ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగత నివాసంగా వెలుగొందింది. అయిదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌గా పిలిచే నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకదాంట్లో నిజాం ట్రస్ట్, మరోదాంట్లో కోఠి ఈఎన్టీ ఆస్పత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్‌కు జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్యాలెస్‌ను నిహారిక సంస్థ భౌతికంగా తన అధీనంలోకి తీసుకోవాల్సి ఉంది. 2019 ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య కొన్ని స్పర్థలు వచ్చాయి. దీంతో గత ఏడాది జూన్‌లో నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగులు హైదరాబాద్ వచ్చినప్పుడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కశ్మీర్‌కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా ఆరా తీయగా నిహారిక సంస్థకు రాజీనామా చేసి బయటకు వచ్చిన హైదరాబాద్ వాసి రవీంద్రన్తో పాటు సురేష్‌కుమార్ తదితరులప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు. నిహారిక సంస్థతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీళ్లు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు 2019 జనవరిలో విక్రయించేశారు. ఈ విషయాలు గుర్తించిన నిహారిక సంస్థ ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిహారిక సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు అక్రమంగా విక్రయించేశారని అనుమానించిన పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేసింది. దీంతో ఆ వింగ్‌లోని యూనిట్– 9 అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రవీంద్రన్, సురేష్‌లతో పాటు మహ్మద్ ఉస్మాన్, సుఖేష్ గుప్తాలను నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో కొన్ని అరెస్టుల్ని చేసిన ముంబై ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు కొనసాగుతుండగానే.. అక్కడ కేసు ఇలా ఉండగానే.. ఇటీవల బంజారాహిల్స్ కేంద్రంగా పని చేసే ఎస్ఆర్ఈఐ ఎక్వీప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఇ.వేణుగోపాల్ సీసీఎస్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. బషీర్‌బాగ్ కేంద్రంగా పని చేసే ఆషి రియాల్టర్స్‌కు చెందిన సుఖేష్ గుప్తా, నీతు గుప్తా, ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేష్ కుమార్, రవీంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించి ప్రతి మూడు నెలలకు ఇన్స్టాల్మెంట్ చొప్పున చెల్లిస్తూ మొత్తం నాలుగు దఫాల్లో రుణం వడ్డీతో సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి ష్యూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న ఎనిమిది ఎకరాల స్థలంతో పాటు కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీభాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ 2018 జూలై 15న అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎస్ఆర్ఈఐ నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో సుఖేష్ గుప్తా తదితరులు విఫలం కావడంతో గత ఏడాది డిసెంబర్ 30న హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసి ఎస్ఆర్ఈఐ సంస్థ రూ.102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీభాగ్‌ను వేలం వేయాలని ప్రయత్నించగా.. నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి ఆషి, నిహారిక సంస్థలతో చేసిన సంప్రదింపులు ఫలితాలు ఇవ్వకపోవడంతో ఎస్ఆర్ఈఐ సంస్థ గత నెల 28న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సుఖేష్ గుప్తా, నీతు గుప్తా, రవీంద్రన్, సురేష్కుమార్లపై ఐపీసీ 420, 406 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కూలుతున్న శకలం.. మనసు వికలం
నిర్మల్: నిమ్మల.. పేరులోనే నిర్మలత్వాన్ని.. నిమ్మలమైన తత్వాన్ని నింపుకున్న ఈ ఊరిలోనూ ఎన్నో విశేషాలున్నాయి. ఎక్కడో భద్రాద్రి రామయ్య దగ్గరి నుంచి గోదారమ్మ వెంట వెనక్కి వచ్చిన దళవాయి నిమ్మల నాయుడు ఇక్కడి ప్రకృతికి పరవశుడయ్యాడు. స్థల విశేషతను గుర్తించి ఇక్కడే స్థిరపడ్డాడు. అలా.. ప్రస్తుత కస్బా ప్రాంతంలో 12 ఇండ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు. ఊరి చుట్టూ చెరువులను తవ్వించాడు. కోటలు కట్టించాడు. అనంతర పాలకులూ అదేరీతిలో అభివృద్ధి పరిచారు. కాకతీయులను తలపించేలా పాలన సాగించారు. ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి.. నేడు నిర్మల్‌గా ఎదిగింది. నాడు రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి ఢిల్లీదాకా ఎదిగిన బిడ్డలూ ఉన్నారు. కాలగమనంలో దశాబ్ధాలు గిర్రున తిరిగిపోయినట్లే.. గతవైభవపు స్మృతులు ఒక్కొక్కటీ పోతున్నాయి. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్‌లో కనుమరుగవుతున్నాయి. ఇన్నాళ్లు ఠీవీగా దర్పాన్ని చాటిన కోటలు.. వాటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు సగం కబ్జాకోరల్లో చిక్కుకుపోగా, ఇప్పుడు చారిత్రక గుర్తులు సైతం శకలాలుగా పడిపోతూ.. నిమ్మలవాసుల మనసులను వికలం చేస్తున్నాయి. పట్టించుకునే అధికారులు.. పాలకులు లేక ఘన చరిత్ర శిథిలదశకు చేరుతోంది. కూలుతున్న శ్యాంగఢ్ ప్రధానద్వారం నిమ్మల..ఓ మినీ ఓరుగల్లు ఓరుగల్లును కాకతీయులు పకడ్బందీగా కట్టినట్లే.. నిమ్మలను పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీగోడను కట్టించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వాటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తైన బురుజులు నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై ఖిల్లా(కోట) కట్టించారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్‌లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళకళలాడేవి. ఇప్పుడవన్నీ శిథిలమై పోయాయి. పట్టించుకునే నాథుడు లేక పలు కోటలు, బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లు కట్టుకున్నారు. గఢ్.. గఢ్‌కో చరిత్ర నిర్మల్ అంటే కోటలు, గఢ్‌లకు ప్రసిద్ధి. అందులో ఒక్కోగఢ్కు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైనగుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్గఢ్ ఆరోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఈ గఢ్‌లో ఒకదానికొకటి ఆనుకుని 32గదులు నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్గఢ్ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్‌గఢ్‌ను డంగుసున్నం, ఇటుక, రాయితో బలమైన కోటగా మార్చారు. ఎతైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్‌లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. దక్షిణ భారతదేశంలో అప్పట్లో ఆయుధ కర్మాగారంగా నిర్మల్‌కు పేరుంది. శ్రీనివాస్‌రావు తన పాలనకాలంలోనే ఎక్కువ గఢ్‌లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్‌ను నిర్మించారు. అప్పటి తన అశ్వసైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్‌గా పేరుపెట్టినట్లు చెబుతారు. బంగల్పేట్, వెంకటాద్రిపేట్లలో కూలిపోతున్న ప్రహరీ పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్‌ను దాటుకునే రావాల్సి ఉంటుంది. దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్‌కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నం. జాతీయరహదారి వెళ్తోంది. బంగల్పేట్ శివారులో ధం–ధంగఢ్, వెంకటాద్రిపేట్‌లో మరోగఢ్, బత్తీస్గఢ్ పక్కనే వేంకటేశ్వర(ఏకశిలా)గఢ్, సోన్ సమీపంలో సోన్‌గఢ్, చిట్యాలలో చిట్టీగఢ్‌లను నిర్మించారు. నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64గఢ్‌లను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాయంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతీగఢ్‌పైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఈగఢ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగమార్గం ఉండటం. మంటలు వేసి తెలిపేవారు ఈగఢ్‌లను ఎత్తైన గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికీ కారణం ఉంది. వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు. సెల్ఫోన్లు, వైర్‌లెస్‌లు లేనటువంటి ఆరోజుల్లో సహజసిద్ధమైన సాంకేతికతను ఉపయోగించేవారు. పట్టణంపైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికి వస్తుంటే మొదట సోన్‌గఢ్‌పై సైనికులు గుర్తించేవారు. వెంటనే అగ్గిరాజేసి మంటలు పెట్టేవారు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంగఢ్‌పై ఉన్న సైనికులు గమనించి వారు కూడా మంట రాజేసేవారు. ఈ మంటల పొగలు తూర్పు వైపున ఉన్న బత్తీస్‌గఢ్‌పై సైనికులు గుర్తించి వారు కూడా మంటలు పెట్టేవారు. ఈమంటలు నేరుగా పట్టణం మధ్యలో ఖిల్లాగుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి. సైన్యాధికారులు, పాలకులు ఆ మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతుందని అప్రమత్తమై శత్రువులను ఎదుర్కొనేవారు. బంగల్ చెరువు వద్ద సీమోల్లంఘన ద్వారం పక్కాగా పట్టణ నిర్మాణం నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మలనాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావు, తదితరులు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారనడానికి ఊరిచుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే నిదర్శనం. ఊరి చుట్టూ ప్రహరీగోడతో పాటు పొలిమేరల్లో పట్టణంలోనికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా బురుజులు నిర్మించారు. ఈ బురుజులకు బలమైన పొడవాటి గొలుసులు ఉండేవి. రాత్రిపూట ఇరువైపులా ఉన్న గొలుసులతో మార్గాలను మూసి వేసేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ పట్టణంలో చైన్‌గేట్ వద్ద ఈ బురుజులు, గొలుసులు ఉండేవి. వీటిæ కారణంగా దీనికి చైన్‌గేట్ అనే పేరొచ్చింది. బంగల్పేట్ శివారులోనూ రోడ్డుకిరువైపులా బురుజులు ఉన్నాయి. బురుజులు, గోడచుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేది. కాలక్రమంలో ఈ కందకాన్ని స్వర్ణప్రాజెక్టు జౌళినాలాగా మార్చారు. ప్రస్తుతం ఇది ఓ పెద్ద మురికికాలువగా మారింది. బంగల్పేట్ శివారులో బురుజులు గత వైభవమేనా.. గోల్కొండ, వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్ కోటలను నాటి పాలకులు నిర్మించినా నేటి పాలకుల పట్టింపులేనితనంతో వెలుగులోకి రాలేదు. ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. చాలావరకు దెబ్బతింటున్నాయి. పర్యాటకప్రాంతంగా శ్యాంగఢ్‌ను అభివృద్ధి చేస్తామని ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరింది. బత్తీస్గఢ్ చుట్టూ గుట్టలపై ఉన్న క్వారీల పేలుళ్ల ధాటికి గఢ్ గోడలు బీటలు వారాయి. రోడ్డు వెడల్పులో చైన్‌గేట్‌ను నామరూపాల్లేకుండా కూల్చేశారు. దృష్టి పెట్టేనా... నిర్మల్ జిల్లాకు చారిత్రక ప్రాంతంగా.. రాజకీయకేంద్రంగా పేరున్నా.. పర్యాటక అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. చారిత్రక కట్టడాలతో పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నా పట్టించుకునే నాథుడు లేడు. వినాయకుల నిమజ్జనం కోసం బంగల్‌చెరువు వద్ద గల సీమోల్లంఘన ద్వారాలను కూల్చేశారు. కొత్తగా అభివృద్ధి చేయకున్నా చరిత్రకు గుర్తుగా మిగిలిన కట్టడాలను మాత్రం కాపాడాలంటూ జిల్లావాసులు మొరపెట్టుకుంటున్నారు. -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్‌లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్‌బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్‌బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్‌తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్‌బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్‌ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
గురునానక్ ప్యాలెస్ కూల్చివేత
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ గురునానక్ ప్యాలెస్‌ను కొందరు దుండగులు కూల్చివేశారు. ఎంతో విలువైన తలుపులు, కిటికీలను కూడా అమ్ముకున్నారు. న్యూలాహోర్ రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలోని బథన్వాలా గ్రామంలో దాదాపు నాలుగు శతబ్దాల క్రితం ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. భవనంలో సుమారు 16 పెద్ద పెద్ద గదులు, 4 వెంటిలేటర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్యాలెస్‌లో గురు నానక్‌తో పాటు కొందరు హిందూ రాజుల చిత్ర పటాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ ప్యాలెస్‌ను చూడ్డానికి వస్తారు. సిక్కులు పవిత్రంగా భావించే ఈ ప్యాలెస్‌ను కూల్చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మహ్మద్ అన్వర్ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మహ్మద్ కుటుంబం కొన్ని తరాలుగా ఈ ఇంట్లోనే నివసిస్తున్నారని.. దాంతో వారు ఈ ప్యాలెస్‌ను తమ సొంత ఇంటిగా భావిస్తున్నారని తెలిపారు. బిల్డింగ్ పాతబడటమే కాక శిథిలావస్థకు చేరటంతో వారే ఈ ప్యాలెస్‌ను కూల్చి వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఆ భవనం లీజుకివ్వడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, అల్వాల్‌లో ఏడో నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ బహదూర్‌కు చెందిన 28.48 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్‌ను లీజుకివ్వడాన్ని సవాల్ చేస్తూ ఏడో నిజాం మునిమనుమరా లు ప్రిన్సెస్ షఫియా సకినా రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం ప్రారంభించారు. ఏడాదికి రూపాయి చొప్పు న 99 ఏళ్ల పాటు భారతీయ విద్యాభవన్‌కిచ్చిన లీజును రద్దు చేసి ఆ ప్యాలెస్‌ను తనకు స్వాధీనం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ సీఎస్, భారతీయ విద్యాభవన్ ప్రెసిడెం ట్, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైదరాబాద్ విలీనం తరువాత తమ ఆస్తుల జాబితాను కేంద్ర హోంశాఖకు ఏడో నిజాం సమర్పించారని, వాటిని అనుభవించేందుకు కేంద్రం అనుమతించిందని ఆమె తెలిపారు. ఏడో నిజాం ఆస్తుల వివరాలు ‘బ్లూ బుక్’లో స్పష్టంగా ఉన్నాయన్నారు. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవన్నారు. ఇలాంటి ఆస్తుల్లో అల్వాల్ సర్వే నంబర్ 157లో ఉన్న కోఠీ ఆసీఫియా ప్యాలెస్ కూడా ఒకటని, ఇది 28.48 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. కంటోన్మెంట్ రిజిస్టర్లో ఈ ఆస్తి నిజాం ఆస్తిగానే రాసి ఉందన్నారు. చట్ట ప్రకారం విలువ లేని లీజ్ ఇది... ఏడో నిజాం చనిపోయిన తరువాత వారసుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయని, దీంతో అల్వాల్‌లోని ప్యాలెస్‌ను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1981లో ఆ ప్యాలెస్‌ను భారతీయ విద్యాభవన్‌కు 99 ఏళ్ల పాటు ఏడాదికి రూపాయి చొప్పున లీజుకు ఇచ్చిం దని ఆమె వివరించారు. 11 నెలల్లోపు రిజిస్టర్ కావాల్సిన ఈ లీజు డీడ్ ఆ లోపు రిజిస్టర్ కాలేదని, అందువల్ల దానికి చట్ట ప్రకారం విలువ లేదన్నారు. లీజుకు తీసుకున్న ప్యాలెస్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆమె వివరించారు. ఇప్పటికే భారతీయ విద్యాభవన్ నిర్వాహకులు ఆ ప్యాలెస్ అందాన్ని చెడగొట్టారని, అద్భుతమైన ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. ఆ భవనాన్ని స్వాధీనంలో ఉంచుకుని వాడుకుంటున్నందుకు నెలకు రూ.25 లక్షలను డిపాజిట్ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలన్నారు. -
పర్లాకిమిడిలో.. ఒడియా సినియా షూటింగ్
పర్లాకిమిడి: స్థానిక బీఎన్ ప్యాలెస్, గజపతి ప్యాలెస్‌లలో ఒడియా చలన చిత్రం సుందర్‌ఘడ్ సాల్మన్ఖాన్లోని కొన్ని పెళ్లి సన్నివేశాలను బుధవారం చిత్రీకరించారు. ఈ షూటింగ్లో హీరో బాబూసేన్, మిహిర్ దాస్, హాస్యనటుడు పప్పు పంపం, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే బీఎన్ ప్యాలెస్‌లో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు చిత్ర దర్శకుడు అశోక్ పతి తెలిపారు. పర్లాకిమిడిలోని గజపతి ప్యాలెస్, బీఎన్.ప్యాలెస్‌ల దగ్గరలో గండాహతి జలపాతాలు, చంద్రగిరి టిబెటియన్ల బౌద్ధమందిరం వంటి మంచి లోకేషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. రోజోపండగకు ఈ ఒడియా చలనచిత్రం రాష్ట్రమంతటా రిలీజ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అభిజిత్ మజుందార్. కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ ప్రాంతంలో చిత్రీకరించినట్టు దర్శకుడు వివరించారు. -
మైసూరు ప్యాలెస్‌కు డేంజర్
సాక్షి, మైసూరు: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మైసూరు ప్యాలెస్ కూడా ఉగ్ర ముప్పు పొంచిఉంది. దసరా ఉత్సవాలలోనే కాకుండా ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దాంతో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో మైసూరు ప్యాలెస్ ఉందని నిఘా సంస్థలు పేర్కొనడంతో మైసూర్ ప్యాలెస్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భధ్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్‌శాఖ, అగ్నిమాపకశాఖలకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్యాలెస్ ఆవరణలో ఇకపై 24 గంటల పాటు భధ్రతా బలగాల పహారాతో పాటు ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, సిబ్బందికి కార్యాలయం, బస ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ డీ.రందీప్ రెండు శాఖలకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోనున్న ఎన్ఐఏ అధికారులు మూడుసార్లు మైసూరు ప్యాలెస్‌లో భధ్రతా ఏర్పాట్లు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరింత భధ్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేటు భధ్రతా సిబ్బందితో పాటు ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలు అమర్చాలని చెప్పారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండడానికి ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఎన్ఐఏ అధికారుల సూచనల ప్రకారం అదనపు భధ్రతా సిబ్బంది, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక వాహనాలు, కార్యాలయం, సిబ్బందిని మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేకపోయారు. గత సంఘటనల దృష్ట్యా... సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన మైసూరు ప్యాలెస్‌లో రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ప్యాలెస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అనంతరం అదేస్థలంలో ప్రస్తుతమున్న ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతమున్న అంబావిలాస్ ప్యాలెస్‌లో అరుదైన, ఎంతో విలువైన చెట్లతో స్తంభాలను ఏర్పాటు చేసారు. కోట్లాది రూపాయల విలువ చేసే బంగారుపూతతో ఈ స్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్యాలెస్‌లో ప్రతీ వస్తువు, స్తంభాలు తదితర వస్తువులన్నింటినీ అరుదైన వృక్షాల దుంగలతో నిర్మించారు. అంతేకాకుండా ప్యాలెస్‌లో కోట్ల విలువ చేసే తైలవర్ణ చిత్రలేఖనాలు, వంశపారంపర్య, చార్రితాత్మక కట్టడాలు, విగ్రహాలు ఉన్నాయి. దీంతో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా లేదా ఉగ్రవాదుల దాడి నుంచి ప్యాలెస్‌ను రక్షించడానికి వీలుగా ప్యాలెస్ ఆవరణలో అగ్నిమాపక వాహనాలు, కార్యాలయంతో పాటు సిబ్బందికి కూడా అక్కడే బస ఏర్పాటు చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. వీటితో పాటు 72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్యాలెస్ చుట్టుపక్కల వందల సంవత్సరాల కాలం నాటి దేవాలయాలు, మ్యూజియంతో పాటు రాజ వంశానికి చెందిన అశ్వాలు, ఏనుగులు, ఒంటెలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్యాలెస్ వెనుకభాగంలోనే రాజ వంశస్థులు కూడా తరతరాలుగా నివాసం ఉంటుండడంతో ప్యాలెస్‌లో భధ్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. దీంతో బెంగళూరు నగరంలోని విధానసౌధ, ఎం.ఎస్.రామయ్య బిల్డింగ్, హైకోర్టు, రాజ్‌భవన్ తదితర కట్టడాల ఆవరణలో ఏర్పాటు చేసిన విధంగానే ప్యాలెస్ ఆవరణలో కూడా అగ్నిమాపక కేంద్రం, వాహనాలు, సిబ్బందిని నియమించాలంటూ రాష్ట్ర అగ్నిమాపక దళం డీజీపీ, పోలీసుశాఖ డీజీపీలను ఆదేశించారు. -
చారిత్రక కల్యాణ మండపం!
మైసూరుః ప్యాలెస్ లో పెళ్ళి సందడి మొదలైంది. మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహానికి ప్యాలెస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జూన్ 27న జరిగే వివాహ మహోత్సవానికి చారిత్రక కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. రాజవంశంలో 40 సంవత్సరాల తర్వాత జరుగుతున్న వివాహ కార్యక్రమం కావడంతో.. రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహం కోసం తరతరాలుగా కొనసాగుతున్నమండప సామగ్రికి మెరుగులు దిద్దుతున్నారు. ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబంతోపాటు, అక్కడి ప్రతి వస్తువుకూ ఓ చరిత్ర ఉంది. మైసూర్ మహారాజుల వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహ కార్యక్రమానికి వంశపారంపర్యంగా కొనసాగుతున్న కల్యాణ మండపానికి ప్రత్యేక హంగులు సమకూరుస్తున్నారు. యువరాజు యదువీర్ పట్టాభిషేకం జరిగిన సమయంలో ఆయన అధిరోహించిన రజిత సింహాసనం (భద్రాసనం) కూడ ప్యాలెస్ లో ప్రత్యేకాకకర్షణగా నిలిచింది. అదేరీతిలో అత్యంత ఐశ్వర్యవంతుడైన యువరాజు వివాహానికి ఇప్పుడు అనువంశికంగా వచ్చే వెండి సింహాసనాన్ని ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అనువంశిక సంప్రదాయ మండపానికి సైతం మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే పూజాకార్యక్రమాలతో పెళ్ళి సందడి ప్రారంభం కాగా... ఖరీదైన చెక్కతో రూపొందించిన కల్యాణ మండపాన్ని, అద్దాల ఆడిటోరియంలోకి తరలించారు. మహారాజులు పట్టాభిషేక సమయంలో మాత్రమే భద్రాసనా ఉపయోగిస్తారు. పది అడుగులు ఎత్తు ఉండే మండపం... రాజ కుంటుంబ సభ్యుల వివాహాల సందర్భంలోనే బయటకు తీస్తారు. 41 ఏళ్ళ తర్వాత గత మే నెలలో యదువీర్ కృష్ణదత్త పట్టాభిషేక సమయంలో భద్రాసనా వినియోగించగా... మండపం మాత్రం రాజకుంటుంబం 1992 లో మైసూరు రాజు పెళ్ళి సందర్భంలో వినియోగించారు. అనంతరం యువరాజు యదువీర్ వివాహం కోసం ప్రస్తుతం వినియోగంలోకి తెస్తున్నారు. ఈ మండపాన్ని మహారాజు కుటుంబంలోని సభ్యుల పెళ్ళిళ్ళకు వాడిన తర్వాత తిరిగి ఏ భాగానికి ఆ భాగం విడదీసి సురక్షితంగా భద్రపరుస్తుంటారు. శివపార్వతుల వివాహ మహోత్సవమైన గిరిజా కల్యాణానికి సంబంధించిన చిత్రాలతో కూడిన ఈ మండపం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. మండపాన్ని 1912 లో రూపొందినప్పటినుంచీ ఇందులో ముగ్గురు మహారాజుల పట్టాభిషేకాలు, రెండు డజన్ల వివాహ మహోత్సవాలు జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహారాజులు, ఇతర రాజకుటుంబ సభ్యుల వివాహాలు, పుట్టినరోజు వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ అష్టభుజ కల్యాణ మండపం నిర్మించినట్లు చెప్తారు. అయితే 1897 లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంతో ప్యాలెస్ లోని అధికభాగం దగ్ధమైపోయింది. ఆ తర్వాత రాజ కుటుంబీకులు తిరిగి ఆ నిర్మాణాన్ని విలక్షణంగా నిర్మించారు. ఈసారి నిర్మాణంలో ప్రత్యేకంగా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడినట్లు తెలుస్తోంది. ఈ మండపాన్ని కేవలం రాజకుటుంబీకుల వివాహాలకోసమే రూపొందించారని, రాజకుటుంబం నమ్మకాలు, సంప్రదాయాలను బాగా తెలిసిన వ్యక్తి, యు ఆర్ ఎస్ కమ్యూనిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. మండపాన్ని ఏర్పాటు చేసే ఆడిటోరియంలో సైతం మూడు పక్కల గోడలూ మైసూరు శైలి చిత్రాలతో సుందరంగా అంకరించబడి ఉంటాయి. దసరా వేడుకలకు సంబంధించిన ఏనుగు బంగారు అంబారీపై మహారాజులు కూర్చున్నట్లుగా ఉండే చిత్రాలు, పురాణ కథలు ఈ గోడలపై నిక్షిప్తమై... రాచరికపు సాక్ష్యాలను ప్రస్ఫుటింపజేస్తాయి. -
యువరాజు సమరభేరి
పొగాకు వ్యతిరేక ర్యాలీ ప్రారంభించిన యదువీర్ విశ్వ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్యాలెస్‌లోని ఆంజనేయ స్వామి దేవాలయం ఎదుట కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వ పొగాకు వ్యతిరేక ర్యాలీని యదువీర్ కృష్ణదత్త ఒడయార్ ప్రారంభించారు. ప్యాలెస్ నుంచి మైసూరు బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో మైసూరు మెడికల్ కాలేజ్, భగవాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు, కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు. - మైసూరు -
పురానా హవేలీ
నాలుగొందల ఏళ్లు పైబడిన హైదరాబాద్ నగర చరిత్రకు సాక్షిగా... నాటి రాచరికపు వైభవానికి ప్రతీకగా... కుతుబ్‌షాహీల ప్రధాన మంత్రి నివాస గృహంగా... నేటికీ అలనాటి సిరులొలికిస్తోంది ‘పురానా హవేలీ’. సాలార్జంగ్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్యాలెస్... సందర్శకులెందర్నో ఆకర్షిస్తోంది. ఐదో కులీకుతుబ్‌షా నవాబ్ మహ్మద్‌కులీ పాలనా కాలం (1580-1612) నాటిది ‘పురానా హవేలీ’. కుతుబ్‌షాహీల ప్రధానమంత్రి మీర్ మోమీన్ నివాస గృహంగా ఈ ప్యాలెస్ ప్రతీతి. ప్యాలెస్ చుట్టూ సుమారు మైలు దూరం పొడవున, దృఢమైన ఎత్తయిన ప్రహరీ నిర్మించారు. రెండో నిజాం, నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ తన కుమారుడు సికిందర్జా కోసం ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేశారని చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం ఈ ప్యాలెస్‌లో పలు కొత్త భవన సముదాయాలను నిజాం నిర్మించారు. అయితే.. మూడో నిజాం ప్రభువుగా నవాబ్ సికిందర్జా సింహాసనం అధిష్టించాక (1803-1829) ఈ ప్యాలెస్‌లో ఆయన నివాసముండనే లేదు. ఆయన చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ మహల్లో ఉన్నారు. దీన్నే చౌమొహల్లా అని కూడా పిలుస్తున్నారు. ఆ మాదిరిగా మూడో నిజాం ఖిల్వత్ మహల్లో ఉండటంతో, రెండో నిజాం ప్రభువు నివాసమున్న ఈ ప్యాలెస్‌కు పాత ప్యాలెస్ లేదా ‘పురానా హవేలీ’ అని స్థానికులు పిలవనారంభించారు. అయితే ఐదో నిజాం ప్రభువుగా సింహాసనం అధిష్టించిన నవాబ్ అఫ్జద్దౌలా... పురానాహవేలీ భవనాల్లోనే జన్మించారు. అలాగే, ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ తిరిగి పురానా హవేలీని తన అధికార నివాస గృహంగా చేసుకుని తన అధికార కార్యకలాపాలు నిర్వహించారు. పురానా హవేలీలో మొత్తం పదకొండు భవనాల సముదాయం ఉంది. ఇందులోని ప్రధాన భవనం 18వ శతాబ్దపు ఇండో-యూరోపియన్ ఆర్కిటెక్చర్‌కు ప్రతీకగా నిలుస్తుంది. ఆరో నిజాం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారనేది చరిత్రకారుల అభిప్రాయం. ఆరో నిజాం కాలంనాటి పలు విశేష వస్తువుల ప్రదర్శనశాల ‘సిటీ మ్యూజియం’ కూడా ప్రస్తుత పురానా హవేలీ ప్రాంగణంలోనే ఉంది. ఎన్నో అద్భుత కళారీతుల ప్రదర్శనశాలగా ప్రఖ్యాతి చెందిన ఈ నిజాం మ్యూజియంను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. అయితే... నేడు పురానా హవేలీలోని పలు భవనాల్లో ముఖరంజా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న పురానా హవేలీ... నేడు గొప్ప వారసత్వపు కట్టడంగా అలరారుతోంది. - మలాది కృషానంద్ malladisukku@gmail.com -
ఒక వెచ్చటి ఆంగ్ల ఉత్సవం...
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జైపూర్ దిగ్గీ ప్యాలెస్ దిగ్గున వెలిగింది. రాజస్తానీ ఫోక్, మసాలా చాయ్, రోటీ- చోలే భతూరేల మధ్య వేదికలు వెచ్చగా మాటలని పంచుకున్నాయి. పుస్తకాలను ఎంచుకున్నాయి. అభిప్రాయాలను ఖండించుకున్నాయి. ఏనాటి జ్ఞాపకాలనో వెలికి తీసి కంఠాలను గద్గద పరుచుకున్నాయి. వేదిక బాగుంది. ముసురు బాగుంది. పొగమంచు బాగుంది. జివ్వున కోసే చలిగాలి బాగుంది. మనిషికీ మనిషికీ మధ్య ఎడం లేనంత కిక్కిరిసిన సమూహాల మధ్య సాహిత్యం తప్ప మరో ఊసు లేకుండా జనవరి 21- 25 తేదీల మధ్య ఐదు రోజులు గడవడం బాగుంది. అయితే బాగోలేనిదీ ఉంది. తొలిసారి తెలుగు మీడియా నుంచి సాక్షి సాహిత్యానికి ప్రత్యేక ఆహ్వానం అందిన దరిమిలా ఈ ఉత్సవంపై స్పెషల్ రిపోర్ట్. అమెరికన్లు, జర్మన్లు, రోమన్లు, ఇటాలియన్లు, ఆసియన్లు, ఇండియన్ అమెరికన్లు వీళ్లంతా హాలీవుడ్లో సినిమాలు తీసి ఆ సినిమాలతో ఒక ఉత్సవం జరుపుకుంటే అదెలా ప్రపంచ సినిమాకు ప్రాతినిధ్యం వహించదో ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ కూడా ‘భారతీయ సాహిత్యం’కు ప్రాతినిధ్యం వహించదు. అవును. బహుశా- దక్షిణాసియాలోనే అతి పెద్ద ‘సాహితీ తీర్థయాత్రాస్థలి’గా గత ఏడేళ్లల్లో పలుకుబడిని పెంచుకున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ప్రధానంగా ఇంగ్లిష్ భాషను ఉద్దేశించినది. ఇంగ్లిష్ వలన, ఇంగ్లిష్ కొరకు, ఇంగ్లిష్ చేత... ఇంగ్లిష్ మార్కెట్‌ను ఉత్సాహ పరచడానికి ఇది చేస్తున్న ప్రచారం సామాన్యం ఏమీ కాదు. అంతమాత్రం చేత ‘స్థానిక’ లేదా ‘దేశీయ’ సాహిత్యం దాని ప్రాధాన్యంలో లేదన్న సంగతీ విస్మరణీయం కాదు. ఈ ఉత్సవం జరిగినన్ని రోజులూ ఒకటే మాట. చలో ఔర్ కుచ్ లిఖో. లేకిన్ ఇంగ్లిష్ మే. ఈ ముక్క చెప్పడానికి లండన్ నుంచి నోబెల్ గ్రహీత వి.ఎస్.నయిపాల్ వచ్చాడు. గుండుకు కూడా దొరకడని పేరు గడించిన ప్రసిద్ధ ఇంగ్లిష్ నవలాకారుడు, సినీ రచయిత హనీఫ్ ఖురేషీ వచ్చాడు. జె.డి.శాలింజర్ (‘శాలింగర్’ కాదట) సెక్రటరీకి సెక్రటరీగా చేరి శాలింగర్కు అభిమానులు రాసే ఉత్తరాల జవాబు పని చూసి ఆ ఉత్తరాల తలపోతను మర్చిపోలేక 1996నాటి న్యూయార్క్ సాహితీ దిగ్గజాలను తలచుకుంటూ ఇటీవలే ‘మై శాలింజర్ ఇయర్స్’ అనే నవల రాసి పేరు తెచ్చుకున్న రచయిత్రి జొయాన్నా రేకాఫ్ అమెరికా నుంచి వచ్చింది. విస్తృతమైన ట్రావెల్ రైటర్‌గా పేరు పొంది ‘ది గ్రేట్ రైల్వే బజార్’ వంటి విఖ్యాత ట్రావెలోగ్ రాసిన పాల్ థొరో వచ్చాడు. ఇంకా అనేక దేశాల రచయితలు దిగబడ్డారు. మన దగ్గర నుంచైతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్తో మొదలు అశోక్ వాజ్పాయ్, శోభా డే, ‘తారే జమీన్ పర్’ ప్రసూన్ జోషీ, ఆకార్ పటేల్, బషారత్ పీర్... అనేకులు. అందరూ ఒక కుటుంబంలాగా. ఒకే కప్పు కింద. బ్రేక్‌ఫాస్ట్ సమయానికి నసీరుద్దీన్ షా, గిరిష్ కర్నాడ్‌లు తారసపడొచ్చు. లంచ్‌లో వెనుక ప్లేట్ అందుకుంటున్నది వార్ కరస్పాండెంట్ స్కాట్ ఆండర్సన్ కావచ్చు. ఆ మూలన వైన్ కౌంటర్ దగ్గర నిలుచున్న అమ్మాయి మనం ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా రెస్పాండ్ కాని పెంగ్విన్ రాండమ్హౌస్ పబ్లిషర్ చికి సర్కార్ కావచ్చు. డిన్నర్ సమయానికి వినిపిస్తున్న గజల్ జావేద్ అక్తర్ గొంతెత్తి పాడేది అయి ఉండొచ్చు. ఇది చాలనట్టు వచ్చేపోయే అతిథులు... శశిథరూర్, రామ్ జెఠ్మలానీ, ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నాహై- వహీదా రెహమాన్, షబానా ఆజ్మీ, రాజ్‌దీప్ సర్దేశాయ్, నన్నొదలద్దన్నట్టు చేతన్ భగత్.... వీళ్లందరినీ ఇలాంటి దిగ్గజాలందరినీ ఒకచోట చేర్చడమే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఘనత. మనుషులు సాధారణంగా ఒకరినొకరు కలవడానికి ఇష్టపడతారు. అందునా, ఒకే అభిరుచి ఉన్నవారిని, పుస్తకాల పురుగులని ప్రపంచపు నలుమూలల నుంచి తెచ్చి కలిపితే? అందుకే ఈ ఆవురావురు. ఆ ముగ్గురు.... నమితా గోఖలే అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఇంగ్లిష్‌లో రాస్తుంది. పురాణ కథలను రీటెల్లింగ్ చేయడం ద్వారా గుర్తింపు పొందింది. పబ్లిషర్‌గా ‘నమితా గోఖలే ఎడిషన్స్’ పేరుతో తెచ్చే పుస్తకాలకు గౌరవం ఉంది. వీటన్నింటికీ మించి భారీ సాహితీ ఉత్సవాలు నిర్వహించడంలో ఆమెకు అనుభవం ఉంది. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఆమె ఆలోచన. ఆమెకు మరో ఇద్దరు తోడు నిలిచారు. ఒకడు- ప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడూ ఆ దేశం కన్నా మన దేశం మీద ‘ది ఏజ్ ఆఫ్ కలి’, ‘ది వైట్ మొఘల్స్’, ‘ది లాస్ట్ మొఘల్’ వంటి పుస్తకాలు రాసిన విలియమ్ డాల్రింపల్. మరొకడు- మన దేశంలో మెగా ఈవెంట్స్ చేసే ‘టీమ్ వర్క్స్’ సంస్థ వ్యవస్థాపకుడు, కాలమిస్ట్ సంజయ్రాయ్. వీరే ప్రతి ఏటా ఈ ఉత్సవం రూపురేఖలనీ, చర్చించవలసిన అంశాలనీ, ఆహ్వానించాల్సిన అతిథులని ఖరారు చేస్తారు. తగిన అనుమతి లేకుండా చీమ కూడా దూరలేదు. ప్రాంతీయ మీడియా అంటే వీళ్లకు లెక్కే లేదు. ఈసారే దక్షిణాది భాషలకు ఆహ్వానం పంపారు. ఫండ్స్ బాగా వచ్చి ఉండొచ్చు. లేదా ఇది మరింతగా విస్తరించి ఉండొచ్చు. విడిగా పాల్గొనాలనే ఉత్సాహం ఉందా? ఐదురోజుల ప్రవేశ రుసుమూ, బస, రాకపోకలూ, ఇతర ఖర్చులూ... యాభై వేలు సిద్ధం చేసుకోవాలి. బ్రిటిష్ ఎయిర్వేస్ బైఠక్.... గూగుల్ ఒక వేదికను స్పాన్సర్ చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్ మరో వేదికను. ఫోర్డ్ ఇలాంటి చాన్స్ వదులుకోదు. మహింద్రా గ్రూప్ ఒకటి. ‘రజనీగంధ’ పాన్‌మసాలా కూడా. విశాలమైన దిగ్గీ ప్యాలెస్‌లో ఐదు చోట్ల ఉన్న ఈ ఐదు వేదికల మీద ఐదురోజుల పాటు జరిగిన దాదాపు 200 సాహితీ కార్యక్రమాల్లో ఎక్కువగా చర్చకు గురైన అంశాలు ఏమిటి? ఎక్కువగా మార్కెట్లో, ప్రచారంలో ఉన్న పుస్తకాలే. నయిపాల్ నవల ‘ఏ హౌస్ ఆఫ్ మిస్టర్ బిస్వాస్’, తనూజా దేశాయ్ నవల ‘బార్న్ కన్ఫ్యూజ్డ్’, నసీరుద్దీన్‌షా ఆత్మకథ ‘అండ్ దెన్ ఒన్ డే’, వహీదా రెహమాన్ జ్ఞాపకాలు ‘ముఝే జీనే దో’, శశిథరూర్ ‘ఇండియా శాస్త్ర’, రామ్ జెఠ్మలానీ ‘ది డెవిల్స్ అడ్వొకేట్’, రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘ద ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’.... అయితే ఈసారి ముఖ్యంగా గమనించవలసింది పురాణాల నుంచి కథలను ఇంగ్లిష్‌లోకి తెస్తున్నవారు, రీ-టెల్ చేస్తున్నవారు, కొత్త దృష్టికోణం నుంచి వ్యాఖ్యానం చేస్తున్నవారు, వాటిలోని పాత్రలతో దాదాపు కమర్షియల్ సాహిత్యాన్ని సృష్టిస్తున్నవారు సీరియస్ సృజనకారుల స్థాయిలో తారసిల్లడం. ‘శివ ట్రయాలజీ’ రాసిన అమిష్ త్రిపాఠీ, మహాభారతాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం చేసిన బిబేక్ దేబ్రాయ్, గ్రాఫిక్స్‌తో పురాణాలను వివరించే పనికి పూనుకుని చాలా పుస్తకాలు అమ్ముతున్న దేవ్‌దత్ పట్నాయక్ ఈ ఉత్సవంలో భుజాలు రాసుకుంటూ తిరిగారు. ఆఖరికి రామాయణ, భారతాలను పిల్లల కోసం రాస్తున్న ఆర్షియా సత్తార్లాంటి వాళ్లు కూడా అదొక ముఖ్య రచనార్హత కలిగినవారై కనిపిస్తారు. నిజానికి ఇంతకు మించిన ఉద్దండులు మనకు ఉన్నారు. రాస్తారు. కాని, తెలుగులో. ఈ విభాగం తర్వాత ఈ ఉత్సవం ప్రాముఖ్యం ఇచ్చింది ‘ట్రావెల్ రైటింగ్’నే. ఈ దేశంలోని ముఖ్యనగరాలు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, లక్నో... వీటి మీద తలా ఒక పుస్తకం రాసేసిన మాళవికా సింగ్, ఇరాక్ (కువైట్) వార్ డైరీ రాసిన చార్లెస్ గ్లాస్, పులుల హతం తర్వాత శ్రీలంకలో తిరిగి అక్కడి పరిస్థితులను చెప్పిన సామంత్ సుబ్రమణియన్, ఇండియాను ‘స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ పారడైజ్’గా వర్ణిస్తూ పుస్తకం రాసిన బి.బి.సి రిపోర్టర్ శామ్ మిల్లర్, అంతరించి పోతున్న క్రిస్టియన్ మోనాస్ట్రీలను పర్యటించి ప్రస్తుతం వాటి మీద పుస్తకం రాస్తున్న విలియమ్ డాల్రింపల్.... ఇలాంటి వారంతా తమ ‘వాండర్లస్ట్’ను చెప్పడం ఈ ఉత్సవంలో ఒక ముఖ్యమైన సెషన్. రాయడం, తిరగడం రెండూ సృజనలో ఒక భాగం. రాస్తూ తిరగడం, తిరిగింది రాయడం.... తెలుగులో ట్రావెల్ రైటింగ్ ఎంతమంది చేస్తున్నారు? ఆదినారాయణ, లోకేశ్వర్, అమరేంద్ర, భద్రుడు, కొండవీటి సత్యవతి... పది వేళ్లు మడవలేమా? ఫైజ్... కైఫీ.... ఇంత పెద్ద దేశం... అందునా ఉత్తర భారతదేశం.... కాని హిందీ సాహిత్యం గురించి వినిపించింది తక్కువ. హిందీ మాట వినిపించింది కూడా అతి తక్కువ. ఈ బాధ మధ్య ‘క్లాసికల్ సాహిత్యా’న్ని ముఖ్యంగా భారతీయ క్లాసికల్ సాహిత్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించిన ముఖ్యమైన చర్చ జరగడం ఒక ఓదార్పు. ఫైజ్, కైఫీ కవిత్వం గురించి చర్చ జరగడం మరో ఓదార్పు. ఐదారు భారతీయ భాషలను ఎంచి వాటి ప్రాచీన సాహిత్యపు పలుకును వినిపించడం మరో ఓదార్పు. తెలుగు నుంచి ఈ ఉత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక సాహితీవేత్త సి.మృణాళిని ఈ వేదికల మీద నుంచి ‘మనుచరిత్ర’ పద్యాలను పాడి వినిపించడం అతి పెద్ద ఓదార్పు. ముందే చెప్పుకున్నట్టు ఇది ఇంగ్లిష్ ఉత్సవం. ఇంగ్లిష్‌లో రాసేవారి ఉత్సవం. కన్నడ సాహిత్యం అంటే వీరి దృష్టిలో కుం.వీరభద్రప్ప, ఎస్.ఎల్.బైరప్పగాక ఇంగ్లిష్‌లో రాసే (ఎక్కువగా అనువాదమయ్యే) సుధామూర్తి అని తెలుసుకుంటే సరిపోతుంది. దక్షిణాది కవులంటే సచ్చిదానందన్, శివారెడ్డి, గోరటి వెంకన్నగాక ఇంగ్లిష్‌లో రాసే విజయ్ శేషాద్రి అని తెలుసుకున్నా సరిపోతుంది. ఇంగ్లిష్‌లో రాసే మలయాళ కవి జీత్ థాయిల్ కేరళ కొబ్బరిగాలుల వరకూ వీరి ప్రతినిధి. ప్రపంచభాష కావాలి వీరికి. భూగోళం మీద పరివ్యాప్తమైన భాష. పద. రాయీ. కాని ఇంగ్లిష్‌లో. చివరకు మిగిలేది ఏది ఇక్కడ కొనప్రాణంతో ఉందో అది ప్రపంచమంతా బతికి ఉంది. నవల! జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు సంబంధించినంత వరకూ రచయిత అంటే నవలా రచయిత. అందునా ఇంగ్లిష్‌లో రాసే నవలా రచయిత. కథ, కవిత్వం... ఓకే... ఆ మూల టేబుల్ మీద కూచో. దర్గామిట్ట కతలు, న్యూ బాంబే టైలర్స్... సరే సరే... ఆ పెట్‌బాటిల్ అందుకుని మంచినీళ్లు పుచ్చుకో. అంతే. అంతకు మించి ఏం లేదు. మరి నవల రాయడం, ఇంగ్లిష్‌లో రాయడం... ఎంతమంది తెలుగు రచయితలు ఈ పనికి పూనుకోగలరు? అసలు తెలుగులోనే ఒక మంచి, గొప్ప నవలకు ఎంతమంది పూనుకోగలుగుతున్నారు. ఒక సరైన నవల- రాయగలిగి- దానిని ఇంగ్లిష్‌లో అనువాదం చేయించుకోగలిగి- అది సరైన పబ్లిషర్ ద్వారా పాఠకులకు అందగలిగి- గుర్తింపు పొందగలిగి- అప్పుడు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అలాంటి రచయిత కోసం కాల్ చేస్తుంది. ఈ-మెయిల్ పంపుతుంది. ప్రపంచంలోని రచయితలందరి సరసనా కూచోపెట్టి రాజస్తానీ నేతవస్త్రం భుజాన కప్పి గౌరవిస్తుంది. తెలుగులో రాయడం ఏ మాత్రం న్యూనత కాదు. కాని రాసింది ఇంగ్లిష్తో ముడిపడి ఉన్న ఆవలి ప్రపంచానికి చేర్చడమూ తప్పు కాదు. మరి ఇక్కడ ఇంగ్లిష్‌లోకి వెళ్లడం చెడ్డ విలువగా ప్రచారం అయి ఉందా? రాసిన పుస్తకాన్ని ప్రచారం చేసుకోవడం చెడ్డ విలువగా స్థిరపడి ఉందా? రాసింది షెల్ఫ్‌లో పెట్టుకొని మంచి పుస్తకమైతే ఎలాగైనా బతుకుతుంది అనుకోవడం మంచి విలువగా ప్రచారం అయి ఉందా? సరే. మీటింగ్స్ ఉంటాయిగా. అప్పుడప్పుడు ప్రెస్‌క్లబ్‌లో కలుస్తుందాం. - ఖదీర్ తెలుగు నుంచి ఈ ఉత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక సాహితీవేత్త సి.మృణాళిని ఈ వేదికల మీద నుంచి ‘మనుచరిత్ర’ పద్యాలను పాడి వినిపించడం అతి పెద్ద ఓదార్పు. ఎవరి ఇంట్లో అయినా పాలో కొయిలో పుస్తకం కనిపించిందంటే ఇక ఆ ఇంటి పెద్దతో మాట్లాడటం అనవసరమని నిశ్చయించుకుంటాను. - ఆల్బెర్టో మాంగ్యుయల్ నేను రాసిందంతా ఇతరులు ఎలా రాశారో చూసి నేర్చుకుని రాసిందే. రచయిత అనే వాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. - వి.ఎస్. నయిపాల్ -
ఇసుక రేణువుపై రాజభవనం
ఇదో రాజభవనం బొమ్మ.. అయితే దీన్ని దేని మీద చెక్కారో తెలుసా? ఇసుక రేణువు మీద!! ఇలాంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు ఇజ్రాయెల్‌కు చెందిన విక్ మునిజ్, మార్సెలోలు. ఇందుకోసం వీరు ఎఫ్ఐబీ (ఫోకస్డ్ అయాన్ బీమ్) పరిజ్ఞానాన్ని వాడారు. సాధారణంగా ఈ పరిజ్ఞానాన్ని మైక్రోచిప్‌లలో సర్క్యూట్లను ఫిక్స్ చేయడానికి ఉపయోగిస్తారు. తొలి దశలో లేజర్లను వాడినా.. అవి ఇసుక రేణువులను నాశనం చేస్తుండటంతో చివరిగా దీన్ని ఉపయోగించి, విజయం సాధించారు. త్వరలో టెల్ అవివ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో వీరి కళాకృతులను ప్రదర్శించనున్నారు.